May 2018
ఆ లక్షణం ఉంటేనే
సినిమా హీరోయిన్లను ఇంటర్యూల్లో విసుగులేకుండా అడిగే ప్రశ్న ఒక్కటే మీ కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారు. అని వాళ్ళు ఏదో ఒక లిస్ట్ చెబుతారు. కాని కంగనా రనౌత్ మాత్రం ఒకే ఒక్క లక్షణం చాలు అంటుంది. తనకు కాబోయే భర్త దేశ భక్తుడై ఉంటే చాలంటుంది కంగనా. ఎందుకంటే కన్న తల్లి కన్న భూమి ఒక్కటే. మాతృ భూమిని ప్రేమించలేని వాడు నాతో మాత్రం అంత విశ్వాసంగా ఎలా ఉంటాడు. ఒక వేళ నేను ఎవరినైన […]
పర్లేదు మంచిదే
చెవులకు, ముక్కులకు, చేతులకు, నడుముకు పాదాల వేళ్ళకు వేసుకునే నగల విషయంలో ఎన్నో వైజ్ణానికి విశేషాలు ఉన్నాయంటున్నారు. ఉదాహరణకు చెవులు కుట్టించుకోవడం అనేది ఆక్యుపంచర్ వైద్య విధానానికి సంభందించింది. సంప్రదాయం వెనుక విజ్ణానం దాక్కుని ఉంది. చెవులు కుడితే రుతు సంభందమైన ఆరోగ్య సమస్యలు రావు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. నాడీ మండలం ఉత్తేజితమై నాడులు ప్రేరణ చెందుతాయి. కంటి చూపు మెరుగవుతుంది. ఇన్ని విశేషాలు ఉండబట్టే ప్రాచీన కాలంలో మగవాళ్ళకు […]
కళ్ళు జాగ్రత్త
ఎర్రని ఎండలో మొదటగా ఇబ్బంది పడేది కళ్ళే. ఎంత సన్ గ్లాసులు ధరించిన కళ్ళు అలిసిపోతూనే ఉంటాయి. ఈ వేసవిలో కళ్ళ ఆరోగ్యానికి కాస్త జాగ్రత్తలు తీసుకోవచ్చు. కంటికి అవసరమైం పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ,విటమిన్ బీ12, సీ,మెగ్నీషియం, జింక్ లు అధికంగా ఉండే గుడ్డు తప్పనిసరిగాతినాలి. చేపలు తీసుకుంటే కళ్ళు పొడిబారి సమస్య పోతుంది. అలాగే కాంటాక్ట్ లెన్సులు వాడే వాళ్ళు కళ్ళు ఇన్ ఫెక్షన్ భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలగే ప్రతి వస్తువు […]
అంటిస్తే అందం
ప్యాచ్ వర్క్ ఎప్పుడూ బావుంటుంది. దేన్నయినా ఫ్యాషన్ గా మార్చేస్తుంది. ఒక సాదాసీదా డ్రెస్ కు ఎన్నెన్నో డిజైన్ లు అతికించి ట్రెండిగా మార్చేస్తుంది. ఈ వర్క్ ఇప్పుడు పెద్ద కష్టం కాదు. ఐరన్ ఆన్ ప్యాచెస్ వచ్చేశాయి మార్కెట్లోకి దీన్ని ప్యాంట్ పైనో షర్ట్ పైనో అతికించేయవచ్చు. పులులు,సింహాలు,లోగోలు,పువ్వులు,అక్షరాలు ఎన్నో ప్యాచెస్ వీటిని పెట్టి ఐరన్ చేస్తే చాలు ఎక్కడ కావాలంటే అక్కడ అతుక్కుపోతాయి. చిల్లులు.మరకలతో పక్కన పడేసిన పాత డ్రెస్ లు అయినా ఈ […]
పాట పవర్
శిశువులను,పశువులను ఒకే రకంగా గానం అలరిస్తుంది అంటారు. కాని ఇప్పుడు కొత్త పరిశోధనలో గానం ఒక చికిత్స అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఉటా హెల్త్ పరిశోధకులు. సంగీతం కారణంగా అల్జీమర్స్ రోగుల పాత జ్ణాపకాలు తిరిగి తెప్పించవచ్చు అంటున్నారు. క్రమం తప్పకుండ పాటలు వినిపిస్తే వాళ్ళలో మతిమరుపు తగ్గి ఆలస్యంగా అయినా పాత విషయాలు గుర్తుకు తెచ్చుకోవడం పరిశోధనలో గమనించాం అంటున్నారు. ఆలోచన శక్తి క్షీణించకుండ పదే పదే పాత పాటలు కూడా వింటూ ఉండటం మంచిదే […]
