పిల్లల కోసం ఉచిత వైద్యం
డాక్టర్ మమతా భూషన్ సింగ్ ఢిల్లో ఎయిమ్స్ లో ప్రొఫెసర్ పిల్లల్లో వచ్చే ఎపిలెప్సీ గురించి ఈమె చికిత్స అందిస్తుంది. ముంబాయ్ లోని ఇంపాక్ట్ ఫౌండేషన్ అధ్యర్యంలో లైఫ్ లైన్ ఎక్సప్రెస్ రైల్లో ఇప్పటికి ఎన్నో వెనకబడిన పల్లెలకు వెళోచ్చారామె. అక్కడ వారికి ఉచితంగా వైద్యం మందులు ఇస్తారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ లో శిక్షణ తీసుకొన్నారు స్వదేశానికి రాగానే ఈ సమస్య పైన పని చేయటం మొదలు పెట్టారు. ఈ అనారోగ్యం పై అవగాహన […]
హిడింబ ఆలయం
దేవతలకే కాదు రక్షేసులకు కూడా గుళ్ళు వుంటాయి అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఉత్తరాదిలో హిడింబా దేవి గుడి ఉంది. మహాభారతం లో హిడింబ,హిడింబాసురుడి చెల్లలు. బీముడి భార్య ఘటోత్కచుడి తల్లి. ఘటోత్కచుడు పెద్దవాడై రాజ్య పరిపాలన బాధ్యత తీసుకున్నాక హిడింబ హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి దివ్య శక్తులు పొందింది కోరికలు తీర్చే దేవతగా మారింది. పూజలు అందుకొంది. అదీ ఈ గుడి విశేషం. 1553 లో మహారాజా బహద్దూర్ సింగ్ హిడింబ పేరిట పగోరా తరహాలో […]
ఆరోగ్యానికి ఒప్పుల కుప్ప
థ్రెడ్ మిల్ పరీక్ష ద్వారా గుండె ఆరోగ్యాన్ని పరీక్షించు కొన్నట్లు ఒప్పులకుప్ప ఆట ఆడి చూడండి అది అంత కంటే గొప్ప పరీక్ష అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇది ఇదివరలో ఆడే ఆట ఎదురెదురుగా ఇద్దరు ఆడపిల్లలు నిలబడి ఎదుటి ఆమె కుడిచేతిని తన ఎడమ చేత్తో ,ఆమె ఎడమచేతిని తన కుడిచేత్తో గట్టిగా బిగించి పట్టుకొని పాదాలకు బలంగా నిలబెట్టి కొద్దిగా వెనక్కి వాలి చేతుల్ని బాగా చాపి గిర్రున తిరిగే ఆట ఒప్పులకుప్ప […]
రుబీనా మజార్
రుబీనా మజార్ సాఫా స్వచ్చంధ సంస్థ స్థాపించి హైద్రాబాద్ బంజారా హిల్స్ లోని భోళా నగర్ . ఇతర మురికి వాడలకు సంబందించిన వాడికి వృత్తి విద్య,నైపుణ్యాలు భోదిస్తోంది. పొదుపు వైద్యం విద్య పై అవగాహన కల్పిస్తుంది ఈ సంస్థ. ఈ ఎన్జీవో ఇచ్చిన సహకారంతో 150 మంది సొంతంగా తయారీ యూనిట్లు నెలకొల్పరు. ఈ సంవత్సరం ఈ సంస్థలో శిక్షణ పొందిన మహిళ లతో బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేయించనున్నారు. నిరుపేద మహిళల కు జీవనోపాధి […]
ఇవన్నీ ప్రకృతి సహజం
ప్రపంచ వ్యాప్తంగా అందాన్ని రెట్టింపు చేయటానికి ఎన్నో ప్రకృతి సిద్ధమైన చిట్కా లు ఉపయోగిస్తారు. భారత దేశంలో మృదువైన చర్మం కోసం జుట్టు ఆరోగ్యం కోసం కొబ్బరి నూనె వాడుతారు చైనాలో గంజికి గ్రీన్ టీ కలిపి ముఖానికి రాసు కొంటారు గంజిని రైస్ మిల్క్ అంటారు. దాన్ని వాడితే ముడతలు మచ్చలూ పోతాయని నమ్ముతారు. ఇటలీలో ఆలివ్ నూనె,గుడ్డు లోని తెల్లసొన సౌందర్య సాధనాలుగా వాడుతారు ఫ్రాన్స్ లో పాలు తేనె కలిపినా నీటితో స్నానం […]
