August 2022
తాంబూలానికి తోడుగా
వరలక్ష్మి వ్రతం జరుపుకొన్న కథ సాయంత్రం పేరంటంలో ముత్తైదువులకు తాంబూలం ఇస్తారు. ఈ గిఫ్ట్ పర్యావరణ హితంగా ఉండేలా చూడాలి అంటారు ఎక్సపర్ట్స్. చక్కని జూట్ బ్యాగ్ లో పండు తాంబూలం పెట్టి ఇవ్వచ్చు. కంచు, ఇత్తడి పింగాణీ రూపాల్లో కామధేనువు లక్ష్మీ గణపతి కాటున్లు ఇవ్వొచ్చు. పెయింటింగ్ చేసిన మట్టి కుండిల్లో చక్కని మొక్కలు బహుమతిగా ఇవ్వొచ్చు. ఆరోమా డిఫ్యూజర్స్ మంచి వాసన వేస్తాయి. ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతిని ఇస్తాయి. వీటిని కూడా పండుగ […]
వర్షాలకు బెస్ట్ ప్యాక్
వర్షాల్లో చల్లని వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. శిరోజాలు పాడవకుండా ఈ కాలంలో వారానికి ఒక సరైన హెన్నా ప్యాక్ వేసుకోవాలి ఇది కండిషనింగ్ ఏజెంట్ గా పని చేసి జుట్టును మృదువుగా ఉంచుతుంది. ఐదు స్పూన్ల హెన్నా పొడికి రెండు స్పూన్ల డికాషన్ కోడిగుడ్డు తెల్లసొన, అర చెక్క నిమ్మరసం, స్పూన్ చొప్పున మెంతుల పొడి, ఉసిరి పొడి, పెరుగు కలిపి మూడు గంటలు నాననివ్వాలి. ఇందులో పావు స్పూన్ యూకలిప్టస్ నూనె కలిపి మెత్తగా […]
మెరుస్తాయి
గాజు పాత్రలో దేన్నైనా స్టోర్ చేసుకోవచ్చు. చూసేందుకు, పదార్థాలను నిల్వ చేసేందుకు చక్కగా ఉంటాయి. కానీ ఈ గాజు పాత్రల పై నీటి మరకలు పేరుకుపోయి ఒక పట్టాన వదలవు. టీ స్పూన్ బేకింగ్ సోడా టీ స్పూన్ వైట్ వెనిగర్ కలిపి ఈ మిశ్రమాన్ని గాజు పాత్ర పై పేర్కొన్న నీటి మరకలు పై రాసి అరగంట అలా వదిలేయాలి తర్వాత రుద్ది కడిగేస్తే చాలు పాత్రలు మెరుస్తూ శుభ్రంగా ఉంటాయి. బాగా శుభ్రం చేసి […]
విజయమే సమాధానం
ఇది పురుషుల పరిశ్రమ స్త్రీలు నిలదొక్కుకోవడం కష్టం అన్నారు నేను దానికి విజయంతో జవాబు చెప్పాలనుకున్నా అంటుంది సంగీత బేరి. ఒడిశా లో ది స్టోన్ స్టూడియో పేరుతో విగ్రహాల తయారీ కంపెనీ ప్రారంభం చేసింది సంగీత. బుద్ధుడి విగ్రహాలు ఉద్యానవన విగ్రహాలు మౌంటెన్స్ ఇండోర్ విగ్రహాలు దేవతల విగ్రహాలు మ్యూరల్స్ టేబుల్ టాప్ డెకరేషన్స్ మొదలైనవి తయారుచేస్తారు. ఈ స్టూడియో వివిధ ప్రాంతాలకు చెందిన 500 మంది కళాకారులతో పనిచేస్తుంది సంగీత విగ్రహాలు కళాకృతులు అలంకరణ […]
అందాన్నిచ్చే నూనెలు
ఎసెన్షియల్ ఆయిల్స్ చర్మానికి అందాన్ని తీసుకురావటం లో ముందుంటాయి. ఇందులో లో నిమ్మ నూనె తాజా తనానికి పరిశుభ్రతకు మారుపేరు. ఇల్లు శుభ్రపరిచే సాధనాలు సబ్బుల తయారీలో ఈ నూనె విరివిగా వాడుతారు. ఈ నూనెలో ఉండే డి-లిమోనిని అనే మూలకం చర్మం పైన ముడతలు పోగొట్టి రక్త ప్రసరణ మెరుగు పరచి చర్మాన్ని తేటగా చేస్తుంది. సూర్యరశ్మి ప్రభావంతో కమిలిపోయిన చర్మాన్ని తిరిగి కాంతిమంతంగా చేయటంలో లావెండర్ నూనె తిరుగులేనిది. వంకాయ రంగు పువ్వులుండే ఒక […]
సంగం లక్ష్మీబాయమ్మ
