Tuesday, 06 Oct, 2026

దూసుకుపోతున్న ది ట్రైబ్

ది ట్రైబ్ పేరు తో స్నేహితులు అనుష్క నందాని కరణ్ సాహ్ని, రాబిన్ బెహ్ల్ లతో కలిసి ఫిట్ నెస్ ప్రాజెక్ట్ ప్రారంభించింది కృతి సనన్ మిమి సినిమా కోసం 15 కిలోల బరువు తగ్గాల్సి వచ్చినప్పుడు ఈ ఫిట్ నెస్ వ్యాపారం మనసులోకి వచ్చింది అని చెబుతోంది కృతి.ఇన్  స్టూడియో పర్సనల్ గ్రూప్, వర్చువల్ విధానంతో ఈ సంస్థ వ్యాయామ పాఠాలు చెపుతోంది. కృతి సనన్ ఈ వ్యాపారానికి కృతి ఇమేజ్ నిజమైన పెట్టుబడి.

మహిళలదే హవా

హాసూర్ లో 80 మంది మహిళా ఉద్యోగులతో అశోక్ లేలాండ్ తయారీ కేంద్రం ఆరంభించింది.ఈ భారీ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ దేశంలో నాణ్యమైన ఉత్పత్తులు తీసుకురాగలిగే సమర్ధత స్త్రీలకు మాత్రమే ఉంది. ఈ అవకాశం ద్వారా వారి జీవితాలను మెరుగుపరుచుకోవటమే కాదు వారి కుటుంబ స్థితిగతుల్ని మార్చేస్తాము అందుకే మహిళా ఉద్యోగులకు నైపుణ్యాల శిక్షణ ఇవ్వడంలో  మేము ముందే ఉంటాం అంటారు ఆ సంస్థ సి ఐ ఓ షేను అగర్వాల్.

భారత కోకిల

భారత కోకిల బిరుదు గల సరోజినీ నాయుడు కవిగా ప్రజాకర్షణ కలిగిన జాతీయ స్వాతంత్రోద్యమ నాయకురాలిగా మనకు తెలుసు.1914 నుంచి 30 ఏళ్ల పాటు గాంధీ గారితో కలిసి పనిచేశారామె.1925 లో జాతీయ అఖిల భారత కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎంపికయ్యారు ఆమె మొదటి కవితా సంకలనం గోలైన ట్రిష్ హాల్డ్ 1905 లో ప్రచురితమైంది.ఆమె తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం కాలేజీ వ్యవస్థాపకులు. సరోజినీ దేవి ఆ కాలంలో అగ్రగామి ఆంగ్ల కవియత్రి.

మహాలఖా బాయి చందా

మహాలఖా బాయి ప్రముఖ కవయిత్రి గా సంగీత కర్పూరిగా, గాయకురాలిగా హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందింది. పుట్టుకతో ఆమె పేరు చందా బీబి. విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా లో మహాలఖా బాయి ని తొలి ఉర్దూ కవయిత్రి గా చెప్పారు ఆమె చేతిరాతతో ఉన్న 125 గజల్స్ ఉన్న పుస్తకం దినాన్-ఏ-చందా, బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ స్థలం మొత్తం బహుమతిగా ఇచ్చిందే. 1824లో మరణించాక ఆమె ఆస్తులలో చాలా భాగం […]

ఈమె ఫైటర్

కెప్టెన్ దీక్ష సి.ఎం పారా స్పెషల్ ఫోర్సెస్ లో ఎంపికైన తొలి మహిళ ఆఫీసర్ ఆర్మీ డాక్టర్ కూడా. ఈమె ఇండియన్ ఆర్మీ లో కఠినమైన శిక్షణ పూర్తి చేశారు. అలాగే ఆర్మీ వైద్యం చేసేందుకు శారీరక దారుఢ్యం కర్తవ్య దీక్ష కావాలి. ఇండియన్ ఆర్మీ లో స్త్రీలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వివక్ష లేదు సంశయాలు లేకుండా ముందుకు వస్తే మంచి భవిష్యత్తు అని చెపుతోంది దీక్ష సి.ఎం.

