చురుకు దనం కోసం
రోజంతా ఆఫీస్ లో జాబ్ చేసే ఉద్యోగినులకు సాధారణంగా వ్యాయామానికి సమయం ఉండదు . అయితే ప్రతిగంటా ,గంటన్నరకు ఒకసారి స్ట్రెబ్బింగ్ వ్యాయామం చేయమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మోకాళ్ళు వంచకుండా ముందుకు వంగి పాదాల్ని పట్టుకోవాలి . మెడ కుడి , ఎడమకు తిప్పటం ,చేతులను సవ్య ,అపసవ్య దిశల్లో తిప్పటం వంటివి చేసినా చాలు . సాయంత్రానికి కండరాలు పట్టేయకుండా ఉంటాయి . అలాగే వత్తిడిగా ఉంటే కాస్సేపు చేస్తున్న పని అవతల పెట్టి […]
ఆమెది గొప్ప మనసు
త్రిసూర్ సమీపంలోని ఇరింజల్ కుర్ మహిళా పోలీస్ స్టేషన్ లో సీనియర్ ఆఫీసర్ గా పనిచేసే అపర్ణ లవ్ కుమాన్ ఒక కాన్సర్ భాదిత బాలిక విష్షు కోసం తన పొడవాటి జడ కత్తిరించి ఇచ్చారు . మూడేళ్ళ క్రితం తొలిసారి గా ఆమె జుట్టు దానం చేశారు . ప్రజలకు అధికంగా సాయం చేసే స్థితికాదు నాది . అందుకే కొందరి పిల్లల మొహాల్లో నవ్వూ చూసేందుకు ఈ పనిచేశాను అంతేనన్నారు . ఆమె దారిలో […]
మేలుచేసే ముల్లంగి
ముల్లంగి దుంప పంట . సలాడ్ లాగా ,పచ్చిగానే తినచ్చు దీని నుంచి లఖించే మెథనాల్ బరువు తగ్గించ గలుగుతుంది . ముల్లంగి తో అనేక పోషకాలు ప్రయోజనాలు ఉన్నాయి . శరీరంలో వ్యర్దాలను వెలికి పంపటంలో తిరుగులేకుండా పనిచేస్తుంది . క్యాన్సర్ కణాలను వృద్ద చెందకుండా చేస్తుంది . క్యాలరీలు,కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి . కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ల ను తగ్గించటంలో కీలకంగా ఉంటుంది . విటమిన్ సి ,జంక్ ,ఫాస్పరస్ వంటివి […]
అచ్చమైన పువ్వులల్లే
చీరె అందం అంత బ్లావుజ్ లోనే కనిపిస్తుంది . కొన్ని ప్రత్యేకమైన బ్లౌజ్ అతి మాములు చీరె ను కూడా అత్యంత ఖరీదైన డిజైనర్ చీరె కంటే అందంగా మార్చేస్తున్నాయి . ప్రత్యేకం త్రీడి ఎంబ్రాయిడరీ పూవులు,పక్షులు ఏ డిజైన్ ఐన సరే ఎంతో ప్రత్యేకం. అచ్ఛం పువ్వో ,పక్షి వాలినట్లు ఉంటుంది . అచ్చమైన సిల్క్ రిబ్బెన్ పూవు బ్లావుజ్ మెడచుట్టు పరుచుకొన్నట్లు ఉంటుంది . నిజమైన బటన్ గులాబీలు బ్లావుజ్ మొత్తం పరుచుకొంటాయి . […]
పగడపు పూల నగలు
ముత్యాల హారాల్లాగే పగడాల హారాలు కూడా వస్తున్నాయి . మధ్యదరా సముద్రంలో ,జపాన్ ,తైవాన్ సమీపంలోని సాగరాల్లో జీవిస్తూ ఉంటాయి . ఆలా అతుక్కునేందుకు కెరోటిక్ తో కూడిన కాల్షియం కార్బోవేట్ ని స్రవిస్తాయి . అవి మొక్కల్లా పెరుగుతాయి . వీటిని కోసి శుద్ధి చేసి పగడాలు తయారు చేస్తారు . గులాబీ,ఎరుపు,ముదురు ఎరుపు, నారెంజ్ ఇలా అనేక వర్ణాలతో ఇవి కనిపిస్తాయి . ముదురు ఎరుపు కోరల్ నే రెడ్ కోరల్ అని పిలుస్తారు […]
శాక ప్రోటీన్స్ దీర్ఘాయుష్షు
