Sunday, 28 Jun, 2026

ఆ వూరంతటికీ ఒక్కడే

ఊరంటే మనుషులు సందడి కదా. కానీ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా మీనాక్షిపురం గ్రామంలో మాత్రం ఒకే ఒక్క మనిషి నివసిస్తూ ఉంటాడు అతనే 70 ఏళ్ల కందస్వామి నాయకర్. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం ఆ వూరి జనాభా 1300. తర్వాత నుంచి ఒక్కళ్ళు గా ఆ ఊరు విడిచి వెళ్ళిపోయారు. దీనికి కారణం నీటి సమస్య రెండోది ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడం. ఈ ప్రాంతాల్లో వర్షాలు పడక పంటలు పండవు భూగర్భ జలాలు […]

కోకోకోలా లేక్

కోకోకోలా అందరూ ఇష్టంగా తాగే పానీయం కానీ బ్రెజిల్ లోని రియో గ్రాండ్ డెల్ నార్టే ప్రాంతానికి వెళ్లిన వాళ్లు మాత్రం కోకో కోలా  సరస్సులో హాయిగా ఈత కొడతారు ఈ సరస్సులో నీళ్లు అచ్చం కోకో కోల కానీ యపు రంగులో ఉంటాయి ఈ సరస్సు పేరు ‘లాగావో దె అరారాక్వారా’  కానీ దాన్ని అందరూ కోకోకోలా లేక అని పిలుస్తారు. ఈ సరస్సులోని నీటిలో అయోడిన్, ఐరన్ స్థాయిలు ఎక్కువగా ఉండటంతో ఈ నీటికి […]

ఫల్గుణి నాయర్

దేశంలోనే అత్యంత సంపన్న మహిళల్లో రెండో స్థానంలో నిలిచారు ఫల్గుణి ఆమె స్థాపించిన నైకా లిస్టెడ్ కంపెనీ అవతరించిన మొదటి రోజే  1,00,000 కోట్ల మైలురాయిని దాటింది గుజరాతీ వ్యాపార కుటుంబాల్లో పుట్టిన ఫల్గుణి నాయర్ ఐ ఐ ఎం  నుంచి మేనేజ్మెంట్ లో పట్టా తీసుకుంది 50 ఏళ్ళ వయసులో వ్యాపారం ప్రారంభించి తొమ్మిదేళ్లలో స్వయంకృషితో ఎదిగింది ఎవరి జీవితాలకు వాళ్ళు హీరో అని అర్థం వచ్చేలా మా సంస్థ కు నైకా( హీరోయిన్) అనే […]

అమ్మ చేతులు రెండే

దేవి చరిత్ర లో దేవి మూర్తి ని అష్టభుజి, అంటే పద్దెనిమిది చేతులు కలది, షోడశ భుజ పదహారు చేతులు కలది అని ఉంటుంది. అసలు ఆ దైవానికి ఎన్ని చేతులని అనుకుంటాము కానీ నిజానికి దేవి కి ఉన్నవి రెండే చేతులు. ఏ రాక్షసుడిని వధించాలో నిర్ణయించుకుని ఆ రాక్షసుడి శక్తిని అంచనా వేసుకొని వాని వధ కోసం ఆయా దేవతల నుంచి కొన్ని ఆయుధాలు తీసుకొని రాక్షససంహారం చేస్తుంది. ఆమె ఎన్ని ఆయుధాలు ధరించి […]

సౌందర్యమయం ఈ వర్ణం

ఇతిహాసాల్లో పురాణాల్లో చాలా గమ్మత్తయిన విషయాలు ఉంటాయి. సాధారణంగా తెలుపు కి చాలా ప్రాధాన్యత ఇస్తారు మనుష్యులు. తెలుపు వర్ణం తో ఉండే అది సౌందర్యం అనుకొంటారు పురాణాలు పరంగా చూస్తే ఎంతో అందమైన రూపంతో ఉంటాడని చెప్పే మన్మధుడు నల్లనివాడు. కీచకుడి తో పాటు,ఆమెను చుసిన వారు ఎవ్వరూ కళ్ళు తిప్పుకోలేనంత సౌందర్యవతి అని చెప్పే ద్రౌపతి నలుపు. ఆమే కృష్ణ (నల్లనిది) అని పిలుస్తారు. పురుషులకు కూడా మోహం తెప్పించేంత అందగాడని చెప్పే శ్రీరాముడు […]