c

బహతీనాక్, పుష్పవల్లి అనే కామెడీ సీరియల్స్ తో సముఖీ సురేష్ చాలా పాపులర్ కమెడియన్ రైటర్ యాక్టర్.నాగపూర్ లో పుట్టి పెరిగిన తమిళ యువతి పుష్పవల్లి. మోటార్ మౌత్ పేరుతో కంటెంట్ క్రియేట్ చేసే సంస్థ స్థాపించింది. అమెజాన్ ప్రైమ్ కామికిస్తాన్  సీజన్ వన్ లో  కో హాస్ట్ గా థర్డ్ సీజన్ లో జడ్జ్ గా వ్యవహరించింది.

బ్రాండ్ ఆఫ్ హ్యూమర్

రాధిక వాజ్ స్టాండప్ కమెడియన్ యాక్ట్రెస్ రైటర్ కూడా కామెడీ ద్వారా స్త్రీల సమస్యలను పురుషాధిక్య ధోరణిని ప్రేక్షకుల ముందుకు తెచ్చి వారిలో ఆలోచన రేకే తించటంతో ఎన్నో ప్రయోగాలు చేసింది. ‘అన్ లాడ్లీ లైక్’ పేరుతో ఆమె రాసిన పుస్తకం పెద్ద సంచలనం. ఆడవాళ్ళ నెలసరి నుంచి, వర్జినిటీ, పెళ్లి వయసు ముదరటం వంటి వివాదాస్వర అంశాలు, ఆచార వ్యవహారాలు కామెడీ తో ముడిపెట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు రాధిక వాజ్.

యుద్ధభూమిలో తొలి అడుగు 

యుద్ధభూమిలో పోరాడే అవకాశం అందుకున్నారు కెప్టెన్ శాలిజా ధామి. వాయుసేన పోరాట విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. పంజాబ్ లోని పంజాబ్ లోని సరభ గ్రామానికి చెందిన శాలిజా 2003లో ఐ ఎ ఎఫ్ లో హెలికాప్టర్ పైలట్ గా కెరియర్ ప్రారంభించారు. పశ్చిమ సెక్టార్లో హెలికాప్టర్ విభాగానికి ఫైట్ కమాండర్ గా చేరారు. ఫ్రంట్ లైన్ కమాండ్ హెవీ క్వార్టర్స్ లో ఆపరేషన్ విభాగంలో ఉన్న శాలిజా పశ్చిమ ప్రాంతంలో క్షిపణులు స్క్వాడ్రన్‌కు నేతృత్వం వహించనున్నారు. ఈ […]

తొలి మహిళ కమాండర్

లద్దాఖ్ లో స్వతంత్రత ఫీల్డ్ వర్క్ షాప్ కు నేతృత్వం వహించే అవకాశం దక్కించుకున్నారు కల్నల్ గీతా రాణా. ఈ అవకాశం అందుకున్న తొలి మహిళ ఆఫీసర్ గా చరిత్ర సృష్టించారు. 23 ఏళ్ల కెరియర్ లో సిక్కిం, జమ్మూ కాశ్మీర్ వంటి ఎన్నో ప్రాంతాల్లో పనిచేశారు. ఈ ఎం ఈ శిక్షణ కేంద్రంలో ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆర్మీలో ఒక యూనిట్ కు కమాండర్ గా వ్యవహరిస్తున్న తొలి నాన్ మెడికల్ ఆఫీసర్ గా గీత […]

ఉత్తమ నిర్మాత

ప్రపంచంలోనే 12 మంది అత్యుత్తమ నిర్మాతల్లో ఒకరు గా గుర్తింపు పొందారు గునీత్ మోంగా. గ్యాంగ్స్  ఆఫ్ వాసేపూర్,అయ్యా, షాహిద్, ది లంచ్ బాక్స్, గర్ల్ ఎల్లో బూట్స్,ఫెడ్లర్స్ మాసన్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ వంటి సినిమాలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. ఢిల్లీకి చెందిన పంజాబీ అమ్మాయి గునీత్ స్త్రీల సమస్యల పైన దృష్టి పెట్టిన గునీత్ 2008 లో సిక్వా ఎంటర్టైన్ ప్రారంభించి అన్నీ విజయవంతమైన సినిమాలే నిర్మించారు.