కాస్త ఛాయ తక్కువ
కాస్త ఛాయ తక్కువ ఉంటే ఏ రంగు దుస్తులు వేసుకోవాలన్న ఆలోచిస్తూ ఉంటారు ఎక్స్ పర్డ్స్. పేష్టల్ షేడ్స్ చమన ఛాయ కు బావుంటాయి అంటారు . నీలం రంగులో జడ్ బ్లు ,ఐన్ బ్లూ వంటివి చక్కగా ఉంటాయి . కాషాయం కలిపిన ఎరుపు తప్పించి ఏ రంగయినా బావుంటాయి . ఆకుపచ్చలో పిస్తా గ్రీన్ లేతాకు పచ్చ వంటివి చక్కగా నప్పుతాయి . నిమ్మ లేత పసుపు రంగు చర్మ చాయని మరింతగా పెంచుతాయి […]
యువతకు స్ఫూర్తి
కేరళ కు చెందిన రమ్య హరిదాస్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పుకోవాలి . రాజకీయాలంటేనే డబ్బు అందులో రాణించాలంటే డబ్బు వెదజల్లాలి . అలాటిది విరాళాలతో కేరళ లోని అలాతూర్ నియోజక వర్గం నుంచి ఎన్నికల్లో నెగ్గింది రమ్య హరిదాస్ . రాహుల్ గాంధీ నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ చూపింది . ఈమె ఎం.పి టికెట్ సంపాదించారు . డప్పు కొడుతూ ,పాటలు పాడుతూ క్రేడ్ ఫండింగ్ ద్వారా పది లక్షలు రూపాయిలు […]
“శ్రీ మణికంఠ అయ్యప్పప్రసాదం”
హరివరాసనం….విశ్వమోహనం… కర్నూలు జిల్లాలోని సప్తగిరి నగర్ లో మణికంఠుడిని చూసి వద్దాం పదండి.కన్నుల పండుగగా దేవాలయం ప్రాంగణం కళకళలాడుతూ వుంటుంది. శివాంశము సగభాగం విష్ణు అంశము సగభాగంతో భక్తులకు దర్శనం ఇస్తాడు.పంచామృతాలతో అభిషేకం ప్రత్యేక ఆకర్షణ.శబరిమలను తలపిస్తుంది.నిత్యం భజనలతో మణికంఠుడిని సేవిస్తారు.మనకు గణపతి,జగదీశ్వరీదేవి దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. నిత్య ప్రసాదం: కొబ్బరి,ఆవునెతితో అభిషేకం. -తోలేటి వెంకట శిరీష
వేడుకలకో సూట్
పథ ఫ్యాషన్ల రూపం మార్చుకొని కొత్తగా మార్కెట్ లోకి వచ్చేస్తాయి 70 వ దశకంలో సందడి చేసిన జంప్ సూట్ మళ్ళి ఇవ్వాల్టి ఫ్యాషన్ ట్రెండ్. ఒక్కపుడు ఇవి పిల్లలకు ప్యాంటు షర్టు విడివిడిగా కాకుండా కలిపి కుట్టించే వాళ్ళు. ఆ పాతకాలపు జంప్ కాస్తా బాయిలర్ జీన్స్ పేరుతొ డెనిమ్ ల క్లాత్ లో మళ్ళి ప్రత్యక్షం అయింది సెలబ్రెటీలు,కాలేజీ అమ్మాయిలు ఒకేసారి ఈ ఫ్యాషన్ డ్రెస్ కి ఎస్ అన్నారు. ఇప్పుడు వేడుకల్లోను ఈ […]
టమేటా తో సంతాన సామర్థ్యం
ఎర్రగా నిగనిగలాడే టమేటా లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెపుతూనే ఉన్నాయి . ఇంకో అదనపు ప్రయోజనాన్ని తాజా అధ్యయనంలో గుర్తించారు . టమేటా లో లభించే లైకోపీన్ మగవారిలో సంతాన సామర్ధ్యాన్ని పెంపోందిస్తుందని కొత్త అధ్యయన సారాంశం ఆరోగ్య వంతులైన పురుషులు ప్రతిరోజు రెండు స్పూన్ల టమేటా రసం తాగితే వారిలో వీర్యకణాల కౌంట్ పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు . లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తోందని,వీర్యకణాల ఆరోగ్యాన్ని పెంచుతుందనీ చెపుతున్నారు.
