July 2020
కళ్ళకు తేమనిచ్చే గులాబీ నీళ్లు
ఎక్కువ సేపు ఫోన్ చూసినా, కంప్యూటర్ పై పని చేసిన కళ్ళు పొడిబారి పోయి మంట,దురద అనిపిస్తాయి. కళ్ళలో తేమ తగ్గడం వల్లే ఈ సమస్య ఎదురవుతుంది.మంచి నీటిలో శుభ్రంగా కడిగిన గుప్పెడు గులాబీ రేకులు తీసుకోవాలి కప్పు నీళ్లను మరిగించి,ఆ నీటిలో గులాబీ రేకులు వేయాలి ఆ నీటిని చల్లారాక వడకట్టి ఆ గులాబీ నీళ్లలో దూది ముంచి కళ్ళ పైన ఐదు నిమిషాల పాటు ఉంచితే కళ్ల మంటలు తగ్గిపోతాయి. అలాగే త్రిఫల చూర్ణం […]
అలవాటు మానేస్తారు
చాలా మంది పిల్లలకు నోట్లో వేలు వేసుకునే అలవాటు ఉంటుంది ఈ అలవాటు మాన్పించడం చాలా కష్టం. బేబీ ఫింగర్ గార్డ్ తో ఈ అలవాటు మాన్పించ వచ్చు. ఈ బేబీ ఫింగర్ గార్డ్ వేలికి తొడిగే లా తయారు చేశారు. వెల్లులా ఉండి దానికి సిలికాన్ తో చేసిన వేలి ఆకృతి ఉంటుంది. దాన్ని వేలికి పెట్టి వెల్లుని మణికట్టుకు చుట్టేస్తే పిల్లలు దానిని తేలికగా తీయలేరు. ఆ సిలికాన్ వేలిని నోట్లో ఉంచుకోవటం నచ్చక […]
నా సమయం మొత్తం ఇచ్చేశా
ఈ తోటపనితో ఎంతో ఆనందం పొందుతున్ననో చెప్పలేను పచ్చని మొక్కల మధ్యని గడపడంతో మానసిక ఒత్తడి అంటూ ఏమీ లేదు.ఖాళీ సమయం మొత్తం పచ్చని మొక్కల మధ్య నే గడిపేస్తున్నాను అంటోంది జుహీ చావ్లా.తన అందం అభినయంతో వెండితెర వేల్పులా వెలిగిన జుహీ చావ్లా ఈ కరోనా సమయంలో మట్టి తో స్నేహం మొదలు పెట్టింది. తన ఇంటి చుట్టూ ఉండే స్థలంలో కూరగాయలు పండ్ల మొక్కలు పెంచుతోంది. సేంద్రీయ పద్ధతిలో చేసే ఈ సాగు ఎంతో […]
బరువు పెరిగారా ?
లాక్ డౌన్ ముందు తర్వాత అని పోల్చి చూసుకోవలసిన విషయాల్లో బరువు చూసుకోవటం కూడా ఒకటి అంటున్నారు ఎక్సపర్ట్స్. వ్యాయామం లేకపోవటం ఎక్కువసేపు విశ్రాంతి గా కూర్చోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే అవి పొట్ట నిండిన భావన కలిగించి ఆకలి తగ్గిస్తాయి. వీటిలో విటమిన్స్ ,మినరల్స్ ఎక్కువే ఉంటాయి. పోషకాలు ఉండే ఆకలిని తగ్గించే పదార్థాలనే స్నాక్స్ గా తీసుకోవాలి. బాదం, […]
వీటిలో పోషక విలువలు జాస్తి
పుచ్చ గింజల్లో ఉండే ఆరోగ్య విలువలు తెలుసుకోకుండా వీటిని పారేస్తూ ఉంటాం.తక్కువ కేలరీలు పోషక విలువలు ఉండె ఈ విత్తనాలు తినడం చాలా మంచిది. నాలుగు గ్రాముల పుచ్చ గింజల్లో 23 క్యాలరీలే ఉంటాయి.ఈ నాలుగు గ్రామంలో 21 మిల్లీగ్రాముల మెగ్నీషియం 0.29 గ్రాముల ఐరన్, జింక్ ఉంటాయి. వీటిని వేయించటం చాలా తేలిక కూడా. రుచి కోసం ఆలివ్ ఆయిల్ ఉప్పు చక్కెర లైమ్ జ్యూస్ పెప్పర్ వంటివి జత చేస్తే మంచిది ఓవెన్ లో […]
ప్రతిభాశాలి దేవయాని
17 సంవత్సరాల దేవయాని బుడబుడకల డొక్క వాయించే అమ్మాయి తిరుప్పారన్ కుండ్రన్ ఊరికి ఇంటర్ టాపర్గా నిలిచింది. తండ్రి బుడబుడక్కల వేషం కడితే, వెనకాల తిరుగుతూ జోప్యం చెప్పే దేవయాని కి ఇంటర్లో 600 మార్కులకు గాను ఐదు వందల మార్కులు వచ్చాయి.ఇల్లు లేని,కరెంట్ లేని అమ్మాయి ప్రతిభ కనిపెట్టి వెల్లూరు టెక్నాలజీ అధినేత విశ్వనాథన్ ఆమెకు తన కాలేజీ లో సీటు,ఉచిత భోజన వసతి ఇచ్చారు. ఇప్పుడు ఎం ఎల్ ఎంపీలు లు కూడా ఆ […]
