August 2022
పోషకాలు పుష్కలం
పోషకాలు పుష్కలంగా ఉండే శనగలను దేశి సూపర్ ఫుడ్ అంటున్నారు ఆహార నిపుణులు. శ్రావణ మాసపు నోముల్లో గుళ్ళలో ప్రసాదాల్లో నానబెట్టిన శనగలు ప్రసాదం. రోగాలు చుట్టుముట్టే ఈ రోజుల్లో సెనగలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఈ ఆహారం వెనుక ఆంతర్యం పూజల్లో చేసే ఉపవాస లో నీరసం రాకుండా సెనగలు శక్తిని ఇస్తాయి. వీటిలోని కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలు కండరాలు బలంగా తయారవుతాయి. ఐరన్ లోపం ఉంటే శనగలు మంచి పోషకాహారం. […]
ఆరుట్ల కమలాదేవి
భారత స్వాతంత్రోద్యమ యోధురాలిగా తెలంగాణ సాయుధ పోరాట వీర రాలుగా ఘనకీర్తి సాధించిన నాయకురాలు ఆరుట్ల కమలాదేవి ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో తొలి ప్రతిపక్ష నాయకురాలు కూడా. 1920లో తెలంగాణలో ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా మంతపురి లో జన్మించారు కమలాదేవి. 12వ యేట ఆరుట్ల రామచంద్రారెడ్డి తో పెళ్లయింది. 1932లో కమలాదేవి చదువు కోసం హైదరాబాద్ వచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కాంగ్రెస్ నుంచి వామపక్ష మార్గానికి మళ్ళిన కమలాదేవి విజయవాడ లో వామపక్ష […]
రాజకుమారి అమృత్ కౌర్
కపుర్తలా రాజవంశానికి చెందిన రాకుమారి అమృత్ కౌర్ లండన్ వెళ్లి ఆక్స్ఫర్డ్ లో చదువుకున్నారు. టెన్నిస్ క్రీడాకారిణి జలియన్ వాలాబాగ్ దుర్ఘటన తర్వాత దేశ స్వతంత్రం కోసం పని చేయాలని అనుకున్నారు. గాంధీజీ కి సెక్రెటరీ గా 17 సంవత్సరాల పాటు పని చేశారు. క్విట్ ఇండియా, దండి ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం గడిపారు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) […]
ఇద్దరూ ఒకేసారి
తల్లి కొడుకు ఒకేసారి ప్రభుత్వోద్యోగులు అయ్యారు. ఒకేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. మలప్పురం ఇర్కోడ్ అనే ఊర్లో ని తల్లీకొడుకులు బిందు, వివేక్ ఇప్పుడు న్యూస్ మేకర్స్. తల్లి బిందు చాలాకాలంగా అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తోంది. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఆమె కోరిక. డిగ్రీ చదివిన వివేక ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు ఇద్దరూ కలిసి కోచింగ్ లో చేరారు. తల్లి బిందు లాస్ట్ గ్రేడ్ సర్వెంట్ విభాగంలో 92 వ ర్యాంక్ సాధిస్తే […]
వర్షాల్లో జాగ్రత్త
ఈ వర్షాల్లో పిల్లలున్న ఇంట్లో జాగ్రత్తగా ఉండకపోతే అనారోగ్యాలు వస్తాయి. ముందుగా వాళ్లకు వేడివేడి భోజనమే పెట్టాలి. గాలిలో తేమ ఉండటం తో దోమల బెడద వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలను వానలో తడవనివ్వద్దు. ఇంట్లోనే వాళ్లకు కావలసిన పాప్ కార్న్ స్నాక్స్ చేసి ఇవ్వాలి. పెయింటింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో వాళ్లకు ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాలి. ముందుగా స్టోరీ బుక్స్ చదివేలా చేయాలి. తాజాగా ఉండే భోజనం శరీరం అలిసేలా ఫిజికల్ […]