చెప్పులూ స్పెషల్
ఈ సంవత్సరం ఫ్యాషన్ ప్రపంచం కూడా పర్యావరణ హితమైన ఉత్పత్తుల పైన దృష్టి పెట్టింది. అందుకే ఎకో ఫ్రెండ్లీ పాద రక్షలు మార్కెట్ లోకి వచ్చాయి. వెదురుతో మందమైన వస్త్రాలు కలిపి స్టయిల్ గా కనిపంచే చెప్పులు తయారు చేశారు. బెంబూ హైహీల్స్ అయితే సన్నని స్ట్రాప్స్ తో చాలా అందంగా ఉన్నాయి ఫిఫ్ స్లాప్స్, కెడ్జెన్,స్లిప్పర్స్ యాంకిల్ స్టాప్ సాండిల్స్ ఇలా ఎన్నో రకాల ఎకో ఫ్రెండ్లీ చెప్పులు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ ఏడాది కొత్తగా చుంకీ […]
ఎప్పటికీ స్ఫూర్తి
ఈ సంవత్సరం సెలబ్రిటీ పాయల్ జాంగిడ్ :2019 కు గానూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి . న్యూయార్క్ లో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్ అందుకొంది పాయల్ . రాజస్థాన్ లోని హింసల్ గ్రామం పాయల్ ది . ఆమెకు పదకొండో ఏట వివాహం తలపెట్టారు పెద్దలు . బాలాశ్రమే నిర్వాహకులు ఎప్పుడో ఒకసారి స్కూల్లో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే మాకు ఫోన్ చేయండి […]
స్టార్ షెఫ్ గరిమా అరోరా
గరిమా అరోరా రెండేళ్ళ క్రితం ‘ గా ‘ అనే రెస్టారెంట్ ను బ్యాంకాక్ లో ఏర్పాటు చేసింది. ఇందులో సాంప్రదాయ భారత విధానాల్లో ఆధునిక రుచులు కలిపి వండి వడ్డిస్తారు. సంవత్సరం తిరిగే సరికి ఆమె రెస్టారెంట్ కి మిషెలన్ స్టార్ గుర్తింపు లభించింది. ప్రపంచ స్థాయి అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించే రెస్టారెంట్స్ కు ఇలాటి గుర్తింపు లభిస్తుంది. ఈ గుర్తింపు సాధన తోలి భారతీయ మహిళా గరిమా. ఈ ఏడాది ఆసియాలోని 50 […]
కేశభరణాలు
అందమైన చీరె నగలతో పాటు శిరోజాలంకరణ కూడా చాలా ముఖ్యం . వేడుకల్లో మెరిసేందుకు సైగ చుట్టుకోవటం ముఖ్యం అంటున్నారు . హెయిర్ స్టయిలిస్ట్ లు . పూర్వం రోజుల్లో ముచ్చటైన ముడి తో అలంకరించు కొనేందుకు నాగ హారం సూర్య చంద్రులు ,చామంతి బిళ్ళలూ వంటి కేశభరణాలు ఉండేవి . ఇప్పుడు చక్కని ముడుల కోసం అందమైన నగలున్నాయి . రైన్ స్టోన్స్ క్రిష్టల్స్ రత్నాలతో చేసిన బుట్టలు ముత్యాల వరసల్ని ముడులకు అలంకరిస్తున్నారు . […]
ఈ ఏడాది సంఖ్య ప్రత్యేకం
2020 సంవత్సరపు సంఖ్యని స్పెషల్ నెంబర్ గా గుర్తించారని అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . 20 కి చాలా గొప్ప చరిత్ర ఉంది పిల్లల నోట్లో 20 పాలపళ్ళు వస్తాయి . ఆ ఇరవై ఊడిపోయి 32 దంతాలు వస్తాయి . పొట్టి క్రికెట్ మ్యాచ్ ట్వంటీ 20 లో ఓవర్లు ఇరవై . బైబిల్ లో ఇరవై ప్రస్తావన 177 సార్లు ఉందట . న్యూమరాలజీ ప్రకారం 20 కి ప్రత్యేక స్వభావం ఉంది ఇది […]
