Wednesday, 30 Sep, 2026
సపోటా ని తియ్యని పండే అనుకుంటాం కదా. కానీ ఈ పండు శిరోజాలను దృష్టినీ పరిరక్షిస్తుంది. నడుము కొలతల్ని సమంగా ఉంచగలుగుతోంది. బరువు తగ్గాలని ప్రణాళిక వేసుకున్నా వాళ్ళకి ఇది మంచి ఆహారం. సపోటా లో ఎక్కువ శాతం పీచు కూడా వుంది. అంచేత దాన్ని భోజనానికి ముందు తీసుకోవటం వల్ల ఉదర ఎంజైమ్ల విడుడలను క్రమబద్దీకరించటంలో సహకరిస్తుంది. సపోటా జ్యూస్ లోకి విటమిన్ సి జుట్టు కుదుర్లు సరిచేసి ఎదుగుదలకు సహకరిస్తుంది. సపోటా లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్లు ఎ,సి ఇ లు ఖనిజాలు పొడిచర్మానికి తగిన తేమ అందిస్తాయి. చర్మం సహజ టెక్చర్ ను కాపాడి కాంతివంతంగా ఉంచ గలుగుతుంది. సపోటా జ్యూస్ ఎనెర్జీ డ్రింక్. ప్రాక్టోజ్ సుక్రోజ్ లాంటి చక్కెర లు శరీరానికి తక్షణ శక్తి ఇస్తాయి. ఉదయం వేళ సెరల్స్ లో మధ్యాహ్నం లంచ్ లో సపోటా కలుపుకంటే చాలినంత శక్తి వస్తుంది. విటమిన్ ఎ పుష్కలంగా వుండి కంటి దృష్టి బావుండేలా చేస్తుంది. రోజుకు సపోటా తప్పకుండా తింటే ఎంతో ఆరోగ్యం ఇది సౌందర్య ఫలం.

హ్యాపీ ఫుడ్

సపోటా ను హ్యాపీ ఫుడ్ అంటారు వీటిని తింటే చర్మకణాలు మెరుగవుతాయి. జుట్టు రాలటం అదుపులో ఉంటుంది. జుట్టు పెరిగేందుకు ఉపయోగపడే కొల్లాజెన్ ఉత్పత్తి పెంచే గుణం సపోటాల్లో ఉంది. సపోటాలు డైటింగ్ చేసే వాళ్ళు తింటూ ఉంటారు ఇవి బరువు తగ్గిస్తాయి. ఐరన్ కంటెంట్ ఎక్కువ బ్లడ్ ప్రెజర్ ను నియంత్రించే గుణం ఉంది. వీటిలో తీయనైన ఫ్రక్టోజ్ ఉంటుంది. ఈ తీపిదనం తాజా శక్తినిస్తుంది వీటిలో ఎ,సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. కంటికి మేలు చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సీజన్ లో వచ్చే సపోటాలు ప్రతిరోజు  రెండయినా తినాలి.

Leave a Reply