నిరంతరం పని వల్లే ఆ సమస్య
నిరంతరం ఏదో పని చేస్తూ సబ్బు వాడుతూ రసాయనాలతో సింక్ లు శుభ్రం చేస్తూ ఉంటే చేతులు చాలా గరుగ్గా ఉంటాయి.చల్లని రుతువుల్లో మీ చేతులను మరింత పొడిబారి పగుళ్లు కూడా వస్తాయి. రెండు స్పూన్ల ఆలీవ్ నూనె లో పంచదార కలిపి అర చేతులకు రాసుకుని బాగా రుద్దాలి .తర్వాత కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి అలాగే ఓట్స్ ని కొద్దిగా మెత్తగా పిండిలా అయ్యేలా చేసి ఆ పిండిలో ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని […]
ఒక ప్రత్యేకత కావాలి
ఎవరికి వాళ్లకు తాము ప్రత్యేకంగా కనిపించాలని ఒక కోరిక ఉంటుంది అలాంటప్పుడు కనిపించిన ప్రతి ఫ్యాషన్ ను అనుసరించటం వల్ల లాభం ఏమి ఉండదు. అలా ప్రత్యేకంగా కనిపించాలి అంటే మీ కోసం ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకోండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.కేశాలంకరణ లోనూ బొట్టు లోనూ వస్త్రధారణలోనూ ఒక ప్రత్యేకత ఉండాలి దాన్ని మార్చకుండా ఒక స్టైల్ స్టేట్ మెంట్ గా చేసుకోవాలి.ఉదాహరణకు విద్యాబాలన్ ఎప్పుడూ అంచున చీరలతో,వాణిశ్రీ పెద్ద కొప్పు తో ఒక రాజకీయ నాయకురాలు […]
పాటలతో సాయం
కోవిడ్ సమయం ఇది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి విరాళాలు ఇస్తానంటే వ్యక్తిగతంగా పాటల్ని అంకితం చేస్తా, మీ స్నేహితులకు బంధుమిత్రులకు పుట్టినరోజు విషెస్ చెబుతానని చెప్పాను. కొన్ని నెలలుగా ఇప్పటికీ మూడు వేల పాటలు వీడియోలు చేశాను. 85 లక్షల విరాళాలు అవసరం ఉన్నవారికి నేరుగా వారి ఖాతాలోకి వెళ్లే లాగా చేశాను. ఒక ఎన్నారై లక్షన్నర రూపాయలు విరాళం ఇచ్చాను అంటూ చెప్పింది గాయని చిన్మయి.మనుషుల్లో మానవత్వం మిగిలి ఉందని చెప్పేందుకు ఇంతకంటే ఇంకే ఉదాహరణ […]
సవాళ్లే అవకాశాలు
అమెరికాకు చెందిన తయారీ రంగ సమస్త ఫ్లెక్స్ సి.ఇ.ఓ రేవతి అద్వైతి .ఆపిల్, సోర్ట్,జాన్సన్ అండ్ జాన్సన్ గూగుల్ ఫియట్ వంటివి సంస్థలు తమ ఉత్పత్తులకు సంబంధించి విడిభాగాల తయారీని ఫ్లెక్స్ సంస్థకు ఔట్ సోర్సింగ్ కు ఇస్తాయి. కరోనాతో ఈ పనులు కాస్త వెనకబడ్డాయి. ఈ సమయంలో రేవతి కరోనా కు సంబంధించిన వస్తువుల తయారీ చేపట్టారు వెంటిలేటర్లు, హాస్పిటల్ బెడ్ వంటివి ఆర్డర్ తీసుకున్నది. 30 ఏళ్ల కెరీర్ లో ఇది కష్ట సమయం […]
కాబోయే మహిళ సి.ఇ.ఓ జేన్ ఫ్రేజర్
150 లక్షల కోట్ల విలువ ఉన్న అమెరికాలోని సిటీ బ్యాంక్ కు సీ ఇ ఓ గా రాబోయే ఏడాదిలో బాధ్యతలు తీసుకున్నారు జేన్ ఫ్రేజర్.స్కాట్లాండ్ లో పుట్టిన జేన్ కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. హోవార్డ్ లో ఎంబీఎ చేశారు. 2014లో కన్జ్యూమర్ అండ్ కమర్షియల్ బ్యాంక్ బాధ్యతలను అదనంగా 2016లో లాటిన్ అమెరికా బాధ్యతలను స్వీకరించారు. వాల్ స్ట్రీట్ లోని ప్రసిద్ధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల్లో ఇప్పటి వరకు మహిళా […]
