Wednesday, 07 Oct, 2026
ఇప్పటికీ మహారుచికరమైన పదార్ధాల్లో వేడన్నం లో పప్పులో నెయ్యి కలుపుకోవటం కూడా మొదటివరసలో వుంటుంది. నెయ్యంత రుచి సనాతన భారతీయ సిద్ధాంతం నెయ్యి మంచిదని మొత్తుకున్నా మనం కవన్నీ భయం వేసి తినం. కానీ ఆయుర్వేదంలో నెయ్యికి రసాయనమానేపేరుంది. అంటే రోగనివారిని అని అర్ధం. నెయ్యి కొవ్వు కాదు అది మజ్జిగ చిలికి తీసిన మృదువైన అమృతం నెయ్యి నెలల తరబడి నిలవుంటుంది. సువాసనలు వెదజల్లే తూనే ఉంటుంది. రోజూ తప్పని సరిగా నెయ్యి తినమని చెపుతోంది ఆయుర్వేదం మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణం అయ్యేందుకు నెయ్యి ఉపయోగ పడుతుంది. నెయ్యిలోని బీటాకెరోటిన్ విటమిన్ ఇవి మంచి ఆక్సిడెంట్లు నెయ్యి మెదడుకు మీలు చేస్తుంది . అలాగే జీర్ణకోశం లోని మ్యూకస్ పొరను రక్షించేందుకు కూడా నెయ్యి ఉపాయాగపడుతుంది. నెయ్యి కొంచమైనా ఆహారంలో కలుపుకోవటం ఆరోగ్యమే రుచికరమే.

చర్మ రక్షణకు నెయ్యి

నెయ్యి ఆరోగ్యానికే కాదు చర్మ రక్షణకు ఉపయోగం అంటారు ఆయుర్వేద వైద్యులు. నెయ్యి లో ఉండే ADEK విటమిన్లు చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు కావలసిన పోషకాలు ఇస్తాయి. క్రమం తప్పకుండా చర్మంపై రాస్తే మచ్చలన్ని పోతాయి. పెదవులు ఎండిపోయి పోట్టు రాలి పోతున్నట్లు అనిపిస్తే నెయ్యి రాయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. నిద్రపోయే ముందర పెదవులకు నెయ్యి రాస్తే  ఉదయానికి మెత్తగా ఉంటాయి. వాటర్ ప్రూఫ్ మేకప్ వంటివి తొలగించాలంటే నెయ్యి వాడచ్చు. వంటింట్లో పని చేస్తూ ఉంటే గరుకు బారిన వేళ్ళకు నేతితో మర్దన చేస్తే మృదువుగా మారిపోతాయి. నెయ్యి చర్మపు పొరల్లోకి చొచ్చుకు పోతుంది. దీని వల్ల చర్మం నిగనిగలాడుతుంది.

Leave a Reply