Wednesday, 07 Oct, 2026
వాషింగ్ మిషన్స్ వచ్చాక గృహిణి కి సగం శ్రమ తగ్గిపోయింది. ఇంతగా ఉపయోగ పడే వాషింగ్ మిషన్లు అన్ని రకాల దుస్తులు వేసేస్తే రంగులు అన్నింటికీ అంటుకోవడం కాకుండా జీన్స్ వంటివి వేస్తే ముందు పోగులు పాడై వస్త్రం రంగు మారిపోతుంది. గంటల తరబడి నానపెట్టి ఉతుకుతుంటే కూడా రంగు వెలుస్తుంది. ఉతికే నీటిలో ఓ చెంచా ఉప్పు వేస్తే ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే సాక్సులున్ని మిషన్ లో వేస్తే సాగి గట్టి తనం పొందుతుంది. జిప్పులు వున్న ఏ దుస్తులైనా మిషన్ లో వేస్తే డ్రయర్ లో కి వచ్చే సరికి అవి పాడవుతాయి. టుర్కి టవల్స్ కూడా అంతే ఎక్కువ సేపు నానబెట్టినా పాడవుతాయి మిషన్ లో వేసినా పోగులు వూడి వచ్చి చాలా తొందరగా పాతవిగా అయిపోతాయి. మిషన్ లో వేసే ముందే బట్టల్ని విడదీసి బరువైనవి పొడవైనవి, రంగు అన్తుకోనివిగా చూసి పెట్టుకోవాలి.

వస్తువులతో జాగ్రత్తలు

మిక్సీ గ్రైండర్, వాషింగ్ మిషన్ లేని ఇల్లు ఉండదంటే ఆశ్చర్యం లేదు. కానీ వాటిని శ్రద్ధగా వాడుకొంటే దానికి పెట్టిన డబ్బుకు పూర్తి న్యాయం జరుగుతోంది. వాషింగ్ మిషన్ లో నిర్దేశిత బరవు మించి బట్టలు వేయవద్దు, నీరు లోపలికి తెచ్చి బయటకు తీసుకపోయే గొట్టాలు పరిశీలించుకొంటూ ఉండాలి. రబ్బర్ లో చేసిన ఏవీ వాషింగ్ మిషన్ తో శుభ్రం చేసేందుకు పడేయద్దు. ప్రతి సారి బట్టలు ఉతకటం అయ్యాక శుభ్రం చేసుకోవాలి. సౌడర్ బాక్స్ ని శుభ్రం చేయాలి. మిక్సీలో గ్రైండర్లు ఎక్కువ సేపు తిప్పవద్దు. వాడిన వెంటనే బ్లేడ్స్ శుభ్రం చేసి పెట్టుకోవాలి. ప్లగ్ కనెక్షన్ వాడేప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. వాటిని బల్లపరుపుగా ఉన్నా నేలపైన పెట్టాలి.

Leave a Reply