రాధా వేంబు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది.ఈ సంవత్సరం మన దేశం నుంచి ఐదుగురు మహిళలు ఈ జాబితాలో ఉన్నారు అందులో జోహో కార్ప్ అనే సాఫ్ట్ వేర్ సంస్థకు చెందిన రాధా వేంబు కూడా ఒకరు.ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆస్తితో ఆమె ఆ కంపెనీలో పెద్ద వాటాదారు.ఈ కంపెనీని రాధా వేంబు సోదరుడు శ్రీథర్ వేంబు1996లో స్థాపించారు. వేంబు ఈ-మెయిల్ సర్వీస్, జోహో మెయిల్‌లకు ప్రొడక్ట్ మేనేజర్‌గా, కార్పస్ ఫౌండేషన్‌కు […]
స్మితా కృష్ణా గోద్రెజ్
ఫోర్బ్స్ వెల్లడించిన భారతీయ మహిళ శ్రీమంతుల జాబితాలో ఉన్నారు స్మితా కృష్ణా గోద్రెజ్.గృహోపకరణాలు, ఫర్నిచర్ మొదలైన వినియోగ వస్తువుల తయారీ సంస్థ గోద్రెజ్. 4.7 బిలియన్ డాలర్ల ఖరీదైన ఈ సంస్థలో స్మితాకు ఐదో వంతు వాటా ఉంది.70 ఏళ్ళ వయసులో ఉన్న స్మితా కృష్ణా గోద్రెజ్ వ్యాపార సంస్థ బాధ్యతలు చూసుకుంటున్నారు.స్మితా నౌరోజీ గోద్రెజ్ సెంటర్ ఫర్ ప్లానెట్ రీసెర్చ్ రాప్టార్ రీసెర్చ్ అండ్ కన్సర్వేషన్ ఫౌండేషన్‌కు అధిపతి కూడా ఆమె ఆస్తి విలువ 16 […]
కిరణ్ మజూందార్ షా
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం ఈ సంవత్సరపు మహిళ శ్రీమంతుల లిస్ట్ లో కిరణ్ మజూందార్ షా ఉన్నారు. ఆమె ఆస్తి విలువ 30 వేల కోట్ల రూపాయలు.బయో ఫార్మసూటికల్ సంస్థ బయోకాన్‌తో స్వతంత్రంగా ఎదిగిన మహిళ కిరణ్ మజూందార్ షా.ఈమె మహిళా ధనవంతుల్లో రెండవ స్థానంలో ఉన్నారు. 1978లో బయోకాన్ స్థాపించారు ఇండియాలో అతిపెద్ద బయోఫార్మసూటికల్ సంస్థ ఇది కిరణ్ మజూందార్ షా వయస్సు 67.
సావిత్రీ జిందాల్
ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో అత్యంత ధనవంతురాలైన మహిళగా సావిత్రీ జిందాల్ గుర్తింపు పొందారు.ఆమె ఆస్తి విలువ 50 వేల కోట్ల రూపాయలు వయస్సు 70. ఎంపికైన ఐదుగురు మహిళా ధనవంతుల్లో మొదటి స్థానం సావిత్రీ జిందాల్ కు దక్కింది. ఆమె భర్త ఒ.పి జిందాల్, జిందాల్ గ్రూప్ సంస్థల స్థాపకుడు.మల్టీ బిలియన్ డాలర్ల విలువ చేసే మిశ్రమ వ్యాపార సంస్థల అధిపతిగా సావిత్రీ జిందాల్ వ్యవహరిస్తున్నారు.2005 లో హెలీకాప్టర్ ప్రమాదంలో భర్త మరణించటంతో […]
టెక్ గురు తన్వి అరవింద్
14 సంవత్సరాల కే స్టార్టప్ ప్రారంభించింది అందరి ఆశీర్వచనాలు పొందింది.తన్వి అరవింద్ చెన్నైలో శిష్య స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేసింది.తొమ్మిదో తరగతి లో ఉండగానే ‘టెక్ ఎడ్ ఎన్’ అనే స్టార్టప్ ని ప్రారంభించింది. వృద్ధులకు టెక్నాలజీ బోధించడం ఈ స్టార్ ఉద్దేశ్యం.వృద్ధులు ఒంటరిగా ఉన్నప్పుడు అయిన వారు అందుబాటులో లేనప్పుడు సులువుగా సాంకేతికత వాడుకొని అవసరాలు తీర్చుకొనేలా చెయ్యటం తన్వి ప్రధాన లక్ష్యం.టెక్నాలజీ తో ఉబర్ బుక్ చేసుకోవటం ఆహారం ఆర్డర్ చేసుకోవటం […]
పెద్ద వాళ్ళకి టెక్ పాఠాలు
