June 2018
చిన్న గింజల్లో అద్భుతం
ఒమేగావె ప్యాటీ యాసిడ్ తో పాటు లిగ్నిన్ కలిగిన ఏకైక విత్తనం అవిసె. ఇందులో కార్బోహైడ్రేట్స్ బాగా తక్కువ. జుట్టుకు చర్మానికి మేలు చేసే అవిసేలో పీచు పదార్ధం ఎక్కువ. మాంగనీస్ థయామిన్ ,మెగ్నిషియం ఎక్కువగా ఉంటాయి. ఒక్క స్పూన్ అవిసె గింజలు తినటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు. ఇవి శిరోజాలకు మెరుపుని ఇస్తాయి.ముఖంపైన మొటిమలు ,కురుపులు రాకుండా చేస్తాయి. మొనోపాజ్ తర్వాత స్త్రీలలో వచ్చే కాన్సర్ లను ఆపగలుగుతాయి. ఇది వేయించి పోడి చేసి అన్నంలో […]
నా రహాస్యం అదే
పాలరాతి శిల్పంలాగా ,నాజుగ్గా ఉండటంలో రహాస్యం ఏమిటని అడిగితే యోగా అనేస్తుంది తమన్నా.నానబెట్టి పోట్టు తీసిన బాధం పప్పు ,గోరు వెచ్చని నీళ్ళు తాగటంలో ఆమె రోజు మొదలవుతుందట. ధ్యానం,యోగా రెండు మూడు ఆసనాలు తప్పని సరి. శరీరం చల్లగా ఉండేందుకు పెరుగు,మంచి నీళ్ళు ,పళ్ళ రసాలు,సూప్ ,కొబ్బరి నీళ్ళు తీసుకోవటం.జంక్ ఫుడ్ ,చక్కెర జోలికి వెళ్ళకుండా ఉండటం ఆమె ఆరోగ్యానికి కారణం అంటోంది తమన్నా.ఇంత తేలికైన ఆహారం తీసుకొంటే శరీరం,చక్కగానే ఉంటాయని ఎక్స్ పర్ట్స్ కూడా […]
ఈ జ్యూస్ మంచి ఔషధం
వర్షాలు మొదలై,వాతావరణంలో తేమ పెరిగి రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఏదో ఒక అనారోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ కాలంలో తేలికగా జీర్ణం అయ్యో కూరగాయాలు తాజాగా వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఆహారం కలుషితం కాదు. వేడిగా ఉన్న భోజనం జీర్ణశక్తి పని తీరు మెరుగు పరుస్తుంది.కాచి చల్లార్చిన నీళ్ళే తాగాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో ప్రమాదం అతి సారా వల్లనే. దీనికి పరిష్కారం డీ హైడ్రేషన్ రాకుండా మజ్జిగ తాగటం, తెలికైన […]
లెక్క లేసుకొంటే కష్టం
బరువు తగ్గేందుకు అతిగా వ్యాయామలు ,నోరుకట్టేసుకోవటం రెండు తప్పే అంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఏది తిన్న కేలరీలు లెక్కేసుకుంటూ ఉంటే ప్రమాదం. అన్నీ సమపాళ్ళలో తిన్నప్పుడే అదనపు కేలరీలు శరీరంలో కొవ్వుగా మారే పరిస్థితి ఉండదు.జీవక్రియల్లో అన్నీ భాగంగా ఉండి శరీర అవయవాలన్నీ చురుకుగా పని చేసేందుకు సాయపడతాయి. అంతే కానీ అందరికీ ఒకే రకపు డైట్ ఫుడ్ కాకుండా వయసుని బట్టి ఎన్నీ కేలరీలు తీసుకొవాలో తెలసుకొంటే బరువును అదుపులో ఉంచుకొవటం కష్టం కాదు. కానీ తీసుకొనే […]
ఈ సీజన్ కంఫర్ట్స్
జీన్స్ ఫ్యాంట్ వేసుకొవటం అంత కంఫర్ట్ ఇంకోటిలేదు అంటున్నారు అమ్మాయిలు. జీన్స్ లాంటివే ఈ వర్షాల్లో వీలుగా ఉండే వెదర్ ఫ్యాంట్లు వచ్చాయి. వీటికి మురికీ పట్టదు.తడిసి పోయి ఇబ్బంది పెట్టవు.ఇస్త్రీ అక్కరలేదు . స్కిన్ టైట్ ఫ్యాంట్లు ,లెగ్గింగ్స్ కూడా వీటిలో వస్తున్నాయి. బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఇవి హాట్ పేవరేట్స్ అందం,సౌకర్యం రెండు ఉన్నాయి కనుక ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్స్.
