Sunday, 28 Jun, 2026

స్టార్ షెఫ్ గరిమా అరోరా 

గరిమా అరోరా రెండేళ్ళ క్రితం ‘ గా ‘ అనే రెస్టారెంట్ ను బ్యాంకాక్ లో ఏర్పాటు చేసింది. ఇందులో సాంప్రదాయ భారత విధానాల్లో ఆధునిక రుచులు కలిపి వండి వడ్డిస్తారు. సంవత్సరం తిరిగే సరికి ఆమె రెస్టారెంట్ కి మిషెలన్ స్టార్ గుర్తింపు లభించింది. ప్రపంచ స్థాయి అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించే రెస్టారెంట్స్ కు ఇలాటి గుర్తింపు లభిస్తుంది. ఈ గుర్తింపు సాధన తోలి భారతీయ మహిళా గరిమా. ఈ ఏడాది ఆసియాలోని 50 […]

కేశభరణాలు

అందమైన చీరె నగలతో పాటు శిరోజాలంకరణ కూడా చాలా ముఖ్యం . వేడుకల్లో మెరిసేందుకు సైగ చుట్టుకోవటం ముఖ్యం అంటున్నారు . హెయిర్ స్టయిలిస్ట్ లు . పూర్వం రోజుల్లో ముచ్చటైన ముడి తో అలంకరించు కొనేందుకు నాగ హారం సూర్య చంద్రులు ,చామంతి బిళ్ళలూ వంటి కేశభరణాలు ఉండేవి . ఇప్పుడు చక్కని ముడుల కోసం అందమైన నగలున్నాయి . రైన్ స్టోన్స్ క్రిష్టల్స్ రత్నాలతో చేసిన బుట్టలు ముత్యాల వరసల్ని ముడులకు అలంకరిస్తున్నారు . […]

ఈ ఏడాది సంఖ్య ప్రత్యేకం  

2020  సంవత్సరపు సంఖ్యని స్పెషల్ నెంబర్ గా గుర్తించారని అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . 20 కి చాలా గొప్ప చరిత్ర ఉంది పిల్లల నోట్లో 20 పాలపళ్ళు వస్తాయి . ఆ ఇరవై ఊడిపోయి 32 దంతాలు వస్తాయి . పొట్టి క్రికెట్ మ్యాచ్ ట్వంటీ 20 లో ఓవర్లు ఇరవై . బైబిల్ లో ఇరవై ప్రస్తావన 177 సార్లు ఉందట . న్యూమరాలజీ ప్రకారం 20 కి ప్రత్యేక స్వభావం ఉంది ఇది […]

కుచ్చులకే ఓటు

కొత్త సంవత్సరం అంతా ఫ్యాషన్ డ్రస్ ల విషయంలో కుచ్చుల గౌన్లు సందడి చేయబోతున్నాయి . గతంలో ఈ రఫెల్స్ చిన్నపిల్లల గౌన్లు గా మాత్రమే ఉండేవి . నెమ్మదిగా చీరెలకు బ్లౌజులకూ రఫెల్స్ కుట్టేశారు . అలల్లా ఎగిరిపడి ఈ కుచ్చుల అందం ఫ్యాషన్ డిజైనర్లకు ఎంతో నచినట్లే ఉంది . 2020 లో ఈ కుచ్చుల డిజైన్లే ఫ్యాషన్ లో అగ్రస్థానంలో ఉంటాయని పండితులు లెక్కలు వేస్తున్నారు . రఫెల్స్ జాకెట్లు ,కుర్తీలు,టాప్ లు […]

“మయూరనాథుని ప్రసాదం”

తమిళనాడు లో నాగపట్నం కు సమీపంలో మనకు మయూర రూపంలో ప్రత్యక్ష మవుతున్న మయూరనాథుడు. దక్షయఙ్ఞంలో అవమానం పాలైన పార్వతీ దేవిని దూరదృష్టితో గ్రహించి వీరభద్రుడ్ని పంపిస్తాడు శివుడు.యఙ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు వీరభద్రుడు. ఆ సమయంలో ఈ అలజడికి భయపడి ఒక నెమలి పిల్ల పార్వతి దేవి ఒడి చేరింది.పార్వతి దేవి భర్త వారించిన వినక తండ్రి చేసే దక్షయఙ్ఞానికి వచ్చి అమర్యాదపాలైతినని  అవమానంతో అగ్నికి ఆహుతి అవుతున్న సమయంలో నెమలి కూడా ఆహుతి అవుతుంది.పార్వతి దేవి […]