ఏ భాష అయినా నాకు కంఫర్టే
ఒక నాటిగా భాషా పరమైన ఇబ్బందులు, హద్దులు నేను ఫీల్ అవ్వలేదు. ఏ భాషలో అయినా నేను కంఫర్ట్ గా ఉన్నాను అంటుంది రష్మిక మందన్న రాత్రికి రాత్రే నాకేం సక్సెస్ రాలేదు. పదేళ్లుగా కష్టపడుతూ ఉన్న, ప్రాంతం, భాష ఆధారంగా కొందరు సినిమాను విభజించి చూస్తారు. కానీ నటిగా నాకు యాక్టింగ్ క్రాఫ్ట్ పట్టు ఉన్నప్పుడు నా భావోద్వేగాలు ప్రేక్షకులకు అర్థం అయ్యేలా నటించేందుకు భాష హద్దు కాదు అనుకుంటాను అంటుంది రష్మిక. ఆమె నటించిన […]
దువ్వూరి సుబ్బమ్మ గారు
జాతీయోద్యమం లో జైలుకు వెళ్లిన ద్వితీయ మహిళగా ప్రథమ ఆంధ్ర మహిళ గా దువ్వూరి సుబ్బమ్మ గారికి చరిత్రలో సముచిత స్థానం ఉంది. 1880 లో కోనసీమలోని ద్రాక్షారామం లో పుట్టిన సుబ్బమ్మ గారు సంస్కృత ఆంధ్ర భాషల్లో విదుషీమణి. చిన్నతనంలోనే పెళ్లయింది సంపూర్ణ స్వాత్రంత్య్ర సంపాదనే లక్ష్యంగా బులుసు సాంబమూర్తి గారు పెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ఆమె బహిరంగ సభలో ఉపన్యాసాలు ఇచ్చారు. సనాతన విద్యాలయం పేరుతో జాతీయ విద్యాలయం స్థాపించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు […]
కాఫీ లో నెయ్యి
బ్లాక్ కోల్డ్ వంటి ఎన్నో రకాల కాఫీల కంటే నెయ్యి వేసిన కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు ఎక్సపర్ట్స్. అమ్మాయిలు, మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఒక పెద్ద సమస్య. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది ఉత్తమ ఎంపిక. కాస్త కాఫీ లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పరగడుపునే తాగితే శరీరంలో ఇన్సులిన్ శాతం పెరగదు. కెఫిన్ తో పెరిగే ఆందోళన కూడా ఈ నెయ్యి వేసిన కాఫీ తగ్గిస్తుంది. నెయ్యి ఆహారాన్ని తేలిగ్గా […]
ఒత్తిడి సమస్య రాదు
పండ్లు ఎక్కువగా తినే వాళ్ళలో మానసిక సమస్యలు డిప్రెషన్ చాలా తక్కువని చెబుతున్నాయి అధ్యయనాలు. సాధారణంగా ఎంతో మందిలో కనిపించే ఆందోళన, ఒత్తిడి స్థాయిలు పండు రోజు తినే వాళ్ళలో కనిపించవు. పోషక విలువలు తక్కువగా ఉండే స్నాక్స్ తినే వాళ్ళలో మామూలు మతిమరుపు వస్తువులు ఎక్కడ పెట్టామో మరిచిపోవటం ఉంటాయి. కానీ పండ్లు ఆహారంగా తీసుకున్న వాళ్లలో ఎలాంటి మానసిక రుగ్మతలు రావు అంటున్నారు అధ్యయనకారులు.
ఎంతో హాయి
థాయిలాండ్ మసాజ్ లకు పెట్టింది పేరు అక్కడి పర్యాటక కేంద్రం చయాంగ్ మాయ్ ప్రాంతంలో ఉన్న ఎలిఫెంట్ నేచర్ పార్క్ లో ఏనుగులు ఫిజియోథెరపీ చేస్తాయి. హాధ్ మసాజ్ పేరుతో ఈ మర్దన చాలా ఫేమస్. ఫిజియోథెరపీ నిపుణులు చేత శిక్షణ ఇప్పించి వారి ఆధ్వర్యంలో పర్యాటకులకు ఏనుగులు మర్దన చేస్తాయి. భారీ బరువుండే ఏనుగులు సున్నితంగా తట్టేలా వీటికి నిపుణులు శిక్షణ ఇస్తారు. దీనితో ఎటువంటి హాని చేయకుండా ఏనుగులు మసాజ్ చేస్తున్నాయి.
