Friday, 16 Oct, 2026
ఎప్పుడూ ఒకే రకమైన శరీర లావణ్యం వుండదు. వయస్సు పెరుగుతున్నా, పిల్లలు పుట్టినా కొద్ది పాటి మార్పులు వస్తాయి. కాస్త పొట్ట ఉచ్చేత్తుగా కనబడటం ఇబ్బంది పెట్టే విషయాల్లో ఒక్కటి. కొద్ది జాగ్రత్తలతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు, పొట్ట కనిపించకుండా బెల్ట్ ఉపయోగించవచ్చు. దాన్ని పొట్ట పై భాగంలో, ఛాతీకి కిందగా వుంచుకోవాలి. అలాగే పెద్ద పువ్వులున్న టాప్ ఎంచుకోవాలి. బిగుతుగా వుండే దుస్తుల జోలికి వెళ్ళక పోవడం మంచిది. మంచి రంగులు ఎంచుకోవచ్చు. ముదురు రంగు దుస్తులు కాస్త వదులుగా వున్నవి పొట్ట కనిపించనీయావు. నిలువు చారలున్న టాప్ ఎంచుకోవడం మంచిది. పొడవాటి రంగు రంగుల మెరిసే టాప్ లు, టైట్ గా వుండే లెగ్గింగ్స్ వేసుకోవచ్చు. ఈ మార్పుల వల్ల ఆకృతి తేడా తెలుస్తుంది.

ఇది కాలేజ్ స్టయిల్

ఎప్పుడు ఫ్యాషన్ లుక్ లో ఉండాలంటే ప్రయోగాలు చేయాలి . అమ్మాయిలు ఈ విషయంలో ఎప్పుడు ముందుంటారు . క్రాఫ్ టాప్ కు జెనికా ప్యాంటు హ్యూబ్ చేసి జావర్ సైడ్డు కళ్ళద్దాలు ,ప్లిప్ ప్లాట్ చెప్పులు వేసుకొన్నారనుకొందాం . లుక్ పూర్తిగా మారిపోదా . లెగ్గిన్స్ వేసుకొని పూవుల టాప్ చెప్పులకు స్టడ్స్ తో సింపుల్ లుక్ ఇచ్చేయచ్చు కదా . ఇక నలుపు జీన్స్ పైన సాదా టీ షర్టులు ,లేత నీలిరంగు పైన పూలప్రింట్లు షర్టులు ,పోల్కడట్ ప్రింట్లు ,డబుల్ లేయర్డ్ పై స్లిమ్ టాప్ లు ఏ కాంబినేషన్ అయిన అదర గొట్టేయచ్చు . కానీ బిన్నంగా ఎంచుకోవాలి . డ్రస్సే స్టయిలే స్టేట్ మెంట్ కదా .

Leave a Reply