Sunday, 11 Oct, 2026

పాపాయి స్నానానికి 

చిన్న పిల్లలకు స్నానం చేయించటం చాలా కష్టం. నీళ్ళు ముక్కులోకో ,కళ్ళల్లోకో,నోట్లోకో పోతాయని భయ పడతారు తల్లులు . ఎవరైనా పెద్దవాళ్ళ సాయం లేకుండా స్నానం చేయించటం కష్టం అనుకొంటారు. మరి అలాంటి అవకాశం లేకపోతే అప్పుడు బేబీ బాత్ షవర్ టాయ్ ని తెచ్చుకొంటే సమస్యే ఉండదు ఈ షవర్ టాయ్ ని  పాపాయి కి స్నానం చేయించే టబ్ లోనో,లేదా నీళ్ళ బకెట్ లోనో పడేసి దానికున్న బటన్ ఆన్ చేస్తే నీళ్ళు తేలిక […]

హెయిర్ డ్రయ్యర్ వద్దు

చలి రోజుల్లో తేమ ఎక్కువగా ఉంటుంది కనుక శిరోజాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అంటున్నారు సౌందర్య నిపుణులు షహనాజ్ హుస్సేన్. కొబ్బరి నూనె లేదా బాదం నూనె శిరోజాలకు పట్టించాలి. ఇలా చేస్తే వెంట్రుకలు మృదువుగా పట్టులాగా ఉంటాయి. నూనెతో మాడుని సున్నితంగా మర్దన చేయాలి వెంట్రుకల కుదుళ్ళ నుంచి వలయాకారంలో చేతి వేళ్ళతో మసాజ్ చేయాలి తలస్నానం చేశాక టవల్ తో గట్టిగా వెంట్రుకలను బిగించ కూడదు మాడు పొడిబారిపోయి చుండ్రు సమస్య మొదలవుతుంది […]

చర్మం పొడి భార కుండా

ఈ చాల గాలుల్లో చర్మం పొడిబారుతోంది . గరుకుగా,తెల్లని గీతాలు పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒంటికి కొబ్బరి నూనె ఆలివ్ నూనె వంటివి రాసుకోవాలి అవసరం అయితే తేమను కాపాడే మాయిశ్చ రైజర్లు కూడా వాడుకోవచ్చు. మాములు సబ్బులకు బదులు గ్లిజరిన్ తో కూడిన సబ్బులు వాడితే మంచిది చలి ఎక్కువగా వుంటే కాస్త ఎండమొదలైయ్యాకే అడుగు బయట పెట్టాలి . కూల్ డ్రింక్ లు ఐస్ క్రీమ్ లు . నోరు గొంతు పై పొరను […]

ఇలా మిక్స్ చేస్తే అందం

సన్నగా ఉంటె జార్జెట్, నెట్టెడ్ వంటి చీరెలు కట్టుకొంటే మరీ సన్నగా కనిపిస్తా నాని అను కొంటారు అమ్మాయిలు, అయితే డిజైనర్ బ్లావుజ్ వేసుకోండి ,ఆ వస్త్రశ్రేణి చీరెలకు అందం వస్తుంది అంటారు డిజైనర్లు . అలాగే లాంగ్ అనార్కలీ డ్రస్ పైన ఎంబ్రాయిడరీ ఓవర్ కోట్  ష్రగ్ ధరిస్తే గ్రాండ్ గా ఉంటుంది సన్నగా అనిపించరు అంటారు . లాంగ్ అనార్కలి పలాజ్ డ్రస్ ,గౌన్ ధరిస్తే ఆ డ్రస్ పైన పెద్దగా ఆభరణాలు కూడా […]

 ఇవి తిరుగులేని ప్యాక్ లు 

ఎంతో చక్కని ఫేస్ ప్యాక్ లు ఆయా సీజన్ లలో దొరికే అన్ని రకాల పండ్లు ,పూలతో తయారు చేసుకోవచ్చు . పుచ్చకాయరసం,కమలా పండు రసం,మామిడి పండు దోసకాయ గుజ్జు దేనితో అయిన మొహానికి మసాజ్ చేసుకోవచ్చు, జిడ్డు చర్మం గలవారు పుల్లటి పండ్లు వాడాలి, సాధారణ చర్మం అయితే దోస అరటి పండ్లు వాడాలి అలాగే బంతి చామంతి గులాబీ పూలు అన్ని వయసుల వారు వాడచ్చు. చామంతి పూలు టీనేజ్ దాటినా తర్వాత వాడాలి. […]