మెరిసే రత్నాలు
రంగు రాళ్ళలో ఎన్నో వింతలు ,వజ్రాలు,రత్నాలు,మెరిసి పోతాయి కానీ ఆస్ట్రేలియాలో దోరికే ఓపత్ రత్నాలు మాత్రం చిత్ర విచిత్రమైన రంగుల్ని నింపుకొని మరీ మెరిసిపోతాయి.తెలుపు ,ఎరుపు,ఆకుపచ్చ,నీలం,గులాబీ,గోధుమ,నలుపు అన్నీ రంగుల్లో ఈ రాళ్ళు అత్యంత పారదర్శకంగా ,ప్రకృతి వింతల్లా ఇముడ్చుకొని మరీ అద్భుతంగా కనిపిస్తాయి. ఈ రత్నాలను అలాగే నగల్లో పొదగటం కానీ, కత్తిరించి వాడటం కానీ చేస్తారు. జ్యోతిష్య నిపుణులు ఈ రాళ్ళని ధరించటం అదృష్టం అంటారు .చక్కని రంగుల్లో మెరిసే ఈ రాళ్ళను ఉంగరాలు,లాకెట్లు,చెవి రింగుల్లనూ […]
కడుపు నిండినట్లే
మాంపాహారంతో పోలిస్తే పుట్ట గొడుగులతో చేసే టిఫిన్స్ తో ఆకలి తక్కువ కావటమే కాకుండా కడుపు నిండిన భావన కలుగుతోందంటున్నారు అధ్యయనకారులు.మాంసాహారం బదులుగా తీసుకొనే పుట్టగొడులలో పోషక విలువలతో పాటు ఎన్నో ప్రయోజనాలున్నట్లు చెపుతున్నారు. పుట్టగొడులు బరువు నియంత్రించటంలోనూ ,సంతృప్త భావననని ఇవ్వటంలొనూ ,సంపూర్ణ ఆరోగ్య పరి రక్షణలోనూ నిశ్చయంగా మెరుగ్గా ఉన్నాయని చెపుతున్నారు.
మెదడుకీ శిక్షణ
ఇతర శరీర భాగాలకులాగే మెదడుకి కూడా శిక్షణ ఇవ్వవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. జ్ఞాపక శక్తినీ,ఏకాగ్రతను పెంచేలా మెదడుకు శిక్షణ ఇచ్చే వ్యయామాల్నీ వారు గుర్తించారు.ఇది పూర్తిస్థాయిలో మనుష్యులలో తెలివి తేటలు పెంచకపోయినా చదువుకొనే చోట ,పని చేసే చోట అవసరమైన నైపుణ్యాలను మెరుగు పరుస్తాయని చెపుతున్నారు. ఫోన్ నెంబర్లు .దిక్కులు,ప్రయాణ మార్గాలు గుర్తించుకొనే గ్యూయిల్ ఎన్ బ్యాక్ వ్యాయామం సాధన చేసిన వారిలో జ్ఞాపక శక్తి మెరుగ్గా ఉందని గుర్తించారు. మారిపోయే స్వీక్వెన్సుల్నీ గుర్తించుకొనే కాంఫ్లిక్స్ స్పాన్ […]
ఖర్జూర తినాలి
ఐరన్ పుష్కలంగా దొరికే ఖర్జూర పండ్లను ప్రతి రోజు కనీసం మూడైనా తినమంటున్నారు డాక్టర్లు.ఇవి కర్త కణాల అభివృద్ధికి తోడ్పడతాయి. రక్తహీనతకు ఖర్జూరాలు ఔషధం …అనారోగ్యకర సమస్యలు తలెత్తకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.పరిగడుపునే తింటే రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. బాలింతలు ప్రతి రోజు తీసుకోవటం వల్ల పసిబిడ్డలకు పుష్కలంగా పాలు వుంటాయి.వీటి వల్ల గుండెకు మేలు .మొదడుకి కూడా ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి.
