Wednesday, 07 Oct, 2026
అన్నదమ్ములూ అక్కాచెల్లెళ్లు ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య చాలా తక్కువగా ఉంటుందీ అంటున్నారు. అలాగని తోబుట్టువులు భార్యాభర్తల మధ్య వచ్చే తగువులు తీరుస్తారని కాదు. ఒక్కరుగా పెరిగిన వారికంటే ఎక్కువ మందితో పెరిగిన వారిలో ప్రేమానందాలతో పాటు పంతాలు పట్టింపులూ ఆ వెనకనే పట్టువిడుపులు సర్దుబాటు జీవితంలో ఒక భాగమై పోతాయి. ఈ రకమైన నైపుణ్యాలు అలవర్చుకునేవాళ్లు వైవాహిక జీవితంలో చాలా సులభంగా సర్దుకుపోగలుగుతారు. అందుకే కుటుంబం అన్నది ఎంత ఉంటే అంత లాభం అంటున్నారు సామజిక నిపుణులు. ఆలా కాకుండా ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున పెరిగిన వాళ్లలో అన్నది ఈ రకమైన నైపుణ్యాలు తక్కువనీ వాళ్ళకి సర్దుకుపోవటం అన్నది జీర్ణం కాదనీ అందుకే విడాకుల సంఖ్యా ఎక్కవవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.

సంతోషంతో దీర్ఘయుష్షు

సంతోషం సగం బలం అన్నది కేవలం నానుడి మాత్రమే కాదు ,శాస్త్రీయంగా కూడా రుజువైంది . ఎవరైతే ఎక్కువగా డిప్రషన్ కు గురవుతుంటారో,వారి తో మిగతావారితో పోలిస్తే వార్ధక్య లక్షణాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల సారాంశం . ఈ దిగులు ,విచారం తో ఉంటె ,ఆ డిప్రషన్ హార్మోన్లు ,రోగనిరోధక వ్యవస్థ ,నాడీవ్యవస్థ వంటి అనేక శారీరక వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది జీవితంలో ఏ డిప్రషన్ కు లోనవుతున్నా వారిలో కణాలను కాపాడే టెలోగుడ్స్ తగ్గిపోతాయి ఒత్తిడి లేనివారితో మాత్రమే  ఈ టెలోగుడ్స్ ఆశాజనక పని తీరులో ఉంటున్నాయి . కనుక దీర్ఘకాలం సంతోషంతో జీవించాలి అంటే సంతోషంగా ఉంటే చాలు .

Leave a Reply