స్టార్ చెఫ్ పూజా ధింగ్రా భారతదేశపు తొలి మకరాన్ దుకాణాన్ని ప్రారంభించి బేకరీ చెయిన్ లీ 15 పటిస్సేరీ యజమానిగా మహిళ వ్యాపారవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆమెకు పేస్ట్రీ గేమ్ చేజర్ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న మొదటి ఫిమేల్ చెఫ్ గా రికార్డ్ సృష్టించింది సాధారణంగా స్టార్ హోటళ్లు పురుషులే నడుపుతారు. కానీ పూజా ధింగ్రా సాంప్రదాయాన్ని తిరగరాసింది.