నెక్లెస్ తో ఆరోగ్యం
అనుక్షణం ఆరోగ్యాన్ని కనిపెట్టే స్మార్ట్ నెక్లెస్ కనిపెట్టారు అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చూసేందుకు సాదాసీదా గా కనిపించే ఈ నెక్లెస్ చెమట లోని సోడియం పొటాషియం హైడ్రోజన్ ఆయాన్ల పరిమాణాన్ని 98.9 శాతం ఖచ్చితంగా కనిపెడుతుంది. చెమటతో గ్లూకోజ్ స్థాయిల్లో వచ్చే మార్పులను గుర్తించగలుగుతుంది. డయాబెటిస్ రోగులకు ఇది అద్భుతంగా పనిచేస్తుందని దీనిద్వారా చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
సుశీల దేవి లిక్మాబమ్
కామన్ వెల్త్ క్రీడలలో సుశీల దేవి లిక్మాబమ్ రజత పతకం సాధించింది. 48 కేజీల జూడో ఫైనల్స్ లో రెండో స్థానంలో నిలిచింది మేరీకోమ్ పుట్టిన మణిపూర్ లోనే సుశీలాదేవి జన్మించారు. తల్లి చావోచి, తండ్రి మనిహర్. ఇంపాల్ లోని స్పోర్ట్ అత్తారింటి ఆఫ్ ఇండియా ప్రాక్టీస్ మొదలు పెట్టిన సుశీల పటియాలా లోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు మారింది. 2008 లో జూనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ గెలుచుకొని […]
అదొక రకం యుద్ధభూమి
నేను ఒడిపోకుండానే నా ఓటమి నిశ్చయం చేశారు నాకు ఎడమ కన్ను కనిపించదు కుడికన్ను అస్పష్టంగా ఉంటుంది. ఆ కాస్త చూపుతోనే చదరంగం ప్రాక్టీస్ చేశాను. ప్రత్యేక బోర్డు తయారు చేయించారు మా తల్లిదండ్రులు ప్రత్యర్థులతో ఆట సమయం ఎక్కువ అవుతుందని చిరాకు పడకుండా శరవేగంతో ఆడటం ప్రాక్టీస్ చేశాను. 2015 లో మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ అనిపించుకునే అంతవరకు విశ్రమించలేదు అంటోంది నటాషా మోరల్స్ టోర్నీ లో 478 మ్యాచ్ లు ఆడితే 222 మ్యాచ్ […]
ఐడియా అద్భుతం
నిఫ్ట్ ముంబై నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ వేసింది రుచి వర్మ 2020లో ఆరువి రుచి వర్మ పేరుతో బ్రాండ్ మొదలుపెట్టింది గర్భిణీలు వేసుకునే డ్రెస్ డిజైన్ చేయడంతో ఆమె వ్యాపారం పుంజుకుంది. అమెజాన్, మిత్ర, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్ లైన్ వేదికల్లో రుచి వర్మ బిజినెస్ నడుస్తోంది. ఏడాదికి ఐదు కోట్ల బిజినెస్ చేస్తాననే రుచి వర్మ ఈ మధ్య క్యాజువల్ వేర్ పైన దృష్టి పెట్టింది. ఖాళీవుంటే పెయింటింగ్ బొమ్మలు వేస్తూ ఉంటుంది రుచి […]
వేలాడే మొక్కలు
చిన్న బాల్కనీ ఉంటే ఎక్కువ నీరు, మట్టి అవసరం లేని వేలాడే మొక్కలు పెంచుకోవచ్చు బోస్టన్ ఫెర్న్ బేబీ టియర్స్ వంటి హ్యాంగింగ్స్ నుంచి వేలాడే మొక్కలు చాలా బావుంటాయి. బేబీ టియర్స్ కు చిన్న ఆకులు ఉంటాయి. జలపాతం లాగా కనిపించే ఈ మొక్క కు మట్టి తేమగా ఉండాలి. వేలాడే ముత్యాల వంటి పెరల్ ప్లాంట్ కు రోజూ కాసిని నీళ్లు పోస్తే చాలు. హృదయాకారంలో మెరిసే ఆకులపైన తెలుపు, పసుపు, బంగారు వర్ణాల […]
