ఇస్లామిక్ ఫ్యాషన్ వస్త్రాలు
మొరాకో వారసత్వ మూలాలు ఉన్న సల్మా తహ్రీ అరేబియన్ గుర్రపు స్వారి నీ విలువిద్యా సంప్రదాయాన్ని ఇస్లామిక్ వస్త్రధారణను కలిపి ‘ఫిల్లీ ప్యారిస్’ అనే ఫ్యాషన్ బ్రాండ్ ను స్థాపించింది. ఫ్రాన్స్ లో పుట్టిన మోరాకో అమ్మాయి సల్మా.మొరాకో సంస్కృతి తో ముడిపడ్డ అరేబియన్ గుర్రపు స్వారి చేసేటప్పుడు వాటి రాజసం ఔన్నత్యం ప్రతిబింబించే సౌకర్యవంతమైన దుస్తులు ఆమె ఫ్యాషన్ బ్రాండ్ లో తయారవుతాయి .నల్లని నికాబ్ పాలిష్ చేసిన రైడింగ్ బూట్లు, లెదర్ గ్లోవ్స్ ఇవన్నీ ఆమె డిజైన్ లో వస్త్ర కళలో భాగాలు. ఓగ్ తన ఫ్యాషన్ మ్యాగజైన్ ఫోటో ఫీచర్ కోసం సల్మాన్ ఎంచుకుంది. ఆమె తయారు చేసే దుస్తులలో సంక్లిష్టమైన జామెట్రీ ఆకృతులు చేత్తో తీర్చిదిద్దిన బంగారు ఆభరణాలు డిజైన్లు ఆమె పుట్టుకతో తెచ్చుకున్న సంస్కృతి వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ మడోనా ఆమెతో గుర్రపు స్వారీ చేయాలని కోరుకొన్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో అశ్వ సుందరిగా ఈమెను వర్ణిస్తారు.
