May 2023
పాటే జీవితం
ఈశాన్య రాష్ట్రం మిజోరం లో రన్రెసంగి ని సాంస్కృతిక చిహ్నం లా భావిస్తారు.మిజో జానపద గీతాలు రారాణి అంటారు. మిజోరం లోని సెర్చిప్ జిల్లా కీటమ్ గ్రామం ఆమె జన్మస్థలం పెళ్లి వేడుకల్లో, చర్చి కార్యక్రమాలల్లో పాడే చిన్న గ్రామీణ గీతాలను ఆమె రేడియోలో పాడారు జానపదాలు, భక్తి గీతాలు, ప్రణయ గీతాలు సేకరించారు సంగీతం రంగానికి ఆమె చేసిన సేవలకు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2017 లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. మూడు […]
షోస్ టాపర్ దర్శన
దర్శన రాజేంద్రన్ ను షోస్ టాపర్ అంటూ పరిచయం చేసింది ఫోర్బ్స్ జయ జయ జయ జయహే సినిమాలో మార్షల్ ఆర్ట్ నేర్చుకుని భర్తకు బుద్ధి చెప్పిన భార్య గా నటించిన దర్శన పుట్టిన ఊరు ఎర్నాకుళం. లండన్ లో ఫైనాన్షియల్ ఎకనామిక్స్ లో పిజీ చేసింది. నటిగా సినిమాల్లో కెరీర్ మొదలు పెట్టింది. హృదయం,డియర్ ఫ్రెండ్, నయా సఫర్, సినిమాలు విజయవంతంగా అయ్యాయి. అట్లా ఆమె షోస్ టాపర్స్ జాబితాలోకి ఎక్కింది.
వైద్య వృత్తే నా కెరీర్
హౌస్ సర్జన్ చేస్తూనే సినిమాల్లో నటిస్తోంది ఐశ్వర్య లక్ష్మి. సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాక నటించిన ప్రతి సినిమాకు పురస్కార్ వచ్చాయి అమ్ము, మట్టి కుస్తీ, గార్గి, పొన్నియన్ సెల్వన్ అన్నింటిలోనూ ఘనవిజయమే. గార్గి సినిమా సహనిర్మాత కూడా. ఫోర్బ్స్ ఆమెను షోస్ టాపర్ జాబితాలో చేర్చి గౌరవించింది. ఎప్పటికైనా డాక్టర్ గా స్థిరపడతాను అని చెబుతోంది ఐశ్వర్య లక్ష్మి.
ఫుడ్ రివ్యూ
Mishry.com ఒక ఫుడ్ రివ్యూ వెబ్ సైట్ గృహిణులు,తల్లులైన కారణంగా ఉద్యోగం వదిలేసిన యువతులు తమ కిచెన్ స్కిల్స్ కు సానపెట్టు కొనే అవకాశం కల్పించే వేదిక ఇది ఎన్ డి టీవీ ఫుడ్ ఛానల్ లో పని చేసిన తను గంగూలి. ఈ చానల్ నడుపుతోంది ఈ వెబ్ సైట్ లో 90 శాతం మహిళా ఉద్యోగులే. దేశం లో ఫుడ్ ప్రొడక్ట్స్ ని రివ్యూ చేసే తొలి వెబ్ సైట్ ఇది. ఈ ఫుడ్ […]
నవలా రాణి
తెలుగు అమ్మాయిలు కలలు ఎందుకు కనాలో ఆ కలలు ఎలా సాకారం చేసుకోవాలంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలో సరిగ్గా 60 ఏళ్ల క్రితం యద్దనపూడి సులోచనారాణి తన నవలల ద్వారా చెప్పారు. దక్షిణ భారతదేశంలో తొలి తెలుగు డైలీ సీరియల్ యద్దనపూడి రాసిన ఋతురాగాలు ,సెక్రటరీ ఆరాధన, మీనా జీవనతరంగాలు వంటి నవలలు జనాదరణ పొందాయి. చందమామ వరకే చదివే అలనాటి ఆడపిల్లలను నవల సాహిత్యం లోకి తీసుకుపోయిన ఘనత నవల రాణి సులోచన రాణి దే. […]
అందంగా ఆర్గంజా
తేలికగా స్టైల్ గా ఫ్యాన్సీ గా ఉండే ఆర్గంజా మెటీరియల్ తో చేసిన లాంగ్ గౌన్ లు ఈ వేసవికి ఎంతో బాగుంటాయి.ఫ్రాక్స్ కు ఆర్గంజా సౌకర్యంగా ఉంటుంది. ఈ మెటీరియల్ తో తయారైన దుస్తులకు బంగారు ఆభరణాలు సూట్ కావు. మెరుపులు మెరిసే ఫ్రీ సిల్క్ వీవ్ తో ఆర్గంజా అందంగా ఈవినింగ్ పార్టీలకు కూడా బాగుంటుంది. 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ ఫ్రాక్స్ చాలా అందంగా సూట్ అవుతాయి.
