Sunday, 04 Oct, 2026
రోజుకో గుప్పెడు నట్స్ తినండిఅని చెపుతూనే వుంటారు డాక్టర్లు. జీడిపప్పు, కిస్ మిస్, బాదాం మనం తీసుకునే గుప్పెట్లో చేరుస్తాం కానీ మరచి పోయే ముఖ్యమైన పోషకాలతో కూడిన వాల్ నట్స్ వైపుకి కళ్ళు పోనియము. చదువుకునే వయస్సు పిల్లలకు ఇవెంతోమంచివి. చూసేందుకే ఇవి మెదడు పనితీరు చురుకుగా ఉంచుతాయి. వీటిలోని ఎసెన్షియల్ ఫ్యాటి ఆమ్లాల వల్లనే పిల్లల్లో ఏకాగ్రత మెరుగు పడుతుంది. మతి మరుపు సమస్య కూడా దగ్గరికి రాదు. మంశాకృతులు, పిండి పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు, అధిక మోతాదులో లభిస్తున్నాయి. వీటిని తినడం వల్ల ఆ పోషకాలన్ని శరీరంలో జీవక్రియ పని తీరుని మెరుగు పరుస్తాయి. శరీరం లోనికి చెడు కోలెస్ట్రోల్ శాతం కూడా తగ్గుతుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు. మోనో సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, మేలు చేసే కొలెస్ట్రోల్ అందిస్తాయి. హృదయానికి రక్త సరఫరా సక్రమంగా జరిగే లా చూస్తాయి. వాల్ నట్స్ లోని పోషకాలు ఎముకలు ద్రుధంగా ఉండేందుకు తోడ్పడతాయి. జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇవి రోజుకు ఐదు తీసుకున్నా చాలు. వీటిలోని పాలీ సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల ఆకలి వేయదు.

ఇవి సూపర్ ఫుడ్

పోషక విలువలు సమృద్ధిగా ఉండే వాల్ నట్స్  ఎన్నో రోగాలను నియంత్రిస్తాయి.మధుమేహం నియంత్రణలో ఉంచడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.వీటిని నానబెట్టి నిద్రపోయే ముందు భోజనంలో తింటే వాటిల్లోని మెలటోనిన్ హార్మోన్ క్రమపద్ధతిలో వచ్చేలా చేస్తుంది.వాల్ నట్స్ లో విటమిన్లు ప్రోటీన్లు, ఫ్యాటి ఆమ్లాలు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్ వంటి ఎన్నో పోషకాలు లభ్యం అవుతాయి.30 గ్రాముల వాల్ నట్స్ లో 190 క్యాలరీలు లభిస్తాయి.అందుకే దీన్ని పవర్ ఫుడ్ అంటున్నారు.ప్రతిరోజు తింటే ఆస్త్రీయో పోరాసిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

Leave a Reply