ఖస్ సిరప్
ఆయుర్వేద ఔషదాలలో ఎక్కువగా వినియోగించే ఒట్టి వేర్లను ఉసిరి ఖస్ నన్నారీ అని కూడా పిలుస్తారు వీటి నుంచి తీసే తైలం చలువ చేస్తుంది జ్వరం తగ్గిస్తుంది.ఈ వేర్లతో కషాయం,షర్బత్ చేసుకోవచ్చు వీటిలో ఇనుము,మాంగనీస్ విటమిన్ బి6 సి పుష్కలంగా ఉంటాయి ఖస్ సిరప్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు.వట్టి వేర్లు 40 గ్రాములు నీళ్లు ఐదు కప్పులు తాటి బెల్లం లేదా పటిక బెల్లం 300 గ్రాములు నిమ్మకాయలు-2 తీసుకోవాలి వట్టివేర్లు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా […]
ధైర్యం చెప్పండి
కరోనా భయంతో పెద్దవాళ్ళు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఎంతో భయపడుతూ ఉంటారు. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు వైరస్ వార్తలు మరింత భయపెడతాయి వారిలో ఒత్తిడి పెరగకుండా పెద్దవాళ్లు శ్రద్ధ తీసుకోవాలి వైరస్ కు అంతగా భయపడాల్సిన అవసరం లేదని, వైరస్ సోకిన వారికి చికిత్స చేసేందుకు మన దగ్గర నిష్ణాతులైన వైద్యులు ఉన్నారని,కోట్ల జనాభా లో అతి తక్కువ మంది దీని బారిన పడుతున్నారని తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి వైరస్ దగ్గరకు రాదని పిల్లలకు […]
రంజాన్ స్పెషల్స్ ఇంట్లోనే
రంజాన్ పవిత్ర ఉపవాసాలు నడుస్తున్నాయి. కరోనా కారణంగా బయటి ఆహారం ఏదీ లభించడంలేదు. ఉపవాసాలు కొనసాగించే శక్తి నిచ్చే పదార్థాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సాంప్రదాయ తీపి పదార్థాలు సేమియా నేతిలో చేసే సుజీ కి హల్వా. పాలతో చేసే ఫేణి వంటివి ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. వీలైనన్ని పండ్లు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రంజాన్ స్పెషల్ వంటకాలు గా నెయ్యి బెల్లంతో చేసిన హల్వా, గోధుమపిండి తో సీరా వంటివి ఇంట్లో చేసుకోవచ్చు. ద్రవ […]
మేకప్ మార్చితే బెటర్
ముఖానికి మాస్కు తప్పని సరి కనుక మాస్క్ తో మేకప్ ను మ్యాచ్ చేసే చిట్కాలు ,కాళ్ళ సౌందర్యాన్ని పెంచే మెలుకువలు అనుసరించి మంటున్నారు సౌందర్య నిపుణులు. చర్మానికి అప్లై చేసే మేకప్ లేయర్స్ తగ్గించాలి అందుకోసం స్పాట్ కన్ సీలింగ్ టెక్నీక్ అనుసరించాలి.ఫౌండేషన్ వేయాలని అనుకుంటే పల్చని లేయర్ పూసుకుని స్పాంజ్ తో చర్మం లో కలిసేలా పరుచుకునేలా చేయాలి మేకప్ చెదిరిపోకుండా బ్యూటీ స్పాంజి తో పౌడర్ని చర్మానికి దగ్గరగా అద్దు కోవాలి మాస్క్ […]
అచ్చ తెలుగు అమ్మాయిలా
మనీ హేస్ట్ సీరీస్ తో ఎంతో పాపులర్ అయింది స్పానిష్ నటి ఆల్బా ఫోర్స్ స్పెయిన్ లోని మండ్రిడ్ లో జన్మించిన ఆల్బా ఫోర్స్ ఈమె ఇప్పుడు తెలుగు అమ్మాయిల నటించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. స్పెయిన్ లోని బార్సిలోనా కు చెందిన విసెంట్ ఫెర్రర్ చారిటీ లో భాగంగా 1952లో ఇండియా వచ్చారు.పేద ప్రజల కోసం ఎంతో కృషి చేశారు. గ్రామాల్లో మూడు వేలకు పైగా బావులు తోవించారు. 1969 లో భార్య […]