ఫలితం ఇచ్చే ఐస్ థెరపీ
శరీరంలో కొవ్వు పేరుకు పోయినచోట ఐస్ థెరపీ చేస్తే ఆ ప్రదేశంలో కొవ్వు కరగటం మాత్రమే కాక చర్మం బిగుతుగా అవుతుంది.ఎన్నో ఏళ్ళ క్రితం ఈ థెరపీ మెక్సీకో లో ప్రారంభించారు.స్రపవం అయినా స్త్రీలకు ఈ ఐస్ థెరపీ మంచి ఉపయోగం. ఒక మందమైన బ్యాగ్ లో ఐస్ వుంచి కొవ్వు ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయటం వల్ల రక్త ప్రసరణ పెరిగి శరీరంలో మలినాలు కూడా బయటకు పోతాయి.పోషకారహారం తీసుకొంటూ క్రమం తప్పకుండాఈ వ్యాయామం చేస్తే […]
అంటించేస్తే చాలు
అపార్టుమెంట్స్ లో మొక్కలు పెంచటం చాలా కష్టం .ఏ వాకిట్లో నూ రెండు కుండలు పెట్టుకోవాలన్న అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. అంతమాత్రనా ఇంట్లో పచ్చగా నాలుగు ఆకులు ,రెమ్మలతో రెండు పూవులతో తోటపెంచితే బావుంటుంది. అనిపించకుండా ఉంటుందా? మెగ్నెట్ ఫ్లాంట్ అని ఆన్ లైన్ లో వెతికితే ఒక చిన్నా అయిస్కాంతం అంటించే బుల్లి కుండీలు ,రకరకాల ఫ్లవర్ వాజుల్లాంటివి కనిపిస్తాయి. అయిస్కాంతాలు ఈ కుండీలను పట్టి ఉంచుతాయి. తేలికైన ఈ గాజు,చెక్క మట్టి కుండీల్లో […]
విడాకులు ఉండవు
అమెరికన్ సోషియోలాజికల్ అసోషియేషన్ చేసిన ఓ సర్వేలో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉన్న ఇళ్ళలో పెరిగిన వాళ్లు విడాకులు తీసుకొనేందుకు సుముఖంగా ఉండరట. అక్క చెల్లెళ్ళు,అన్నదమ్ములూ ఎక్కువ మంది ఉన్నా ఇళ్ళలో కలిసి పెరిగిన వాళ్ళలో ప్రేమానుబంధాలు ,పంతాలు ,పట్టింపులు,వెంటవెంటనే సర్ధుబాట్లు పట్టువిడుపులు ఉంటాయి. ఈరకమైన నైపుణ్యాలతో పెరిగిన వాళ్ళు పెళ్ళిళ్లు చేసుకొన్న భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చిన ఆ సంసారం విచ్చిన్నం కాకుండా ఉంటుంది. వైవాహిక జీవితంలో సర్ధుకుపోతారు. ఒక్కళ్ళుగా పెరిగిన […]
ఎత్తు చెప్పులు వేసుకొంటే
ఎత్తు తక్కువగా ఉన్న,మోడరన్ గా కనిపించాలనుకొన్న అమ్మాయిలు హీల్స్ వేసుకొంటారు. ముని వేళ్ళ పైన ఒత్తిడి తగలకుండా ముందుగా కాలి గోళ్ళు పొడుగ్గా లేకుండా కత్తిరించుకొని ఈ హీల్స్ వేసుకొండి ,సౌకర్యంగా ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పాదాల పగుళ్ళు ఇతర ఇన్ ఫెక్షన్లు లేకుండా చూసుకోవాలి. చూసేందుకు పాదాల మృదువుగా కనిపించాలి. ఫ్యూమిక్ రాయితో మృత కణాలు పోయేలా రుద్దీ పాదాలకు మాయిశ్చరైజర్ లేదా పెట్రోలియం జెల్ల్ తో మర్ధన చేస్తే పొడిబారిపోకుండా ఉంటాయి. ఏ […]
పిల్లల ముందు వాదనలా ?
పెద్దవాళ్లకి తెలియక కాదు కానీ ఆవేశంతో ఒళ్ళు మరిచి పోయి పిల్లల ముందే గట్టిగా అరుచుకొని దెబ్బలాడుకుంటారు. మరీ కోపం ఎక్కువైతే తామ గొడవల్లోకి పిల్లలను లాగుతారు. ఇలా పెద్దవాళ్ళ తగువుల్లో నలిగే పిల్లలు చాలా ఒత్తిడికి లోనై ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తారు. వీళ్ళతో పోలీస్తే అనారోగ్యంగా ఉన్న ఉండే దంపతుల మధ్య పెరిగిన పిల్లలు చాలా ఆరోగ్యంగా,మానసికంగా కూడా ఎంతో చురుగ్గా సంతోషంగా ఉంటారని చెపుతున్నారు. పెద్దవాళ్ళ మనస్పర్థలు పిల్లల భావాద్వేగాలని దెబ్బతీసి ,ముఖ్యంగా […]
నలుపు మాయం