కుచ్చులకే ఓటు
కొత్త సంవత్సరం అంతా ఫ్యాషన్ డ్రస్ ల విషయంలో కుచ్చుల గౌన్లు సందడి చేయబోతున్నాయి . గతంలో ఈ రఫెల్స్ చిన్నపిల్లల గౌన్లు గా మాత్రమే ఉండేవి . నెమ్మదిగా చీరెలకు బ్లౌజులకూ రఫెల్స్ కుట్టేశారు . అలల్లా ఎగిరిపడి ఈ కుచ్చుల అందం ఫ్యాషన్ డిజైనర్లకు ఎంతో నచినట్లే ఉంది . 2020 లో ఈ కుచ్చుల డిజైన్లే ఫ్యాషన్ లో అగ్రస్థానంలో ఉంటాయని పండితులు లెక్కలు వేస్తున్నారు . రఫెల్స్ జాకెట్లు ,కుర్తీలు,టాప్ లు […]
“మయూరనాథుని ప్రసాదం”
తమిళనాడు లో నాగపట్నం కు సమీపంలో మనకు మయూర రూపంలో ప్రత్యక్ష మవుతున్న మయూరనాథుడు. దక్షయఙ్ఞంలో అవమానం పాలైన పార్వతీ దేవిని దూరదృష్టితో గ్రహించి వీరభద్రుడ్ని పంపిస్తాడు శివుడు.యఙ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు వీరభద్రుడు. ఆ సమయంలో ఈ అలజడికి భయపడి ఒక నెమలి పిల్ల పార్వతి దేవి ఒడి చేరింది.పార్వతి దేవి భర్త వారించిన వినక తండ్రి చేసే దక్షయఙ్ఞానికి వచ్చి అమర్యాదపాలైతినని అవమానంతో అగ్నికి ఆహుతి అవుతున్న సమయంలో నెమలి కూడా ఆహుతి అవుతుంది.పార్వతి దేవి […]
ఇలా చేయండి
ఇల్లు సర్దటం లో కొన్ని టిప్స్ అమలు పరిస్తే పర్ ఫెక్ట్ గా పని అయిపోతుంది. ప్లాస్టిక్ డబ్బా ఘాటైన మసాలా ధినుసులు పెడతారు. తరువాత ఆ మసాలా వాసన ఎంత కడిగిన పోదు. ఆ వాసన పోయేందుకు ఒక అగ్గిపుల్ల వెలిగించి ఆర్పేసి ఆ వచ్చే పొగపైన డబ్బా బోర్లిస్తే చాలు వాసనలు పోతాయి. అగ్గిపుల్ల మంటను ఆర్పినపుడు వచ్చే పొగకు డబ్బా శుభ్రంగా అయిపోతుంది. కూరలు తరిగే ప్లాస్టిక్ బోర్డ్ పై,డైనింగ్ టేబుల్ పై […]
తూటాల్లాంటి మాటలు
మార్పు స్పష్టంగానే కనిపిస్తుంది . తమకు అవమానం జరిగితే ఊరికే మనసులో పెట్టుకొని భాదపడుతూ ఊరుకోవటం లేదు . నడివీధిలో నలుగురికి తెలిసేలా చేయాలి అనుకొంటున్నారు . ఇప్పుడు కెన్యా మహిళలు అలా రహదారుల మీద కి వచ్చారు . స్థానిక యూనిటీ యూసఫ్ ఆధ్వర్యంలో “చాక్ బాక్ ” పేరుతో ఒక ఉద్యమం మొదలు పెట్టారు . రోడ్డుపైన రంగుల చాక్ పీస్ లతో తమ భాదను అక్షర రూపం ఇవ్వటం మొదలు పెట్టారు . […]
వృద్ధాశ్రమంలో పెళ్ళి
కేరళ లోని వృద్దాశ్రమంలో మొదటిసారి ఒక పెళ్ళి జరిగింది 65 సంవత్సారాల లక్ష్మి అమ్మాల్,67 సంవత్సారాల కొచ్చానియన్ వధూ వరులై ఘనంగా పెళ్ళి చేసుకున్నారు. కేరళ మంత్రి శివ కుమార్ ఈ వివాహానికి హాజరై ఆ వధూవరులను అభినదించారు లక్ష్మి అమ్మాల్ కు కొచ్చానియన్ 30 ఏళ్ళుగా తెలుసు. ఆమె దెగ్గర పని చేసేవాడు. లక్ష్మి భర్త 20 ఏళ్ళ క్రితం మరణించారు ఆమె బంధువుల దెగ్గరే ఉంటూ రెండేళ్ళ క్రితం వృద్దాశ్రమానికి వచ్చింది కొచ్చానియన్ అదే […]
