December 2021
ఉత్తమ ఉపాధ్యాయురాలు
2021లో చాలా మంది వ్యక్తులు తమ విజయాలతో తోటి వారిని ప్రభావితం చేశారు. చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన మేఘన ముసునూరి హైదరాబాద్ ఫౌంటెన్ హెడ్ గ్లోబల్ స్కూల్, జూనియర్ కాలేజీ వ్యవస్థాపకురాలు మంచి టీచర్ కూడా. ఈ సంవత్సరం గ్లోబల్ టీచర్ ప్రైజ్ అందుకున్నారు మేఘన రెండు వందల ఆరు కు పైగా దేశాల్లో ని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే ఈ ప్రైజ్ కు షార్ట్ లిస్ట్ అయినా ఉపాధ్యాయుల్లో మేఘనా […]
కాస్మెటిక్ క్యాప్సిల్స్
అమ్మాయిలు మేకప్ కిట్ ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఏదైనా టూర్ కి వెళ్ళాలి అనుకుంటే అన్ని వస్తువులు తీసుకు పోవడం కష్టం అందుకే ఈజీగా కావలసినవి వెంట తీసుకొని వెళ్లేలా సౌందర్య ఉత్పత్తులు మినీ క్యాప్సూల్స్ లాగా వచ్చేసాయి. లిప్ స్టిక్, లిప్ బామ్ లు, సన్ స్క్రీన్ లోషన్, స్క్రబ్, ఫేషియల్ క్రీమ్స్, ఆయిల్ ఫేస్ మాస్క్ లు బుల్లి క్యాప్సుల్స్ రూపంలో దొరుకుతున్నాయి ప్రయాణాల్లో ఒక చిన్న డబ్బాలో ఇవన్నీ తీసుకొని వెళ్ళవచ్చు […]
ఎంబ్రాయిడరీ వాచీలు
టైమ్ చూసుకునేందుకు వాడే వాచీలు ఇప్పుడు అందమైన కళాఖండం లాంటి రూపంలో దుస్తులకు మ్యాచింగ్ లాగా వచ్చేస్తున్నాయి. డయల్ లో పాల ఎంబ్రాయిడరీ దారాలతో పాతకాలం నాటి పెయింటింగ్స్ పక్షులు, పువ్వులు కుట్టేస్తున్నారు. మెయిడెన్ సెల్టన్,గూచి, ఛానల్, ఒలివియా బర్టన్, చోపార్డ్ వంటి లగ్జరీ బ్రాండ్లు ఈ అందమైన ఎంబ్రాయిడరీ వాచ్ లు తయారు చేస్తున్నాయి. మనుషుల మొహాలు ఎంబ్రాయిడరీ తో గూచి వంటి బ్రాండ్ మగవాళ్ళు కోసం పాములు, సింహాలు, పులుల బొమ్మలు రంగు […]
ఆస్కార్ కు ‘రైటింగ్ విత్ ఫైర్’
అందరూ దళిత మహిళ జర్నలిస్ట్ లే నడుపుతున్న ‘ఖబర్ లెహరియా’ న్యూస్ పేపర్ గురించి దాని డిజిటల్ వార్తల గురించి తయారు చేసిన డాక్యుమెంటరీ ‘రైట్ విత్ ఫైర్’ ఆస్కార్ 2022 బరిలో మన దేశం నుంచి షార్ట్ లిస్ట్ అయింది. 25 మంది దళిత మహిళా జర్నలిస్ట్ ఉత్తరప్రదేశ్ బుందేల్ ఖండ్ మధ్యప్రదేశ్ లలో గ్రామీణ వార్తలను స్త్రీల దృక్కోణం లోంచి అందించిన పత్రిక గురించిన డాక్యుమెంటరీ ఇది 2002లో ఖబర్ లహరియా వార్తాపత్రిక చిత్రకూట్ […]
చక్కని గిఫ్ట్
చిన్న పిల్లల పుట్టిన రోజు చక్కని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే వచ్చే కస్టమైజ్డ్ ఫోటో రూబిక్స్ క్యూబ్ వైపు చూడొచ్చు. ఫోటో పంపితే చాలు పాపాయి బొమ్మ తో ఈ రూబిక్స్ క్యూబ్ తయారు చేసి ఇస్తారు. అన్నివైపులా పోటోలే ఉండే ఈ క్యూబ్ తో పిల్లలు వాళ్ళ ఫోటో ని వాళ్లే మళ్లీ మళ్లీ ఆట ఆడుతూ చూసుకుంటారు. ఇంతకుముందు రంగుల్ని కలిపేసి ఆడే ఈ క్యూబ్ లు ఇప్పుడు […]
ఇది అలంకరణ ‘సమయం’
