Sunday, 09 Aug, 2026
మిగిలిపోయిన ఆహార పదార్ధాలు, టైమ్ లేక ఉదయం సాయంత్రం కోసం ఒకే సారి వేడి చేసి తినేస్తాము కానీ అన్నింటినీ అలా వేడి చేయొద్దు అంటారు డైటీషియన్లు. బచ్చల కూర లో ఇనుము నైట్రేట్ లు పుష్కలంగా వుంటాయి. ఈ కూరను వండాక మళ్ళి నేరుగా వేడి చేయకూడదు. వేడి నీళ్ళ గిన్నెలో వుంచి వేడెక్కేలా చేయాలి. అలాగే ఉడికించి లేదా కూర చేసిన గుడ్లు కూడా మళ్ళి వేడి చేస్తే అందులోని పోషకాలు పోతయి. చికెన్ కూడా అంతే, వండాక మళ్ళి మళ్ళి వేడి చేస్తే మాంసకృతులు పోతాయి సరి కదా జీర్ణ సంబందమైన సమస్యలు వస్తాయి. బంగాళా దుంప కూర కూడా వేడి చేసి తింటే విషపదార్ధాలు శరీరంలోకి చేరినట్లే. మాంసకృతులు పుష్కలంగా అందించే పుట్ట గొడుగు కూర కూడా ఫ్రిజ్ లో వుంచి, సాయంత్రం వేడి చేసి తినాలి అని చుస్తే అనారోగ్యాలు తధ్యం . సాధ్యమయినంత వండిన కూరలు మళ్ళి మళ్ళి వేడి చేసి తినడం వల్ల నష్టమే.

ఒక్కే వంట చాలు 

ఇంట్లో ఒకేరకమైన వంట చేసిన,ఆ వంటను ఆరోగ్య కరంగా చేస్తే,ఆ వంటను ఎవరికి అవసరమైన పరిమాణంలో వాళ్ళు తీసుకొంటే సరిపోతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్ ఇంట్లో నలుగురు వుంటే నాలుగు రకాల వంటలు అక్కర్లేదు ఎవరైనా ఆరోగ్యపరంగా సరిపడని సమస్యలుంటే ఆ ఒక్కళ్ళకి వేరుగా వండచ్చు. మిగతా అందరికీ కలిపి పిండి పదార్ధాలు,మాంసకృత్తులు కొవ్వులు ,విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఇలా అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకొని వండితే చాలు. వివిధ రకాల ధాన్యాలు,పప్పులు,కాయగూరలు పాలు,మాంసం గింజలు ఇవన్నీ మన ఆహారంలో ఉండాలి. ఇలా సమతుల్యాంగా అన్ని పదార్ధాలు ఉండేలా వంట చేస్తే దాన్ని ఇంట్లో అందరు వాళ్ళకు అవసరమైన పరిమాణంలో తీసుకొంటే అంతా  ఆరోగ్యంగా ఉంటారు.

Leave a Reply