1911లో హైదరాబాద్ దగ్గరలోని ఘట్కేసర్ లో జన్మించిన ఆడ సంగం లక్ష్మీబాయమ్మ వినోబాభావే శిష్యురాలు పార్లమెంట్ మెంబర్ గా 20 ఏళ్లున్నారు 1952లో సైదాబాద్ లోని తమ సొంత భవనం లో ఇందిరా సేవా సదనం స్థాపించారు. తనకున్న సమస్త సంపదలు దానికే ధారపోశారు లక్ష్మీబాయమ్మ. 1952 లోనే జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్,బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అఖండ విజయం సాధించారు. విద్యాశాఖ ఉపమంత్రిణిగా పనిచేశారు. ఈ పదవి అలంకరించిన ప్రథమ తెలంగాణ మహిళా […]
కంటి కింపుగా
పాశ్చాత్య దేశాల్లో పిల్లల పెంపకంలో ఫుడ్ ఆర్ట్ కు ఎక్కడ లేనంత ప్రాధాన్యత ఉంది అక్కడ పిల్లల భోజనాన్ని అచ్చమైన కళాఖండాలుగా ప్లేట్లో అమరుస్తారు. పిల్లలకు తిండి తినిపించడం ఏ దేశంలో అయినా సవాలే కదా. వెజ్ పఫ్ కు చేపల లాగా కుకీస్ పిల్ల పిల్లల్లా రొట్టెను పడవ లాగ తీర్చిదిద్దితే పిల్లలు మారాం చేయటం ఆపేసి ప్లేట్లో పదార్థాలకు మనసు ఇచ్చేయవచ్చు. రోజు తినే భోజనమే. పిల్లల కళ్లల్లో పడేలా కాస్త సృజనాత్మకంగా తీర్చిదిద్దితే […]
రుచిగా తినచ్చు
ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా ఎడిబుల్ కట్లరీ ట్రెండ్ మొదలైంది. అంటే రుచికరమైన పదార్థాలతో తయారయ్యే స్పూన్ లు, ప్లేట్లు, కప్పులు ఇవి వాడిన తర్వాత హాయిగా తినవచ్చు. మల్టీ గ్రెయిన్ పిండితో తయారయ్యే ఈ కట్లరీ లో 14 శాతం డైటరీ ఫైబర్ 10 గ్రాములు ప్రొటీన్లు, 2 శాతం పొటాషియం, 7 శాతం క్యాల్షియం, 33 శాతం ఐరన్ ఉందని లెక్కలు తేల్చారు పోషకాహార నిపుణులు. తినే డిష్ కన్నా ఈ కట్లరీ నే ఆరోగ్యవంతమైన […]
ఇప్పుడు మేం క్లాస్ మేట్స్
మా అమ్మతో కలిసి కాలేజ్ కు వెళ్లడం పరీక్షలకు ప్రిపేర్ అవ్వటం ఎంతో బాగుంది. నేను అమ్మ కలిసి ఎల్ ఎల్ బి లో చేరాం. ఇద్దరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం అంటు సంతోషం వ్యక్తం చేసింది నైనా జైస్వాల్. హైదరాబాద్ కు చెందిన ఈ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ పిహెచ్ డి తో సహా ఎన్నో డిగ్రీలు అందుకుంది. ఎల్.ఎల్.బి తర్వాత సివిల్ సర్వీసెస్ లక్ష్యాన్ని చేరే ప్రయత్నం ప్రారంభిస్తాను […]
నడకే ఔషధం
కోపాన్ని కొన్ని నియమాలతో నియంత్రించుకోవడం సాధ్యమే అంటున్నారు ఎక్సపర్ట్స్. ముందుగా కోపం వస్తే కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలి దీనితో అరిచే స్థాయి మాట్లాడే స్థాయికి వస్తుంది మెదడు. శారీరక మానసిక ఒత్తిడి కొన్ని సందర్భాల్లో కోపానికి కారణం అవుతుంది దీనికి వ్యాయామం యోగా పరిష్కారం. విపరీతంగా కోపం వస్తే ముందుగా నిలబడిన ప్రదేశం నుంచి దూరంగా వెళ్లి పది నిమిషాలు నడవడం కూడా మంచిదే. నేను చేసిందే రైట్ అనుకునే మన స్థితిని మార్చుకుంటే కోపం […]
గేమింగ్ ఇండస్ట్రీలో సౌమ్య