ఇలా చేయండి 

ఇల్లు సర్దటం లో కొన్ని టిప్స్ అమలు పరిస్తే పర్ ఫెక్ట్ గా పని అయిపోతుంది. ప్లాస్టిక్ డబ్బా ఘాటైన మసాలా ధినుసులు పెడతారు. తరువాత ఆ మసాలా వాసన ఎంత కడిగిన పోదు. ఆ వాసన పోయేందుకు ఒక అగ్గిపుల్ల వెలిగించి ఆర్పేసి ఆ వచ్చే పొగపైన డబ్బా బోర్లిస్తే చాలు వాసనలు పోతాయి. అగ్గిపుల్ల మంటను ఆర్పినపుడు వచ్చే పొగకు డబ్బా శుభ్రంగా అయిపోతుంది. కూరలు తరిగే ప్లాస్టిక్ బోర్డ్ పై,డైనింగ్ టేబుల్ పై […]

తూటాల్లాంటి మాటలు

మార్పు స్పష్టంగానే కనిపిస్తుంది . తమకు అవమానం జరిగితే ఊరికే మనసులో పెట్టుకొని భాదపడుతూ ఊరుకోవటం లేదు . నడివీధిలో నలుగురికి తెలిసేలా చేయాలి అనుకొంటున్నారు . ఇప్పుడు కెన్యా మహిళలు అలా రహదారుల మీద కి వచ్చారు . స్థానిక యూనిటీ యూసఫ్ ఆధ్వర్యంలో “చాక్ బాక్ ” పేరుతో ఒక ఉద్యమం మొదలు పెట్టారు . రోడ్డుపైన రంగుల చాక్ పీస్ లతో తమ భాదను అక్షర రూపం ఇవ్వటం మొదలు పెట్టారు . […]

వృద్ధాశ్రమంలో పెళ్ళి  

కేరళ లోని వృద్దాశ్రమంలో మొదటిసారి ఒక పెళ్ళి జరిగింది 65 సంవత్సారాల లక్ష్మి అమ్మాల్,67 సంవత్సారాల కొచ్చానియన్ వధూ వరులై ఘనంగా పెళ్ళి చేసుకున్నారు. కేరళ మంత్రి శివ కుమార్ ఈ వివాహానికి హాజరై ఆ వధూవరులను అభినదించారు లక్ష్మి అమ్మాల్ కు కొచ్చానియన్ 30 ఏళ్ళుగా తెలుసు. ఆమె దెగ్గర పని చేసేవాడు. లక్ష్మి భర్త 20 ఏళ్ళ క్రితం మరణించారు ఆమె బంధువుల దెగ్గరే ఉంటూ రెండేళ్ళ క్రితం వృద్దాశ్రమానికి వచ్చింది కొచ్చానియన్ అదే […]

ఎప్పుడైనా చీరె సౌకర్యమే

మారథాన్ పరుగుకు చీరెకట్టు అడ్డం కాదని నిరూపించారు అంకిత కోన్వస్ . పింక్ ధాన్ 8 వ ఎడిషన్ లో ఆమె సంప్రదాయ సిద్దమైన అస్సాం చీరెకట్టు తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు . అంకిత కోన్వస్ ప్రముఖ మోడల్ ,పిట్ నెస్ గురుమిచింద్ సోమన్ భార్య . ఇలాటి మారధాన్స్ తో అందరూ జాగింగ్ ట్రాక్స్ వేసుకొంటారు . కానీ అంకిత వినూత్నాంగా చీరెకట్టు తో పాల్గొన్నారు . పింక్ ధన్ లో భాగంగా 10 […]

ఈ సంవత్సరపు  రంగు ఇది 

ప్రతి  సంవత్సరం ఒక కొత్త రంగు కలర్ ఆఫ్ ది ఇయర్ గా నిలుస్తోంది. ఫ్యాషన్ నిపుణులు ఆరంగులోనే దుస్తులు రూపొందిస్తారు. రాంప్ వాక్స్ లో ఆరంగు లోనే సెలబ్రిటీలు మెరిసిపోతారు. అయితే ఈ  సంవత్సరం 2020 లో మాత్రం లేత రంగుల దే హవా. అందులోను సముద్ర తీరాల్లో కనిపించే వర్ణాల నే నిపుణులు మెచ్చుకొన్నారు ముఖ్యంగా సీ ఫోమ్ కలర్ కే అగ్రస్థానం ఇచ్చారు. సముద్రపు అలలు నురగల్లో దర్శనం ఇచ్చే లేత ఆకుపచ్చ […]