“అయ్యప్ప ప్రసాదం”

మార్గశిర మాసం మొదలైంది కన్నె పిల్లలకు సందడే మరి.ఇటు కన్నె సాములు కూడా అయ్యప్ప మాల వేసుకొని సందడే మరి. హైదరాబాదు లోని సనత్ నగర్ లో గల అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు భక్తులు.ఈ రోజు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని మోక్షం పొందుదామా !! ఎంతో దీక్షతో బ్రహ్మచర్యం స్వీకరించి,అయ్యప్ప మాల ధరించి,భక్తి శ్రద్ధలతో పడిపూజ చేసుకుని,ఇరుముడితో 18 మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుని తరిస్తారు.స్వామియ్యేయి….శరణం అయ్యప్ప […]

డాన్సింగ్ తో ఫిట్ నెస్ 

ఆకర్షణీయమైన నా రూపానికి క్రమం తప్పని వ్యాయామం కారణం అంటోంది దిశాపటాని . నా వ్యాయామం లో డాన్స్,ఈత,వెయిట్ ట్రైనింగ్ యోగ ఉంటాయి. నా ఫిట్ నెస్ లో డాన్స్ దే ప్రధాన పాత్రా అంటోంది. నేను న్క్సేర్ డాన్సింగ్  అనే కొత్త నాట్యం నేర్చుకొన్నాను. డాన్స్ తో మనసు తేలిక అవుతోంది. శరీరానికి చక్కని వ్యాయామం కూడా అందుతోంది. శరీరాన్ని తేలికగా వుంచాలి అనుకొంటే ప్రతి రోజు వ్యాయామం చేయాలి అంటోంది దిశా పటాని . […]

మెడకి ప్యాచ్ అవసరం 

మొహం తో పాటు మెడ భాగంలో వుండే మృదువైన చర్మంపైన కూడా దృష్టి పెట్టండి లేకపోతే అక్కడ గీతాలు,ముడతలు వచ్చేసి వయసు పెరిగినట్లు అయిపోతుంది అంటున్నారు మేకప్ ఎక్స్ పర్ట్స్ . ఎండలోకి వెళ్ళేప్పుడు ముఖంతో పాటు మెడకు కూడా సన్ స్క్రిమ్ లోషన్ రాసుకోవాలి. సన్ స్క్రిమ్ వాడటం వల్ల చర్మం పైన ముడతలు ఏర్పడవు. స్నానం చేసాక మెడకు కూడా మాయిశ్చ రైజర్ రాసుకోవాలి. అలాచేస్తే మెడభాగంలోని చర్మానికి పోషణ ఉంటుంది. మొహానికి  మాస్క్ […]

అందాన్నిచ్చే పూవ్వులు

టాన్ సమస్యకి ప్లోరల్ మాస్క్ లు బాగా పని చేస్తాయి . మల్లెల,మందారం,గులాబీ ,తామర వంటి పూలతో  ఫేస్ ప్యాక్ తయారుచేసి వేసుకొంటే టాన్ పోతుంది . పొద్దుతిరుగుడు పువ్వులో ఇ-విటమిన్ పుష్కలంగా ఉంటుంది . టమాటాలోని లైకోసెనె చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది . పొద్దుతిరుగుడు పువ్వు మెత్తగా నూరి అందులో టమాటా గుజ్జు ,పచ్చిపాలు కలిపి పేస్టులా చేసి ఆ పేస్ట్ ను ఫ్రిజ్ లో ఉంచి చల్లాగ అయ్యాక ప్యాక్ వేసుకోవాలి . అలాగే […]

 పూర్వీకుల విధానాలే బెస్ట్ 

మనం పూర్వికులు పాటించిన ఆహార పద్ధతులనే అనుసరించటం బెస్ట్ అంటారు ఎక్స్ పర్ట్స్. అలాగే తినే తిండి తో పాటు మనం ఆహారం వండే పద్ధతి కూడా మార్చుకోవాలంటున్నారు ,వంటకు అల్యూమినియం పాత్రలు ఉపయోగిస్తే నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. స్టీల్ పాత్రలు కొంత నయం కానీ మట్టి పాత్రల్లో వండటం వల్ల ఆహార పదార్ధాల లోని ఆర్సెనిక్ ను,ఆ పాత్రా గ్రహిస్తుంది అందుకే మట్టి పాత్రలు వంటకు ఉత్తమం. అలాగే నల్ల నువ్వులు,ఆలివ్ […]

ఆకట్టుకొనే టి కులీ ఆర్ట్ 

టి కులీ అన్నది ఒక ప్రాచీన కళ. దళసరి చెక్క వస్త్రంపై ప్రత్యేక శైలిలో గీసే బొమ్మలివి. చేతితో చేసే ఈ బొమ్మల కోసం మొగల్ చక్రవర్తులు పాట్నా వరకు వచ్చేవారట . బిహారీ మహిళలు చేతితో రూపం పోసుకున్న బొమ్మలివి. భారతీయ వివాహ ప్మట్టాలు,రామ్ లీలా వంటి చిత్రాలు ఈ కళ ప్రత్యేకం ఇపుడీ చిత్రాలకు విదేశాల్లో ఎంతో ఆదరణ వుంది.