నూరేళ్ళ ఆరోగ్యాంగా జీవించాలి అనుకొంటే మాంసాహారం కాస్త తగ్గించి దాని బదులుగా గింజ పప్పులు అంటే బాదం,ఆక్రోట్,పిస్తా,సోయా చిక్కుళ్ళు పప్పులు తీసుకొంటే చాలు. పప్పు సంబంధమైన ప్రోటీన్లు నిండిన ఇలాటి ఆహారం తీసుకునేవారి జీవనకాలం పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెపుతున్నాయి . ఈ విషయం పై జపాన్ లో చేసిన 25 అధ్యయనంలో 20 ఏళ్ళ పాటు 70 వేల మందిని పరిశీలించి ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించారు . శాఖాహారంలో లభించే మాంసకృత్తులు ఎక్కువగా తీసుకొన్నా వారిలో […]
స్వర్గానికి మెట్లు
పేరుకు తగ్గట్టే. అద్భుతమైన అందంతో స్వర్గానికి కట్టిన మెట్ల వారసలాగే ఉన్నాయి . ఈ హైకోస్టయిడ్స్ . అమెరికా లోని అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒహు రాష్ట్రం హవాయ్ కూడా ఒకటి . ఈ ప్రాంతంలో కోడలా మధ్య కొన్ని వేళా మెట్లు ఉంటాయి . అందమైన కొండ ప్రకృతి సహజంగా ఏర్పడింది . దాని పైకి చేరుకొనేందుకు మెట్లు కట్టి మరింత ప్రత్యేకత తెచ్చారు ఇంజనీర్లు . ప్రశాంతమైన పచ్చని వాతావరణం ,ఎత్తయిన కొండలు ,పక్షుల […]
వేసవిలో మంచు మాయం
(కౌడార్ స్పోర్ట్ ఐస్ మైనీ) Coudar sport ice mine ఇదొక వింత గుహ . ఎప్పుడు వేసవి వస్తుందా,ఎప్పుడెప్పుడు ఈ గుహలో మంచు కొండలను చూద్దామా అని పర్యాటకులు ఎదురు చూస్తారు . ఈ గుహలు వేసవిలో మాత్రమే మంచు ఏర్పడుతుంది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో కౌడార్ స్పోర్ట్ ఐస్ మైనీ ఉంది . అది కుత్రిమ గుహ కదా .సహజంగా ఏర్పడిందే. వేసవి వస్తే చాలు ఈ గుహ మంచు తో నిండి పోతుంది మంచు […]
“కేసరి నందన ప్రసాదం”
బుద్ధిర్బలం యశోధ్యైర్యం నిర్భయత్వ మరోగతాః ఆజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ !! చెన్నైకి సమీపంలో నమ్మకళ్ అనే గ్రామంలో స్వయంభూగా వెలసిన దేవుడే అంజనీ పుత్రుడు,వాయు పుత్రుడు అయిన హనుమంతుడు. ఇక్కడ దేవాలయానికి గోపురం వుండదు.స్వామి వారు రోజు రోజుకి ఎత్తు పెరుగుతారట. ఈ క్షేత్రంలో స్వామి వారి పాదాలు కూడా దర్శనం చేసుకుని తరించవచ్చు. భక్తులకు కోరికలు తీర్చే భక్తరామ హనుమంతుడు.ఈ దేవాలయం అతి పురాతన కట్టడం. నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు సమర్పించిన […]
ధూళి తో పెయింటింగ్
రష్యా రాజధాని మాస్కోలో నికిట గోలు బెవ్ అనే కళాకారుడు ఉన్నాడు . అందరిలా ఎదో చిత్రాలు గీస్తే ప్రత్యేకత ఏముందీ . వాహనాల పైన పేరుకొన్నా దుమ్ముతో చిత్రాలు గీద్దాం అనుకొన్నాడు . వాహన దారుల పర్మిషన్ తీసుకోని దుమ్ము పట్టిన కార్ల పైన చేతినే బ్రష్ గా చేసుకొని చిత్రాలు గీస్తాడు . కొన్నింటికి బ్రష్ ల వాడతారు . మాస్కో రోడ్ల పైన ఎన్నో వాహనాలపై ఈ దుమ్ము పెయింటింగ్స్ కనిపిస్తాయి . […]
సౌందర్యాన్నిచ్చే కలబంద