“పార్ధసారధి ప్రసాదం”
తమిళనాడులో ట్రీప్లికేన్ లో వున్న పార్ధసారధి దేవాలయంను తమిళనాడు యాత్రలకు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోవాలి.ఇక్కడ దేవాలయాల కట్టడం చూస్తే మన పూర్వీకులు ఎలా నిర్మించారో అని ఆశ్చర్యంగా ఉంటుంది. పార్ధసారధి దేవాలయంలో శ్రీ కృష్ణ పరమాత్మ తన సోదరుడు బలరాముడు,సహోదరి సుభద్ర కొలువై ఉన్నారు.ఇక్కడ స్వామికి మీసాలూ ఉండడం ప్రత్యేకత.కురుక్షేత్ర యుద్ధంలో తగిలిన గాయలు కూడా మనకు కనిపిస్తాయి. నిత్యప్రసాదం:కొబ్బరి,పులిహోర -తోలేటి వెంకట శిరీష
ఈ సువాసన ధూపం వాడితే మేలు
కమ్మని సువాసన వచ్చే సాంబ్రాణిని ఇప్పుడు వైరస్ భయం పోయేందుకు విరివిగా వాడమంటున్నారు.సాంబ్రాణి పొగ ఉన్నచోట సూక్ష్మ క్రిములు కీటకాలు ఉండవు .అందుకే పసి పిల్లలకు స్నానం చేయించగానే సాంబ్రాణి పొగ వేస్తారు.వృక్ష జాతులల్లో బోస్వెల్లియా సెరాటా (ఫ్రాంకెన్సెన్స్), కొమ్మ పోరా మీదా (మెడ్ ) లచెపుతారు. ఇది కిలో ధర 30 వేల రూపాయలు పైనే ఉంటుంది.దీని నుంచి తీసిన నూనెను సబ్బులు ,పర్ఫ్యూమ్ ,బాడీ లోషన్లలో వాడతారు .ఈ నూనె చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది […]
కదిపితే మెరుస్తాయి
ఏదైనా కొత్తగా ఉంటేనే దానికి డిమాండ్.నగలైనా అంతే అవి అప్ డేట్ అయితేనే అందరినీ ఆకర్షిస్తాయి.ఇప్పుడిలా మార్కెట్ లో కొచ్చాయి టాజల్ ఉంగరాలు ఉంగరం ముందుభాగంలో గొలుసులు వేలాడుతూ ఉండటం వీటిలో ప్రత్యేకత.మాట్లాడుతూ చేతిని కదిపినప్పుడల్లా ఉంగరం ముందున్నా టాజల్స్ కదులుతూ, అందంగా కనిపిస్తాయి. వాటిలో వజ్రాలు క్రిస్టల్స్ పొదిగిన టాజల్స్ అయితే వేలు కదిపితే మెరుపులు మెరుస్తాయన్నమాట. ఈ టాజల్స్ ఉంగరాల యూత్ ఫేవరెట్స్.
కాఫీ ఆకుల టి ఆరోగ్యం
కాఫీ ఆకులతో చేసే గ్రీన్ టీ, తేయాకు తో చేసే గ్రీన్ టీ కన్నా ఆరోగ్యానికి మంచిదంటున్నారు ఎక్స్పర్ట్స్. కాఫీ మొక్క పుట్టిన ఇథియోపియాలో కాఫీ గింజల కన్నా కాఫీ ఆకులనే టీ రూపంలో వేల సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారనీ దీన్ని వాళ్ళు కుటి అంటారని .ఈ టీ వల్లనే వారిలో డయాబెటిస్ బాధితులు కనిపించారనీ చెపుతున్నారు ఎక్సపర్ట్స్ .మార్కెట్ లోని గ్రీన్ టీ లతో పోలిస్తే ఈ కాఫీ ఆకులతో చేసే కుటి అరకు టీ […]
శక్తినిచ్చే సొరకాయ
ఈ వేసవిలో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది నీటి నిల్వలు తగ్గి నిస్సత్తువ ఆవరిస్తుంది.ఈ పరిస్థితి రాకూడదు అనుకుంటే సొరకాయ ఆహారంలో తరచూ తీసుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణులు చెపుతున్నారు వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్ సి,రైబోఫ్లేవిన్, జింక్, థయామిన్, ఇనుము,మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇనుము తో పాటు సొరకాయ లో ఉండే విటమిన్ బి,సి లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.ఇందులోని పొటాషియం ఒత్తిడి పెరగ నివ్వదు జీర్ణశక్తికి […]
