పిహు( Thriller Movie ) 

పిహు( Thriller Movie ) 

పిహు( Thriller Movie ) 

వినోద్ కప్రి తీసిన పిహు సినిమాలో రెండేళ్ల పాప మైరా విశ్వకర్మ ఒక్కతే యాక్టర్.గౌరవ భార్య పూజ భర్తతో గొడవపడి ఆత్మహత్య చేసుకుంటుంది.రెండేళ్ల పాప పిహు ఒంటరిగా ఆ ఇంట్లో తండ్రి వచ్చే వరకు ఎన్ని రకాల ప్రమాదాలకు దగ్గరగా వెళుతుంది ఈ సినిమా కథ. సినిమా చూస్తుంటే మన ఇళ్ళల్లో ఇన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా అనిపిస్తుంది. తాత్కాలికమైన ఆవేశంతో ఆత్మహత్యలు  చేసుకునే ఎంతో మంది తల్లిదండ్రులు ఒక్క నిమిషం తమ  సంతానాన్నిఎంత ఒంటరిగా ప్రపంచంలో వదిలి పెట్టి వెళ్తున్నామా అని ఆలోచించుకుంటే అసలు ఆత్మహత్యలు జరగవు. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా విశ్రాంతి గా లాక్ డౌన్ సమయం లో చూడడం మరి మర్చిపోకండి.