మెడలోనూ అమ్మే
లక్మీ హారాలు,పాత తరం నగలు ఆ కాలంలో నగల్లో కూడా దేవతామూర్తులు దర్శనం ఇచ్చేవి. ముఖ్యంగా లక్ష్మీదేవి నగల్లో కొలువై ఉండేది. ఇప్పుడు అవే నగలు ఫ్యాషన్ కు ప్రతిరూపాలు అయ్యాయి. లక్ష్మిదేవి చోకర్ నెక్లెస్ లో మొత్తం అమ్మవారి బొమ్మలే మెడ చుట్టు వస్తాయి. వజ్రాలు,కెంపులు,రత్నాలు,ముత్యాలు పొదిగిన ఈ హారం చాలా బావుంటుంది. అలాగే లక్ష్మీరూపంలో హారాలు మ్యాచింగ్ గా దిద్దులు,గాజులు వస్తున్నాయి. వన్ గ్రామ్ గోల్డ్ లోనూ లక్ష్మీ రూపాలే. సంపదగా ఆది దేవతగా […]
ఎండకు పాడవ్వదు
వేసవిలో ఎండ, చెమటకు మేకప్ ఎక్కువసేపు మొహం పైన ఉండదు. పొడి చర్మానికి వేసవిలో మాయిశ్చరైజర్ అవసరం ఉండదు. అయితే వాటర్ ప్రూఫ్ మేకప్ వాడితే మంచిది. లిక్విడ్ ఫౌండేషన్ వేసి మస్కర్, లైనర్ తో కళ్ళను దిద్దుకున్నాక బుగ్గలకు బ్లష్ అద్ది టిష్యూ పేపర్ తో అదనపు రంగు తొలగించవచ్చు. ఇక జిడ్డు చర్మం ఐతే ఐస్ తో మొహం రబ్ చేసి ఫౌండేషన్ వేయాలి. ముందుగా ప్రైమర్ వాడాలి. దాని పైన వాటర్ బేస్డ్ […]
పాడే దీపం
మనకు ఒక వస్తువుతో ఇంకొన్ని ప్రయోజనాలు ఉండటం ఇష్టం. ఇది వ్యాపార రహస్యం కూడా. ఇప్పుడు జింగ్ స్పీకర్ లైట్స్ చూస్తే అలంకరించుకునే అందమైన పంజరంలో పిట్టలు ఇంకెన్నో డెకరేటివ్ ఆర్టికల్స్ కనిపిస్తాయి. బ్లూటూత్ తో పని చేస్తాయి. ఇందులో లౌడ్ స్పీకర్ లైట్ కూడా ఉంటుంది. రీ చార్జ్ చేస్తే పదిహేను గంటల పాటు సంగీతం వినోచ్చు. కరెంట్ పోయినప్పుడు లైట్ లా ఉపయోగపడి అందులోనే సంగీతం గంటల తరబడి వినే సౌకర్యం ఉంటే ఎంతబావుంటుంది. […]
మంచి లక్ష్యం కోసం
కొన్ని కొన్ని మంచి పనుల కోసం కొత్త కొత్త ఛాలెంజ్ లు ఇంటర్ నెట్ లో ట్రెండ్ అవుతుంటాయి. లవ్లీ ఫ్రేమ్ శాన్వీ నో స్ట్రా చాలెంజ్ కి ఓకే చెప్పానంటుంది. కూల్ డ్రింక్స్ కొబ్బరి నీళ్ళు తాగేటప్పుడు స్ట్రా వాడకపోవటం అన్నమాట. ఈ ఛాలెంజ్ వెనుక ఉన్న కథ గురించి మాట్లాడుతూ ఫ్రెండ్స్ తో కొబ్బరి నీళ్ళు స్ట్రా లేకుండా తాగుతానని సరదగా ఛాలెంజ్ చేశారు. మొదట్లో ఫెయిల్ అయినా ప్రాక్టీస్ చేసి సాధించాను. ఇది మంచిపనికి […]
కాస్త ప్రత్యేకం
ఏదైన ప్రత్యేక సందర్భాన వేసుకునే దుస్తులు,నగలు ప్రతిబింభిస్తాయి. ప్రత్యేకం అంటేనే కాస్త భిన్నంగా ఉండాలి కదా. ఎప్పుడు పార్టీలకు స్పెషల్ అకేషన్ల కోసం జీన్స్ టీ షర్టులే కాదు. కాస్త భిన్నంగా బాడీ కాన్ దుస్తులు ఎంచుకోవచ్చు. ఇవి ఫ్యాషన్ అయితే వయసు అభిరుచులు భట్టి ఈ డ్రెస్ ఎంచుకోవాలి. పాతిక లోపు వయసు ఐతే మోకాలి వరకు ఉండేవి. ఆ వయసు దాటితే పోడవాటి గౌన్లు ప్రాధన్యత ఇవ్వాలి. బాడీ కాన్ లోనే మినీలు హై […]
రూల్స్ తప్పవు
