Monday, 05 Oct, 2026
కేశ సంరక్షణ కోసం ఉపయోగపడే ఏడు అద్భుతమైన మూలికలున్నాయి. ఒకటి వేప అశ్వ గంధ ఉసిరి బంతి పూలు మెంతులు త్రిఫల తులసి ఈ ఏడు చాలా శక్తి వంతంగా శిరోజాల సంరక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. వేప ఉసిరి హెయిర్ ఆయిల్స్ జుట్టుకు పట్టించే ప్యాక్ లో ఎక్కువగానే వాడతారు. త్రిఫల తైలం పొడి దొరుకుతాయి. అశ్వ గంధ ను డాక్టర్ సలహాలతోనూ మెంతులు బంతిపూలు తులసి ఎలాంటి సందేహం లేకుండా జుట్టు పోషణ కోసం హాయిగా వాడుకోవచ్చు. ఏ రకంగా జుట్టుకు ప్యాక్ వేసినా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. మూలికా చికిత్స విధానమైన ఆయుర్వేదం లో కేశ సంరక్షణ కోసం వాడే మూలికలు ఇవే. జుట్టు వూడి పోతుందని ఆదుర్ధా పది ఆ టెన్షన్ తో మరింత జుట్టును పోగొట్టు కోకుండా ఈ ప్రాచీన మూలికలను వాడి చూడండి.

మందార తో జుట్టుకు పోషణ 

అందానికి రూపం కట్టినట్లు కనిపించే మందారపూల చర్మం జుట్టు కి తగిన పోషణ ఇస్తాయి జుట్టు రాలిపోతుంటే మందార పూలు ఎండ బెట్టి పొడి చేసి కొబ్బరి నూనె మూడు వంతులు పావు వంతు ఆముదం కొన్ని మెంతులు కలిసి మందారపూలు పొడి కలిసి , మందార పువ్వుల పొడి కలిపి మరగనివ్వాలి. ఇది సగం అయ్యే దాకా మరిగాక  ఈ నూనె ను ఆరబెట్టి సీసాలో పోసుకుని ప్రతిరోజు రాసుకోవాలి ఇలా చేస్తే ఊడిన జుట్టు తిరిగి వస్తుంది .మందార పూలు వేసి మరిగించి నీళ్లలో రెండు చుక్కల లావెండర్ ఆయిల్ కలిపి తలస్నానం చేస్తే వీటిలోని సుగుణాలు చర్మాన్ని తాజాగా చేస్తాయి.మందార ఆకులు మెత్తగా నూరి ఇందులో కలబంద రసం ఆలివ్ నూనె కలిపి తలకు ప్యాక్ లా వేసుకొని అరగంట ఆరిపోయాక తలస్నానం చేయాలి ఇలా చేస్తే జుట్టుకు పోషణ అంది ఆరోగ్యంగా మారుతుంది.

Leave a Reply