బ్రిక్స్ గౌరవ సలహాదారుకు టీనా దాబి
బ్రిక్స్ సి సి ఐ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ యంగ్ లీడర్స్ ఇనీషియేటివ్స్ కమిటీకి గౌరవ సలహాదారు గా అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.కీలకమైన రంగాల్లో యువతకు ప్రేరణ ఇచ్చి వారిని ప్రోత్సహించి వారి ద్వారా ప్రపంచాన్ని అభివృద్ధి పధంలోకి నడిపించే ఆలోచనలను మేము పంచుకోబోతున్నాం అంటోంది టీనా దాబి.ఐఎ.ఎస్ ఆఫీసర్ ఇండియా తోసహా ఐదు దేశాలు ఇవి. ఈ బ్రిక్స్ కమిటీ సలహాదారుగా 2023 వరకు ఉంటారు టీనా ఐదు దేశాల వాణిజ్యం, […]
కార్టింగ్ క్వీన్ ఆషీ హన్స్ పాల్
మోటార్ స్పోర్ట్స్ లో దూసుకుపోతుంది టీనేజ్ రేసర్ ఆషీ హన్స్ పాల్. రైజింగ్ స్టార్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇటీవల ది ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 19 మంది అమ్మాయిల్లో ఆషి కూడా ఉంది చెన్నై రేస్ లో అతి వేగంగా ల్యాప్ పూర్తి చేయడంతో నేను చాంపియన్ గా నిలిచాను ఆ రేస్ తర్వాత నేను ఎప్పటికీ వెనక్కి తిరిగి చూడు చూసుకోనవసరం రాలేదు అంటోంది ఆషీ కార్ […]
మాస్క్ పరోటా
ప్రజల్లో కరోనా పట్ల అవగాహన పెంచేందుకు ఫేస్ మాస్క్ పరోటాలు తయారు చేశారు మధురై లోని టెంపుల్ సిటీ హోటళ్ళ లో మేనేజింగ్ డైరెక్టర్ కె. లక్ష్మణ్ కుమార్ కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్రయోగాలు చేయటం ఆయనకు అలవాటే.రజనీకాంత్ బాబా సినిమా విడుదల అయ్యాక బాబా పన్నీర్ బటర్ మసాలా దోసె,సచిన్ టెండూల్కర్ నూరవ సెంచరీ చేసినప్పుడు బ్యాట్ ఆకారంలో టెండూల్కర్ దోసే మొదలైనవి ఆహార ప్రియులకు అందించారు.మధురై లో మట్టు దావని బ్రాంచ్ లో ఈ […]
మలై కాస్ స్పెషల్
మలై కాస్ ట్రిక్ ఆర్ టిప్ పేరుతో ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్ తయారీని ఇంస్టాగ్రామ్ లో విడుదల చేశారు మలైకా అరోరా. ఇది ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసే డ్రింక్.నీళ్లు, తాజా ఉసిరి, పసుపు, అల్లం, మిరియాలు, యాపిల్ సిడర్, వెనిగర్ తీసుకోవాలి.వీటిని మిక్సీ లో వేసి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి.ఈ జ్యూస్ నీ వడబోసి ప్రతి ఉదయం తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. విటమిన్ సి యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఈ డ్రింక్ ఇంటి దగ్గరే […]
ఇవి డిజైనర్ ఫ్యాషన్ బూట్లు
