జీన్స్ వల్లే నలుపు
జీన్స్ వాడే వాళ్ళు తప్పని సరిగా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలని చర్మానికి తేమ అందించే కొబ్బరి బాదం నూనె ను తొడలకు రాసుకోవాలి లేకపోతే తొడలు కాళ్లపైన రాపిడి పెరిగి చర్మం నల్లగా అయిపోతుందని అంటున్నారు కాస్మెటాలజిస్ట్ లు. బిగుతుగా ఉండే ఈ ప్యాంట్లు వేసుకోవటం వల్ల ఒత్తిడి ఎక్కువై వెరికోజ్ వీన్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. జీన్స్ కాస్త వదులుగా ఉన్నవే ఎంచుకోవాలి. ప్రతిసారీ ఉతకాలి ఏడు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు […]
మెడలో మురళి
శ్రీ కృష్ణుని మురళి నాదం ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రసిద్ధం బృందావనం, గోపికలు, మురళి నాదం వంటివి సౌందర్యానికి మరో రూపాలుగా మనస్సులో మెదులుతాయి అలాటి చక్కని వేణువుని అందంగా నగల్లో కి తెచ్చారు కళాకారులు ప్రేమకు ప్రతిరూపమైన ఫ్లూట్ ని అందంగా నగల్లో అమరేచ్చేరు. ఆకులు, రుద్రాక్షలు, కృష్ణుని రూపం లో ఈ మురళి చక్కగా ఒదిగిపోయి అద్భుతంగా కనిపిస్తోంది పచ్చని నగల్లో అమ్మాయిలు తమ అభిరుచి ని చేప్పేట్లు గా ఎంచుకునే నగల్లో ఈ ఫ్లూట్ నగలు […]
యాపిల్ గింజల్లో సైనేడ్ ?
యాపిల్, ఖర్జూరం వంటి పండ్ల విత్తనాల్లో ఎమిగ్ డాలిన్ అనే సమ్మేళన పదార్థం ఉంటుందని ఇది మానవ జీర్ణ ప్రక్రియ ఎంజైమ్ల తో కలిస్తే సైనెడ్ విడుదల అవుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. యాపిల్ విత్తనం పై గట్టి పూత ఉంటుంది. అంచేత విత్తనం లోపలి పదార్థం జీర్ణప్రక్రియ ఎంజైమ్ తో కలవదు. పొరపాటున ఒక గింజ ఎవరైనా మింగిన ప్రమాదం లేదు. అది మానవ శరీరంలో ఎటువంటి మార్పు చెందకుండా విసర్జితం అయిపోతుంది. కానీ ఎక్కువ […]
మౌనం కాపాడదు !
మీ నిశ్శబ్దం మిమ్మల్ని రక్షించదు అంటోంది తమన్నా. ముఖం పై నల్లని అరి చెయ్యి నొక్కుతూ ఉన్నట్లుగా కనిపించే ఒక ఫోటో ని ట్విట్టర్ లో ఉంచింది తమన్నా ఆ ఫోటో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతితో జాత్యాహంకార దాడులకు వ్యతిరేకంగా అమెరికా ప్రజలు రోడ్డెక్కారు ఆ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ. ఇది కేవలం నల్లజాతీయుల సమస్య మాత్రమే కాదు అందరి జీవితాలకు సంబంధించిన విషయం అంటూ ‘ఆల్ లైఫ్స్ మేటర్’ పేరుతో ట్వీట్ చేసింది తమన్నా.
