Sunday, 28 Jun, 2026

ముందే మెనోపాజ్

కొన్ని అధ్యయనాలు ఆరోగ్యాన్ని ఎలా మెరుగు పరుచుకోవచ్చో చెప్పేస్తాయి. కనుక చదివేందుకు చాలా ఉత్సహాంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాలు చాలా ఇబ్బందిపెడతాయి. మహిళలు కార్బోహైడ్రెడ్స్ ఎక్కువగా ఉన్నా ఆహారం తీసుకోవటం వల్ల మెనోపాజ్ చాలా తొందరగా వచ్చే అవకాశం ఉందని ఇటీవలి అధ్యయనం చెపుతుంది. మహిళల ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి ఏ రకంగా దోహాదం చేస్తాయి అన్నా అధ్యయనంతో రిఫైన్డ్ కార్బో హైడ్రెడ్‌ ముఖ్యంగా అన్నం ,పాస్తా ఎక్కువగా తీసుకొనే వాళ్ళలో మెనోపాజ్ ఏడాదిన్నర ముందుగా వస్తోందని […]

వర్షకాలం జాగ్రత్తా

వర్షకాలపు సీజన్ బాగానే ఉంటుంది కానీ వంటింల్లో వస్తువులు మాత్రం జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. బియ్యం ,పప్పులు,ఉప్పులు,స్పైస్ లో పురుగులు ,ఫంగస్ చేరుతాయి. బ్రెడ్ పైన పసుపు ఆకుపచ్చ కలసిన మల్ట్ కనిసిస్తుంది. కనుక సీజన్ అయ్యే వరకు చిన్న బ్రెడ్ ప్యాక్స్ తెచ్చుకోవాలి. ఉప్పు ,చక్కెర ఉన్నా సీసాల్లో చెమ్మ చేరకుండా కొన్ని బియ్యం గింజలు అ సీసాల్లో వేయాలి. బియ్యం డబ్బాలో కొన్ని కర్పూరం బిళ్ళలు చిన్న వస్త్రంలో కట్టి వేస్తే పురుగులు పట్టవు. […]

సంగీతం వినండి

జ్ఞాపకశక్తి తగ్గుతోంది అనిపిస్తే చాలు సంగీతం వినటం ఎక్కువ చేయండి అంటున్నాయి పరిశోధనలు. చాలా మంది తమకు జ్ఞాపక శక్తితో పాటు ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుంది అంటున్నారు . ఇలాంటి క్షీణతలకు కారణం అయ్యే బాగాలకు సంగీతం మంచి వైద్యం అంటున్నాయి పరిశోధనలు.సంగీతంతో ఎంతో మనసు స్వాంతన పొందుతుందని ,అలాగే నెమ్మదిగా లో లోపల పాడుకొన్న మతి మరుపు క్రమంగా తగ్గిపోతుందని చెపుతున్నారు. సంగీతం నరాలకు స్వాంతన కలిగిస్తుంది అన్న విషయం తెలిసిందే.

ఇంటికి అందం

చాలా మందికి పుస్తకాలంటే చాలా ఇష్టం.కొని ఇల్లంతా పుస్తకాలతో నింపేసేవాళ్లున్నారు. లేదా కొందరికి బుక్స్ హాల్లో అలంకరించుకోవటం ఇష్టం. పుస్తకాలు ఇచ్చే అందం ఇంకేవీ ఇవ్వవన్న మాట. ఇప్పడు వస్తున్న బుక్ షెల్ఫ్ వాల్ మ్యూరల్స్ గదిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంటించుకోవచ్చు. అద్దాల బీరువాలు పుస్తకాలు ఉన్నట్లు కనిపించేవి డ్రాయింగ్ రూమ్స్ మూలగా అంటించుకోవచ్చు. వినైల్ షీట్ల తో తయారు చేసే ఈ బుక్ షెల్స్ స్టిక్కర్ల పైన నీళ్ళు పడినా […]

మళ్ళీ ఇప్పుడిది ట్రెండ్

కంటె ఏనాడిదో ప్రాచీన కాలపు నగ .మహానటి సినిమాలో మాయా శశిరేఖ సినిమాలో ఈ కంటె కనిపిస్తుంది. రాజస్థాన్ నగల్లో హాస్లీ పేరుతో మీనాకారీ ,పోల్కీ డిజైన్ తో కంటెను చేయించుకొంటారు. ఇప్పడు ఈ కంటె ఫ్యాషన్ తెరపైకి వచ్చింది. వజ్రాలు ,అన్ కట్ డైమండ్స్, ముత్యాలు పచ్చలు కలసిన కంఠహారం అయిపోతుంది సాదాసీదా కంటె.పాత కాలపు ష్యాషన్ కొత్తగా తిరిగొచ్చి అమ్మాయిలకు ఇష్టమైన ట్రెండీ నగయిపోతుంది.

ఎలా ఉంటాయో

ఏదైనా రుచి నచ్చితే దాన్ని అన్ని పదార్థాలలో వెతుకుతాం అలాంటిదే జార్ ఫ్రూట్ చాకొలెట్ .ఈ ప్రపంచంలో చాకొలెట్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. కోకో గింజలు చాలా ఖరీదు అవటంతో ఇప్పడు పనస గింజల గురించి ఆలోచన వచ్చింది. పరిశోధనలు జరిగాయి పనస తిన్నాక సాధారణంగా వీటిని పారేస్తాం. లేదా కొందరు ఉడకబేట్టి,కాల్చి తింటారు కూడా.ఇప్పడు ఈ గింజలను ఎండబెట్టి పొడిచేసి వీటికి చాకొలెట్ రుచి వచ్చేలా మారుస్తున్నారు. చాలా తొందరలో జార్ ఫ్రూట్ చాకొలెట్స్ […]

అన్ని ఇవ్వచ్చు

సంవత్సరంలోపు పిల్లలకు వట్టి పాలు సరిపోవు కాబట్టి ఘనాహారం అలవాటు చేయాలి. పళ్ళు వచ్చే వయసు కూడా .ఆరు నెలల నుంచి అలవాటు చేస్తే సంవత్సరం వచ్చే సరికి ఈ ఆహారం తినేందుకు వాళ్ళు సిద్దంగా ఉంటారు. ఆహారం పిల్లలకు అరిగే లాగా బాగా మెత్తగా ఉడికించి ఇవ్వాలి.వండిన కూరగాయలు ,కందిపప్పు ,పెసర పప్పులు కూడా రవ్వలాగా చేసి అన్నంతో కలిపి అందులో చక్కగా నెయ్యి వేసి తినిపించవచ్చు. మాంసాహారం అలవాటు చేయదలుచుకుంటే చికెన్ ,చేప పెట్టవచ్చు. […]