ఫ్యాషన్ జ్యువెలరీ లో టైమ్ సింబల్ లోకి వచ్చి చేరింది. టైమ్ చూసేందుకు ఉపయోగపడే గడియారాల తో బెల్ట్ లు, బ్రాస్ లైట్స్, బ్యాంగిల్స్ వంటి రకరకాల నగలు తయారు చేశారు డిజైనర్లు. పెయింటింగ్ జ్యువలరీ, ఫ్యాబ్రిక్ జ్యువలరీ, టెర్రకోట జువెలరీ లాగా యాంటిక్ లుక్ తో కనిపిస్తున్నా టైమ్ జ్యువెలరీ ఈ సంవత్సరపు ట్రెండ్ ఎక్కువగా మారనున్నది వేలాడే లోలాకులు, వేళ్లకు ఉంగరాలు, గడియారాలు వెలిగిపోతున్నాయి. కొత్తదనం కోరుకునే వాళ్లు ఈ కొత్త సంవత్సరం ఈ […]
శిరోజాల రక్షణ కు ఉసిరి
ఉసిరికాయలోని సి-విటమిన్ శిరోజాల రక్షణ కు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఉసిరికాయ పొడి తో ఎన్నో రకాల నూనె తయారు చేసుకోవచ్చు. రెండు స్పూన్ల ఉసిరి పొడి, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె కలిపి చాలా మరిగించాలి. నువ్వుల నూనెతో తల మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. ఉసిరి కాయ పొడి లో గుడ్డు వేసి గిలక్కొట్టి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు పెరుగుతుంది. […]
శారీ లైబ్రరీ
వడోదర లో హేమ చౌహాన్,సాధన షా,నీలా షా వంటి కొందరు స్నేహితురాళ్లు ఆస్తా సహేలి అనే బృందాన్ని ప్రారంభించి ఒక శారీ లైబ్రరీ ఏర్పాటు చేశారు. మంచి మంచి చీరెలు ధరించాలనే కోరిక ఉన్నా పేద మధ్యతరగతి ఇల్లాళ్లు ఇక్కడ కొంత డిపాజిట్ చేసి వేడుకల కోసం చీరెలు అద్దెకు తీసుకోవచ్చు.తిరిగి ఇచ్చాక లాండ్రీ ఖర్చులు పోను మిగతా డిపాజిట్ నీ వెనక్కు ఇస్తారు నిర్వాహకులు.ఏడాదికి ఓసారి జరిగే శారీ మేళాలో ఉచితంగా చీరెలు కూడా పొందవచ్చు. […]
డాకర్ రేస్ లో మషేల్
ఎడారిలో సాగే అత్యంత కఠినమైన డాకర్ ర్యాలీ 2022లో పడనున్నది 33 ఏళ్ల సౌదీ మహిళ రేసర్ మషేల్ అల్ ఒబైదన్. ఈ రేసులో పాల్గొననున్న తొలి మహిళ కూడా ఆమె. ఈ మధ్యనే వరల్డ్ క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్ లో హెయిల్ ఇంటర్నేషనల్ ర్యాలీ’ టీ3 క్లాస్‌లో రెండో స్థానం దక్కించుకుంది మషేల్.డాకర్ రేస్ లో పాల్గొనేందుకు వ్యక్తిగత ట్రైనర్ తో కలిసి సౌదీ ఎడారుల్లో సాధన చేస్తోంది. ఈ రెస్ లో వేగం ఒక్కటే […]
ఆంచల్ జైల్లో ఆర్జే లు
హరియాణా లోని ఆంచల్ సెంట్రల్ జైల్ లో ఆరుగురు మహిళా ఖైదీలకు ఆర్జే లుగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది వర్తికా నందా. ఢిల్లీ యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ వర్తికా నందా సెంట్రల్ జైలు లో ఏర్పాటు చేసిన జైలు రేడియో కోసం మహిళా ఖైదీలకు శిక్షణ ఇచ్చారు. ఇంకొన్ని రోజుల్లో ఈ ఆరుగురు ఖైదీలు ఆర్ జె లుగా విధులు నిర్వహిస్తారు. ఒత్తిడి, ఒంటరితనం పోగొట్టేందుకు మనం ఒక కుటుంబం అనే భావన కలిగించేందుకు ఈ […]
