Wednesday, 12 Aug, 2026
కొన్ని నగలు ధరిస్తే అమ్మాయిలకు అందం వస్తుంది. కొన్ని నగలకు అమ్మాయిలు ధరిస్తేనే అందంగా కనిపిస్తుంది. తల తిప్పారనుకొండి ఆ వజ్రాల తో తళుక్కుమంటారు. పెదవులపైకి నవ్వొస్తే నీటి బిందువు లాంటి చెవిపోగులు పచ్చని ఆకుల చివర నెమ్మదిగా ఊగుతాయి. ఏ వర్ణపు దుస్తులయితే ఆ వర్ణాలతో మెరిసిపోయే ఈ డ్రాప్స్ ఇయర్ రింగ్స్ అమ్మాయిల ఫ్యాషన్. ముఖ్యంగా దీపాల వెలుగులో ఈ డ్రాప్స్ ఇయర్ రింగ్స్ అందం చూడాలి. గాఢమైన రంగుల దుస్తుల పైకి మరే నగలు లేకపాయినా ఈ వజ్రపు చెవి పోగులు మెరిపిస్తాయి. అమ్మాయిల కోసం ప్రత్యేకించి ఈ డిజైన్లు ఓసారి చూడండి.

ముఖాకృతిని బట్టి ఎంపిక 

ఇయర్ రింగ్స్ లో వందల రకాల మోడల్స్ కనిపిస్తాయి. కంటికి నచ్చిన డిజైన్ ఎంపిక చేసుకొంటారు. కానీ ముఖాకృతికి నొప్పే ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకోండి అంటూ ఎక్సపర్ట్స్ . గుండ్రని మొహానికి కోలగా ఉండే ఇయర్ హ్యాంగింగ్స్ చక్కగా సూటవుతాయి. టియర్ డ్రాప్స్. హాంగర్లు అందంగా ఉంటాయి. కోలా ముఖాకృతికి ఎలాంటి ఇయర్ రింగ్స్ అయినా సూట్ అవుతాయి. హృదయాకారం గల ముఖం అయితే డాంగిల్స్,టియర్ డ్రాప్స్ షాండ్లియర్ ఇయర్ రింగ్స్ బావుంటాయి నల చదరపు మొహం అయితే ముఖాకృతి సమంగా కనిపించటం కోసం గుండ్రని ఇయర్ రింగ్స్ ఎంచుకోవాలి ఇయర్ హ్యాంగింగ్స్ ఇయర్ హుప్స్ చాలా బావుంటాయి.

Leave a Reply