వస్తువులు శుభ్రం
చిన్న పాటి కిటుకుల తో ఇల్లు, వస్తువులు శుభ్రం చేసుకోవచ్చు. ఏదైనా ఫ్లోర్ క్లీనర్ మైక్రోవేవ్ లో స్ప్రే చేసి అరగంట పాటు వదిలేసి తర్వాత టూత్ బ్రష్, పొడి బట్టతో తుడిస్తే మైక్రోవేవ్ ఎటువంటి మరకలు లేకుండా ఉంటుంది. టమాటో ల పైన రెండు గాట్లు పెట్టి వేడినీళ్లలో కాసేపు పడేస్తే పై తొక్క తెల్లగా ఊడి వస్తుంది. వారానికి ఒకసారి బేకింగ్ సోడా నిమ్మరసం కలిపిన మిశ్రమం లో వేడి నీళ్ళు పోసి టూత్ […]
మిస్ ఇండియా 2022
ప్రతిష్టాత్మక మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని వర్జీనియా కు చెందిన యువతి ఆర్య వాల్వేకర్ గెలుచుకున్నారు సినీనటి కావాలన్న తన చిరకాల కోరిక ఈ కిరీటం నెగ్గడం ద్వారా తీర్చుకొంటున్నది ఆర్య వాల్వేకర్.
అందమైన ఉత్పత్తులు ఇవి
పాత చీరలకు ప్లాస్టిక్ వ్యర్ధాలు జోడించి లగ్జరీ ఉత్పత్తులు తయారు చేస్తోంది రిని మెహతా తమ్ముడు రోహన్ మెహతా తో కలిసి ‘పిటారా’ బ్రాండ్ కు రూపకల్పన చేసింది. పిటారా అంటే ట్రెజరీ బాక్స్ అని అర్థం జైపూర్ కు చెందిన రిని మెహతా టెక్సటైల్స్ డిజైనర్ గా పని చేసింది. ఆమె ప్రారంభించిన పిటారా బ్రాండ్ తో చేసిన ఉత్పత్తులను రాజస్థానీ కళా సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబం లాగా ఉంటాయి. బగ్రు,జర్దోసి ప్రింట్లు ఎంతో బావుంటాయి. […]
విలాస రూపం
ఎంబ్రాయిడరీ డిజైన్స్ తో మెరిసిపోయే లాంగ్ వెల్వెట్ జాకెట్ సాయంత్రపు పార్టీలకు అంతులేని అందాన్ని ప్రత్యేకతను ఇస్తాయి. బ్లాక్, పర్పుల్, బ్లూ, గ్రీన్ కలర్ కోట్లు. రాచరికపు హంగులు తెచ్చిపెడతాయి. అలాగే వెల్వెట్ జాకెట్ శారీ తో లెహంగా కాంబినేషన్ గా ఉంటుంది. ఒకే రకం, లేదా కాంట్రాస్ట్ కలర్ జాకెట్ కూడా బావుంటాయి. ఈ వస్త్రం లోనే మెరుపు ఉంటుంది కనుక పెద్దగా ఆభరణాలు అవసరం ఉండదు. చెవులకు లాంగ్ హ్యాంగింగ్స్ ఉంటే చాలు ఫ్యాషన్ […]
పాలిచ్చే తల్లుల ఇబ్బంది
‘ఫ్రీడం టు నర్స్’ పేరుతో గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించారు ఆధునిక ప్రకాష్ దీనికి తోడుగా పూణే నుంచి బెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ మదర్స్ పేరుతో ఫేస్ బుక్ పేజి ఓపెన్ చేశారు. ఎంతోమంది తల్లులు తమ బిడ్డలకు పాలు ఇవ్వటం తో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు 2013 లో ప్రారంభించిన ఈ పేజ్ లో లక్షన్నర మంది తల్లులు సభ్యులుగా ఉన్నారు ఇది పసి బిడ్డలకు పాలిచ్చే తల్లులు బయట ప్రపంచం లోకి […]