దీపోత్సవ రహస్యం

ప్రాచీనులు పర్వదినాల్లో ఎం చేయాలని చెప్పిన దాని వెనుక ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్య రహస్యం కూడా ఉండి తీరుతుంది. ఈ కార్తీక మాసం లో దీపాలు వెలిగిస్తారు. ఆ వెలిగే దీపపు వెలుగు సాక్షాత్తు భగవంతుడి రూపమని,ఆ జ్యోతి లో దైవాన్ని దర్శించాలని దీపోత్వం చెపుతోంది చలి పెరుగుతున్న ఈ రోజుల్లో ఎన్నో క్రిమికీటకాలు బలంగా పెరుగుతూ ఉంటాయి. వాటిని పనిగట్టుకొని చంపటం నేరం. ఈ దీపాల వెలుగులు ఈ జ్వాలకు ఆకర్షింపబడి ఎన్నో కీటకాలు […]

ఈ సింహం పెద్ద సెలబ్రిటీ

ఎవరేనా కుక్కనో పిల్లినో పెంచుకుంటారు. ఈ రష్యన్ దంపతులు ఒక సింహం పిల్లను జూ నుంచి కొనుక్కొని తెచ్చి పెంచుకుంటున్నారు. 2015 రష్యా లోని సంరస్క్ అనే ఊర్లో జూలీ అనే  మౌంటెన్ లయన్ కు మూడు పిల్లలు పుట్టాయి.ఓ పిల్లని పెంజా అనే ఊర్లో ఒక జూ వాళ్ళు కొనుక్కున్నారు మెస్సీ అనే పేరు పెట్టారు దానికి జబ్బు చేస్తే అధికారులు దానిని చంపేద్దామానుకున్నారు. ఇది తెలిసిన అలెగ్జాండర్ మేరియా అనే ఇద్దరు సైకియాట్రిస్ట్ లు […]

అర్ధరాత్రుళ్ళు తినచ్చు

టెలివిజన్ ముందు కూర్చుని అర్ధరాత్రి దాకా ఉండటం చాలా మందికి అలవాటైపోయింది. అంతసేపు మేలుకొని సహజంగా ఆకలి వేస్తుంది కనుక రకరకాల చిరుతిండ్లు తినేస్తూ ఉంటారు. అర్ధరాత్రి చిరుతిండ్లు తినడం మంచిదేనని ఆరోగ్యవంతమైన స్నాక్స్ తింటే ఇబ్బంది లేదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అర్ధరాత్రి ఆకలి వేస్తే బెర్రీలు తినొచ్చు వీటిలో ఉండే పీచు మెగ్నీషియం నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉండటం లో ఉపకరిస్తాయి తృణ ధాన్యాలతో తయారు చేసిన స్నాక్స్ ఏవైనా తినొచ్చు వాటిలో ఉప్పు […]

ఈ పాలు చాలా రుచి

ఇప్పుడు పాలంటే డైరీ పాలు ఒక్కటే కాదు మొక్కల నుంచి దుంపల నుంచి పండ్ల నుంచి కూడా పాలు తయారవుతున్నాయి. అరటిపండులో పొటాషియం తోపాటు బి12 వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి కొంచెం సోడియం కూడా ఉంటుంది. ఇవి జంతువుల పాలు ముట్టుకుని వేగన్లే కాదు ఎవరైనా తాగచ్చు జ్యూసీగా తియ్యగా ఉండే ఈ పాలను ములా అనే కంపెనీ తయారు చేస్తోంది. మంచి పోషకాలతో పాటు చక్కెర శాతం కూడా ఈ పాలల్లో తక్కువే. ఈ […]

కృతిమ చెరువులు సృష్టికర్త మైథిలి అప్పల్వార్

తెలుగు రాష్ట్రాలతో సహా రాజస్థాన్ వంటి చోట్ల వేలాది కృత్రిమ చెరువులను సృష్టించి రైతుల కోసం ఇచ్చింది ముంబై లో పుట్టి పెరిగిన మైథిలి అమెరికాలోని జార్జియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డిగ్రీ చేసింది. ఆమె తయారు చేసిన సూపర్ లైనింగ్ పాలిమర్ షీట్ల తో పొలాల్లోనే చెరువులు ఏర్పాటు చేయించింది. ఈమె ఆలోచన లోంచి పుట్టిన జల సంచయ్ ద్వారా 80 వేల మంది రైతులు లబ్ది పొందారు. 13 వేలకు పైగా […]