బ్రిటన్ యువరాజు హ్యారీ పెళ్ళాడి మహరాణి అయిపోయింది నటి మేఘన్ మార్కెల్. సకల సౌకర్యాలు రాజభవనంలో నివసించవచ్చు గాని రాజ కుటుంభానికి సంభందించి ఎన్నో పద్దతులు ఉంటాయట.మేఘన్ ఎప్పటిలా హాయిగా సెల్ఫీలు తీసుకుని పోస్టులు పెట్టుకోకుడదు. సోషల్ మీడియా ఎకౌంట్ లు ఉండకూడదు. ఆటో గ్రాఫ్ లు ఇచ్చేయకూడదు. డ్రెస్సింగ్ అయితే మినీ స్కర్ట్ లు వదిలేయాల్సిందే. డిన్నర్ టైమ్ ప్రకారం షెల్ ఫిష్ ముట్టుకోకుడదు. మహారాణి కంటే ముందు నిద్ర పోకూడదు. ఫంక్షన్ లో భర్త […]
బరువు తగ్గేరు
బరువు తగ్గేందుకు తీసుకునే డైట్ లో ఈసారి బంగాళాదుంపను చేర్చుకోమంటున్నారు పరిశోధకులు. సాధరణంగా బంగాళాదుంపతో చేసే పదార్ధాలు బరువు తగ్గే క్రమంలో తీసుకోరు. కాని ఇటివల పరిశోధనలో బంగాళాదుంపలు, వీటితో చేసిన పదార్ధాలు కొద్దిగా తీసుకున్న కడుపు నిండిన భావన కలుగుతుందని కనుగొన్నారు. 40 మంది ఊబకాయులు మీద చేసిన ఈ పరిశోధన విజయవంతం అయిందని చెప్పారు. రెండు గ్రూప్ లకు బంగాళాదుంపలు, క్యారెట్లు ఇచ్చారు, బంగాళాదుంపలు తిన్న గ్రూప్ అనూహ్యంగా బరువు తగ్గిందట.
ఆరోగ్య ప్రదాయిని
పాలలో ఉండే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇంకా పరిశోధనలు జరుగుతునే ఉన్నాయి. స్వీడన్ పరిశోధకులు పాలలో ఇంకో గొప్ప గుణం కనిపెట్టారు. ప్రతిరోజు రెండు గ్లాసుల పాలతో క్యాన్సర్ కణాలు వృద్ది చెందకుండా అపేయవచ్చని చెబుతున్నారు. పాలల్లో ఉండే మిల్క్ ప్రోటీన్ క్యాన్సర్ కణాలను సమర్ధవంతంగా ఎదుర్కోంటుందని వీరి పరిశోధనలో తేలింది. పాలు కాకుండా పాలు ఆధారిత పదార్ధాలతో కూడా ఇదే ఫలితం పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
చల్లగా వద్దు
ఫ్రీజ్ లో పెడితే ఏవయిన తాజాగానే ఉంటాయి. కాని కొన్ని పదార్ధాల్లో రుచి నశిస్తూ ఉంటుంది. ఉదాహరణకు నట్స్ లో ఫ్రీజ్ లో పెడితే అందులో ఉన్న నూనె బావుంటుంది కాని రుచి పోతాయి. వీటిన్ని గాలి చోరబడని సీసాల్లో భద్రపరిస్తే చాలు. కిర దోస కూడా గది ఉష్ణోగ్రతలోనే తాజాగా ఉంటాయి. వెల్లుల్లిని బయటే ఉంచాలి. ఫ్రీజ్ లోని తేమ కు పాడైపోతాయి. తెనే అయితే ఫ్రీజ్ లో చల్లదనానికి గడ్డకట్టిపోతుంది. పుచ్చకాయ కోయకముందు గది వాతావరణంలో […]
అలసటా
తీరిక లేని పని తర్వాత ఏ పార్టీకో వెళ్లాలంటే మొఖం అలసటగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫ్రీజ్ నుంచి తీసిన చల్లని నీళ్ళతో మొఖం కడుక్కోవాలి. దీనితో ముఖం కండరాలు బిగుసుకుని మృదువుగా కనిపిస్తాయి. ఐస్ ముక్కలు వేసిన పాలతో మొఖన్ని కాసేపు రుద్దితే చర్మానికి తేమ అందుతుంది. అలాగే ఒక స్పూన్ ఫ్రీజ్ లో పెడితే చల్లగా ఐపోతుంది. ఈ స్పూన్ ను పదే పదే చల్లబరుస్తూ కళ్ళ […]
నేను స్త్రీ వాదిని కాదు