నిజమైన హీరో
మనసున్న మనిషిగా రుజువు చేసుకున్నారు అక్షయ్ కుమార్. భారత దేశంలో గొప్ప దాతృత్వం ఉన్న సెలబ్రిటీ అక్షయ్ కుమార్.కరోనా నివారణ చర్యలు కోసం 30 కోట్ల విలువైన సాయం అందించారు అనే ఫోర్బ్స్ పత్రిక చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో మన దేశం నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక వ్యక్తి అక్షయ్.కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ ఇబ్బందులు పడుతున్న ఎందరికో సాయం చేసి నిజమైన హీరో గా […]
సమస్తం తాటాకు తోనే
తమిళనాడులో ముఖ్యంగా కారైకుడి, చిట్టినాడ్ ప్రాంతాల్లో తాటిచెట్ల సంఖ్య ఎంతో ఎక్కువ. అక్కడి హస్తకళా వస్తువుల తయారీలో తాటాకే అత్యంత కీలకం.తాటి ఆకులతో ఎన్నో అందమైన వస్తువులను తయారుచేస్తారు. దీన్ని కొట్టాన్ కళ అంటారు. పెళ్లిళ్లలో తెచ్చే చీరలూ మిఠాయిలూ సారెలో వాటిని ఉంచే బాక్సులూ ట్రేలూ మొదలైనవి అన్ని తాటాకుతోనే అల్లుతారు. వర్షాకాలపు గొడుగులు దగ్గర నుంచి పిల్లలు ఆడుకొనే గిలక్కాయలూ బ్యాగ్ లు పూలదండలు. ఇలా తాటితో అల్లిక లెన్నో ఉన్నాయి. లేత తాటాకును […]
ఆమె మా గర్వం
కరోనా లక్షణాలతో వచ్చే వారికి మోనా చికిత్స చేస్తుంది ప్రతి రోజు ఆమె మారథాన్ లో పరుగులు తీస్తోంది అంటున్నారు. ది ఫ్లయింగ్ సిఖ్ మిల్ఖా సింగ్ ఆయన కూతురు మోనా మిల్ఖా సింగ్ న్యూయార్క్లోని మెట్రోపోలిటియాన్ హాస్పిటల్ సెంటర్ లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ వార్డ్ లో ఫిజిషియన్ గా సేవలందిస్తున్నారు.లక్షల్లో బాధితులు ఆస్పత్రులో చనిపోతున్నారు. నాలుగు లేయర్ల ప్రొటెక్టివ్ సూట్ ధరించి రోజులో 12 గంటల పాటు ఆస్పత్రిలో గడుపుతోంది మోనా మిల్కా సింగ్.ఆమె పని […]
పోషకాల ఖజానా
దోర జామ కాయ పోషకాల ఖజానా అంటున్నారు ఎక్స్పర్ట్స్.రోగ నిరోధక శక్తి మెండుగా ఉండే ఆహారం జామపండు.ఈ పండులో విటమిన్-సి చాలా ఎక్కువ.ఇన్ఫెక్షన్లను రానివ్వదు100 గ్రాములు,లేదా కప్పు పండ్ల ముక్కల నుంచి రోజులో మనకు కావల్సిన దానికంటే ఎక్కువగానే సి- విటమిన్ అందుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఎంతో మేలు చేస్తుంది.ఇందులోని వగరు మ్యూకప్ ను పలుచగా చేస్తుంది.జలుబు దగ్గు తగ్గిపోతాయి. రోజుకు జామ పండు తింటే మంచిది.
అంతకు మించిన అందం
అందరికీ అందమైన ఆధునికమైన నగలు చాలా ఇష్టం.వాటిని భద్రపరిచే పెట్టెలు కూడా అందంగా కనబడితే బాగుంటుందనే ఉదేశ్యంతో తయారు చేశారు డిజైనర్ ట్రింకెట్ బాక్స్ లు.ఇవి కేవలం నగల పెట్టలేక కాదు అలంకరణ వస్తువులు లాగా కూడా ఉపయోగపడతాయి డ్రెస్సింగ్ టేబుల్ పైనా షోకేస్ లోను పెడితే చక్కగా ఉంటాయి. ఎంతో అందమైన రంగుల్లో రంగు రాళ్ళు పొదిగిన ఈ డిజైనర్ ట్రింకెట్ బాక్స్ లు ఎన్నో చక్కని రూపాల్లో కనిపిస్తున్నాయి రథం, పడవ, స్ట్రాబెర్రీ, పూలబుట్ట, నెమలి […]
శిరోజాలకు మెరుపు
ఎండ వేడికి వెంట్రుకలు నిర్జీవంగా అయిపోతాయి అలాటప్పుడు కొబ్బరిపాలతో జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది. పావు కప్పు పచ్చి కొబ్బరి పాలు అరటిపండు స్పూన్ ఆముదం కలిపి మెత్తని పేస్టులాగా చేసి ఆ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఓ అరగంట అలా ఉంచి తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా జుట్టు రాలకుండా ఉంటుంది. కొన్ని కొబ్బరి పాలు గుడ్డులో తెల్లసొన చంచా […]
గిరిజన సేవలో ఉమా ప్రేమాన్
గిరిజనులు పిల్లల కోసం అట్టప్పాడి రెండేళ్ల కిందట ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభించింది ఉమా ప్రేమాన్. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషలు నేర్పటం తో పాటు మార్షల్ ఆర్ట్స్, సంగీతం, నృత్యం కూడా బోధిస్తారు.ఇరవై సంవత్సరాలుగా పేదలకు ఎన్నో విధాలుగా ఆధారంగా ఉన్నఉమా ప్రేమాన్ కేరళలో అట్టప్పాడి దత్తత తీసుకున్నారు. గిరిజనుల సంక్షేమం కోసం మహిళలకు రుణాలు ఇప్పించి టైలరింగ్, విస్తరాకులు కుట్టటం, శానిటరీ నాప్ కిన్స్ రూపొందించటం నేర్పించారు వీ […]
కల నిజమాయే !
