Friday, 31 Jul, 2026

ఆమె గీతల్లో పిల్లలకు విద్య

రూబుల్ నాగి ఒక చిత్రకారిణి.చదువుకు దూరమైన నిరుపేద పిల్లల కోసం మురికి వాడల  లోని గోడలను పిల్లలకు పాఠాలు చెప్పే స్కూల్ గా మార్చింది.ఒక గోడ మీద అక్షరాలు మరొక గోడ మీద అంకెలు ఇంకొక గోడమీద సైన్సు ఆరోగ్యం పరిశుభ్రత పర్యావరణానికి సంబంధించిన రంగురంగుల బొమ్మలు వేసింది.ఆ గోడల దగ్గరే నిలబడి పిల్లలకు పాఠాలు చెప్పింది.30 మందితో మొదలైన ఆ పాఠశాల వందలాది ప్రాంతాలకు విస్తరించింది. పాఠశాల ముఖమే చూడని పిల్లలను చదువు వైపు నడిపించింది రూబుల్ నాగి.ఆమె శిక్షణ కేంద్రాల్లో చదువుకున్న పిల్లలు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పట్టాలు సంపాదించారు మరికొందరు సివిల్ సర్వీస్కు సిద్ధం అవుతున్నారు మరికొందరు భారత సైన్యంలో అధికారులుగా చేరేందుకు శిక్షణ తీసుకుంటున్నారు.ఈ అద్భుతమైన కృషికి గుర్తింపుగా ఆమెకు గ్లోబల్ టీచర్ ప్రైజ్ లభించింది.. దాదాపు కోటి రూపాయల వరకు వచ్చిన డబ్బుతో ఆమె నిరుపేద పిల్లలకు ఉచితంగా పూర్తి విద్య అందించే సంస్థ ను నిర్మించడం గురించి ఆలోచించింది.మురికి గోడలను బడి గా మార్చిన తమ టీచర్ కు గౌరవపూర్వకంగా తమ చదువునే కానుకగా ఇచ్చారు పిల్లలు.

Leave a Reply