అంతులేని దయ
ఒంగీ గిరిజన తెగల కోసం పనిచేసిన శాంతి తెరిసా లక్రా ను ప్రభుత్వం ఎప్పుడో పద్మశ్రీ ని బహుకరించింది. అండమాన్ లోని డుగోంగ్ క్రీక్ లో ఆదివాసీలు ఎక్కువ వారు నాగరిక ప్రపంచంలో కలువరు వైద్య సేవలు తీసుకోరు శాంతి లక్రా ఎంతో ఓర్పుతో వారి నమ్మకం సంపాదించుకుంది. 2004 లో అండమాన్ ను కుదిపేసిన సునామీ విపత్తులో కూడా శాంతి ఆదివాసీల సేవలోని మునిగి ఉన్నది.2020 కోవిడ్ కాలంలో ఆదివాసీలను ఒప్పించి అందరికీ వ్యాక్సిన్ వేసుకునేలా […]
ముత్యాల తీగలు
అందమైన ఇండోర్ ప్లాంట్స్ రెండు ఉన్నాయి సెనెసియో రౌలేయనస్ ముత్యాల దండలా ఉంటుంది దీన్ని స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ అంటారు సీలింగ్ కు కొక్కెం కట్టి కుండీల వేలాడదీసి తీగను పెంచితే ఇల్లంతా అందం దీనికి సూర్యరశ్మి అవసరం లేదు. అలాగే ప్రేయర్ ప్లాంట్ కూడా లేత ముదురాకు పచ్చ రంగులతో మధ్యలో పొగాకు ఈనె తో ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది దీనికి ఎక్కువ కొమ్మలు కాడలు ఉండవు ఒక్క కాడకు ఒక్కో ఆకు […]
పరుపు పై మరకలు
పరుపులు దుప్పట్ల పైన పిల్లలు తడిపేసిన మరకలు ఎంత ఉతికినా పోకుండా కనిపిస్తూ ఉంటాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా లిక్విడ్ డిష్ వాష్ మిశ్రమం స్ప్రే బాటిల్లో పోసి మరకలు ఉన్న ప్రదేశం లో తడిపి ఈ మిశ్రమాన్ని చల్లి కాస్త రుద్ది పొడి గుడ్డతో తుడిస్తే పరుపు పైన మరకలు పోతాయి. పరుపుపై రక్తం మరకలు కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్, లిక్విడ్ డిష్ వాష్,ఉప్పు కలిపి మందంగా పేస్ట్ లాగా రాసి ఆరిపోయాక తడి […]
బిజినెస్ సక్సెస్
పారుల్ గులాటి పేరున్న నటి నిష్ హెయిర్ పేరుతో హెయిర్ ఎక్స్ టెన్షన్స్ విగ్స్ బిజినెస్ చేస్తోంది. సహజమైన జుట్టు తో తయారయ్యే ఈ ఎక్స్ టెన్షన్ లతో నెలకు 70,80 లక్షలు సంపాదిస్తోంది పారుల్. ప్రస్తుతం వెబ్ సిరీస్ తో కూడా బిజీగా ఉన్న పారుల్ కు సామాజిక మాధ్యమాల్లో ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రధానంగా ఇన్ స్టా, ఫేస్ బుక్ యూట్యూబర్స్ ద్వారానే ఆమె వ్యాపారం విజయవంతంగా సాగుతోంది.
