Wednesday, 07 Oct, 2026

కలిసి కలకాలం జీవించండి

ఏ బాంధవ్యం అయినా చక్కగా పెంచి పోషిస్తేనే పదికాలాల పాటు నిలబడుతుంది. ముఖ్యంగా భార్యభర్తల బంధం దృఢంగా ఉండాలంటే ఇద్దరూ కలసి దాన్ని పోషించాలి. మూడో వ్యక్తి జోక్యం వల్లనే చాలా వైవాహిక బంధాల్లో అపశృతులు దొర్లుతాయి. ఇందుకు మూడో వారి ప్రభావం వారిపై ఉండటమే కారణం .ఎవరి తల్లిదండ్రులు,తోబుట్టులను తమ మధ్యకు తెచ్చుకోకూడదు.ఏవైనా సమస్యలుంటే భార్య భర్తలే పరిష్కారించుకోవాలి. కానీ ఇతర కుటుంబ సభ్యుల జోక్యం వద్దు.ఒక నిర్ణయం తీసుకోవటంలో ఎవరి ప్రభావం ఉండకూడదు. సాధారణంగాఎవరి తల్లి దండ్రులు వాళ్ళ పిల్లల పక్షాన్నే ఉంటారు. కనుక వారి జోక్యం భార్యభర్తల సమస్య మరింత ముదిరే అవకాశాలు ఉంటాయి.

Leave a Reply