March 2020
పాలు మంచివి
పాలు పాల ఉత్పత్తులైన పెరుగు,పన్నీర్ ,చీజ్ నుంచి కాల్షియం ,ప్రోటీన్లు అలాగే వెన్న తీయని పాల నుంచి అధిక మొత్తంలో కొవ్వు శక్తి లభిస్థాయి . ఎదిగే వయసులో పిల్లల కు ఈ పోషకాలు అత్యవసరం. పాలలోని కాల్షియం ఎముకల ఆరోగ్యానికి తప్పనిసరి . సంవత్సరం లోపు పిల్లలకు తల్లిపాలు లేదా వైద్యుడు సూచించిన ఫార్ములా పాలు ఇవ్వాలి . రెండేళ్ళు దాటినా పిల్లలకు రోజుకు రెండు ,మూడు గ్లాసుల పాలు ఇవ్వవచ్చు . పాలలోని పోషకాలు […]
“ఐరావతేశ్వరుని ప్రసాదం”
తమిళనాడులో తంజావూరు జిల్లాలో ఉన్న కుంభకోణంకు షుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐరావతేశ్వరుడ్ని చూసి తరిద్దా రండి. ఈ ఆలయం చోళుల రాజ్యంలో నిర్మించారు.దుర్వాస మహాముని కోపానికి ఇంద్రుని వాహనమైన ఐరావతం తన తెల్లని రంగు శాపం వలన మారిపోయింది. శాపవిమోచనకు ఐరావతం ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థించగా పూర్వ రూపాన్ని రాజరాజేశ్వరి సహిత రాజరాజేశ్వరుడు ప్రసాదిస్తాడు.ఈ దేవాలయంలోని మెట్లు ధ్వనించే విధంగా ఉంటాయి.ఇక్కడ యమతీర్ధం అనే కోనేరులో స్నానం చేసిన సర్వ పాపాలు తొలగించి […]
ఎన్నెన్నో వర్ణాలు
పూవుల గుత్తిలో అందమైన రంగురంగుల పూలు ఆకులూ కలిపి ఆకర్షణీయం తయారు చేయటం చూశారు . కానీ ఒక చిన్ని మొక్కల్లో హరివిల్లు రంగులో అనేక మైన పూలు పూయిస్తున్నారు . పండ్లు ,కూరగాయల్ని అభివృధి చేసే గ్రాఫ్టింగ్ పద్దతిలో ఈ పూల మొక్కలు సృష్టి చేస్తున్నారు . పొడవాటి కాండం వచ్చేలా ఒక మొక్క పెంచి దాని పై భాగంలో వేరువేరు పూలు వచ్చేలా వేర్వేరు మొక్కలతో గ్రాఫ్టింగ్ చేస్తున్నారు . అప్పుడు ఒక కుండీలో […]
రిలాక్స్ అవ్వండి
మనుష్యులు చక్కగా పనులు చేసుకోవాలి . నైపుణ్యాన్ని ప్రదర్శించి తీరాలి కానీ ఆ పని చేయటంలో కాస్త రిలాక్సేషన్ మాత్రం అవసరం అంటారు నిపుణులు. పని వత్తిడి నుంచి బయట పడేందుకు పనిచేస్తున్న చోటే క్రమ పద్దతిలో రిలాక్స్ అవటం నేర్చుకోవాలి. పని మధ్యలో ఒక రెండు నిముషాలు బ్రేక్ తీసుకోని శరీరాన్ని గట్టిగా ఒకసారి కదిలించటం ,చేతులు చాచటం,మోచేయి భుజ భాగాల విదిలించటం చేయాలి . లేచి నిలబడి అటూ,ఇటూ ఓసారి నడిచి శరీరాన్ని రిలాక్స్ […]
ప్రింటెడ్ కాటన్స్ బెస్ట్
ఎండ వేడి మొదలైన కొద్దీ వంటికి మెత్తగా తేలికగా అనిపించే కాటన్ దుస్తులు ధరిస్తే హాయిగా ఉంటుంది. అమ్మాయిలకు ప్రింటెడ్ కాటన్ చుడిదార్ మంచి ఎంపిక. ప్రింటెడ్స్ కాటన్స్ తో కాంట్రాస్ట్ రంగులు ఎంచుకొంటే మరింత బావుంటుంది. టాప్ ఉన్నా డిజైన్ ను పోలిన రంగుతో బాటమ్ ఎంచుకోవాలి రెండింటికీ మ్యాచ్ అయ్యే కలర్ ఫుల్ చున్నీ వేసుకోవాలి. బెల్ హాండ్స్ లాంగ్ హాండ్స్ స్లీవ్ హాండ్స్ ఎలాటి డిజైన్ లో కుట్టించుకొన్న కాటన్ చుడీదార్ లో […]