నోరు తాజాగా 

దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ,నోరు తాజాగా అనిపించేందుకు మౌత్ ఫ్రెషనర్స్ వాడుతువుంటారు. కొన్ని రకాల పండ్ల పదార్దాలు అలాంటి తాజా శ్వాస నిచ్చేందుకు సాయపడతాయి. యాపిల్ లోని మాలిక్ యాసిడ్ పళ్ళని శుభ్రం చేస్తుంది నోరు తాజాగా వుంటుంది . స్ట్రాబెర్రి అనాస లోని బ్రోమిలిన్ విటమిన్-సి పోషకాలు నోటిని తాజాగా వుంచుతాయి. చీజ్ పనీర్ లోని కాల్షియం ,ఫాస్పరస్ నోటిలోని లాలాజలం ఉత్పత్తి కావటానికి సహకరిస్తాయి. నోట్లో తగినంత లాలాజలం వుంటే నోటి దుర్వాసన కు […]

శోభనా భార్తియా

శక్తిమంతమైన మహిళల జాబితాలో ముందు కనిపిస్తుంది శోభనా భార్తియా . హిందుస్థాన్ టైమ్స్ దినపత్రిక  వారి ఇతర ప్రచురణ సంస్థలకు అధిపతిగా ఎడిటోరియిర్ డ్రైరెక్టర్ గా మీడియా రంగంలో ప్రభావిత మహిళా గా కనిపిస్తుంది శోభనా బిట్స్ పిలానీ కి ప్రో ఛాన్స్ లర్ గా కూడా భాద్యతలు తీసుకొన్నారు రామె .. రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్ గా వ్యవహరించారు . భారతదేశంలో  శక్తిమంతమైన వేత్తగా చెప్పుకొనే కె.కె బిర్లా కుమార్తె . హిందుస్థాన్ టైమ్స్ పత్రికను […]

ఇదొక మ్యూజికల్ మైల్ స్టోన్

నా కెరీర్ లో మ్యూజికల్ మైల్ స్టోన్  చేరుకున్నాను అంటోంది కీర్తి సురేష్ . రజనీకాంత్ 168 వ సినిమాలో కీర్తికి నటించే అవకాశం వచ్చింది . శివ దర్శకత్వంలో సన్ పిక్చర్ నిర్మిస్తున్నా ఈ చిత్రంలో నటిస్తున్నందుకు తన సంతోషం వ్యక్తం చేస్తూ రజనీకాంత్ సరసన నటించటం అన్నాది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం . నా కెరీర్ లో ఇది అద్భుతమైన మలుపు నటిగా ప్రతి సినిమా నాకు సవాల్ గానే […]

విశ్వ సుందరి జోజిబిని తుంజీ

ఈ సంవత్సరం విశ్వ సుందరి కిరీటం ,దక్షిణాఫ్రికాకు చెందిన  జోజిబిని తుంజీ ని వరించింది . వివిధ దేశాలకు చెందిన 90 మంది అందగత్తెలతో జోజిబిని ఈ టైటిల్ సాధించింది . దక్షిణాఫ్రికా లోని ట్యూలో అన్న చిన్న ఊరిలో బాల్యం గడిపిన   జోజిబినికేప్ టీన్ లో పబ్లిక్ రిలేషన్స్ లో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసింది . ఈ ప్రపంచంనలుపును ఎలా చూస్తుందో నాకు తెలుసు . తలుపులు తెరచి చూడండి . ఒక కొత్త […]

అన్ని పట్టుచీరలే ఎందుకు ?

