Wednesday, 05 Aug, 2026
నెలసరి ముందు నుంచే కొందరికి భావోద్వేగాల పరమైన చిరాకు కోపం వంటి సమస్యలు వేధిస్తాయి. ఈ సమయంలో నడుము, కాళ్ళ నొప్పులు భాదిస్తాయి. పొట్ట ఉబ్బరంగా వుంటుంది. ఏమీ తినాలి అనిపించదు. వీటి నుంచి ఉపసమనం కోసం ముందుగా రిలాక్స్ అవ్వాలి. విశ్రాంతి తీసుకొన్న గదిలో ఒక మూల తాజాగా వాసనలోచ్చే ముంచి పూల గుత్తిని వుంచుకోవాలి. పరిమళాలు మనస్సుకి ఆహ్లదాన్ని ఇస్తాయి. అలాగే మంచి సువాసన వచ్చే కోవొత్తి వెలిగించినా పర్లేదు. నొప్పుల ఉపసమనానికి హీటింగ్ ప్యాక్స్ దొరుకుతాయి. వాటితో వేడి నీళ్ళు కాపడం ఉపసమనం. అలాగే భోజనం విషయంలో చిన్ని మార్పులు చేసుకోవాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. నీటి నిల్వలు తగ్గకుండా తరచుగా నీటిని తాగాలి. అచ్చంగా నీళ్ళు తాగలేక పొతే ఆ నీళ్ళ సీసాలో పుదీనా ఆకులు, కిరోసిన్ ముక్కలు వేస్తె బావుంటాయి.

ఇక పీరియడ్ లీవ్

పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకున్నాం.ఇక మొదట మా సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులు సంవత్సరానికి పది రోజులు లీవ్ తీసుకోవచ్చు అని జొమాటో కంపెనీ సిఈఓ దీపేందర్ గోయల్  ప్రకటించారు.ఈ సౌలభ్యంతో జొమాటో లో పనిచేసే మహిళా ఉద్యోగులకు రెగ్యులర్ సెలవులతో పాటు మరో పది రోజులు అదనపు సెలవు దొరికింది.జొమాటో భారతదేశంలో గురుగావ్ లో మొదలై ఇవ్వాళ 24 దేశాల్లో సేవలు అందిస్తోంది.ఆ సంస్థలో ఐదు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Leave a Reply