ఈజీ హోమ్ అనే కొత్త స్టార్టప్ ప్రారంభించింది వృద్ధులకు డిజిటల్ స్కూల్ నేర్పిస్తున్నారు బెంగళూరుకు చెందిన అక్కాచెల్లెళ్ళు శ్రీయ బజాజ్ సురభి.కరోనాతో అందరూ ఇంటికే పరిమితమైన సందర్భంలో స్మార్ట్ ఫోన్ లో ఆన్ లైన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేయటం పెద్ద వాళ్లకు సరిగ్గా తెలియక ఇబ్బందులు పడుతున్నారు.ఎం.బి.ఏ పూర్తి చేసిన ఈ యువ వ్యాపారవేత్తలు పెద్ద వాళ్ల కోసం జూమ్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ వాడకం ఆన్ లైన్ లో సరుకులు ఆర్డర్ చేయటం […]
స్నాక్స్ బదులు బాదం బెస్ట్
అమెరికా జనరల్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రచురించిన కథనం ప్రకారం గుండె సంబంధిత అనారోగ్యాలు మానసిక ఒత్తిడే కారణం. ఒత్తిడికి గురైనప్పుడు గుండె కొట్టుకునే లయ మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారం స్నాక్స్ బదులు బాదం గింజలు తింటే ఒత్తిడిలో ఉన్నప్పుడు గుండె కొట్టుకునే తీరు ఎప్పటి లాగే ఉంటుందని గుండె చక్కగా పనిచేస్తుంది అని చెబుతోంది.గుండె సంబంధమైన జబ్బులకు దారితీసే మానసిక సమస్యల్లో మొదటిది ఒత్తిడే అంటున్నారు శారీరక వ్యాయామం, పోషకాలున్న ఆహారం, ఆరోగ్యవంతమైన జీవన శైలి […]
చర్మకాంతి కి మసాజ్
ఒత్తిడి అలసట తగ్గాలన్న. అందాన్ని కాపాడుకోవాలి అనుకున్న ఒంటికి తలకు నూనె మసాజ్ చేసుకోవాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.మసాజ్ తో చర్మానికి తేమ అంది నిగారింపుగా ఉంటుంది. ఎండకు కమిలిన దేహం రంగు మారిన చర్మం సాధారణ స్థితికి వస్తాయి.కండరాల నొప్పులు తగ్గుతాయి.ఆలీవ్ నూనె తలకు పట్టించి మర్దనా చేస్తే తలభారం తగ్గుతుంది.అలాగే కొబ్బరి నూనెలో విటమిన్-ఇ గుణాలు ఎక్కువ.దాన్ని వేడి చేసి ఒంటికి రాసి మృదువుగా కాసేపు మర్దన చేస్తే పొడిబారిన చర్మం సాధారణ స్థితికి వస్తుంది.ఈ […]
ఇక నీరసం రాదు
ఎక్కువ సమయం వ్యాయామం చేసిన డిహైడ్రేషన్ సమస్య వస్తుంది.పోషకాహార నిపుణులు మై 22 బి.ఎం.ఐ వ్యవస్థాపకురాలు ప్రీతి త్యాగి ఏమంటారంటే క్రీడాకారులు, జిమ్ కు వెళ్ళే వాళ్ళు ఎదుగుతున్న పిల్లలు వాటర్ బాటిల్ లో ఉప్పు నిమ్మరసం కలిపిన నీళ్ళు వెంట తీసుకుపోవాలి.ఈ నీళ్లు తాగితే ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. నీళ్ళతో పాటు తాజా పండ్లు కూరగాయలు ఎక్కువ శాతం నీళ్లు ఉండే కీరదోస, చిలకడదుంప, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, నిమ్మజాతి పండ్లు తినాలి.గ్లాస్ వేడి […]
చిన్ని చేతుల సాయం
కరోనా పోరులో చిన్నారులు కూడా భాగం పంచుకుంటున్నారు కలకత్తాలోని పార్క్ సర్కస్ అనే మురికివాడలో కరోనా కేసులు అధిక సంఖ్యలో ఉన్నాయి.అంతటా లాక్ డౌన్ విధించారు అక్కడకు 14 ఏళ్ల అమ్మాయి ముర్షిదా ఖాటూన్ తన15 మంది మిత్రబృందంతో సహాయ చర్యలు చేపట్టింది.సేవ స్వచ్ఛంద సంస్థ అక్కడి పిల్లలకు విటమిన్ ఎ, పాలు సరఫరా చేస్తుంది ఈ ముర్షిదా ఖాటూన్ బృందమే ఆ మాత్రలు పాలు తల్లిదండ్రులకు అందిస్తోంది. నీళ్లు పట్టుకొనే చోట ఈ పిల్లలే క్యూ […]
అయితే పోషకాల లోపమే