పెళ్ళి సందర్భాల్లో అన్ని బరువైన,పట్టు చీరెలు ఎందుకంటే ఇక ఆ తర్వాత సందర్భాల్లో  వాటిని కట్టుకోవటం కష్టం అందుకే కొన్ని లైట్ వెయిట్ చీరెలు ఎంచుకోండి అంటున్నారుఫ్యాషన్  డిజైనర్స్ . పట్టు చీరెలు పెళ్ళికి సంబందించిన ప్రధాన వేడుకలకు ఎంచుకొని ఇతర సందర్భాలకు ఫ్యాన్సీగా తేలిగ్గా ఉండే చీరెలు ఎంచుకోవాలి . జార్జెట్ ,కోటా ,ఆర్గాజ్ వంటివి బావుంటాయి . ప్యూర్ పట్టు,ఉప్పాడ కోయంబత్తూర్ సిల్క్ వంటివీ బావుంటాయి . చిన్న అంచుల జార్జెట్స్ సంప్రదాయ టచ్ […]

ఉడ్ ఫర్నిచర్ చాలా అందం

ఉడ్ ఫర్నిచర్ తో ఇంటికి చక్కని లుక్ వస్తుంది . అయితే నిర్వహణ బావుంటేనే ఫర్నిచర్ మెరుపు పోకుండా ఉంటుంది .  ఫర్నిచర్ కి ఎండా తగలకుండా చూసుకోవాలి . తేమ తగిలితే కర్ర ఉబ్బి పోతుంది . ఉడెన్  ఫర్నిచర్ పైన నేరుగా సూర్యకిరణాలు పడితే రంగుపోయే అవకాశం ఉంటుంది . సూర్యరశ్మి పడనిచోటనే ఈ ఉడ్ ఫర్నిచర్ ఉంచుకోవాలి . గ్లాసులు,కప్పులు,పానీయాల కప్పులు టేబుల్ పైన పెట్టేసమయంలో ఫ్యాట్స్ ని గాని ,మ్యాట్స్ ని […]

ఐటీ లో మేటి పద్మ శ్రీ

శక్తివంతమైన నవతరం వ్యక్తిగా అత్యధిక జీతం అందుకొనే టాప్ టెన్ మహిళగా గుర్తింపు పొందారు  పద్మ శ్రీ వారియర్ . ఐ టీ  రంగంలో తిరుగులేని రాణిగా గుర్తింపు పొందిన  పద్మ శ్రీ పదహారణాల తెలుగమ్మాయి . విజయవాడలో ఇంటర్ వరకు చదివి ఢిల్లీ  ఐ ఐ టీ లో చదివేందుకు వెళ్ళిన తొలితరం ఆడపిల్లల్లో పద్మ శ్రీ ఒకరు . డ్రైవర్ అక్కర్లేని కార్ల తయారీలో ,ఆ స్వయం భోదిత వాహనాలకు అవసరమైన సాఫ్ట్ వేర్ తయారీలో […]

ఇది థాయ్ బతుకమ్మ ఉత్సవం

థాయ్ లాండ్ లొ జరిగే థాయ్ క్రాతొంగ్ వేడుక అచ్చం తెలంగాణాలో జరిగే బంగారు బతుకమ్మ పండగలగానే ఉంటుంది . కొబ్బరి ఆకులతో అల్లిన బుట్ట పై తామర, బంతి ,చామంతి ,లావెండర్ వంటి పువ్వులతో అందంగా పేర్చిన పూల బుట్టలు తయారుచేస్తారు . వాటి పై అగరవత్తులు ,దీపాలు వెలిగించి ,పూజ చేసి దగ్గరలో ఉన్న సరస్సులో వదిలిపెడతారు . థాయ్ క్యాలెండర్ లో వచ్చే ఆఖరు నెలలోని పౌర్ణమి రోజు ఈ పండుగ జరుపుకొంటారు […]

కాలుష్యంతోనే ఈ ప్రమాదం

కాలుష్య వాతావరణం తో గ్లకోమా అవకాశాలు పెరుగుతున్నాయని పరిశోధకులు చెపుతున్నారు . ఏటా ఆరుకోట్ల మంది అంధత్వం బారిన పడుతున్నారు పరిశోధనలు చెపుతున్నాయి . పెద్ద వయసు,జన్యువులే కారణం కాకుండా ఈ వాతావరణ కాలుష్యం వల్ల కంటి రక్తనాళాలు కుంచించుకు పోవటం వత్తిడి పెరగటం కావచ్చు అంటున్నారు . హానికరమైన రసాయనాలు నేరుగా కళ్ళలోకి వెళ్ళడం వల్ల నాడీవ్యవస్థ దెబ్బతిని ఈ సమస్య తలెత్తుతుందని చెపుతున్నారు . గ్రామా ప్రాంతాల లో కంటే పట్టణ ప్రాంతాల్లో నే […]