Wednesday, 23 Sep, 2026
నాలుక ఎప్పుడు తియ్యదనాన్ని కోరుతూనే వుంటుంది. అనారోగ్యం రానీ, శరీర బరువు పెరగనీ, ఇలాంటి సమస్యలున్నా సరే స్వీట్ తినాలన్న కోరిక పోదు. స్వీట్ లో వున్న స్వీట్ రుచి గొప్పదనం ఇదే. మాములుగా డాక్టర్లు ఎం చేపుతరంటే ఒత్తిడి, అలసట శరీరానికి తినాలనిపించడానికి కారణాలు శక్తి తగ్గితే తీపి ద్వారా శరీరానికి తక్షణ సాయం అందుతుంది. ఈ కబుర్లు అలా వుంచి స్వీట్లు జోలికి వెళ్ళకుండా వుండాలంటే ముందస్తుగా వ్యాయామం చేయాలంటున్నారు డాక్టర్లు, అలాగే శరీరంలోని నీటి శాతం తగ్గినప్పుడు కూడా చెక్కర తినాలని పిస్తుందిట. ఈ ఫిలింగ్ వదిలించుకునేలా మనసుని కంట్రోల్ చేసుకుని తీరాలి. అలా తీపీ లేని జీవితాన్ని అలవరుచుకునే క్రమంలో మరీ వుండలేక పోతే 70 శాతం డార్క్ చాకొలెట్ ను రెండు ముక్కలు మాత్రం తినాలి. స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్, ఖర్జూర పళ్ళు, అప్రికాట్స్, ఎండు ద్రాక్ష, అంజీర ఎదో ఒకటి తినాలి. స్వీట్స్ ఎంతో బాగుంటాయి. కానీ తింటే నష్టం మరీ ఎక్కువ.

తియ్యనివి తింటే నష్టం 

స్వీట్లు ఎక్కువ తింటున్న,ఉప్పు వాడకం ఎక్కువైనా నిద్ర సరిగా పట్టక పోవచ్చు అంటున్నారు అధ్యయనాలు. అందుకే ఇవి సాధ్యమైనంత వరకు తగ్గించండి అంటున్నారు అధ్యయనకారులు. ఏడు గంటలు నిద్రలేకపోతే గుండె జీవక్రియ సంబంధమైన జబ్బులు చుట్టు ముడతాయి బాగా నిద్ర పోతే తియ్యని పదార్ధాలు తినటం ఉప్పు వాడకం కూడా ఆటో మాటిక్ గా తగ్గిపోతుంది అంటున్నారు పరిశోధకులు. నిద్రలేమి ఊబకాయం తో ఉన్న కొందరి పై చేసిన పరిశోధనలో వారికి ఉన్న తిండి అలవాట్లు చెక్ చేస్తే వారి భోజనం లో తియ్యని పదార్ధాలు ఉప్పు ఎక్కువ ఉన్నట్లు తేలింది. వారంతా దాదాపు హైపర్ టెన్షన్ షార్ట్ స్లీపింగ్ తో బాధ పడుతున్నవారే .

Leave a Reply