పోషకాహార లోపం గురించి శరీరం తప్పకుండా కొన్ని సంకేతాలస్తూ ఉంటుంది.కాలిన గాయాలు తగ్గకపోవడం జలుబు దగ్గు ఫ్లూ వంటివి తరచు రావటం శరీరంలో విటమిన్ సి లోపం కావచ్చు.ఆకుకూరలు సిట్రస్ పండ్లు క్యాప్సికం వంటివి రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.జుట్టు రాలి పోతున్న, నీరసం ఆయాసం వంటివి ఉన్నా ఇనుము తగ్గినట్లు అనుకోవచ్చు.కాళ్లు చేతుల నొప్పి ఉన్న కీళ్ల దగ్గర భరించలేనంత బాధ ఉంటే విటమిన్ డి క్యాల్షియం తగ్గినట్లు గుర్తించవచ్చు.ఈ రెండు […]
ఈ ప్యాక్ లతో శిరోజాలకు మెరుపు
జుట్టు పొడిబారి చివర్లు చిట్లి పోతు,వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు వస్తే ఈ సహజమైన పదార్థాల మందుల కంటే బాగా పనిచేస్తాయి అంటున్నారు వైద్యులు.రెండు కప్పుల మునగాకు రుబ్బుకుని దానికి టేబుల్ స్పూన్ ఆముదం చెంచా పెరుగు కలిపి తలకు పూతలా వేసుకోవాలి.20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే దీనివల్ల కుదుళ్లు ఆరోగ్యం గా మారి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.అలాగే కలబంద గుజ్జు రాసి ఆరేవరకు జుట్టును అలా వదిలేసి తలస్నానం చేస్తే శిరోజాలు మెరిసిపోతాయి.మెత్తగా కుచ్చులా […]
లీనా తివారి
21 వేల కోట్ల రూపాయల ఆస్తి తో లీనా తివారి అత్యంత ధనవంతురాలైన భారతీయ మహిళగా ఫోర్బ్స్ గుర్తించింది.యు.ఎస్.వి అనే ముంబాయి లోని ఫార్మాసూటికల్ కంపెనీ అధిపతి లీనా తివారి.ఈ కంపెనీ వార్షిక ఆదాయం 449 మిలియన్ల డాలర్లు.ఈ ఫార్మాసూటికల్ కంపెనీ ప్రధానత మధుమేహం, హృద్రోగ ఔషధాలను తయారు చేస్తుంది. 63 సంవత్సరాల లీనా తివారి తండ్రి స్థాపించిన కంపెనీ ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు.
ఇది సహజమైన పద్ధతి
కళ్ల దగ్గర చర్మం పలచగా ఉండటంతో సూర్యరష్మిలోని హానికారక కిరణాలు కళ్ల దగ్గర చర్మాన్ని తొందరగా ముడతలు పడేలా చేస్తాయి.నల్లని వలయాలు ఏర్పడతాయి సహజ పద్ధతిలో ఈ వలయాలు పోగొట్టాలంటే ఎండలో బయటకి వెళ్లేప్పుడు క్రీమ్ రాసుకోవాలి.బంగాళదుంప లోని ఎంజైమ్స్ ఇన్ ఫ్లమేషన్ తగ్గించి కళ్ళకింద చర్మాన్ని బిగుతుగా చేస్తాయి.బంగాళదుంప పల్చగా ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో ఉంచాలి.వాటిని కళ్ళ పైన పెట్టుకొని ఆ చల్లదనం పోయేవరకు విశ్రాంతిగా ఉండాలి.అలాగే కీరదోస లో కూడా చర్మాన్ని మృదువుగా […]
ఈ ఆకే ఔషధం
తమలపాకులు చర్మసౌందర్యానికి ఉపయోగపడతాయి మొహం పై మొటిమలు,వాటి తాలూకు మచ్చలను ఈ తమలపాకు తగ్గిస్తుంది.రెండు మూడు తమలపాకులు మెత్తగా చేసి అందులో పసుపు తేనె కలిపి మొహానికి రాసుకుని బాగా ఆరిపోయాక కడిగేయాలి.తమలపాకు లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు తగ్గిస్తాయి.అలాగే నీళ్లలో తమలపాకులను బాగా మరిగించి వడకట్టి అందులో తేనె,నిమ్మరసం కలిపి మొహానికి రాసుకుంటే చర్మానికి తేమ అంది తాజాగా అయిపోతుంది.నీళ్లలో కొన్ని చుక్కల తమలపాకు నూనె వేయాలి.అలాగే ఈ నూనె వేడి […]