నేను స్త్రీవాదిని కాదు కాని జెండర్ ఈక్వాలిటీని నమ్ముతాను అంటుంది కరీనాకపూర్. వీర్ ది వెడ్డింగ్ సినిమా ప్రమోషన్ లో ఆమె మాట్లాడుతూ సాధరణంగా ఫెమినిజం అంటే స్త్రీ,పురుష సమానత్వం అంతమాత్రనా పురుషులను అగౌరవపరచనక్కర్లేదు. ఈ కన్ఫ్యూజన్ లేకుండా నేను ఫెమినిస్టును కాదంటున్నారు. నేను ఒక స్త్రీని అంతకంటే ముంది ఒక మనిషిని నన్ను కరీనాకపూర్ అన్న సైఫ్ భార్య అన్న నా దృష్టిలో ప్రత్యేకత ఏమిలేదు. పేరు సంభోదన ఉనికి కోసమే మాత్రమే. ఫెమిస్టును అని చెప్పుకోవడం […]
అన్ని ఒక వైపే
ఎప్పటికప్పుడు కాస్త అటుఇటుగా ఫ్యాషన్ మారినా ఏ సీజన్ లో కంఫర్ట్ బుల్ గా కనిపించే కుర్తీలు కాస్త స్టైయిల్ మార్చుకుని ఒక వైపు డిజైన్ ఉండేలాగా ఒక వైపు సాధాగా కనిపించే లాగా సింగిల్ కలర్ డిజైన్ కుర్తీలు వచ్చాయి. రెండు రంగుల డిజైన్ తో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో ఈ కుర్తీలు వెరైటీగా ఉంటాయి. అలాగే శారీ విత్ ఒన్ సైడ్ టాప్ లు వచ్చాయి. అలగే ఒక వైపు వెస్ట్రన్ గౌను ప్యార్లల్ […]
పరికిణీకి పట్టు
అందమైన పట్టు ఆధినికమైన ఫ్యాషన్ ని కూడా అందంగానే ప్రతిబింబి స్తుంది. సాధరణంగా పరికిణీలు సంప్రదాయకంగానే ఉంటాయి. బెనరస్, కంచి పట్టు లెహంగా పైకి క్రాప్ టాప్ వేసుకుంటే మోడరన్ లుక్ వచ్చేస్తుంది. ఇది ముదురు లేత వర్ణాల మేళవింపు లా ఉండాలి. సిల్క్ లో సాదా అయినా పూల డిజైన్ లెహంగా వేసుకుంటే మెడ చేతుల పై డిజైన్ ఉన్నా క్రాప్ టాప్ చాలా బావుంటుంది. కోల్డ్ షోల్డర్, స్లీవ లెస్ కూడ చక్కగా నప్పుతుంది. […]
దీర్ఘకాల యవ్వనం
ఈ సీజన్ లో దొరికే తాటి ముంజల్ని ఒక్క రోజు కూడ వదలకుండ తినండి అంటున్నారు డైటీషియన్లు. ఆరోగ్యంగా బరువు అదుపులో పెట్టుకోవాలంటే ఈ తాటి ముంజలు రుచికరమైన మార్గం అంటున్నారు. వీటిలో స్వాభావికంగా ఉండే నీటి పాళ్ళు, పుష్కలంగా ఉండే ఖనిజాలు వడదెబ్బ నుంచి రక్షిస్తాయి. వీటిలో ఉండే పెట్రో కెమికల్స్ వల్ల వయసు పైబడిన లక్షణాలు తగ్గుతాయి. దీర్ఘకాల యవ్వనం సాధ్యపడుతుంది. ముంజల్లో ఉండే పొటాషియం పాళ్ళు రక్తపోటును నివారిస్తాయి. జీర్ణ వ్యవస్థని శుభ్రపరుస్తాయి. కాలేయం […]
ఒక పదిహేను నిమిషాలు
ఉదయాన్నే ఎంత త్వరగా లేవగలిగితే అంత ప్రయోజనాత్మకంగా సమయాన్ని వినియోగించుకోగలుగుతాం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కనీసం ఏడుగంటలు నిద్రచాలు, తాజాగా ఉండే ఉదయపు గాలి ప్రశాంతంగా అతి విశ్వాసంతో ఉండేందుకు సహకరిస్తుంది. అలాగే ఒక్క పదిహేను నిమిషాలు ఏకాంతంగా ప్రశాంతంగా ఉండేందుకు కేటాయిస్తే రోజంతా ఆ ఉత్సాహం వెంటే ఉంటుంది. అ కొద్ది నిమిషాలు మనల్ని మనం సమీక్షించుకునేందుకు గమునించేందుకు పనికి వస్తాయి. ఏ పని చేయకుండా ఉదయం వేళ కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే చాలు ఒక […]
