Thursday, 01 Oct, 2026
ఈ మధ్య కాలంలో సోయా వినియోగం పెరిగింది. సొయా పాలు చీజ్ ఎన్నో ఉత్పత్తులు మార్కెట్ లోకి వస్తున్నాయి . న్యూట్రీషన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని మహిళలకు ఎంతో ప్రయోజనాకరమని అందరు చెపుతున్నారు. దీన్నో అద్భుతమైన ఆహారం అంటున్నారు. సోయాను సహజ రూపాల్లో అంటే సోయాపిండి పాలు టోఫు ఇలా ఏ రూపంలో అయినా హాయిగా తినచ్చు. ఎలాంటి దుష్ప్రభావాల భయము లేదు. ప్రోటీన్ కు ఇది మంచి ఆధారం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇది గుండెకు మంచిదని ఎముకల్లో సాంద్రత పెంచుతుందని అలాగే ఆస్ట్రియో పోరోసిస్ రాకుండా ఏది రక్షిస్తుందని మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని గుర్తించారు. ఇది మహిళలకు నిస్సందేహంగా మంచి ఆహారం. బ్రేడ్స్ కుకీస్ వంటి బెకెడ్ ఫుడ్స్ సోయాలోని ఏ ఆహార విలువను పోకుండా తయారవుతున్నాయి. ఉదయపు ఆహారంగా సొయా తీసుకుంటే ప్రోటీన్స్ కావలిసినన్ని దక్కినట్టే . సోయాలో ఎన్నో రకాలు టెక్నీక్స్ ఎలా చేసుకోవాచ్చొ అంతర్జాలం లో వెతకచ్చు.

మేలుచేసే సోయా 

మధుమేహంతో బాధపడేవారికి సోయా ఎంతో మంచి ఆహారం అంటున్నారు పరిశోధకులు. చక్కెర వ్యాధి శరీరంలో అన్ని భాగాల పైన ప్రభావం చూపెడుతుంది ఇందుకే షుగర్ ఉన్నవాళ్లు రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచే ఆహారం తీసుకోకూడదు. అందుకే వారికి సోయా ఎంతో మేలు చేస్తుంది ఇందులో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కసారిగా కాకుండా గ్లూకోజ్ కొంచెం కొంచెం గా విడుదల అయ్యేలా చేస్తుంది. సోయా ఐరన్ రక్త ప్రసరణ శాతాన్ని పెంచుతుంది అధిక శాతంలో ఉండే జింక్ క్యాల్షియం తో ఎముకలు వృద్ధికి  తోడ్పడతాయి.

Leave a Reply