Sunday, 28 Jun, 2026

కనురెప్పలు అందంగా

దాదాపుగా మేకప్ సామాగ్రి మొత్తం రసాయనాల తోనే తయారవుతాయి. మార్కెట్ లో దొరికే ఖరీదైన కాస్మెటిక్స్ లో కూడా రసాయనాలు కలుస్తాయి. కనురెప్పలను ఆరోగ్యంగా ఉంచే ఐ లాష్ జెల్ ను రసాయనాలు వాడకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అర టీ స్పూన్ బాదం నూనె, మూడు చుక్కల ఆమోదం, విటమిన్ ఇ క్యాప్సూల్  ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ను తీసుకోవాలి. అన్నింటిని బాగా కలిపితే ఐ లాష్ జెల్ మిశ్రమం తయారవుతుంది. దీన్ని […]

నీళ్ల కొరత తీరుస్తా

తమిళనాడులో జరిగిన స్థానిక ఎన్నికల్లో యంగెస్ట్ పంచాయతీ ప్రెసిడెంట్ గా ఎంపికైంది 25 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ షారుకళ  ఎంపికయ్యారు. తెన్‌కాశీ కి సమీపంలోని లక్ష్మీయూర్‌లో పుట్టిన షారుకళ ఆ ప్రాంతం అంతా నీటికి ఇబ్బంది. వర్షం వస్తే మనిషి పోయేంత సమస్య. తెన్‌కాశీ దగ్గరలో పుట్టిన షారుకళ  ఆ గ్రామాలకు నీటి కొరత తీరుస్తానని హామీ తో వెంకటపట్టి పంచాయతీ నుంచి, 796 ఓట్లు మెజారిటీతో గెలిచింది షారుకళ. ఆ పంచాయతీ లో మొత్తం 6362 […]

ఇక్కడ వరకట్నలు లేవు

జమ్మూ కాశ్మీర్ లోని  గందర్‌బల్ జిల్లా బాబా వాయిల్ గ్రామాన్ని డౌరీ ఫ్రీ ఏరియా గా ప్రకటించుకున్నారు ఆ ఊరి పెద్దలు. మా ఊర్లో మేము వరకట్నాన్ని వ్యతిరేకిస్తున్నాం దీనికి మేము ఎప్పటికీ కట్టుబడి ఉంటాము. అని ఊరి పెద్దలు పత్రం రాసుకొని సంతకాలు చేశారు. 30 ఏళ్ల క్రితం చేసుకున్న ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూ ఇవ్వాల్టి యువకులు దానిని పాటిస్తున్నారు. పేదరికం, వరకట్నం కారణంగా అమ్మాయిలకు పెళ్లిళ్లు కాకపోవటం చూసి ఊరి పెద్దలు అప్పట్లో ఈ నిర్ణయం […]

ఈ పిల్ ప్రమాదం

గర్భనిరోధక మాత్రల వాడకం కొంత తెలుసుకునీ వాటి పనితీరు గురించి విచక్షణ మహిళల్లో ఉండటం లేదు అంటున్నారు డాక్టర్లు. ఐ పిల్ వంటి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ ను గర్భనిరోధక పద్ధతులు అవలంభిస్తూ పొరపాటున మరిచి పోయిన సందర్భం లో వాడుకోవాలి కానీ ఈ పిల్స్ నే పూర్తిగా గర్భనిరోధక సాధనంగా వాడటం వల్ల శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఏర్పడి నెలసరి క్రమం తప్పడం అబార్షన్ గర్భం దాల్చ లేకపోవటం వంటివి జరుగుతాయి. ఒకవేళ అప్పటికే గర్భం ధరించి […]

ఆరోగ్య లాభాలు

ప్రొటీన్లు పీచు ఎక్కువగా ఉండే ఓట్స్ తో లెక్కలేనన్ని ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఈ పోషకాలు ఉన్న ఓట్స్ ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఉంటుంది. రాత్రివేళ నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు. వండే శ్రమ కూడా ఉండదు ఓట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. ఇందులోని అత్యధిక పీచు కాంప్లెక్స్ కార్బోహైడ్రేడ్స్ రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దానితో శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ లను సక్రమంగా వినియోగించుకోగలుగుతుంది ఫలితంగా మధుమేహం దగ్గరకు రాదు.

