January 2020
“నూతన ప్రసాదం”
శుభాకాంక్షలు,శుభాభినందనలతో నూతన సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం. నూతనంగా మనకు విఘ్నాలను అవిఘ్నాలుగా,శుభాలకు నాంది పలుకుతూ మంచి ప్రవర్తనతో ముందడుగు వేసి విజయాన్ని సాధించటానికి మన ప్రయత్నాలు ఫలించటానికి అన్ని వేళల సదా అభయం ఇచ్చి ఆశీస్సులు అందిస్తూ భక్తులకు తొలి పూజనీయుడు విఘ్నేశ్వరుడు. నూతన సంవత్సరం విఘ్నేశ్వరునితో ప్రారంభం అయింది.నిత్యం ఆయన పూజ ఎంతో ఇష్టం పిల్లలకు.గజవదనుడు,మూషిక వాహనుడు,లంబోదరుడు..ఎలా పిలిచిన పలికే దైవం. నిత్య ప్రసాదం: కొబ్బరి, కుడుములు,పానకం వడపప్పు. -తోలేటి వెంకట శిరీష