అందుకే అల్జిమర్స్
ఎక్కువ సేపు కూర్చొని పని చేసేవాళ్ళలో జ్ఞాపకశక్తి చాలా తొందరలో తగ్గి పోతుంది అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. ఎక్కువ సమయం కూర్చుంటే మధుమేహం,గుండె జబ్బులు బారిన పడే అవకాశం చాలా ఎక్కువ అంటున్నారు. గంటల కొద్దీ కూర్చుంటే మెదడులోని జ్ఞాపకశక్తి కి సంబంధించిన మడియల్ టెంపోరల్ లోబ్ పొర పల్చబడుతోందని ఈ పరిశోధనలో నిర్ధారణ అయింది. దానితో జ్ఞాపకశక్తి తగ్గి డెమన్షియా కు దారి తీస్తుంది. ఒక సారి పొర దెబ్బ తింటే ఎంత వ్యాయామం చేసిన […]
మిల్స్ ప్రోటీన్స్ తో ఆరోగ్యం
నిత్యం రెండు గ్లాసుల పాలు తాగితే కాన్సర్ నుంచి కొంతలో కొంతయినా ఉపశమనం కలుగుతోంది అంటున్నారు నిపుణులు. పాలలో ఉండే మిల్క్ ప్రోటీన్ కాన్సర్ కణాలు నాశనం చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ లండన్ స్వీడన్ నిపుణులు గుర్తించారు. మిల్క్ ప్రోటీన్ గల ఏ పదార్ధాలైన అవి కేన్సర్ కణాలను నాశనం చేస్తాయి ఎక్కువ మిల్క్ ప్రోటీన్ తీసుకొనే వాళ్ళలో కేన్సర్ సమస్యలు పెద్దగా కనిపించలేదని నిపుణులు తమ అధ్యయనం లో గుర్తించారు.
అదేం లాభం లేదు
భోజనం బదులు పళ్ళు కూరగాయ రసాలు తీసుకొంటే బరువు తగ్గుతారు అనుకోవటం కేవలం భ్రమే అంటారు ఎక్సపర్ట్స్. ఒకటి రెండు రోజుల పాటు కేవలం పళ్ళు కాయగూరల రసాలు తీసుకోవటం ఒక పద్దతిగా ఉంది. దీనివల్ల ఆ ఒకటి రెండు రోజుల మేరకు కాస్త బరువు తగ్గినా ఆ తగ్గిన బరువు వెంటనే పెరిగిపోతుంది. రెండు రోజులో అత్యంత తక్కువ కేలరీలు తీసుకోవటం వల్ల శరీరంలో గైకోజెన్,నీరు మాత్రమే తగ్గు ముఖం పడతాయి. కొవ్వు తగ్గదు. తర్వాత […]
“యాదగిరి నరసింహస్వామి ప్రసాదం”
హైదరాబాదులో ఉన్న శ్రీ యాదగిరి నరసింహస్వామి ఆలయం దర్శనం చేయడం వల్ల సకల శుభాలకు నాంది పలికినట్టు.ఆ స్వామిని దర్శించి వద్దాం పదండి. పాల్గుణ మాసం వచ్చేసింది ఇంకా వివాహాలతో సందడిగా వుంటాము.యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం అయింది. కన్నుల పండుగగా వుంటుంది.ఉగ్రరూపుడైన నరసింహస్వామి మనలో వున్న అహంకారం తొలగించి ఙ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఉగ్ర రూపంలో ప్రత్యక్ష మై ఇక్కడ కొలువు తీరి వున్నారు.ఇక్కడ గుట్ట మీద స్వామి అంగరంగ వైభవంగా పూజలు […]
ముఖాకృతిని బట్టి ఎంపిక
ఇయర్ రింగ్స్ లో వందల రకాల మోడల్స్ కనిపిస్తాయి. కంటికి నచ్చిన డిజైన్ ఎంపిక చేసుకొంటారు. కానీ ముఖాకృతికి నొప్పే ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకోండి అంటూ ఎక్సపర్ట్స్ . గుండ్రని మొహానికి కోలగా ఉండే ఇయర్ హ్యాంగింగ్స్ చక్కగా సూటవుతాయి. టియర్ డ్రాప్స్. హాంగర్లు అందంగా ఉంటాయి. కోలా ముఖాకృతికి ఎలాంటి ఇయర్ రింగ్స్ అయినా సూట్ అవుతాయి. హృదయాకారం గల ముఖం అయితే డాంగిల్స్,టియర్ డ్రాప్స్ షాండ్లియర్ ఇయర్ రింగ్స్ బావుంటాయి నల చదరపు […]