చక్కని గుర్తింపు

ప్రపంచంలో అతిపెద్ద న్యాయ సేవల సంస్థ  డెంటన్స్‌‌ కు చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. వైజాగ్ కు చెందిన నీలిమ పాలడుగు. డెలాయిట్ లో మానవ వనరులు విభాగంలో గ్లోబల్ పీపుల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు నీలిమ. డెలాయిట్ కు 85 పైగా దేశాల్లో కార్యకలాపాలు ఉంటే డెంటన్స్‌‌ సంస్థ శాఖలు 205 దేశాల్లో నడుస్తున్నాయి ఇప్పుడు వీటన్నింటికీ నీలిమ సారథ్యం వహిస్తున్నారు. ఈ స్థాయిని అందుకున్న తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు నీలిమ.

ఉపవాస లాభం

ఉపవాసం తో శరీరం తనని తాను శుభ్రం చేసుకుంటుందనీ దెబ్బతిన్న కణాలు తనను తాము తినటం లేదా తమని తాము నాశనం చేసుకోవడం వల్ల గ్రోత్ హార్మోన్ అభివృద్ధి చెంది కొత్త కణాలు పుట్టుక ప్రేరేమితమవు వుతోందని దీన్నే వైద్య పరి భాషలో ఆటో ఫిజీ  అంటారని చెపుతున్నారు జపనీస్ సైంటిస్ట్ యోషినోరి ఓషుమి శరీరంలో పేరుకుపోతు ఉండే పాడయిన,చనిపోయిన మరమ్మత్తు అవసరమైన కణాలను శరీరం తానంతట తానే తొలగించుకోవటం ఆటో ఫిజీ ఈ చర్య ఉపవాసంలో […]

ఛాయా సోమేశ్వరుడు

ఇక్కడి శివలింగం పైన నిత్యం ఒక ఛాయ కనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా ఎలాంటి స్తంభం కానీ కట్టడం కానీ లేదు. కాస్తా స్తంభం నీడ శివుడి మీద పడుతూ ఉంటుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న సోమేశ్వర మందిరంలోని శివుణ్ణి ఛాయా సోమేశ్వరుడు అంటారు. ఈ దేవాలయం 11వ శతాబ్దపు చోళుల పాలన లోని నిర్మాణం మధ్యలో మండపం దాని నుంచి మూడు దిశల్లో సుదూరం సమ దూరంలో మూడు మందిరాలున్నాయి మధ్యలో శివుడుంటాడు అటు ఇటు […]

చర్మానికి రక్షణ

టర్మరిక్ ఫేషియల్ టోనర్ ను ఇప్పుడు ఇంట్లోనే ఎలాంటి రసాయనాలు వాడకుండా తయారు చేసుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పసుపు కొమ్ము రసం, మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, టేబుల్ స్పూన్ నిమ్మరసం, గ్రీన్ టీ నాలుగు టేబుల్ స్పూన్లు కప్పు నీళ్లు తీసుకోవాలి. ముందుగా నీటిలో గ్రీన్ టీ వేసి బాగా మరగనివ్వాలి చల్లారిన ఆ నీళ్ళలో పసుపు కొమ్ము రసం, అలోవేరా, నిమ్మరసం, రోజ్ వాటర్ […]

జస్నా సలీమ్ ఇచ్చిన కానుక

జస్నా సలీమ్,కేరళకు చెందిన ముస్లిం యువతి గీసిన కృష్ణుని బొమ్మ, కోజికోడ్ సమీపంలోని పండలం అనే గ్రామంలో ఉన్న శ్రీ కృష్ణ స్వామి దేవళం లో పూజలందుకుంటోంది. సెప్టెంబర్ 27వ తేదీ తేదీన,వెన్న తింటున్న బాలకృష్ణుని బొమ్మని దేవాలయం లోని పూజారులు భక్తిగా అందుకొని గుడిలో ఉంచారు. జస్నా సలీమ్ ప్రొఫెషనల్ పెయింటర్ కాదు. వెన్న తినే బాలకృష్ణుని బొమ్మ వేయడం నేర్చుకుని ఎన్నో బొమ్మలు గీసి కోజికోడ్ లో 2016 లో ఎగ్జిబిషన్ పెట్టింది. ఆమె […]