లాక్ డౌన్ ఎప్పుడూ లేనంత విశ్రాంతి సమయాన్ని ఇచ్చింది.ఈ సమయాన్ని ఎంతో శ్రద్ధగా ఒక నెరవేరని కలని నిజం చేసేందుకు వినియోగించుకున్నాను అంటుంది నటి ఐశ్వర్య రాజేష్.నాకు మొదటినుంచి డాన్స్ చాలా ఇష్టం.క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని కలలు కనేదాన్ని.చదువు ఇంకా చిన్న ఉద్యోగాలు చేయటంతో అది సాధ్యం కాలేదు తరువాత సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక డాన్స్ నేర్చుకోవడం కాలే అనుకొన్నా ఇంతలో ఈ లాక్ డౌన్ పీరియడ్ వచ్చింది. పూర్తి సమయాన్ని నృత్యం నేర్చుకోవటం లోనే […]
ఇది కొత్త సమస్య
కరోనా సమయంలో సెల్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. వర్చువల్ ప్రపంచంలో యువతరం ఎక్కువసేపు గడుపుతోంది. వండిన, తినా,కొత్త డ్రెస్ వేసుకొన్న ఒక పాట పాడిన, పుస్తకం చదివిన అవన్ని సెల్ లో క్లిక్ మనిపించడం సోషల్ మీడియాలో పెట్టటం ఒక లైక్ ల కోసం ఎదురు చూడటం సర్వ సాధారణం అయిపోయింది. కానీ ఈ లైక్ ల కోసం ఎదురు చూడటం సెల్ఫీలు పోస్ట్ చేసి రెస్పాన్స్ కోసం ఎదురు చూసే యువత లో ఈటింగ్ డిజార్డర్స్ […]
ఇకపై అన్ని ఆన్ లైన్ లోనే
కరోనా భయంతో కొనుగోళ్ళు అమ్మకాలు ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనే ఎక్కువగా సాగనున్నాయి. ఫ్యాషన్ వీక్ లు కూడా డిజిటల్ బాట పట్టాయి ఈ మధ్య జరిగిన షాంఘై ఫ్యాషన్ వీక్ లో 150 మంది డిజైనర్లు తమ బ్రాండ్ ని ప్రదర్శించారు. ‘ టి మాల్ ‘ వేదికగా ఫ్యాషన్ షో ని ఆన్ లైన్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.అప్పటికప్పుడే చూడండి కొనండి అనే నినాదం తో మొదలైన ఈ షోని 15 […]
ప్రతి రోజూ అవసరం
కరోనా నియంత్రణలో భాగంగా ఇల్లు మొత్తం క్రిమిరహితం చేయాలి. ఇంట్లో బల్లులు తలుపులు గడియలు స్విచ్ లు టాప్ లు శుభ్రంగా తుడవాలి చేతులకు డిస్పోజబుల్ లేదా తిరిగి ఉపయోగించే చేతి తొడుగులు ధరించాలి. పరుపులు సోఫాల పైన కవర్లు వారానికొకసారి తీసి ఉతికినవి వేయాలి. ఒకటికి రెండింతలు చొప్పున 60 శాతం ఐసో ప్రొఫైల్ ఆల్కహాల్, 90 శాతం నీళ్లలో శానిటైజర్ తయారు చేసుకోవాలి లేదా లీటర్ నీటిలో ఏడు గ్రాముల బ్లీచింగ్ పౌడర్ వేసి […]
కప్పు టీ మంచిదే
ప్రతి రోజు కప్పు టీ తాగితే ఆరోగ్యమే అన్ని రకాల టీ లలో ప్రధానంగా కెఫిన్,ఫ్లవనాయిడ్స్,ఫ్లేవనాయిడ్ లేవు నోట్స్ అనే జీవ రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్ ఎల్ డి ఎల్ ను తగ్గిస్తాయి.కొవ్వు పధార్దాలైన టీ గ్లిజరాయిడ్స్ ను కొంత మేరకు తగ్గిస్తాయి. టీ తాగడం వల్ల కొవ్వు పేరుకోవడం తగ్గుతోంది.పాలు ఎక్కువగా ఉండే వైట్ టీ కాస్త తేలిగ్గా ఉండే టీ ఆకులతో తయారవుతోంది కెఫిన్ కూడా చాలా తక్కువ. బ్లాక్ […]