అనుబంధాలు పదిలం
ఈ లాక్ డౌన్ సమయంలో దంపతుల మధ్య అనుబంధం ఎంతో బలపడినట్లు ఒక అధ్యయనం చెపుతోంది. ఇళ్లల్లోనే ఉండిపోయిన వారిలో 47 శాతం పెళ్లి చేసుకొన్నవాళ్ళు లేదా బంధం లో ఉన్నవాళ్లలో 38 శాతం మంది తమ భాగస్వామి పైన ఇష్టం,ప్రేమ పెరిగాయని చెప్పారు. 90 శాతం మంది కొత్తగా పెళ్ళైనవాళ్లు సహజీవనం తో ఉన్నవాళ్లలో తాము ఎక్కువ సమయం గడపగలిగినందువల్లనే ఎక్కువ అర్ధం చేసుకోగలిగామని,ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు పెంచుకొన్నామని భాగస్వామితో దాపరికం లేకుండా మాట్లాడ గలిగినందుకు […]
స్వాంతన కోసం హెల్ప్ లైన్
కోవిడ్-19 విజృంభన తో లాక్ డౌన్ మూలంగా ఎన్నో కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి .ముఖ్యంగా ఇంటి పని పెరిగింది ఇల్లు ఆఫీస్ ఉద్యోగ భద్రత వ్యాపారాల భవిష్యత్ పైన ఎంతో మందికి ఎన్నో అనుమానాలు వస్తున్నాయి.ఇందుకోసం కొందరు సైకియాట్రిస్టులు ఐ ఐ టి ,ఐ ఎం,ఎమ్ పట్టభద్రులు,మాజీ సివిల్ సర్వెంట్స్ కలిసి హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఆ హెల్ప్ లైన్ పేరు కోవిడ్ సాథీ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు ఈ […]
గొప్ప వితరణ
ఉత్తరాఖండ్ కు చెందిన 82 సంవత్సరాల వయస్సు లో ఉన్న దర్శినీ దేవి భర్త భారత్ యుద్ధంలో హవల్దార్.1965 ఇండో పాక్ యుద్ధంలో వీర మరణం పొందారు. దర్శినీ దేవి దగ్గర దాచుకున్న డబ్బు రెండు లక్షల రూపాయల వరకు ఉంది.ఆ మొత్తాన్ని ఆమె సీ.ఎం కేర్ ఫండ్ కు ఇచ్చేశారు. డిఫెన్స్ స్టాప్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. మనం దర్శినీ దేవి ని ఆదర్శంగా తీసుకోవాలి అలా చేయలేకపోయినా కనీసం […]
కౌగిలి ఇచ్చే శక్తి
పుట్టిన కొన్ని రోజులకే పసివాళ్ళు అమ్మానాన్నల కౌగిలింతను గుర్తుపట్టేస్తారట. ఈ పసిబిడ్డలకు తల్లిదండ్రులు గుండెలకు హత్తుకొనీ దానికీ,బయట వాళ్ళు దగ్గరకు తీసిన దానికీ తేడా తెలిసిపోతుందనీ టోక్యో లోని యోషిడా ఆఫ్ టోహా యూనివర్సిటీ నిపుణుల బృందం చేసిన పరిశోధనలో తేలింది. ఏడాది లోపు వేల కొద్ది పిల్లలను ఎంపిక చేసి చేసిన పరిశోధనలు పిల్లలను తల్లిదండ్రులు హత్తుకుంటే వారిలో గుండె కొట్టుకునే వేగం తగ్గిందట. అంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ కౌగిలింతలో రిలాక్స్ […]
మనసు కదిలించే భయానకం (మలయాళం)
1940లో రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రపంచ జనాభాలో మూడోవంతు మంది జవాన్లు మరణించారు.అందులో ఇండియాలో 87,000 మంది అయితే కుట్టినాడ్ లో 650 మంది సోల్జర్స్ చనిపోయారు.ఈ నేపథ్యంలో తీసిన సినిమా ‘భయానకం’. మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేసి వికలాంగుడైన ఒక వ్యక్తి పోస్ట్ మాన్ గా కుట్టినాడ్ వస్తాడు. ఆ వూర్లో ఆర్మీలో చేరిన వాళ్ళు పంపే మనీ ఆర్డర్ లు పంచుతుంటాడు. అంతలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలు అవుతుంది.ఇక మరణ వార్తలు […]