రైస్ బేబీ

కోవిడ్ -19 ప్రపంచాన్ని ఎంతో మార్చింది ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో విందులు వినోదాలు చేయటం అరుదై పోయింది ఇప్పుడు జపాన్ లోని పేరెంట్స్ తమ పిల్లలను ఆశీర్వదించే వేడుకకు బంధువులను ఆహ్వానించకుండా Dakigokochi (Dakigokochi) పేరుతో పిల్లల బొమ్మలు ముద్రించిన బియ్యం సంచిని బంధువుల ఇళ్లకు పంపిస్తున్నారు. స్వయంగా వెళ్లి బిడ్డను చూడలేని బంధుమిత్రులు బియ్యం సంచి పైన కొత్తగా జన్మించిన పిల్లవాడి బొమ్మను చూసి ఆశీర్వదించే లాగా సరిగ్గా ఆ శిశువు బరువు తో ఈ […]

అది నా బాధ్యత

హైదరాబాద్ పొలాన్ లో ప్రారంభించిన వియ్ కెన్ కార్యక్రమానికి ప్రచార కార్యకర్తగా పని చేస్తోంది మిస్ ఇండియా మానసా వారణాసి. మిస్ ఇండియా కిరీటం బాధ్యతను పెంచింది 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కోసం కూడా పని చేయాలనుకున్న దాతల సాయంతో ఇప్పటివరకు తెలంగాణ లోని 12 జిల్లాల్లో వాహనాలు కొన్ని ఇచ్చేను. ఇంకా ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలకు ఇవ్వవలసి ఉండె వియ్ కెన్ కార్యక్రమానికి ప్రచారకర్తగా ఉండటం నా బాధ్యత భావిస్తున్నా అంటోంది మానసా […]

 విద్యాభివృద్ధికి అపూర్వ కృషి

ఎడ్యుకేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఇదన్ అవార్డ్ అందుకున్నారు డాక్టర్ రుక్మిణి బెనర్జీ. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్రథమ్‌ లో పనిచేస్తూ విద్యా వ్యవస్థ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నారు. బెనర్జీ నేతృత్వంలోని బృందం యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ తయారు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరు లక్షల మంది పిల్లల అక్షరాస్యత నాణ్యత పై జరిపిన సర్వే రిపోర్ట్ అది ఈ కృషి కి గుర్తింపుగా రుక్మిణి కి ‘యిదన్‌’ ప్రైజ్ వరించింది. […]

బుక్స్ ఆన్ ది ఢిల్లీ మెట్రో

పుస్తకం ఎదురుగా కనిపిస్తూ ఉంటే చదవాలని అనిపించవచ్చు ఆ తర్వాత మరిన్ని చదవాలనే కోరిక కోరిక కలగచ్చు. అందుకే నేను Books on the Delhi metro (BODM) వెంచర్ ప్రారంభించాను. పుస్తకాలను మెట్రో స్టేషన్, ట్రైన్ లలో పెట్టించటం నాకు చాలా ఇష్టమైన పని అంటుంది శృతి శర్మ. మొదటిసారి రచయిత్రి జంపా లహరి పుస్తకాలు నేను నా భర్త తరుణ్ చౌహాన్ కలిసి మెట్రో స్టేషన్ లలో పెట్టాము. పుస్తకాలు చదివి నాకు ఎంతో […]

అమ్మ కంటే ఎక్కువ

భారతదేశం నుంచి ఐదుగురు అనాధ ఆడ పిల్లలను దత్తత తీసుకుంది అమెరికా టీచర్ క్రిస్టిన్ గ్రే. ఓహియో రాష్ట్రంలోని సిన్ సినాటీ లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేసే క్రిస్టిన్ పెళ్లి బంధం లోకి వెళ్ళ దలచుకోలేదు అనాధ పిల్లలను చేరదీయాలనుకుంది. మహిళా కళ్యాణ్ కేంద్ర నుంచి ఆమె దత్తత తీసుకున్న పాపను తల్లి చెత్తకుప్పల్లో వదిలేస్తే కుక్కలు ముక్కు కొరికాయి. ఇంకో పాపకు ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి ఇంకో ఇద్దరు పిల్లలు కూడా ఆమె […]