షాపింగ్ కు లక్షల్లో జీతం
ఎన్నో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో ఒక అద్భుత అవకాశం ఇస్తోంది షాప్ బ్యాక్ వెబ్ సైట్,ఈ జాబ్ కేవలం షాపింగ్ చేయాలి. అంతే. ఈ సంస్థ ఎంపిక చేసే ఆఫీసర్ వెబ్ సైట్ లోని వేరు వేరు బ్రాండ్ల వస్తువులు కొనుగోలు చేయాలి. అలా కొంటూ ప్రతి ఉత్పత్తి మీద ఆ సైట్ లు క్యాష్ బ్యాక్ ఎలా పొందవచ్చో చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేయాలి. ఇలా షాపింగ్ చేస్తే నెలకు ఎనిమిది లక్షలు […]
ఆడవాళ్ళ ముక్కులు చాలా చురుకు
వాసన పసిగట్టటంలో మనిషికీ మనిషికి కొంత తేడా ఉంటుందంటారు. కానీ ముక్కులు మటుకు చాలా చురుగ్గా పనిచేస్తాయట. మగవాళ్ళ ముక్కల కంటే ఆడవాళ్ళ ముక్కులు ఎందుకు చురుగ్గా ఉంటాయో అన్న విషయం,తెలుసు కొనేందుకు బ్రెజిల్ కి చెందిన శాస్త్రవేత్తలు ‘iso tropic fraetionators’ అన్న పరీక్ష రూపొందించారు. ఈ పరీక్షలో మెదడులో ఏ భాగానికి సంబంధించి ఎన్ని కణాలు ఉన్నాయో ఖచ్చితంగా లెక్క పెట్ట వచ్చు నాటి ఈ పద్దతిని ఉపయోగించి వాసనకు సంబందించిన న్యూరాన్లు ఆడవాళ్ళలో 50 శాతం […]
ఎయిర్ డ్రెస్సర్
ఖరీదైన చక్కని చీరెలు,సూట్స్ ఉతికితే ఆ మెరుపులు పొతూ ఉంటాయి. ఇప్పుడు జెట్ స్టీమ్ టెక్నాలజీ తో పని చేసే ఎయిర్ డ్రెస్సర్ ఆ సమస్య తీర్చేస్తోంది. ఇందులోని ఎయిర్ హాంగర్ల కు దుస్తులను వేలాడ దీస్తే ఆవిరి పట్టించి అందులోని మురికిని జాగ్రత్తగా డస్ట్ ఫిల్టర్ ద్వారా తీసేస్తాయి డియోడరెంట్ ఫిల్టర్ ద్వారా దుస్తులు సువాసనలు వచ్చేలా చేస్తాయి. చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎయిర్ డ్రస్సర్ పని చేస్తుంది. దీని వల్ల దుస్తులు పాడవవు. […]
మానవ నిర్మిత జలపాతం
ప్రకృతి మనిషికి ఇచ్చే బహుమతుల్లో నురగలు కక్కుతూ జలజలా పారే జలపాతాలు ఒకటి ఎతైన కొండల్లోంచి విసురుగా కిందికి దుకే జలపాతాలు ప్రపంచంలో చాలాచోట్ల ఉన్నాయి కానీ చైనా లోని యువన్ ప్రావిన్స్ జలపాతం మాత్రం ప్రకృతి ఇచ్చిన సంపద కాదు. ఇది ఆసియా లోనే అతి పెద్దదైన మానవ నిర్మిత జలపాతం. స్థానిక న్యులాన్ నదిలోని నీటిని డియంచి అనే సరస్సుల్లోకి మళ్ళిస్తే వరదల సమస్య, నీటి సమస్య రెండు ఉండదని భావించి 1100 కోట్లతో […]