అందరి నోట దుర్గవ్వ పాట
భీమ్లా నాయక్ సినిమాలో రామజోగయ్య శాస్త్రి రాసిన సెబుతున్నా నీ మంచి సెడ్డ పాటను సాహితి చాగంటి తో కలిసి పాడింది కుమ్మరి దుర్గవ్వ. ఆ పాట విడుదలైన రోజు 60 లక్షల మంది వీక్షకుల అభిమానం పొందింది. ఆశువుగా పాటలు కట్టేసి పాడే దుర్గవ్వ మంచిర్యాల దగ్గరలోని కోటిపల్లి దగ్గర ఉన్న రొయ్యల పల్లి కూలీ చేస్తూ బిడ్డలను పోషించుకునే దుర్గవ్వ సంబరాలు, పండగల్లో పాటలు అల్లుకుని పాడేది కూతురి ప్రోత్సాహం తో పాడిన, ఉంగురమే […]
చిరునవ్వుతో వస్తా
నేను వెనకడుగు వేయను రొమ్ము కాన్సర్ నీ జయిస్తాను అంటూ ప్రముఖ నటి హంసా నందిని సామాజిక మాధ్యమాల్లో తన జుట్టు లేకుండా ఉండే ఫోటో పోస్ట్ చేసి మరీ తన కాన్సర్ గురించి చెప్పుకొచ్చింది. కథానాయకగా ప్రత్యేక గీతాలు నర్తకిగా తెలుగు సినిమా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన హంసా నందిని నిండైన ఆత్మవిశ్వాసంతో తన కథ చెప్పింది. 4 నెలల క్రితం రొమ్ములో కణితి ఉందని చూసి వైద్యులను సంప్రదిస్తే రొమ్ముక్యాన్సర్ అన్నారు ఆపరేషన్ తో […]
చక్కని గిఫ్ట్
చిన్న పిల్లల పుట్టిన రోజు చక్కని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే వచ్చే కస్టమైజ్డ్ ఫోటో రూబిక్స్ క్యూబ్ వైపు చూడొచ్చు. ఫోటో పంపితే చాలు పాపాయి బొమ్మ తో ఈ రూబిక్స్ క్యూబ్ తయారు చేసి ఇస్తారు. అన్నివైపులా పోటోలే ఉండే ఈ క్యూబ్ తో పిల్లలు వాళ్ళ ఫోటో ని వాళ్లే మళ్లీ మళ్లీ ఆట ఆడుతూ చూసుకుంటారు. ఇంతకుముందు రంగుల్ని కలిపేసి ఆడే ఈ క్యూబ్ లు ఇప్పుడు […]
కేక్ పెళ్లి కూతురు
ఈ తరం పెళ్లి సందడి ఫోటో షూట్లు, కేక్ కటింగ్ ల తోనే హడావుడి చేస్తోంది. నిశ్చితార్థానికి రిసెప్షన్ కి కేక్ కట్ చేస్తున్నారు. ఈ వేడుకలను దృష్టిలో పెట్టుకొని కేక్ థీమ్ మార్చేశారు కళాకారులు లూధియానా కి చెందిన బ్రేక్ టౌన్ క్రష్ అనే సంస్థ ఈ మధ్య ఒక అందమైన పెళ్ళికూతురి కేక్ తయారు చేసి ఇన్ స్టా లో పెట్టింది.వధువే వచ్చి కూర్చుందా అన్నంత సహజంగా ఉంది కేక్. పంచదార మార్జిపాన్ లకు […]
మెదడు పనితీరుకు షాక్
కుత్రిమ మేధ తో మనిషి మేధాశక్తి పెంచవచ్చు అంటున్నారు పరిశోధకులు. మూర్ఛ వ్యాధితో బాధపడే కొందరు రోగులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తే వారి మెదడులో అవి ఎలా పనిచేస్తాయో చూసేందుకు సూక్ష్మమైన ఎలక్ట్రో కోడ్ లు అమర్చారు. అదే సమయంలో విద్యుత్ సాయంతో ఆలోచనా శక్తికి సంబంధించిన మెదడు భాగాలు మెరుగు అయ్యేలా చేశారట. కనుక డిప్రెషన్,ఆందోళన ఇతర మానసిక వ్యాధులను ఇదే విధంగా తగ్గించవచ్చు అంటున్నారు పరిశోధకులు. తాజా పరిశోధనలో మెదడు లు ఏ భాగంలో […]
రెడీమేడ్ డిజైన్స్