చర్మం,జుట్టు ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో రకాల ఫ్యాక్స్ వేసుకొంటారు . కొన్ని సహజమైన పదార్దాలు కోరుకొన్న ప్రయోజన్నాని ఇస్తాయి . కలబంద గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఇందులో సమానమైన పరిమాణంలో కొబ్బరి నూనె ,ఆముదం,మెంతులు కలపి మరగనివ్వాలి బాగా వేడయ్యాక దాన్ని చల్లార్చ ఓ డబ్బాలో భద్రపరుచు కోవాలి . దీన్ని తలస్నానం చేసే ముందర జుట్టుకు పట్టించి మసాజ్ చేస్తే వెంట్రుకలకు చక్కని పోషణ అందుతుంది . ముఖం పై మచ్చలు తగ్గాలంటే పావుకప్పు కలబంద […]
జారిపోయే సమస్యే లేదు
వర్షంలోకి వెళితే వేసుకొన్న బూట్లు తడిసిపోయి పాదం నుంచి జారిపోతూ ఉంటాయి . ఇక సాక్స్ ఉండే అవి తడిసి నీళ్ళు కారుతూ మరింత చిరాకు పెడతాయి. ఈ సమస్య రాకుండా సోల్ హగ్గర్, సీక్రెట్ 2.0 కొనుక్కుంటే చాలు . ఇవి సాక్స్ లాంటివే అయినా బయటకు కనిపించవు . బూట్లు వేసుకొనే ముందు వీటికి తొడగాలి వీటికి మడమలు,అరికాళ్ళు ,కాలివేళ్ళను పట్టి ఉండేలా సిలికాన్ గ్రీస్ ఉంటుంది . అరికాళ్ళ దగ్గర దూది లాంటిది […]
ట్రెండీ లుక్
హటాత్తుగా జంప్ సూట్ ఫ్యాషన్ అయిపోయింది . ప్లే సూట్ ర్యంపర్ గా పిలిచే ఈ దుస్తుల్ని క్యాజువల్ ,పార్టీ,ఆఫీస్ వేర్ గా కూడా చక్కగా వేసుకోవచ్చు . డస్ట్ గ్రీన్ బ్లు మెరూన్ వంటి రంగులు ,బెల్ ,స్ట్రెయిట్ కట్ వంటివీ కాఫ్ లెంగ్త్ ,త్రీ ఫాడ్స్ రకాలన్నీ ఇప్పుడు అమ్మాయిలు ధరించేందుకు ఇష్ట పడుతున్నారు సిల్క్ కంటే లినెన్ ,నూలు ,రెనిమ్ వస్త్రశ్రేణి తో జంప్ సూట్లు సౌకర్యంగా ఉంటాయి .పైనుంచి కిందవరకూ ఒకే […]
బ్యూటీ ఫుల్ లైబ్రరీ
గ్రంధాలయం పేరులోనే ఒక ఆలయం ఉంది . పుస్తకాలంటే పవిత్రమైన మందిరం అని అదే గ్రంధాలయం . అందమైన అందమైన రాజభవనం లాగా ఉంటే ప్రతిరోజు వెళ్లిచూడాలి అనిపించేంత అందంగా ఉంటే అలాంటిది ఉంది చెక్ రిపబ్లిక్ లోని ప్రాగ్ నగరంలో ఉన్న క్లెమెంటియం గ్రంధాలయం . ఆ భవనం ఎంత అందమైన దంటే ,గోడల నిండా గ్రీకుకదల ఆధారంగా బోలెడన్ని పెయింటిగ్స్ గీసి ఉంటాయి . ఆ పెయింటిగ్స్ నే ప్రెస్కో పెయింటిగ్స్అంటారు . వందల […]
మొబైల్ టాయ్ లెట్స్
ముంబయ్ లో మొబైల్ టాయ్ లెట్స్ రోడ్డెక్కాయి . ఇదొక పాత బస్ . దీన్ని కాస్తే టాయ్ లెట్ గా మార్చారు . ఇందులో మహిళలకు మరుగు దొడ్డితో పాటు కాస్సేపు విశ్రాంతి గడిపేందుకు టి.వి , వైఫై సదుపాయాలు ఉన్నాయి . బస్ లోనే శానిటరీ నాప్ కిన్ డిస్పోజల్ మెషీన్ ఉంది వెస్ట్రన్ టాయ్ లెట్స్ ఏర్పాటు చేశారు . నిర్వహణ కోసం ఒక మహిళా కూడా ఉంటుంది . ఐదు రూపాయిల […]
ఏ మార్పూ లేదు
నిజం చెప్పాలంటే పేరు గుర్తింపు కూడా బోలెడన్ని సవాళ్ళను వెంట తీస్తాయి . ఇవేమీ నా లో మార్పు తేకుండా జాగ్రత్త పడ్డాను . నేల పై ఉండటమే నాకు ఇష్టం ఓ నటిగా పేరు తెచ్చుకోవాలన్న నా కల నాకళ్ళ ముందు ఉంటుంది . నేను ఆ కల సాకారం చేసుకునేందుకే ప్రయత్నం చేస్తున్నా అంటోంది ప్రియా వారియర్ . పరిశ్రమలో నన్ను కాస్త నొప్పించినవి ట్రోల్స్ . నిజానికి ట్రోల్స్ ను సరైన సెన్స్ […]
పొడవాటి జుట్టు కావాలా ?.
