Sunday, 04 Oct, 2026
శరీరానికి మంచి చేస్తాయనో, నిపుణులు చెపుతున్నారనో కష్ట పడి పచ్చి కూరగాయాలు తినాలని ప్రయత్నిస్తాం. కారెట్ తో ఆగిపోతూవుంటుంది మన వ్రతం. కానీ పచ్చి కూరగాయలు మంచ్ చేస్తాయని అనుకోవడం దండగే పలు పరిశోధనలు చెప్పుతున్నాయి. పచ్చి కూరలు ఎంత కడిగినా వాటి పైన సుక్ష్మ జీవులు నసించవు. అంచేత వాటిని ఆరోగ్యకరమైన పద్దతిలో వండితే పచ్చి వాటికంటే మేలు చేస్తాయి. కూరగాయలు అతిగా నూనెలో వేయించడం,మసాలాలు దట్టించి మైళ్ళ కొద్ది సువాసనలు వచ్చేలా వండటం చేయకుండా కొద్ది పాటి నూనె లేదా ఆవిరిపైన వుడికించడం మేలు అంటున్నారు. టొమాటో, కారెట్, క్యాబేజీ, మిర్చీ వంటివి పచ్చిగా కంటే కొంచం ఉడికాక తింటేనే ఎక్కువ పోషకాలు శరీరానికి లభిస్తాయి అంటున్నారు పరిశోధకులు. నాన బెట్టి, పచ్చిగా కట్ చేసి తింటే మంచి దనుకోవడం కేవలం అపోహే అంటున్నారు.

ఈజీ కుకింగ్ 

వంట తొందరగా అయ్యేందుకు కొన్ని చిట్కాలు  పాటించవచ్చు కూరలు వండేందుకు వెడల్పాటి పాన్ బదులు చిన్న పాన్ తీసుకోవాలి.చిన్న పాన్ మంట బాగా తగిలి వంట తక్కువ సమయంలో పూర్తవుతోంది.కూరగాయలు చిన్న ముక్కలుగా కోస్తే అవి తొందరగా ఉడుకుతాయి.ఫ్రిజ్ లో ఉంచిన కూరగాయలు పన్నీర్ వంటివి వంట కు ముందే తీసి బయట పెట్టాలి. వండే సమయానికి వాటి చల్లదనం తగ్గుతుంది.వంట కు ముందే ఓవెన్  ఆన్ చేసి టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. అపుడు ఓవెన్ లో బేకింగ్ లేదా రోస్టింగ్ చేయాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉంచుకోవాలి. దీనితో తక్కువ సమయంలోనే బేకింగ్ రోస్టింగ్  పూర్తివుతుంది గ్రేవీ కూర వండేటప్పుడు ముందే వేడి చేసి పెట్టుకొన్న నీళ్లు పోస్తే కూర తొందరగా అవుతోంది.

Leave a Reply