అప్పుడే ఒత్తిడి మాయం

విరామం లేకుండా షూటింగ్స్ లో పాల్గొనటం వ్యాపారం చూసుకోవటం ఇట్లా బ్రేక్ లేకుండా పని చేస్తుంటే వత్తిడి సహజం. ఆ సంకేతాలు కనిపించగానే వ్యాయామం యోగా ధ్యానం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకుంటూ. ఇంకా స్ట్రెస్ తగ్గి తగ్గలేదు అనుకుంటే మా కుక్క పిల్లలతో గడుపుతూ అంటుంది సమంత. అవకాశాలు అన్నీ ఒకేసారి వస్తాయి. అన్నింటినీ ఒకే సమయంలో పూర్తి చేయాలి అప్పుడు బద్ధకం అనుకుంటే నష్టపోతాం. లక్ష్యాల పట్ల కలలు కంటూ నిద్రిస్తే వెనకబడి పోతాం. […]

ఇంకో కొత్త అవకాశం

నాకు నటనంటే చాలా ప్రేమ ప్రతిరోజు ఏదో ఒకటి నన్ను మోటివేట్ చేస్తుంటుంది. నాలో నేను ఉత్తమ వెర్షన్ కోరుకుంటాను ఎవరితోనూ నన్ను పోల్చుకోను. ఇక్కడ ప్రతి ఒక్కరి ప్రయాణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నా పని నేను సీరియస్ గా చేసుకుంటూ పోతాను అంటుంది రాశికన్నా. మద్రాస్ కేఫ్ లో వెండి తెర పైకి వచ్చిన రాశి కన్నా ఎప్పుడు వెబ్ సిరీస్ లో హిందీ వినోద పరిశ్రమలో కాలుపెట్టింది.  ఒక సిరీస్ లో అజయ్ […]

కలలు కంటే మంచిది

మంచి ఆరోగ్యానికి నిద్ర ఎంత అవసరమో అలాగే కలలుకనే అంత గాఢనిద్ర మంచిదంటున్నారు నిపుణులు. ఆ సమయంలో మెదడులో రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుందని దీని వల్ల న్యూరాన్ల లో పేరుకొన్న హానికర కలుషితాలు వెలికి వెళ్లిపోతాయని వారు చెబుతున్నారు.  మగత నిద్ర,గాఢ నిద్ర మెలుకువ స్థితిలో ఉన్నప్పుడు రక్త ప్రసరణ ఏ విధంగా ఉంటుందన్న విషయం పై విస్తృత పరిశోధనలు నిర్వహించారు. మగత నిద్ర మెలుకువ కు పెద్ద వ్యత్యాసం లేదు కానీ గాఢ నిద్రలో […]

వేడి చేస్తే ప్రమాదం

మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఫ్రిజ్ లో పెట్టి తినబోయే ముందు వేడి చేసుకోవటం చాలామందికి అలవాటు కాని కొన్ని పదార్థాలు వేడి  చేస్తే చాలా ప్రమాదం అంటున్నారు ఎక్సపర్ట్స్ . పుట్టగొడుగులు వండగానే వేడిగా ఉండగానే తినేయాలి. ఎక్కువ సమయం నిల్వ చేసిన వేడిచేసిన, వాటిలోని ప్రోటీన్లు విచ్ఛిన్నమై జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చికెన్ మళ్లీ వేడి చేస్తే వాటిల్లోని మాంసకృత్తులు నశిస్తాయి. గుడ్డు వేడి చేస్తే క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా విడుదల […]

ఇవి సూచనలే

గోళ్ళు శరీరంలో అనారోగ్యాలని బయట పెడతాయి.గోళ్ళ దృఢత్వం, వాటి పై ఏర్పడే పగుళ్ళు వంటి లక్షణాలు అంతర్లీన అనారోగ్యానికి సూచనలు గోళ్లు తేలికగా విరిగిపోతు ఉంటే విటమిన్-సి,ఎ లు లోపమని అని అర్థం. గొల్ల పై గుంటలు పడితే సోరియాసిస్ లేదా అలోపేసియా ఏరేటా ఉన్నట్టు అనుకోవాలి. పసుపుపచ్చగా ఉంటే మధుమేహం హైపో థైరాయిడిజం కు సూచన. వయసు పెరుగుతుంటే సహజంగా గోళ్లపై నిలువ గీతలు ఏర్పడతాయి. ఈ గీతలు ఒక్కసారి రక్తహీనతను సూచిస్తాయి. అడ్డుగా గీతలు […]