Thursday, 13 Aug, 2026
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయ వల్ల కలిగే ఉపయోగపడే లిస్టు లో ఇప్పుడు జుట్టు సంరక్షణ కూడా చేరింది. వాతావరణంలో కలిగే ఎన్నో మార్పులతో జుట్టు వుదిపోతూ వుంటుంది. ఖరీదైన వైద్యాలకి కూడా లొంగని పక్షంలో ఉల్లిపాయ వైద్యం వైపు చూడొచ్చు. ఉల్లిపాయ వాసన భరించడం కాస్త కష్టమే కానీ అందమైన జుట్టు కావాలంటే ఆ కష్టం భరించాలి. ఉల్లిపాయ ముక్కలు కోసి మెత్తగా గ్రయిడ్ చేసి ఉల్లి రసం తీసుకోవాలి. కుదుళ్ళ లోపల దాకా పట్టించి ఓ అరగంట పాటు ఆరనిచ్చి ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే ఫలితం తెలుస్తుంది. అలాగే ఉల్లిపాయ రసం లో తేనె కలిపి ఈ మిశ్రమం తలకు అప్లయ్ చేసి ఆరనిచ్చి ఈ ఉల్లిపాయ లోనే కొబ్బరి నూనె కలిపి తలకు మసాజ్ చేసే కొంతసేపయ్యాక తలస్నానం చేసిన ఫలితం బావుంటుంది. ఉల్లి రసంలో రమ్ కలిపి ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. తెల్లవారాక ఈ రసం తలకి పట్టించి స్నానం చేస్తే చాలా మంచి ఫలితం వుంటుంది. ఏ రకంగా వాడినా వట్టి ఉల్లిరసం లో నైనా ఫలితం మాత్రం అద్భుతంగానే వుంటుంది.

నేరుగా వాడకండి

ఉల్లి రసంతో జుట్టు కు మంచి పోషణ అంటున్నారు ఎక్స్పర్ట్స్.ముందుగా ఉల్లిపాయలు మెత్తగా రుబ్బి ఆ మిశ్రమాన్ని మెత్తని తెల్లని వస్త్రంలో వేసి ఓ డబ్బాలో పెట్టాలి దాన్ని ఫ్రిజ్ లో ఉంచి గంట తర్వాత తీసి,రసం పిండుకోవాలి. దీన్ని తేనె, కొబ్బరి నూనె,కీరదోస రసం ,ఆముదం, కలబంద గుజ్జు వంటివి కలిపి వాడుకోవాలి. లేకపోతే ఉల్లి రసం నేరుగా వాడితే మాడుని ఇరిటేట్ చేస్తుంది.వాసన ఘాటుగా ఉంటుంది కనుక రెండు చుక్కలు సువాసన ఇచ్చే ఎస్సెన్షియల్ ఆయిల్ కలిపి రాసుకోవచ్చు.జుట్టు రాలుతుంటే ఈ ఉల్లి రసానికి ఓ స్పూన్ తేనె కలిపి జుట్టుకు రాసుకుని పావుగంట ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Leave a Reply