మనస్తత్వశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న సౌమ్యసింగ్ రాథోడ్ గేమింగ్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయ్యింది.మహిళా సంపన్నుల జాబితా (హురున్ పవర్–లీడింగ్ వెల్దీ ఉమెన్ 2021)లో చోటు సాధించింది. నాలుగేళ్ళ క్రితం పవన్ నందాతో కలిసి దిల్లీ కేంద్రంగా ‘విన్ జో’ పేరుతో సోషల్ గేమింగ్ యాప్ మొదలు పెట్టింది సౌమ్యసింగ్.‘క్విక్ ఎంటర్‌టైన్‌మెంట్’ లక్ష్యంతో రకరకాల జానర్స్‌లో యూత్‌ను ఆకట్టుకునే గేమ్స్ రూపొందించింది.‘విన్ జో’ ద్వారా పరోక్షంగా, ప్రత్యక్ష్యంగా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. సౌమ్య ముఖ్యంగా ‘రెస్పాన్సిబిలిటీ గేమింగ్’కు […]
అపురూపమైన పుష్పం
ఎన్నో వన్నెల్లో గుండ్రని బంతి ఆకారంలో కనిపించే బొగడ బంతి పూలను గ్లోబ్ అమరాంధ్ అంటారు. కొమ్మలు రెమ్మలు ఎండినా పువ్వు మటుకు వాడకుండా రూపం పోకుండా ఉంటుంది. కనుకనే వీటిని నేచర్స్ సూపర్ ఫ్లవర్ గా చెబుతారు. జమైకా అమెరికాల్లో వీటిని బ్యాచిలర్ బటన్ అంటారు. ఈ పువ్వుల్లో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ క్యాంపెరల్ అనే చర్మాన్ని రక్షించే గుణం కూడా ఉంది.ఫంగై, బ్యాక్టీరియా తో పోరాడే ఆంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి. ఈ చిన్న పువ్వుతో […]
పురుషులే సున్నితం
కుటుంబం ప్రేమ సంబంధాల్లో విభేదాలు తలెత్తి విడిపోవాల్సి వస్తే ఆ బాధ స్త్రీల కంటే పురుషుల్లోనే ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు. లాంకాస్టర్ యూనివర్సిటీ నిపుణులు చేసిన అధ్యయనంలో ఈ విడిపోవటం, స్త్రీల కంటే పురుషులనే బాధించాయని ఆన్ లైన్ కౌన్సిలింగ్ సెంటర్లలో తీసుకున్న డేటా చెపుతోంది. విడిపోవటం వల్ల తామెంత బాధ పడుతున్నామొ చెప్పుకోని ఏడ్చిన పురుషులే ఎక్కువ అని చెబుతున్నారు. భావోద్వేగాలు ఆడవాళ్ళకున్నట్లే మగవాళ్ళకి ఉంటాయని, ఇంకా చెప్పాలంటే మరి కాస్త పురుషుల్లోనే ఎక్కువ అని […]
రెండు ఆకులు చాలు
సౌందర్యం కోసం ఉపయోగించే ఎన్నో క్రీములు లోషన్ల కంటే వేపాకులు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి అంటారు ఆయుర్వేద వైద్యులు. వేపాకులు వేసి మరిగించిన నీళ్లతో మొహం కడుక్కుంటే కళ్ళు తేటగా ఉంటాయి. ముఖంలో నిగారింపు వస్తుంది. కళ్ళు మంటలు ఎర్రబడటం ఉండదు. ప్రతి ఉదయం రెండు వేపాకులు తింటే, లేదా ముద్దగా నూరి తిన్న చర్మం కాంతివంతంగా ఉంటుంది. మొటిమలు కళ్ళకింద వలయాలు తగ్గుతాయి. వేపాకు నూరి తలకు పట్టిస్తే జుట్టు రాలడం చిట్లటం డ్రై గా […]
హ్యాపీ గా ఉండాలంటే
మనసు ఉల్లాసంగా ఉండాలంటే ఫీల్ గుడ్ హార్మోన్ డోపమైన్ ఉత్పత్తి మెరుగ్గా ఉండాలి. అందుకోసం జీవన విధానంలో మార్పులు అవసరం. ఉల్లాసవంతమైన పనుల్లో పాల్గొనోట డాన్స్, ఆటలు, నచ్చిన పాటలు వినటం ఏ పనిలో ఉత్సాహం దొరికితే ఆ పని కోసం కొంత సమయం కేటాయించాలి. ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. మనసారా నవ్వాలి. పజిల్స్ చిక్కు ప్రశ్నలతో మెదడుకు వ్యాయామం అందించాలి. మెదడు చురుగ్గా ఉంటే డోపమైన్ ఉత్పత్తి పెరుగుతుంది.