“సంగమేశ్వరుడి ప్రసాదం”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సంగంజాగర్లమూడి, గుంటూరు తెనాలి రహదారిలో మనకు బాలాత్రిపురసుందరి సమేత శ్రీ సంగమేశ్వరాలయం దర్శన భాగ్యం కలుగుతుంది. కాశీ విశ్వేశ్వరుడు,పాప హరేశ్వరుడి సంగమమే ఈ సంగమేశ్వరుడు.తొలుత ధ్వజరోహ దర్శనం తరువాత గంగాభవాని మరియు పోలేరమ్మను, కాలభైరవుడిని దర్శనం చేసుకోవాలి.ఈ క్షేత్రానికి తుంగభద్ర మరియు బాలకృష్ణ నదులుగా కృష్ణమ్మ ప్రవహిస్తుంది. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామి వారిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాలు,పండ్ల రసంతో అభిషేకించడం. -తోలేటి వెంకట శిరీష
అన్నీ లాభాలే
ఇప్పుడు వంకాయలు అనేక రంగుల్లో వస్తున్నాయి ఊదా,పసుపు,తెలుపు,నలుపు గులాబీ రంగుల్లో,రకరకాల ఆకారాల్లో దొరుకుతున్నాయి. వంకాయలో పీచు అధికం బి-1,బి-6 విటమిన్లు చాలా ఎక్కువ 100 గ్రాముల వంకాయల్లో 15 కెలోరీలు మాత్రమే ఉంటాయి ప్రత్యేకంగా ముదురు రంగు వంకాయి తొక్కలో యాంటీ ఆక్సీడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీవకణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ ను నియంత్రిస్తుంది మెదడు కణాల చుట్టు వుండే కొవ్వును కాపాడుతోంది. వాటిలో పోషక విలువలు పోకుండా ఉండాలంటే సన్నని మంట పైన […]
సూప్ స్నానం తో అందం
ఆరోగ్యం కోసం సుప్ తీసుకొంటారు. కానీ అందం కోసం ఏకంగా సూప్ లో స్నానం చేయటం గురించి ఎక్కడైనా విన్నామా? జపాన్ లో ఇ స్నానం ఇప్పుడు చాలా ప్రసిద్ధి. వేడి వేడి సూప్ టబ్ నిండా పోసి అందులో కూర్చొని స్నానం చేస్తే చర్మ సౌందర్యం మెరుగువుతోంది అంటారు జపాన్ లో స్పా నిర్వాహకులు,చైనా జపాన్ లలో నూడుల్స్ సూప్ ప్రధాన ఆహారం. వీటిలో ఇప్పుడు స్నానాలు కూడా చేస్తున్నారు. కొన్ని హోటల్స్ లో ప్రత్యేకంగా […]
క్యాప్సుల్ గదులు
హోటల్ రూమ్స్ అంటే అన్ని సదుపాయాలతో సౌకర్యంగా ఉండేవి కదా. ఇక్కడ బస చేయాలంటే ఖరీదు ఎక్కువే కొన్ని హోటల్స్ లో తక్కువ అద్దెకు లాకర్స్ , డార్శెటరీ ల సౌకర్యం ఉంటుంది. కానీ జపాన్ లో సామాన్యుల బడ్జెట్ కు అనుగుణంగా ప్రత్యేక ఆలోచన చేశారు.అక్కడ పాడుకొనేందుకు గదులు నిర్మిస్తారు. వీటిని కేప్సూల్ గదులు అంటారు. ఒక మామూలు హోటల్ గది స్థలంలో కనీసం ఇరవై ముప్పయ్ మంది పాడుకొనే గదులు ఏర్పాటు చేస్తారు. అద్దె […]
కొరియోగ్రఫీ అనీ
వెండి తెర వెనకే ఎందరో స్టార్స్ ఉంటారు . మనం తెరపైన చూసే హీరో హీరోయిన్ల నైపుణ్యాలన్నీ ఆ తెరవెనక పని చేసే వారిదేనంటే ఆశ్చర్యం లేదు. అనితా లామా పశ్చిమ బెంగాల్ నుంచి హైద్రాబాద్ వచ్చింది . చిరంజీవి నటించిన శంకర్ దాదా సినిమాలో ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసే అవకాశం దక్కించుకొంది . ఇక ఆ తరువాత తెలుగు,తమిళం,బాలీవుడ్ సినిమాలలో మొత్తం 200 పైగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్నారామె . పూరి […]
