సంపన్న మహిళ మహిమా దాట్ల
మహిమా దాట్ల లండన్ లోని వెబ్స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ల్లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. భారత ఔషధ రంగంలో తనదైన ముద్ర వేశారు మహిమ. తాతలై న జి ఏ ఎన్ రాజు, డివికే రాజు 1953లో నెలకొల్పిన బయోలాజికల్ ఇ లిమిటెడ్ కంపెనీకి సీఈఓ గా మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2001లో కంపెనీలో చేరి తయారీ నాణ్యత ప్రాజెక్టు నిర్వహణ వంటి విభిన్న రంగాల్లో అధ్యయనం చేశారు.2013లో మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు ఎన్నో రకాల టీకాలు తయారు చేసి యునిసెఫ్ వంటి సంస్థలకు సరఫరా చేసి ఈ కంపెనీ అంతర్జాతీయ గుర్తింపు పొందింది.కోవిడ్ సమయంలో ఈ సంస్థ కోర్బావ్యాక్స్ టీకాలు అందించింది. మహిమ ఆస్తి విలువ సుమారు 28 వేల కోట్లు.తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్న మహిళగా ఈమె గుర్తింపు పొందారు. అత్యంత శక్తివంతమైన వంద మంది మహిళల తో ఫార్చ్యూన్ విడుదల చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి మహిమ పేరు చోటు చేసుకున్నది.
