Sunday, 04 Oct, 2026
అన్నదమ్ములూ అక్కాచెల్లెళ్లు ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య చాలా తక్కువగా ఉంటుందీ అంటున్నారు. అలాగని తోబుట్టువులు భార్యాభర్తల మధ్య వచ్చే తగువులు తీరుస్తారని కాదు. ఒక్కరుగా పెరిగిన వారికంటే ఎక్కువ మందితో పెరిగిన వారిలో ప్రేమానందాలతో పాటు పంతాలు పట్టింపులూ ఆ వెనకనే పట్టువిడుపులు సర్దుబాటు జీవితంలో ఒక భాగమై పోతాయి. ఈ రకమైన నైపుణ్యాలు అలవర్చుకునేవాళ్లు వైవాహిక జీవితంలో చాలా సులభంగా సర్దుకుపోగలుగుతారు. అందుకే కుటుంబం అన్నది ఎంత ఉంటే అంత లాభం అంటున్నారు సామజిక నిపుణులు. ఆలా కాకుండా ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున పెరిగిన వాళ్లలో అన్నది ఈ రకమైన నైపుణ్యాలు తక్కువనీ వాళ్ళకి సర్దుకుపోవటం అన్నది జీర్ణం కాదనీ అందుకే విడాకుల సంఖ్యా ఎక్కవవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.

ఎలాగోలా నవ్వితేనే ఆరోగ్యం

కావాలని నవ్వినా ,నవ్వొచ్చి నవ్వినా, ఎలా నవ్వి నా సరే నువ్వు నవ్వే  దీనివల్ల మేలే జరిగేది అంటున్నారు పరిశోధకులు.నవ్వుతో  ముఖంలో కదిలే కండరాలు వల్ల మెదడులో న్యూరో ట్రాన్స్ మీటర్లు విడుదల అవుతాయని దీనివల్ల మన మనసుకి హాయిగా అనిపిస్తుందని పరిశోధనల్లో తేలింది కోవిడ్ కారణంగా ఎంతోమంది డిప్రెషన్ లోకి వెళ్ళటం ఆందోళన పడటం వల్ల ఆరోగ్యం పాడవడం గురించి చేస్తున్న పరిశోధనల్లో నవ్వుతో మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుందనీ పాజిటివ్ గా ఆలోచించే గుణం పెరుగుతుందని తేలింది. అందుకే మనసులో ఒత్తిడి అనిపిస్తే హాస్య ప్రధానమైన సినిమానో, పుస్తకాన్నో ఎంచుకుని నవ్వుతూ ఉండండి అంటున్నారు పరిశోధకులు.

Leave a Reply