ప్రాణాలకు తెగించి

ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్ ద్వారా పదివేల మంది బాలబాలికలను స్త్రీ లను అక్రమ రవాణా నుంచి కాపాడారు పల్లబి ఘోష్ అస్సాం కు చెందిన పల్లబి 2020 లో ఎన్జీవో స్థాపించారు. ఈశాన్య రాష్ట్ర పోలీస్ లు,సరిహద్దు భద్రతా దళాల తో కలిసి యాంటీ ట్రాఫికింగ్ యాక్టివిస్ట్ గా పనిచేస్తోంది. బెంగాల్ అస్సాం నాగాలాండ్ వంటి రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చి బలవంతపు పెళ్లిళ్లు చేస్తారు. ఆడపిల్లల అక్రమ రవాణా ఆ ప్రాంతాల్లో యథేచ్ఛగా జరుగుతుంది […]

కొత్త వెలుగు

రాజవంశీకులైన అక్షిత, మృణాళిక కోల్కత్తాలో చదువుకొని ఆ పైన విదేశాలకు కూడా వెళ్లారు ఒడిశా లోని మయూర్ భంజ్ జిల్లాలో జరిపాడు పట్నంలోని 1804 కాలానికి చెందిన అందమైన రాజ భవనాన్ని బోటిక్ హోటల్ గా మార్చేశారు ఇద్దరు కలిపి వందల సంవత్సరాల నాటి కళాకృతులు  పునరుద్దరించారు ఎంతో మంది చేతివృత్తి కళాకారులకు ఈ రాజభవనం కేంద్రం అయింది.  ఒడిశా కు చెందిన ఈ మయూర్ బంజ్ ప్యాలెస్ ఇవ్వాళ చూడవలసిన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి.

సమాజ సేవ

14 ఏళ్ల తెలుగు అమ్మాయి సింధు సూరపనేని అమెరికా ప్రెసిడెంట్ అవార్డుతో సత్కరించింది టెడెక్స్ లో స్పీకర్. ఆన్ లైన్ లో పెయింటింగ్స్ డాన్స్ పాఠాలు చెప్పే సింధు వాషింగ్టన్ స్టేట్ బి స్ట్రాంగ్ ప్రతినిధి కూడా రెండు వేల మందికి నాలుగు వందల ఆర్ట్ లెసన్స్ చెప్పిన సింధు మోస్ట్ ఇన్స్పిరేషనల్ యూత్ అవార్డ్ స్పోకెన్ యంగ్ ఫిలిం త్రిఫీ అవార్డులు తీసుకున్నది.

డోలు విద్యాంసురాలు లలిత

డోలు విద్యాంసురాలు 24 ఏళ్ల లలిత మనీషా ను ఘనంగా సన్మానించారు తెలంగాణ గవర్నర్ తమిళసై. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి డోలు విద్యాంసురాలిగా గుర్తింపు పొందింది లలిత. ఈమెది తినాలి డోలు వాయిద్యం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది.

ప్రైవేట్ మాస్టారు దివ్య

బైజు పేరుతో ఆన్ లైన్ టీచింగ్ ను ప్రారంభించారు దివ్య గోకుల్ నాథ్ భర్త రవీంద్రన్ తో కలిసి స్థాపించిన ఈ బైజు వ్యాపార పరంగా సక్సెస్. సైన్స్ టెక్నాలజీ లెక్కలు మొదలైన రంగాలలో మహిళలు ఎలా ప్రవేశించాలి. రాబోయే కొత్త విద్యావిధానానికి ముందుగా తయారై ఉండటం ఎలా అన్న విషయాలు కూడా బోధిస్తుంది. బైజు యాప్ తో దివ్య మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు, ఎదిగే క్రమంలో ఎదుర్కొనే ఇబ్బందులు, వాటిని అధిగమించే మార్గాలు […]