నిష్ఠా దూదేజా  

గ్లామర్ ప్రపంచంలో విజయవంతమైన మోడల్ గా రాణిస్తోంది నిష్ఠా దూదేజా. ఆమెకు వినికిడి సమస్య ఈ అమ్మాయి 2018 మిస్ డెఫ్ ఆసియా టైటిల్ విజేత మిస్ అండ్ మిస్టర్ వరల్డ్ పోటీల్లో భారతదేశం నుంచి టైటిల్ గెలుచుకుంది. 2013, 2016, 2017 సంవత్సరాలలో బధిరుల ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్న ది మిస్ ఆసియా డెఫ్, మిస్ ఇండియా డెఫ్ టైటిల్స్ గెలుచుకొని టెన్నిస్ బ్యూటీ విభాగాల్లో నంబర్ వన్ గా నిలిచింది. భారత […]

‘అన్ని పర్వతాలూ ఎక్కుతా’

ఆఫ్రికా ఖండంలో ఎత్తయిన పర్వతం కిలిమంజారో ఎక్కి భారత జాతీయ జండా ఎగుర వేసింది మౌంటేనియర్ పులకిత హస్వి. 13 ఏళ్ల పులకిత కీబోర్డ్,గిటార్ వాయిస్తుంది.స్కేటింగ్ లో నేషినల్స్ కు వెళ్ళింది. భవిష్యత్ లో ఎవరెస్ట్ అకోన్‌కాగువా,డెనాలి,ఎల్ బ్రస్,విన్ సాన్ మాసిఫ్, లు కూడా ఎక్కాలని లక్ష్యం అంటుంది పులికిత.

హానీ లేని మెరుపులు

మేకప్ లో ఐ షాడోల కోసం గ్లిట్టర్ లను వాడతారు మొక్కల నుంచి తీసిన సెల్యులోజ్ లోనే ఈ గ్లిట్టర్ తయారు చేసినప్పటికీ అది మెరవటం కోసం సూక్ష్మమైన అల్యూమినియం ప్లాస్టిక్ రేణువులను కలుపుతారు ఈ మైక్రో ప్లాస్టిక్ తో పర్యావరణానికి ఎంతో నష్టం అని గుర్తించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పూర్తిగా భూమిలో కలిసిపోయే గ్లిట్టర్లు తయారు చేశారు. మొక్కలు పండ్లు కూరగాయల లోని రేణువులను సేకరించి దీన్ని తయారు చేశారు. ఈ మెరుపులు నెమలి, […]

ఆ సినిమాలు నన్ను మార్చేశాయి

స్పోర్ట్స్ అంటే నాకు ఎంతో ఇష్టం క్రీడాకారుల రియల్ హీరోస్ అంటుంది తాప్సీ. శభాష్ మిథు చిత్రంలో నటించే వరకు నాకు బ్యాట్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు ఏ కొత్త కథ వచ్చిన వదులుకోకూడదు అన్న ఆలోచనతోనే స్పోర్ట్స్ చిత్రాలు మొదలు పెట్టాను. రస్మీరాకెట్ తరువాత నన్ను నేను చూసుకొంటే శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉన్నాను అనిపించింది. పింక్, థప్పడ్‌ చిత్రాల తర్వాత నన్ను నేను మెరుగు మెరుగు పరుచుకొన్నానని అర్థం అయింది. ఈ […]

ప్రొజెక్షన్ జ్యూవెలరీ

ప్రియమైన వారికి శుభాకాంక్షలు కాస్త వినూత్నంగా చెప్పాలంటే ప్రొజెక్షన్ జ్యువెలరీ ఎంచుకోవచ్చు. నెక్లెస్,ఉంగరం, బ్రాస్ లెట్ ఇలా ఏ రకమైన జ్యువలరీ ఇవ్వాలనుకున్న ఆ నగ పెండెంట్ అందమైన ఇష్టమైన వారికి ఫోటో లేదా చక్కని సందేశం పెట్టేయచ్చు. మైక్రో ఎన్ గ్రేవింగ్ టెక్నాలజీ స్టోన్ తో ఉండే ఈ ప్రొజెక్షన్ జ్యువెలరీ చూసేందుకు మామూలుగా ఉంటుంది కానీ, స్టోన్ దగ్గర ఫ్లాష్ లైట్ వేసిన, ఫోన్ కెమెరా లో నుంచి చూసినా అందులో ఫోటో గాని […]