నెయిల్ పాలిష్ పైన డిజైన్లు సొంతంగా వేసుకోవడం చాలా కష్టం ఎవరైనా నైపుణ్యం ఉన్న ఆర్టిస్ట్ ల బ్రష్ లతో వేయాలి. ఇప్పుడు ఆ డిజైన్ లు అతికించుకునే స్టిక్కర్స్ లాగా వస్తున్నాయి. అవి అతికించుకొన్నవి అని తెలియకుండా సన్నని లైన్ స్టిక్కర్స్ డెకాల్స్ కూడా ఉన్నాయి. వీటిని మ్యాట్ గ్లిట్టర్ నెయిల్ స్ట్రిప్పింగ్ టేప్ లైన్స్ అంటున్నారు. ఎన్నో రంగుల్లో వస్తున్నాయి ఇవి. ఇలాటి టేపులు కొని నెయిల్ పాలిష్ వేసుకున్నాక కోరిన సైజ్ లో […]
గుస్సాడి ది సెలబ్రేషన్ ఆఫ్ గాడ్
గుస్సాడి సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ గాడ్ డాక్యుమెంటరీ తీసి గోండుల సాంప్రదాయాలు వారి జీవిత విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది దర్శకురాలు జెన్నిఫర్ ఆల్ఫోన్స్. కేరళ ఫిలిం ఫెస్టివల్ లో ఈ డాక్యుమెంటరీ ప్రశంసలు అందుకుంది. గోండులు ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ తీసింది జెన్నీఫర్. పూణేలో ఫిల్మ్ కోర్స్ చేసిన జెన్నిఫర్ దర్శకుడు కృష్ణవంశీ తో కలిసి పనిచేసింది. వీధి బాలల పైన తీసిన కచరా అనే షార్ట్ ఫిలిం ఆమెకు […]
జానకీ అమ్మాళ్
జానకీ అమ్మాళ్ గణిత మేధావి శ్రీనివాస్ రామానుజన్ భార్య. రెండేళ్ల పాటు మాత్రమే ఆమె రామానుజన్ తో కాపురం చేసింది. పదేళ్ళ వయసులో ఆమెకు 21 సంవత్సరాల రామానుజన్ తో పెళ్లయింది. పెళ్లి తర్వాత ఇంగ్లాండ్ వెళ్లిన రామానుజన్ పుట్టెడు జబ్బుతో ఇండియాకు తిరిగి వచ్చి కొన్ని నెలలకే మరణించారు. అప్పటికి జానకి వయస్సు 20 రామానుజన్ 32 ఏళ్ల వయసులో ఉన్నారు. ఆ తర్వాత ఆమె ఎన్నో కష్టాలు పడి కుట్టుపని వృత్తిగా చేసుకొని కాలం […]
విజేతల కథల పేజీ
హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేరుతో ఫేస్బుక్ ఫేస్ బుక్ ఓపెన్ చేసింది కరిష్మా మెహతా. సామాన్యులు చేసే అసామాన్య జీవాన పోరాటాలు త్యాగాలు గొప్ప పనులు విజేతల కథలే ఈ పేజీలో వస్తాయి. ఇప్పటివరకు 6000 మంది జీవన కథనాలు రాశారు ఎందరికో సాయం అందించగలగాను చదువుకి, వైద్యానికి, శిక్ష అనుభవించిన నిరపరాదులకు ధన సహాయం చేశాను. ఆ తృప్తి తీరనిది అంటుంది కరిష్మా మెహత. 21 ఏళ్ల వయసు లో 8 ఏళ్ల క్రితం ప్రారంభించిన […]
ప్రత్యేకం ఈ స్టయిల్
వేడుకల్లో రొటీన్ కు భిన్నంగా కనిపించాలంటే దోతీ స్టయిల్ డ్రస్ దానికి తగ్గ యాక్సెసరీలు జోడిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు అంటున్నారు స్టయిలిస్ట్ లు. ధోతి తో క్యాజువల్ లుక్ కోసం జోడిగా క్రాప్ టాప్ ధరించాలి. అలాగే మహారాణి హారం స్టేట్ మెంట్ ఉంగరం మువ్వలా మేజోళ్ళు చేతిలో క్లచ్ పట్టుకొంటే గుజరాతి లుక్ వచ్చేస్తుంది.లేదా ఆక్సిడైజ్డ్ జ్యువలరీ మెటాలిక్ క్లచ్ మెటాలిక్ బూట్లు ధరిస్తే లుక్ వచ్చేస్తుంది. ఇక ధోతి శారీ లుక్ అయితే మరింత […]