నోట్లోనికి గాలి పీల్చుకొని బుగ్గలను ఉబ్బిస్తే మొహాం పైన ముడతలు కనబడకుండా పోతాయట. ఈ వ్యాయమం రోజులో చాలా సార్లు చేయవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రతి రోజు వెచ్చని కొబ్బరి నూనెతో చెంపలను మర్ధన చేస్తే చెక్కిళ్ళు చాలా మృదువుగా అయిపోతాయి. అలాగే చర్మం కమిలినట్లు అనిపిస్తే పులిసిన పెరుగును రాయండి. మరకలు నలుపు మాయమైపోతాయి అంటున్నారు .అలాగే బచ్చల ఆకులు గులాబీ రేకలు పేస్ట్ గా చేసి ముఖంపై రాసి ఆరిపోయాక కడిగేస్తే మొటిమలు […]
ఎన్నింటిలోనో కల్తీ
మంచి ప్యాకింగ్ తో చూసేందుకు అందంగా చక్కని రంగుతో కనబడితే అవన్నీ మంచి వస్తువులు అనుకొంటాం. కానీ ఎన్నీ వస్తువుల్లో కల్తీ.. తింటే అనారోగ్యం సాధారణంగా పంచదార లో బొంబాయిరవ్వ సుద్దముక్కల పొడి కలిపితే కళ్ళతో చూస్తే తేడా చెప్పలేము. నీళ్ళలో వేస్తే తెల్లగా అయిపోయి ,నీటి అడుగున బొంబాయి రవ్వ తేరుకొంటే అది కల్తీదే కదా. శనగా పిండిలో బియ్యపు పిండి మిఠాయి రంగు కలిసే అవకాశం ఉంది. నీళ్ళలో వేస్తే నీరు ఎరుపు రంగులో […]
పగటి కలలు మంచివే
చాలా మంది పని చేయటం కంటే పగటి కలలు కనటం ఇష్టం. పనీ పాడు లేకుండా ఇదే మిటని అందరూ వాళ్ళని విసుక్కుంటారు. కానీ ఇలా పగటి కలలు కనే వారికే మేధాస్సు ఎక్కువ అంటున్నారు . అత్యంత సమర్థులు ,సృజనకారులు సమస్య పరిష్కర్తలు వారే అంటున్నారు శాస్ర్తవేత్తలు,పరిశోధకులు, ఎంఆర్ ఐ స్కానింగ్ ద్వారా కొంత మంది మెదళ్ళ అమరికా పనీ తీరు క్షుణంగా పరిశీలించి అప్పగించిన పని పర్ ఫెక్టుగా చేసుకుపోయేవాళ్ళకంటే ఇలా మధ్య మధ్యలో […]
ముత్యాల్లాంటి పళ్ళు
నవ్వితే ముత్యాలు రాలిపడినట్లు ఉండాలంటారు. అయితే కాఫీ,టీ లు తాగి తాగి తెల్లని పళ్ళ వరుస కాస్త పసుపు రంగులోకి మారి పోతాయి. చిన్న చిట్కాలతో పచ్చని పళ్ళను మెరిపించవచ్చు. కమలా ఫలం తోక్క తీసుకొని తెల్లగా ఉండే లోపలి భాగంతో దంతాలపైన రుద్ది పది నిమిషాలు అలా వదిలేసి బ్రష్ చేసుకోవాలి.ఇలా రాత్రిళ్ళు ఒక వారం పాటు చేస్తే కమలపండులో ఉండే విటమిన్ సి కారణంగా దంతాలు మెరుస్తాయి. స్ట్రా బెర్రీలు పెస్ట్ లా చేసి […]
వంట సోడాతో క్లీన్
యాపిల్స్ మంచిదే కానీ వాటి పంటదిగుబడి పెంచటం కోసం వాడే రసాయనాలు అవశేషాలు కోత అనంతరం వాటిపై మిగిలిపోతాయి. అందువల్లనే వీటిని తింటేనే ఆరోగ్యం దెబ్బ తింటుంది. మాసాచు సెట్స్ వర్సిటీ నిపుణులు తాజాగా యాపిల్ పళ్ళపైన ఎక్కువగా కనించే ఫంగీసైడ్ థియాబెంకాజోల్ రసాయనంపై దృష్టి పెట్టి ఈ మందు చల్లిన యాపిల్ ను శుభ్రం చేసేందుకు వంటసోడా బ్లీచ్ వంటి రకరకాల ద్రావణాలు ఉపయోగించారు.ఇందులో మంచి సోడాతో మెరుగైన ఫలితాలు వచ్చాయని వారు చెపుతున్నారు.
అలవాటు చేసుకోండి
క్యాబేజీ ,కాలీఫ్లవరా?ఊడికించేటప్పుడు వచ్చిన వాసన అబ్బ అంటారు అమ్మాయిలు.కానీ వీటిని కనీసం 10 గ్రాములైన తినటం వల్ల గుండెకు రక్తాన్నీ చేరవేసే రక్తనాళాల గోడలు మందం తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది అంటున్నారు . మగవాళ్ళతో పోలిస్తే ఈ కూరలు తినటం వల్ల ఆడవాళ్ళకే ఆరోగ్యం అంటున్నారు. వీటిని క్రమం తప్పకుండా తింటే కెరోటిన్ రక్తనాళాల గోడలు పలుచగా ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. అందుకే ఇప్పటికి అలవాటు లేకపోయినా ఇక నుంచైనా తినండి అంటున్నారు ఎక్స్ […]