ఎప్పుడు ఎరోబిక్స్ బెస్ట్

ఎప్పుడు ఒకేలాటి వ్యాయామం విసిగిస్తూ పోతే ఒకసారి వాటర్ ఏరోబిక్స్ ఎంచుకోండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇటు ఉల్లాసం అటు వ్యాయామం రెండు దక్కుతాయి అంటున్నారు . అధిక బరువుతో బాధపడే వారికి ఏ వ్యాయామం చేయాలన్న బద్దకంగా ఉంటుంది . అలాటి వాళ్ళకి ఈ వాటర్ ఏరోబిక్స్ కష్టం ఉండదు . 80 శాతం శరీరం మునిగి ఉంటుంది కనుక శరీరం బరువు అనిపించదు . తేలికగా వ్యాయామాలు చేయవచ్చు కీళ్ళ నొప్పులున్నా ఈ […]

ముంబయ్ సివంగి 

లోక్ మత్ మహా రాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారాన్ని అందుకొన్నారు ఎమ్. అంబిక. నార్త్ ముంబయ్ డి సి పి గా బాధ్యతలు నిర్వహిస్తున్న అంబికను ముంబయ్ సివంగి అంటారు పెళ్లయ్యాక పిల్లలు కలిగాక ప్రైవేట్ గా చదివి రాసి ఇంటర్ డిగ్రీ పూర్తి చేసి సివిల్ రాసి అర్హత సంపాదించారు అంబిక 2008 లో ఐ పి ఎస్ కు ఎంపికయ్యారు. హైద్రాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకొన్నారు. విధి నిర్వహణకు సేవా తత్పరత […]

ఈ వర్క్ చాలా అందం 

కాస్త ప్రత్యేకంగా కనిపించాలి అంటే ప్యాచ్ వర్క్ శారీస్ ఎంచుకోండి అంటున్నారు డిజైనర్స్. అందమైన డిజైన్ లతో ప్యాచ్ వర్క్ చేసిన కాటన్ చీరెలు చక్కగా ఉంటాయి. పువ్వుల లతల డిజైన్ తో ఉన్న కాంట్రాస్ట్ కలర్ ప్యాచ్ ను సాదా చీర కు అటాచ్ చేస్తే ఈ ప్యాచ్ వర్క్ తో ఆ చీరె అందం మారిపోతోంది. ప్యాచ్ వర్క్ కు వాడిన క్లాత్ నే బ్లౌజుకు వాడితే చీరెకు అందం వస్తుంది. నెక్ డిజైన్ […]

“పచ్చ కర్పూరం-ప్రసాదం”

అనంతాళ్వార్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రీతి కరమైన భక్తుడు.నిత్య నిర్మలమైన మనసుతో భగవంతుడుకి కైంకర్యం చేసుకున్నాడు. ఆళ్వార్ తిరుమల కొండ పైన స్వామి వారి సన్నిధిలో పూలతోటను పెంచి ఆ వనంలోని పుష్పాలను స్వామికి సమర్పించు కోవాలని గర్భవతి అయిన  తన సహధర్మచారిణితో కొండ పైన నివసిస్తూ ఉండేవాడు.తోటలో పనిచేస్తున్న సమయంలో ఒక బాలుడు తన వంతు సాయం చేస్తానన్న ఆళ్వార్ కోపంతో నిరాకరించి ఆ బాలుడిని తన చేతిలో ఉన్న గునపముతో కొట్టిన స్వామి […]

 ఇవే ముఖ్యం 

ఆభరణాలు అన్నింటిలో కర్ణా భరణాలు ముఖ్యం వీటి ఎంపికే సగం ఫ్యాషన్ లుక్ ని నిర్ణయిస్తుంది. ఎప్పుడు స్టార్స్ ఫ్యాషన్ ఇవి చిన్నవిగా బరువు లేకుండా వుంటేనే బావుంటాయి,ఇవి 30 నుంచి 50 గ్రాములలోపే బరువుండాలి. లేకపోతే ఆ బరువుకు చెవిసాగిపోతుంది. ఆలా బరువైనవే ధరించాలని ఎప్పుడైనా సరదా పడితే మాటీలు జతచేయాలి చీరెలు,హై కలర్ బ్లౌజులు ధరిస్తే పెద్ద ఇయర్ రింగ్స్ బావుంటాయి. ఇప్పటి స్టయిల్ సెంటిమెంట్ అదే. అదే బరువు విషయంలో జాగ్రత్త పడాల్సిందే. […]

