వందలో ఈ నలుగురు
వారసత్వ వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించి నాయకురాళ్ళు గా ఎదిగిన వందమంది మహిళలతో ఈ ఏడాది ఫార్చ్యూన్ విడుదల చేసిన జాబితాలో అపోలో సిస్టర్స్ కూడా ఉన్నారు. ప్రీతా రెడ్డి,సునీత రెడ్డి,సంగీతారెడ్డి,శోభన కామినేని ఈ నలుగురు తండ్రి వారసత్వాన్ని అందుకుని అపోలో కి నాలుగు స్తంభాలు గా నిలిచారు. అపోలో ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. 76 ఆస్పత్రులు 7వేల పైగా ఫార్మసీలతో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ హెల్త్ కేర్ చెయిన్ గా అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ని నిలిపారు . ప్రీతా రెడ్డి ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్, సునీత ఎండి ,శోభన ప్రమోటర్ డైరెక్టర్,సంగీత జాయింట్ ఎండి హోదాలో అపోలో నడిపిస్తున్నారు. క్వాలిటీ, ఫైనాన్స్, ఇన్నోవేషన్ పార్ట్నర్ షిప్,విభాగాలను ఒక్కొక్కరు విజయవంతంగా నిర్వహిస్తున్నారు.బలమైన నాయకురాళ్ళు గా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకొని 2021 ని నుంచి మోస్ట్ పవర్ఫుల్ విమెన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
