Wednesday, 30 Sep, 2026
ముత్యాల నగలు ఎప్పటికీ మారని ఫ్యాషన్. ముత్యాల మెరుపు తగ్గకుండా కొత్తగా మెరవాలంటే తగిన జాగ్రత్తలు కావాలి. మేకప్ పెర్ఫ్యూమ్ వంటివి అప్లయ్ చేశాకే నగలు ధరించాలి. అలాగే రాత్రికేక హ్యాండ్ బాడీ క్రీమ్ రాయటానికి ముందే ముత్యాల నగలు ఉంగరాలు తినేయాలి. వాటిని మెత్తని వస్త్రంలో తుడవాలి. బాగా ఆరనివ్వాలి. అలాగే ముత్యాలను మురికి పట్టాయనిపిస్తే మెల్ట్ సోప్ నీరు కలిపి శుభ్రపరచాలి. అమ్మోనియా లేదా డిటర్జంట్స్ కలిపిన నీళ్లతో ముత్యాలు శుభ్రం చేయకూడదు. అల్ట్రాసోనిక్ క్లీనర్ తో కూడా ముత్యాలు ఆభారణాలు ఉంచవద్దు . బరకగా వుండే వస్త్రంతో శుభ్రం చేయవద్దు. వీటివల్ల ముత్యపు పైపొర పాడవుతుంది. ఈ పోర పోతే ముత్యాలు మాములు పూవుల్లా కనిపిస్తాయి . మిగతా ఆభారణాలతో కలిపి ముత్యాల నగలు ఉంచకూడదు. సులువుగా వీటిపైనా గీతాలు పడతాయి. ముత్యాల నగల కోసం ప్రత్యక జ్యూవెలరీ బాక్స్ వాడటం మంచిది.

అందంగా ముత్యాలు

చీరెకట్టు కైనా ఆధునిక దుస్తులపై నా ముత్యాల నగలు బావుంటాయి మెలికలు తిరిగి నట్లు ఉండే టాంగిల్డ్ పర్ల్ నెక్లెస్ లు ఇటు చీరెలు అటు చుడిదార్ లకు రెండింటికీ బావుంటాయి. చీరెల పైకి పొడవాటి నెక్లెస్ లు మ్యాచింగ్ పెద్ద సైజు ముత్యాలు నెక్లెస్ లు మ్యాచింగ్ పెద్ద సైజు ముత్యాలు నెక్లెస్ లు పట్టు, బనారస్ చీరెల పైకి బావుంటాయి. కాయిన్ షేప్ పర్ల్ నెక్లెస్ లు మోడ్రన్ దుస్తులు బోల్డ్ ప్రింట్ ఉండే ఫ్యాన్సీ చీరెలకు బావుంటాయి. అందరిలో ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటే గోల్డ్ పర్ల్ సెట్ ధరించాలి. ఇది ప్రస్తుతం సెలబ్రిటీలు  అనుసరిస్తున్న ఫ్యాషన్ ట్రెండ్.

Leave a Reply