అపురూపమైన బియ్యం 

వరి కంకుల నుంచే బియ్యం వస్తాయి కదా. కానీ వెదురు చెట్టుకు కూడా బియ్యం పండుతాయి. ఈ బియ్యాన్ని పండించటం అంత తేలిక కాదు. వెదురు సాధారణంగా పూయదు 50 ఏళ్ళకోసారి కొన్ని వెదురు జాతులు పూస్తాయి. బియ్యం కంకులు వస్తే వెదురు చనిపోతుంది. ఎక్కడో ఒకచోట పండే ఈ వెదురు బియ్యాన్ని గిరిజనులు సేకరించి. వీటిని లేత వెదురు ఆకుల రసాన్ని పట్టించి పచ్చని ముత్యాల్లాంటి బియ్యాన్ని తయారు చేస్తారు. ఎంతో రుచిగా ఎన్నో పోషక […]

చక్కని స్ఫూర్తి 

ఒక జర్నలిస్ట్ గా సమాజానికి ఎం చేయచ్చో చేసి నిరూపించుకొంది అర్చన చౌదరి. అస్సాం టియాకు తోటల్లో పనిచేసే ఆదివాసి మహిళలు గురించి తీసుకొంది అర్చన అక్కడ వాళ్ళకి ఏదైనా వైద్య సదుపాయాలు ఏవీ లేవు. గర్భం ధరించిన దగ్గర నుంచి సమస్యలే. గర్బశ్రవం,రక్తహీనతల తో మృత్యువాత పడేవాళ్ళ సంఖ్య ఎక్కువ . పిల్లలు పుట్టిన వేంటనే చని పోతూవుంటారు. లాభాపేక్ష లేని సంస్థలతో పనిచేస్తూ అస్సాం మహిళలకు అండగా నిలబడింది అర్చన. మారుమూల ప్రాంతాల నుంచి […]

ఉల్లి కాడల్లో పోషకాలు 

ఉల్లి కాడల్లో అనేక పోషక విలువలున్నాయి వాటిని తప్పకుండా అన్నిరకాల కూరల్లోనూ వేసే అలవాటు చేసుకోండి అంటారు న్యూట్రిషనిస్ట్ లు . వీటిని తరచు తీసుకొంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది పెరుగులో పచ్చి ఉల్లి కాడలు వేసుకుతింటే పైల్స్ వల్ల వచ్చే వాపు నొప్పి తగ్గుతాయి. సూప్స్ లో ఉల్లి కాడలు సన్నగా తరిగి వేసుకొని తాగితే జలుబు దగ్గు నుంచి ఉపశమనం ఉంటుంది. పచ్చి ఉల్లి కాడల రసం,తెనే సమపాళ్ళలో కలిపి తీసుకొంటే వ్యాధి నిరోధక […]

హాబీకి వయసేంటీ  

అభిరుచి ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదని నిరూపించారు వహీదా రెహెమాన్. ఈ సుప్రసిద్ధ సినీనటి తన 81వ ఏట కెమెరా పెట్టుకొని వైల్డ్ లైఫ్ ఫొటో గ్రఫీ లో బిజీ అయ్యారు. ఇండియా,టాంజానియా,నమీబియా,కెన్య అడవుల్లో ఎన్నో ఫోటోలు తీశారు తానుతీసిన ఫోటోల తో ఒక ఎగ్జిబిషన్ నిర్వహించారు చిన్నపుటి నుంచి నాకు ఫోటోగ్రఫీ ఇష్టం. ఒక ఫోటో ఎగ్జిబిషన్ లో ఆర్ట్ క్యూరేటర్ హిమాంశు షెథ్ ను కలిశాను. నా హాబీ గురించి చెపితే హాయిగా […]

 పట్టు కు జతగా 

ఉగాది,సంక్రాంతి రెండు పండగలు ముందున్నాయి. ఏ పండగకైనా పట్టు చీరె ధరించేందుకే మహిళలు ఇష్టపడతారు వాటిపైన సాంప్రదాయ ఆభరణాలు జతచేస్తారు. ఇప్పుడు  పట్టు చీరెలపైకి ధరించేందుకు ఫ్యాషన్ జ్యూలరీ అందుబాటు లోకి వచ్చింది. సిల్వర్,కుందన్ రత్నాలతో చేసిన పొడవాటి హారాలు,మెడను చుట్టేసే చోకర్స్ కొంటున్నారు అమ్మయిలు. అలాగే థ్రెడ్ జ్యువెలరీ కూడా పట్టు చీరెలకు మంచి మ్యాచింగ్. ఇక టెర్రాకోట డిజైన్స్ సాంప్రదాయ సొగసులు తీసుకురావటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.