Friday, 16 Oct, 2026
ఎంత మంచి అంశమైన అతిగా దాని జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. అతి ఎప్పుడూ అనర్ధదాయకమే త్వరగా నజుగ్గా అయిపొతాం అనుకుని అదే పనిగా విభిన్న వర్కవుట్ పద్దతులను అనుసరిస్తూ వుంటే దాని వల్ల హాని జరుగుతుంది. వారానికి ఐదు రోజులు, ౩౦-45 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తే చాలు. అంతకంటే ఎక్కువ వత్తిడితో బ్రిస్క్ వాక్ చేస్తే వ్యతిరేక ప్రభావం ఉంటుందంటారు నిపుణులు. మోడరేట్ వర్కవుట్ల తర్వాత ఇమ్యునిస్టం పూర్తిగా రికవర్ కావటానికి 72 గంటల సమయం పడుతుంది. వర్క్ ఔట్ షెడ్యుల్ కు చాలినంత రికవరీ సమయం కేటాయించాలి. దీని వల్ల కల్న్దరాళ్ళు రిలాక్స్ అయ్యేందుకు అవకాశం వస్తుంది. ఇమ్యూన్ సపోర్టింగ్ పోషకాలు. యాంటీ ఆక్సిడెంట్స్ ఆహారం ద్వరా తీసుకోవాలి. విటమిన్-సి అధికంగా వుండే పదార్ధాలు తీసుకోవాలి.

ఆరోగ్యం కాదు అపాయం

వాకింగ్ చేయటం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. అయితే ఈ వాకింగ్ ఎక్కడ చేస్తున్నారో చెక్ చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పచ్చగా ఉండే పార్కులు వాకింగ్ ట్రాక్ లో ఎంపిక చేసుకొని నడవాలి. ఆ పరిసరాల్లో ఉండే చెట్లతో తాజా గాలి పీల్చుకొనే అవకాశం ఉంటుంది. అంతే కాని రోడ్డు మార్జిన్ లతో ట్రాఫిక్ ఉన్న ప్రదేశాల్లో వాకింగ్ అస్సలు చేయకూడదు.ఇలాంటి చోట్లలో విపరీతమైన కాలుష్యం ఉంటుంది. దుమ్ము ధూళి,శబ్దాలు, వీటన్నింటితో ఆరోగ్యం మాట అలా ఉంచి లేని పోని అనారోగ్యలు వస్తాయి జాగ్రత్తా అంటున్నారు.

Leave a Reply