లండన్ కాలేజీలో ఫ్యాషన్ రిటైల్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసిన సునయన హర్జాయ్ డిజైనర్ బూట్లు తయారు చేస్తోంది. నేరుగా వినియోగదారునికి అందేలా ఆన్లైన్ వ్యాపారం మొదలు పెట్టింది హాట్సాఫ్ యాక్సెసరీస్ పేరు తో తయారయ్యే బూట్లు మగవారికి మాత్రమే. మారుతున్న ఫ్యాషన్ లకు అనుగుణంగా ఇప్పుడు రంగుల బూట్లు కావాలంటున్నారు.నాణ్యమైన లెదర్ బూట్లు అందుబాటు ధరలకు అందించటం నా లక్ష్యం అంటోంది సునయన. లక్న ఫ్యాషన్ వీక్ బెంగళూరు ఫ్యాషన్ వీక్ లాటి వివిధ ఫ్యాషన్ […]
ముఖాన్ని మెరిపించే ప్యాక్ లు
ఈ సహజమైన పదార్థాలతో చేసే ఫేస్ పాక్స్ ఇతర ఖరీదైన పాక్స్ ల కంటే సమర్థవంతంగా పనిచేస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స.అవిసె గింజల పొడి తేనె పంచదార కలిపిన ప్యాక్ లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుతాయి మడతలు పడనీయవు రెండు అంజీర పండ్లు గుజ్జుగా చేసి దానికి రెండు స్పూన్ల పాలు తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం నిగారింపుతో ఉంటుంది. అరటి పండులోని విటమిన్ ఇ,సి పొటాషియం వంటివి చర్మాన్ని తాజాగా […]
జలుబు నుంచి రక్షణ
రోజు గుప్పెడు దానిమ్మ గింజలు తింటే ఎన్నో పోషకాలు అందుతాయి అంటున్నారు డాక్టర్లు. పొటాషియం కాల్షియం మెగ్నీషియం విటమిన్-సి, బి6, ఐరన్, పీచు వంటి ఎన్నో పోషకాలతో నిండిన బొప్పాయి రోగ నిరోధకశక్తిని పెంచి జలుబు నుంచి రక్షణ ఇస్తుంది. బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది. రక్త నాళాల్లో అడ్డంకులను తొలగించి రక్త సరఫరా సాఫీగా సాగేలా చేస్తుంది. వీటిల్లోని కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తాయి. ప్రతిరోజూ తప్పనిసరిగా దానిమ్మ గింజలు కానీ రసం […]
జిడ్డు పోతుంది
ఈ వర్షాలు కురిసే సమయంలో ఒక్కసారి మొహం జిడ్డుగా లేదా పొడిబారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.వీటిని పెరుగుతో దూరం చెయచ్చు.బాగా పండిన స్ట్రాబెర్రీలను గిన్నెలోకి తీసుకుని స్పూన్ పెరుగు వేసి బ్లండర్ తో కలపాలి.ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి పెరుగులో శనగపిండిని, టమోటో రసం కలిపి దాన్ని మొహానికి పట్టించి సవ్య అపసవ్య దిశలో మర్దనా చేసి తర్వాత చల్లని నీళ్ళతో మొహం కడుక్కోవాలి. రెండు టేబుల్ స్పూన్ పెరుగు లో […]
మహిళలకు తోడుగా కూల్ కన్య
ముంబైకి చెందిన వన్షిక గోయంకా కూల్ కన్య పేరుతో ఆన్ లైన్ వేదికలో అందుబాటులోకి తెచ్చారు.కెరీర్ కు సంబంధించిన సందేహాలన్నీ తీర్చేస్తారు. కొత్తగా కెరీర్ మొదలుపెట్టిన వారికి దిశా నిర్దేశం చేస్తుందీ ఆన్ లైన్ సంస్థ. ఇందుకోసం కెరీర్ గైడె లైన్స్ నిపుణులు, మానసిక వైద్యులు డిజిటల్ మార్కెటింగ్ పండితులు సదా సిద్ధంగా ఉంటారు.సాధారణంగా ప్రసవం, పిల్లల పోషణ, కుటుంబ పరిస్థితుల కారణంగా చాలామంది మహిళలు కెరీర్ మధ్యలోనే వదిలేస్తారు. వాళ్లు మళ్లీ కెరీర్ మొదలు పెట్టాలనుకుంటే […]
క్రిమి కీటకాలు పరార్