అందమైన వ్యాపారం
స్మార్ట్ రాప్ పేరుతో గిఫ్ట్ రాప్ లు బిజినెస్ చేస్తారు కృతక సబర్వాల్. వర్క్ షాప్ లు వెబినార్ ద్వారా టీచర్ ప్రెన్యూర్ గా గిఫ్ట్ ప్యాక్ తయారీలో శిక్షణ ఇస్తుంది. దేశవ్యాప్తంగా 1300 మంది మహిళలకు ర్యాపింగ్ క్రాఫ్ట్ నేర్పించింది. బహుమతులు అందమైన రూపంతో అందించడం స్మార్ట్ రాప్ ఉద్దేశం బేకర్లు, స్వీట్లు గిఫ్టింగ్ కంపెనీలు గృహాలంకరణ బ్రాండ్స్ ఈ కళ పట్ల ఇష్టం చూపిస్తున్నారు .
శారీ రన్
శారీ రన్ పేరుతో బెంగళూరులోని జయ నగర్ మైదానంలో చీరకట్టుతో మారథాన్ లో పాల్గొన్నారు. మహిళలు ఫిట్ నెస్ దుస్తులు వేసుకోవడం ఇష్టం లేని వారికి స్ఫూర్తి ఈ మారధాన్.జయనగర్ జాగర్స్ కు అతిపెద్ద రన్నింగ్ గ్రూప్ గా పేరుంది ఐదు నగరాల్లోని 30 కేంద్రాల్లో 7500 మంది జాగర్స్ సభ్యులుగా ఉన్నారు. ప్రముఖ వస్త్ర దుకాణాల సముదాయం తనీరా ఈ శారీ రన్ కు స్పాన్సర్ చేస్తోంది.
కంఫర్ట్ లుక్
వేసవిలో కాటన్స్ కే ఓటు వేస్తాం. ఖాదీ కాటన్ ఎక్కడ్ కాంబినేషన్ తో షార్ట్ కుర్తిస్, జాకెట్స్, స్కర్ట్స్, ఫ్రాక్స్, టాప్స్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటాయి. కూల్, కంఫర్ట్ లుక్ తో ఆకట్టుకుంటాయి అలాగే అఫీషియల్ గా కూడా స్పెషాలిటీ చాటుకుంటాయి. ఇక్కత్ తో వచ్చే అన్ని రకాల దుస్తులు మోడ్రన్ లుక్ తో స్టైల్ గా ఉంటాయి.
పువ్వుల ఎంబ్రాయిడరీ
కాలానుగుణంగా ఫ్యాబ్రిక్ ఎంపికలో మార్పులు ఉంటాయి.కానీ పువ్వుల డిజైన్స్ లో మాత్రం మార్పులు రావు. వేసవికి ఎంపికలో పూల డిజైన్లు ఎప్పుడు ముందుంటాయి. ఈ నెల సరికొత్త డిజైన్లతో చేతి తో కుట్టిన ఎంబ్రాయిడరీ పువ్వుల డిజైన్లు మంచి మార్కులు సంపాదించాయి. ఎంబ్రాయిడరీ, పువ్వుల లతలు, ఆప్లిక్ వర్క్ పువ్వులతో నేత సిల్క్ చీరలు మార్కెట్లోకి వచ్చాయి. క్యాజువల్ గా కట్టుకునేందుకు వేడుకల్లో ప్రత్యేకం గాను ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఆకట్టుకుంటున్నాయి.