క్వీన్ ఆఫ్ వెల్ నెస్

ఆరోగ్యం మెరుగుపరిస్తే అందం దానంతట అదే వస్తుందన్న సూత్రం ప్రకారం చేసిన వందన లుత్రా తను క్వీన్ ఆఫ్ వెల్ నెస్ గా చెపుతారు.సన్నగా నాజూకు గా ఉండటం మాత్రమే అందం కాదని చెబుతూ ఆమె ప్రారంభించిన వి.ఎల్.సి.సి వందన లుత్రా (కార్ల్స్  అండ్ కర్వ్స్) ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆసియా, ఆఫ్రికా ఖండాల లోని 153 నగరాల లో ఉన్న వి.ఎల్.సి.సి కేంద్రాలలో నాలుగు వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఆహారపు అలవాట్లు మార్చటం అదనంగా […]

ఇంగ్లీష్ నేర్పుతారు

ఇంగ్లీష్ మాట్లాడటాన్ని సులభతరం చేసేందుకు హలో ఇంగ్లీష్ పేరుతో మొబైల్ యాప్ తయారు చేశారు ప్రన్షు పత్ని. ఈ లెర్నింగ్ అప్లికేషన్ కు 220 దేశాలలో సబ్స్క్రైబర్లు ఉన్నారు. 50 మిలియన్ యూజర్స్ ఉన్నారు. దేశంలో ఇది నెంబర్ వన్ ఎడ్యుకేషన్ యాప్. ఇందుకు గాను ఫోర్బ్స్ ఇండియా లో అండర్- 30 లో ప్రన్షు పత్ని స్థానం పొందారు.

విజయవంతమైన వ్యాపారం

2011 లో బిలియన్ డాలర్ల పెట్టుబడి తో లైమ్ రోడ్ ఆన్ లైన్  ఫ్యాషన్ రిటైల్ షాప్ ను ప్రారంభించారు సూచి ముఖర్జీ ఇక్కడ కస్టమర్స్ ఆలోచనలకు తగ్గట్టు గా దుస్తులు తయారు చేస్తారు. 50 వేల మందికి పైన లబ్ధి పొందుతున్న ఈ సంస్థ ఈ రోజు 52 మిలియన్ల డాలర్ల స్థాయిలో ఉంది. ఈ ఆన్లైన్ క్లాతింగ్ షాప్ సి ఈ ఓ గా సూచి ముఖర్జీ క్యూటెస్ట్ స్టార్టప్ ది ఇయర్ యూనికాన్ […]

పుస్తకాలతో అవగాహన

జార్ఖండ్ లో పుట్టి పెరిగిన అదితి గుప్తా మహిళల రుతుస్రావ సమస్యల పట్ల అవగాహన కలిగించే లక్ష్యంతో మెన్ స్ట్రు పీడియా సంస్థ ఏర్పాటు చేశారు ఈ స్టార్ట్ ప్ లో ఫ్రీ ట్రాన్స్ టీనేజర్లకు లైంగికత పీరియడ్స్ తదితర అంశాలపై కామిక్ పుస్తకాలు యానిమేటెడ్ వీడియోలు ఉన్నాయి.14 భాషల్లో ఉన్న ఈ పుస్తకాలను 18 దేశాల ప్రజలు చూస్తున్నారు. ప్రసిద్ధ ఫోర్స్ ఇండియా అండర్ 30 లిస్ట్ లో అతిథి పేరు చేర్చి గౌరవించింది.

సంచార వైద్యశాలలు

డాక్టర్ స్వాతి పిరామాల్ ముంబాయిలో డాక్టర్ పిరామాల్ హెల్త్ కేర్ సెంటర్ ద్వారా పలు రకాల అనారోగ్యాల గురించి అవగాహన సేవలు అందిస్తారు స్వాతి మహిళల ఆరోగ్యానికి స్వచ్ఛమైన నీరే అవసరం అని భావించి ముంబాయిలో ఎంపిక చేసిన ప్రాంతాలకు రక్షిత నీరు అందించే స్వర జల్ ప్రాజెక్ట్ ప్రారంభించారామె. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ హెల్త్ సర్వీస్ లు నిర్వహిస్తారు హెచ్.ఎమ్.ఆర్.ఐ సౌకర్యం తో పాటు అంబులెన్స్ సంచార సేవలు నిర్వహిస్తారు.