సహజమైన పెర్ఫ్యూమ్స్

శిరోజాలకు హెయిర్ పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే మరింత మృదువుగా పట్టులా పోతాయి బయట దొరికే రసాయనాలు నిండిన పెర్ఫ్యూమ్ కాకుండా సహజసిద్ధమైన వస్తువులతో ఇంట్లోనే పర్ఫ్యూమ్స్ తయారు చేసుకోవచ్చు.కొబ్బరి నూనెలో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ 100 ఎమ్.ఎల్ రోజ్ వాటర్ వేసి బాగా కలిపి స్ప్రే బాటిల్ లో కలిపి నిలువ చేసుకోవచ్చు. తలస్నానం చేశాక పొడి జుట్టుకు ఈ పర్ఫ్యూమ్ సువాసనతో ఉంటుంది అలాగే అర కప్పు రోజ్ వాటర్ తో పదిహేను […]

అప్నా ఘర్

బ్రేవ్ సోల్స్ ఫౌండేషన్ స్థాపించింది 34 సంవత్సరాల షాహిన్. స్వయంగా యాసిడ్ బాధితురాలు యాసిడ్ దాడిలో ఒక కన్ను పూర్తిగా పోయిందామెకు తన వంటి బాధితులు ఎంతో మంది ఉన్నారని తెలుసుకుని బ్రేవ్ సోల్స్ ఫౌండేషన్ ఎన్జీవోలు ప్రారంభించింది షాహిన్ అప్నా ఘర్ పేరిట ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా నడిపిస్తోంది. ఢిల్లీకి చెందిన సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన షాహిన్ ఇప్పుడు యాసిడ్ అమ్మకాలు నిలిపివేయాలని పోరాటం చేస్తోంది. షాహిన్ స్థాపించిన ఫౌండేషన్ బాధితులకు నష్టపరిహారం, […]

తాకితే షాకే

అమ్మాయిలకు ఆత్మరక్షణ కోసం ఎన్ని రకాల గ్యాడ్జెట్లు వస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చిన సేఫ్టీ టార్చ్ విత్ షాక్ ఎఫెక్ట్ ఆఫ్ పరికరం బటన్ నొక్కితే చాలు ఎల్ ఇ డి ఫ్లాష్ లైట్ తో పాటు హై ఓల్టేజ్ విద్యుత్ విడుదలై దాడిచేసే ఆగంతకులకు షాక్ కొడుతుంది. దీనికి ఉండే పదునైన కోనలు కూడా ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి వెంట తీసుకు వెళ్ళటం కూడా సులువే.

చలికాలంలో రక్షణ

వాతావరణం చల్లగా మారింది చలికి ఉదయాన్నే నిద్ర లేవాలి అనిపించదు కానీ సూర్యకిరణాలు శరీరానికి తగలకుండా పోతే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకే తప్పనిసరిగా ఓ అరగంట ఆరుబయట వ్యాయామం చేయాలంటున్నారు ఎక్సపర్ట్స్.  వాతావరణంలో తేమ తగ్గి చర్మం జుట్టు పొడిబారతాయి. పగుళ్లు ఇబ్బంది పెడతాయి ఈ పరిస్థితి తలెత్తకుండా సమపాళ్లలో కొబ్బరి, బాదం నూనెల్ని కలిపి వేడి చేసి అందులో పసుపు కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడే అరికాళ్లకు రాయాలి. అలాగే ఒంటికి నువ్వుల […]

పరీక్ష పాస్

కేరళ కొట్టాయం కు చెందిన 104 సంవత్సరాల కుట్టియమ్మ వంద మార్కులకు గాను 89 మార్కులు సాధించింది వార్తల్లో నిలిచారు కేరళ విద్యా శాఖ మంత్రి వి.శివన్‌ కుట్టి ఆమెను సత్కరించి ‘అక్షర ప్రపంచంలోకి స్వాగతం’ అన్నారు నవంబర్ ఏడవ తేదీన కేరళ ప్రభుత్వం రూపొందించిన ‘సాక్షరతా మిషన్‌’లో భాగంగా వాలంటీర్ ఫెహరా జాన్‌ కుట్టియమ్మ ఇంటికి వెళ్లి పాఠాలు నేర్పించి. కొట్టాయం జిల్లాలో, ‘అయర్‌ కున్నమ్‌’ అనే పంచాయతీకి చెందిన కుట్టియమ్మ పరీక్ష పాస్ అయిన […]