వర్షా కాలంలో చల్లదనానికి ఈగలు, బొద్దింకలు, ఇతర కీటకాలు ఇంట్లోకి వచ్చేస్తాయి.గదుల మూలల్లో ఉప్పు లేదా వెనిగర్ కలిపిన నీటిని చల్లాలి.లవంగాలు దాల్చిన చెక్క పొడి ఇంటి మూలల్లో చల్లితే ఆఘాటైన వాసనకు చీమలు రావు.పుదీనా ఆకులు ఇంటి మూలల్లో ఉంచితే కీటకాలు లోపలకు రావు.లవంగ నూనె చెల్లి నా చాలు అలాగే ఇంట్లోకి బల్లులు వస్తుంటే గది మూలల్లో మిరియాలపొడి కలిపిన నీటిని చిమ్మాలి ఉల్లిపాయ, వెల్లుల్లి వాసన కూడా బల్లులు పారిపోతాయి నాప్త లిన్ […]
చామంతి నాటే తరుణం ఇదే
చామంతి,నారు పోసేందుకు ఇది అనువైన కాలం కాస్త చోటులలో చక్కని చామంతిని పెంచుకోవాలంటే ఒక టబ్ లో మట్టిలో నారు చెల్లి పైన పొరగా మట్టి వేస్తే పది రోజుల్లో మొలకలు వస్తాయి వీటిని కుండీల్లో పెంచుకోవచ్చు అయితే నీరు ఎక్కువ నిల్వ ఉండకూడదు.సూర్య రశ్మి 20 నుంచి 27 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అందితే చాలు.రెండు మూడు రోజులకో సారీ నీళ్లు పోస్తూ పొడుగ్గా పెరిగే మొక్కలకు కర్రలతో ఊతం ఇవ్వాలి. తర్వాత పై కాండపు […]
శనగలు తింటే ఆరోగ్యం
రోజుకో గుప్పెడు ఉడికించిన శనగలు తినండి బోలెడు పోషకాలు అందుతాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్ .వీటిలో క్యాల్షియం,మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్-కె ఉంటాయి.ఇవి ఎముకల్ని బలంగా ఉంచుతాయి.వీటిలోనే విటమిన్-బి9 ఫోలేట్ మెదడు కండరాలు వృద్ధికి తోడ్పడతాయి.సెనగల్ లో పీచు,రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.మాంసా హారంలో కలిగే ప్రయోజనాలు సెనగల తో పొందవచ్చు ఉడికించిన శనగలు అల్పాహారంగా తీసుకోవచ్చు.
శ్రావణ మాసానికి బెనారస్ పట్టు
శ్రావణ మాసం మొదలైంది.బెనారస్ చీరె తోనే శ్రావణమాస కళ ఇంటి కోస్తుంది.వెండి బంగారు జరీతో నేనే బెనారస్ చీరెలు ఎంతో కాలం మన్నికగా ఉంటాయి. నేత రంగును బట్టి ఉత్సవాల్లో పండుగల్లో కట్టుకునే చీరెలు ఇవి.వసంత కాలంలో పసుపు వర్ణపు చీరెలు వేసవిలో తెల్లని చీరెలు మధ్యాన్నలలో, ఉత్సవాల్లో ముదురు రంగు చీరెలు కట్టుకుంటారు.ఈ బెనారస్ చీరెలకు పేటెంట్ హక్కులు కూడా ఉన్నాయి. చక్కని సిల్వర్ మోటిఫిల్ రంగుల మేళ వింపుతో అందమైన కొంగుల తో బెనారస్ […]
సాధించి తీరతాం
అంతా సక్రమంగా ఉంటే ఈ పాటికి ఒలింపిక్స్ క్రీడలు మహోత్సవం మొదలయ్యేది.బాగా ప్రిపేర్ అయ్యాక వాయిదా పడటం కొంచెం బాధగానే ఉంది.పోటీ పడడం కోసం ఇంకొక ఏడాది ఎదురుచూడాలి. మానసికంగా శారీరకంగా పర్ఫెక్ట్ గా ఉండాలి.రోజూ ప్రాక్టీస్ చేయాలి ప్రశాంతంగా స్ట్రాంగ్ గా ఉండేందుకు సాధన ఉపయోగపడుతోంది.రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అన్నీ చక్కబడతాయి.అనుకున్నవి సాధించి తీరుతాను అంటుంది సింధు.అతి పెద్ద ఈవెంట్ టోక్యో ఒలంపిక్స్ వచ్చే ఏడాది కి పోస్ట్ పోన్ అయ్యింది.అయినా నేనెప్పుడూ నిరాశ […]