“తారాపీఠ్ ప్రసాదం”
పశ్చిమ బెంగాల్ లో వున్న తారాపూర్ లో ఉన్న తారాపీఠ్ అమ్మవారి దర్శనం చేసుకుని వద్దాం పదండి. ఇక్కడ భక్తులు “ఆమ్ఫన్” తుఫాన్ బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.శివుడు కైలాసంలో క్షీరసాగర మధనంలో మధిస్తున్నప్పుడు వచ్చిన విషాన్ని లోకోద్ధరణ కోసం ఆ విషాన్ని సేవించాడు.దాని ప్రభావంతో శివయ్య పార్వతీదేవి ఒడిలో మత్తుగా సేద తీరాడు.అట్టి సమయంలో పార్వతీదేవి శివయ్యను పసివాడిగా తన ఒడిలో స్ధన్యం ఇస్తున్న భంగిమలో దర్శనం ఇస్తారు.అమ్మవారు […]
కేరళ పోలీస్ పవర్ ‘ ఉండ ‘ 2019 మలయాళం
కేరళ లోని ఇడుక్కి నుంచి కొత్తగా నియమితులైన కేరళ పోలీసులు బస్తర్ లో ఎలక్షన్ డ్యూటీ కి బయలు దేరిన ఇతివృత్తంలో వచ్చిన సినిమా. ఉండ పోలీసుల దగ్గర లాఠీలు తప్ప బుల్లెట్లు ఉండవు. ఆ లాఠీలతో నే మావోయిస్టు ప్రాంతంలో నెగ్గుకు రావాలి. వీళ్లు మావోయిస్టు ల పేరు చెప్పి ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టాలని రాజకీయాలే కొనసాగుతున్నాయని అమాయకులను మావోయిస్టులు గా ముద్ర వేసి బలి తీసుకుంటున్నదని స్వార్ధ రాజకీయాలకు మిలటరీ సాయం అందుతుందని సూచన […]
మూడేళ్ళ కబీర్ వితరణ
డియర్ పోలీస్ అంకుల్ మా పైన శ్రద్ధ చూపించినందుకు ధన్యవాదాలు .కరోనా వైరస్ ను మీ గన్ తో షూట్ చేయండి అంటూ ఒక నోట్ రాసి,దానికి యాభైవేల రూపాయలు చెక్ జత చేసి ముంబై పోలీస్ కమిషనర్ పరం బీర్ సింగ్ కు అందజేశాడు మూడేళ్ల కబీర్ .కప్ కేకులు అమ్మి 50 వేలు పోగు చేశాడు. ఈ సొమ్ము అందుకని పోలీస్ శాఖ ఎంతో ముచ్చటపడి తన ట్విట్టర్ లో కబీర్ వీడియోని పోస్ట్ […]
తియ్యనివి తింటే నష్టం
స్వీట్లు ఎక్కువ తింటున్న,ఉప్పు వాడకం ఎక్కువైనా నిద్ర సరిగా పట్టక పోవచ్చు అంటున్నారు అధ్యయనాలు. అందుకే ఇవి సాధ్యమైనంత వరకు తగ్గించండి అంటున్నారు అధ్యయనకారులు. ఏడు గంటలు నిద్రలేకపోతే గుండె జీవక్రియ సంబంధమైన జబ్బులు చుట్టు ముడతాయి బాగా నిద్ర పోతే తియ్యని పదార్ధాలు తినటం ఉప్పు వాడకం కూడా ఆటో మాటిక్ గా తగ్గిపోతుంది అంటున్నారు పరిశోధకులు. నిద్రలేమి ఊబకాయం తో ఉన్న కొందరి పై చేసిన పరిశోధనలో వారికి ఉన్న తిండి అలవాట్లు చెక్ […]
ఇదే సేఫ్
లాక్ డౌన్ సడలింపులు పెరిగాయి. అలాగే కరోనా సోకుతుందనే భయం కూడా ప్రజల్లో పెరుగుతోంది. వైరాలజిస్ట్ లు చేసిన ఒక పరిశోధనలో,సన్నిహితంగా మెలగటం మూసి ఉన్న జన సమ్మర్ధమైన ప్రదేశాల్లో సంచరిస్తేనే కరోనా తేలికగా సోకుతుంది. కానీ ఎదో ఐదు నిముషాలు మార్కెట్ కు వెళ్లిన,కరోనా సోకిన వ్యక్తి పక్కనుంచి నడిచి వెళ్లిన పరుగెత్తిన వైరస్ సోకటం చాలా తక్కువ అని తేలింది. కలిసి గుంపులుగా భోజనం చేయటం ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణాలు చేయటం కాస్త […]