పొడవాటి జుట్టు కోరుకొనే వారికీ ఎక్స్ టెన్షన్లు ఇప్పుడు గొప్ప అవకాశం . వీటి ద్వారా శిరోజాల స్వరూపాన్ని మార్చేయవచ్చు . సింథటిక్ ఎక్స్ టెన్షన్లు కాస్త చౌకగా దొరుకుతాయి . తాత్కాలికంగా వాడుకోవచ్చు . సహజ వెంట్రుకల ఎక్స్ టెన్షన్లు మంచి క్వాలిటీ తో సంవత్సరం వరకూ బావుంటాయి . తాత్కాలిక ఎక్స్ టెన్షన్లు క్లిప్స్ తో పిట్ చేస్తారు . వీటిని ఎవరి సాయం లేకుండానే అమర్చుకోవచ్చు . చిన్నిచిన్ని రింగ్స్ కు వెంట్రుకలు […]
“కొమరెల్లి మల్లన్న ప్రసాదం”
శివ శివ శంకరా!!భక్తవ శంకర శంభో హర హర!! నారీమణులూ!! ఈ రోజు ముందుగా నిన్నటి వాల్మీకి మహర్షి జయంతిని తలచుకుంటూ కొమరవెల్లి మల్లన్న క్షేత్రాన్ని చూసి తరించి వద్దాం రండి!! హైదరాబాద్- కరీంనగర్ రహదారి లో కనిపించే సుందరమైన స్వాగత తోరణాలు మనల్ని ఆహ్వానిస్తాయి.నల్ల పాలరాతితో శివలింగం దర్శన భాగ్యం కలుగుతుంది.ఈ క్షేత్రంలో ధ్వజస్థంబంని గమనిస్తే దేవతలే రూపకల్పన చేసినట్టు కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో మూడు నెలలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. చూడడానికి రెండు కళ్ళూ చాలవు.శివసత్తుల […]
మళ్ళీ పెరగవు
కనుబొమలు థ్రిడింగ్ చేయించు కొంటే చాలా తీరుగా ఉంటాయి . అవి నిండుగా కనిపించాలి అంటే కొద్దీ పాటి జాగ్రత్త తీసుకోవాలి . కనుబొమల్ని ఐ బ్రో పెన్సిల్ తో దిద్దుకోవాలి . వాటికోసం వాడే బ్రష్ తో దువ్వినట్లు చేయాలి . ముఖంపై పేరుకున్నా మృతకణాలు పోయేందుకు స్క్రబ్ వాడినట్లు కనుబొమల చుట్టూ క్రీం రాసి మదన చేస్తే కనుబొమల భాగం పొడిబారకుండా మెరుస్తూ ఉంటుంది . పెట్రోలియ జెల్లీ రాసి మధన చేసినా పర్లేదు […]
ఇక శాకాహారం తినాలి
పాల ఉత్పత్తుల్ని అధికంగా తీసుకోవటం వల్ల ఉష్ట మండల ప్రాంతాల్లో జీవవైవిధ్యం దెబ్బతింటోంది అంటున్నారు నిపుణులు.వ్యవసాయానికి బదులుగా మాంసంకోసం జంతువుల పెంపకం ఎక్కువవుతుంది . వీటికోసం ఎక్కువ భూమి కేటాయిస్తున్నారు . పశుజనాభా పెరగటంతో జల వనరులు అడుగంటుతున్నాయి . వాతావరణ కాలుష్యం పెరుగుతుంది . పశుసంపద పెరగటంతో అనేక వృక్షజాతులు అంతరించి పోతున్నాయి . దీనిలో పర్యావరణానికి తరగని నష్టం వస్తుంది . మానవాళి ఆహారపు అలవాట్లు మార్చుకోనట్లయితే ఉష్ట మండల ప్రాంతాల్లోపావువంతు నేలభాగం శతాబ్దం నాటికీ తుడిచిపెట్టుకుపోతోంది అంటున్నారు . వ్యవసాయాన్నీ ప్రమోట్ చేయమంటున్నారు .