ఎంత తింటున్నామో అదీ ముఖ్యం
40 ఏళ్లు దాటినా అందం కాపాడుకో గలుగుతున్నాను అంటే కేవలం శాకాహారం వర్క్ వుట్స్. ముఖ్యంగా ఏం తింటున్నాననే దాని పట్ల ధ్యాస ఉంచటం మాత్రమే అంటోంది మలైకా అరోరా. ఆరోగ్యం తీరు శరీరం బరువు మొదలైన విషయాలు లెక్కలు తూచే ఏం తినాలో నిర్ణయిస్తారు డైటీషియన్లు. కానీ ఎంత తినాలో కూడా ఖచ్చితంగా పాటించాలి అంటారామె. నేనయితే ఉదయం గోరువెచ్చని నీరు తేనె కొబ్బరి నూనె కలిపిన పానీయం తాగుతాను. ఇది చర్మాన్ని మెరిపించి వ్యర్థాలను […]
రోజ్ వాటర్ తో నిద్ర
రోజ్ వాటర్ తో చర్మం మృదువుగా మారటమే కాదు ఇంకా నిద్రకు కూడా మేలు చేస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ఒక కప్పు నీళ్ళలో పావు కప్పు రోజ్ వాటర్ కలిపి తలస్నానం పూర్తయ్యాక ఆఖర్లో ఈ మిశ్రమంతో జుట్టు కడిగేస్తే లిఫ్ట్ జుట్టు మెరిసిపోతుంది. రోజ్ వాటర్ కొన్ని చుక్కల జాస్మిన్, లావెండర్ వంటి ఎసెన్షియల్ ఆయిల్ కలిపి తలంతా స్ప్రే చేసి మృదువుగా మర్దన చేస్తే రక్తప్రసరణ మెరుగవడం తో పాటు శిరోజాలు సువాసనలు వస్తాయి. […]
పొడిగా ఉంటేనే ఆరోగ్యం
వంటిల్లు చెమ్మగా ఉంటే క్రిమికీటకాలు చేరతాయి. తడితో దుర్వాసన వస్తుంది. వంట ఇంటి తలుపులు కిటికీలు వీలైనంత ఎక్కువ సేపు తెరిచి, గాలి, వెలుతురు లోపలికి వచ్చేలా చూడండి. చెద పురుగులు, బొద్దింకలు చేరకుండా ఉంటాయి. వంట చేసే గట్టు పైన జిడ్డు మురికి ఎప్పటికప్పుడు వదిలించాలి. సింక్ మూలల్లో తడిలేకుండా పేరుకోకుండా చూడాలి. వంటగది అరల్లో నిలకా జెల్ ప్యాకెట్లు కానీ, బొగ్గు ముక్కలను చిన్న మూటలా కట్టి ఉంచితే ఫ్రెష్ గా ఉంటుంది. సింక్ […]
మహిళల హక్కుల కోసం
సమాజానికి సహాయం చేయటం కోసం యువర్ ఇన్‌స్టా లాయర్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ లో మహిళల హక్కుల గురించి చెబుతున్న బెంగళూరు అమ్మాయి తాన్యా ను డిజిటల్ స్టార్ గా ప్రకటించింది ఫోర్బ్స్ చట్టాలను సామాన్యులకు అర్థమయ్యే భాషలో హాస్య కథలు జోడించి చెప్పటం ప్రత్యేకత. మహిళా సాధికారత చట్టాలు పిల్లల హక్కులతో పాటు మానసిక ఆరోగ్యం పైన అవగాహన కల్పిస్తోంది తాన్యా. ఊహ తెలియని వయసులో మా అమ్మ నాన్న విడిపోయారు. న్యాయవాది అయ్యాక గాని విడాకులు […]
పర్యావరణ హితం లక్ష్యం
ఇస్రో ఉద్యోగి అయిన పంక్తి పాండే ను డిజిటల్ స్టార్ గా ఎంపిక చేసింది ఫోర్బ్స్. కాస్మెటిక్స్ దగ్గరనుంచి ఇల్లు వస్త్రాలు శుభ్రం చేసుకొనే డిటర్జెంట్ క్లీనర్లు ఇంట్లోనే తయారు చేసుకుని వాడతారు ‘జీరో వేస్ట్’ విధానాన్ని ఫాలోయర్ లకు అలవాటు చేస్తుంది. పంక్తి పాండే పాత వస్త్రాలు ఆధునిక ధోరణిలో కి మార్చడం చర్మ సమస్యలకు సహజ పరిష్కారాలు బహిష్ఠు సమయంలో పర్యావరణ పద్ధతులు ప్రోత్సహించే టెడెక్స్ స్పీకర్ కు ఇన్‌స్టా ఖాతా 2.6 లక్షల […]