వేసవి కి జాగ్రత్త
ఈ వేసవిలో వ్యాయామాలు కష్టమే. బరువు పెరగకుండా చక్కెర శాతం తగ్గించాలి. స్వీట్స్ దూరం పెట్టాలి అధికంగా రైస్ తినడం తగ్గించాలి. ఉదయాన్నే ప్రోటీన్ ఫుడ్ తీసుకుని సాధ్యమైనంత వరకు కనీసం వాకింగ్ అయినా చేయాలి. తాజా కూరగాయలు పండ్లు తినాలి. ఒకే సారి అధిక శాతంలో ఆహారం తినకుండా నాలుగైదు సార్లు గా కాస్త కాస్త గా తినాలి.ఈ వేసవికి జిమ్ వర్కవుట్స్ కష్టం అనిపించినప్పుడు కనీసం భోజనం విషయం జాగ్రత్త పడాలి.
ఆల్ రౌండర్
గీతిక కొడాలి అమెరికా అండర్ 19 క్రికెట్ టీమ్ కెప్టెన్. ఆమె తండ్రి విజయవాడ కు చెందిన ప్రశాంత్ కొడాలి ఆన్ లైన్ లో ఇంజనీరింగ్ చదువుతున్న గీతిక 2019 లో అండర్ 19 టీమ్ తో కెరీర్ ప్రారంభించింది.14 ఏళ్ల వయసులో యు.ఎస్ ఉమెన్స్ టీమ్ లో ఎంపికయింది. క్రికెట్ లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుని ఆట పైన పట్టు సాధించింది గీతిక.
వత్తిడి తగ్గించే మొక్క
బాల్కనీ లో కాస్త చోటు ఉంటే ఈ ఔషధ మొక్కలు పెంచండి జలుబు, జ్వరం, నరాల ఒత్తిడి తగ్గిపోతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. పుదీనా ఆకుల్లాగా ఉండే లెమన్ బామ్ మొక్క నిమ్మ వాసనతో ఉంటుంది. వేసవిలో తియ్యని పూలు పూస్తాయి.అలాగే గడ్డి లాగా ఉండే ఖస్ ఖస్ మొక్కలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ యాంటీ సెప్టిక్ లక్షణాలున్నాయి. కోపం, ఆందోళన తగ్గించగల శక్తి ఈ మొక్కకు ఉంది.
వస్త్రం పై గ్రంధాలు
అస్సాం కు చెందిన హేమ ప్రభ చుటియా వస్తాం పైన చిత్రాలు వేయగలరు. సిల్క్ వస్త్రం పైన ఆమె ఆధ్యాత్మిక చిత్రాలు నిక్షిప్తం చేస్తారు. శ్రీమంత శంకర్ దేవ్ రచించిన గుణమాల, శ్రీ మాధవ దేవ్ అస్సామీ లో రాసిన నామ్ ఘోసా వైష్ణవ గ్రంధాన్ని ఆమె సిల్క్ వస్త్రంపై నేశారు. 280 గజాల పొడవు, రెండు అంగుళాల వెడల్పు ఉన్న ఈ వస్త్రం పై మూడేళ్ల పాటు కష్టపడి ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు నేశారు.ఈ అరుదైన […]
విశేష ప్రతిభ
భారతీయ మూలాలున్న ప్రొఫెసర్ మేఘన పండిట్ బ్రిటన్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ ట్రస్ట్ కు సి ఈ ఓ గా నియమితులయ్యారు. ఈ ట్రస్ట్ కు బ్రిటన్ లో ఎన్నో టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి ముంబైలో ఎం బి బి ఎస్ చేసిన మేఘన పండిట్ ఈ బాధ్యత చేపట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకున్నారు.
జంగల్ కి టార్జన్
జమున టుడు పర్యావరణ ఉద్యమకారిణి సంతాల్ ఆదివాసి మహిళ. ఆమె పుట్టినిల్లు ఒడిశా అత్తిల్లు జార్ఖండ్ భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కు దగ్గర బంధువు. 2019లో పద్మశ్రీ అందుకున్నారు జమున టుడు ను జంగల్ కి టార్జాన్ అని పిలిచి గౌరవించారు.ప్రధాని పర్యావరణాన్ని కాపాడుకుంటే మనిషికి జీవితం ఉంటుందని నమ్ముతారు జమున. ఊరందరినీ కలుపుకొని మొక్కలు నాటారామె వన సంరక్షణే ఆమె ధ్యేయం.