చర్మానికి మెరుపులు
ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక ముఖం ఎండ వేడికి కమిలిపోకుండా ఫ్రూట్ ప్యాక్ వేసుకుంటే మేలు. ముందుగా ముఖం నీళ్లతో శుభ్రం చేసుకుని పాలతో కూడిన క్లెన్సర్ వాడాలి. చిన్న గిన్నెలో పాలు పోసి అందులో కాటన్ బాల్ ను మంచి మెడ ,ముఖం చుట్టు రుద్దాలి. తరువాత నిమ్మరసం వేసినా స్క్రాబ్బర్ తో రుద్దితే చర్మం పైన మలినాలు పోతాయి పొడిబారిన చర్మానికి తేనె రాసి పది నిమిషాలు ఆగి నీళ్లతో శుభ్రం చేసుకోవచ్చు.అరటిపండు, […]
శానిటైజర్ డేంజర్
కరోనా వైరస్ ఒక్కటే కాదు నిరంతరం చేతుల్లో ఉండే ఫోన్ పైన టాయిలెట్ సీట్ పైన ఉన్నంత బ్యాక్టీరియా ఉంటుందంటున్నాయి అధ్యయనాలు.ఈ ఫోన్ శుభ్రం చేసేందుకు శానిటైజర్ వాడితే అందులో ఉండే గాఢత కలిగిన ద్రావకం మూలంగా ఫోన్ పాడయ్యే అవకాశం ఉంది.కొలిన్ వంటి ద్రావకం కొంత నయం.నేరుగా వాటిని ఫోన్ పైన చల్లకుండా మెత్తగా ఉండే మైక్రో ఫైబర్ వస్త్రాన్ని తీసుకొని దాని పైన ద్రావకం చెల్లి ఫోన్ ను సున్నితంగా తుడవాలి.శానిటైజర్ లిక్విడ్ […]
ఇలా చేసి చూడండి
ఈ లాక్ డౌన్ సమయంలో ఎంత తీరికగా అనిపిస్తూ ఒత్తిడికి గురి చేస్తోంది .ఆ ఎఫెక్ట్ మొహం పైన కనిపిస్తోందని ఎంతోమంది అమ్మాయిల ఆరోపణ.ఒత్తిడి ఎన్నో సమస్యలకు మూలం.ముందుగా ముఖ చర్మం పాడవుతుంది చర్మం నిర్జీవంగా తయారై బ్లాక్ హెడ్స్ వస్తాయి. జుట్టు రాలిపోతుంది వీటికి ఇంట్లో వస్తువుల తో పోగొట్టవచ్చు.తేనె లో నిమ్మరసం కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్నచోట క్రమంతప్పకుండా రాస్తే కొద్ది రోజుల్లోనే తేడా తెలుస్తుంది.వెంట్రుకలు నిర్జీవంగా మారిపోతే ఆలివ్ నూనెలో తేనె కలిపి […]
పసివాడికి షారుక్ అండ
బీహార్ లోనే ముజాఫ్ఫార్ పూర్ రైల్వే స్టేషన్లో శ్రామిక రైల్లోంచి. అర్బీనా ఖాతున్ అన్న యువతి శవాన్ని దించారు ఆమె కొడుకు రెండేళ్ల వాడు తల్లికి కప్పిన దుప్పటి తీస్తూ ఆమె లేవమని అడుగుతూ ఆడుతున్న దృశ్యాన్ని వీడియో ద్వారా ప్రపంచం మొత్తం చూశారు. భర్త వదిలేసిన అర్బీనా బీహార్ నుంచి గుజరాత్ వలస వెళ్లి పిల్లవాడితో బ్రతుకుతుంది.లాక్‌డౌన్ లో శ్రామిక రైల్లో తన స్వస్థలం కటిహార్ కు బయలుదేరి దారిలో చనిపోయింది.ఆమె కొడుకును వీడియోలో చూసి […]
