అండా దండా అన్నీ నాన్నే
పిల్లల శారీరక మానసిక అభివృద్ధిలో తండ్రిదే ముఖ్య పాత్ర అంటున్నాయి అధ్యయనాలు.తండ్రితో స్నేహంగా ఎక్కువ సమయం గడిపే పిల్లలు సామాజిక సంబంధాలు మెరుగుపరచుకోవడం లో ముందుంటారని సైకాలజిస్ట్ లు చెబుతున్నారు. ముఖ్యంగా తండ్రి తో సన్నిహితంగా ఉండే ఆడపిల్లలు భవిష్యత్తులో ఒక భరోసాతో ధైర్యంతో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కు దూరంగా ఉంటారని ఇంకో అధ్యయనం చెబుతోంది.కొడుకుతో తన భావాలను ఆశయాలు ఆలోచనలు పంచుకోగలితే ఆ తండ్రే కొడుక్కి రోల్ మోడల్ అవుతాడని అధ్యయనాలు చెబుతున్నాయి.ఆధునిక జీవితం […]
ఇదే అసలైన ఔషధం
శరీర బరువును కొద్దీ కిలోలు తగ్గించుకున్న మధుమేహం ముప్పు సగానికిపైగా తగ్గిపోతుందని తాజా అధ్యయనం చెబుతోంది బ్రిటన్ నార్ఫోక్ నార్విచ్ విశ్వవిద్యాలయ ఆస్పత్రి శాస్త్రవేత్తల అధ్యయనం ఫ్రీ డయాబెటిస్ లో ఉన్నవారు రెండేళ్లపాటు తమ జీవన శైలిలో చిన్న మార్పులు చేసుకోవటం ఆహార విషయంలో జాగ్రత్త,శారీరక శ్రమ కండరాలను పరిపుష్టం చేసే వ్యాయామం చేయటం ఆహారంలో సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించటం ద్వారా మధుమేహం ముప్పు తగ్గించుకోవచ్చు నని చెప్పారు.
మాసాన్ (హిందీ) (2015)
వారణాసి నగరం చుట్టూ అల్లిన కథ మాసాన్ (Masaan) దేవి తన బాయ్ ఫ్రెండ్ తో ఒక హోటల్ లో పోలీసులకు పట్టుబడుతుంది అవమానంతో అతను ఆత్మహత్య చేసుకుంటాడు.తనకు మూడు లక్షలు ఇస్తే కేస్ వదిలేస్తానని దేవి తండ్రితో పోలీస్ ఇన్ స్పెక్టర్ భేరం ఆడుతాడు. ఇంకోవైపు హరిశ్చంద్ర ఘాట్ లో శవదహనం చేసే కుటుంబంలో పుట్టిన దీపక్ శాలు గుప్తా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అతన్ని వివాహం చేసుకునేందుకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని చెబుతుంది […]
వాళ్ళు మనకే తెలుసు
‘కన్నా మూచి’ అనే సినిమా తీస్తున్నా. ప్రపంచంలో ధైర్యవంతులైన మహిళలున్నారు.వారు మనకు తెలుసు అలాంటి వాళ్ళు మన లోనే ఉన్నారు.మనతోనే ఉన్నారు అలాంటి వాళ్ల గురించి బలంగా చెప్పాలనుకున్నాను అంటూ పోస్ట్ చేసింది వరలక్ష్మి సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె గా మాత్రమే వార్తల్లో నిలవాలని అనుకోకుండా నాయకిగా,ప్రతినాయకగా కూడా తన శక్తిని నిరూపించుకుంది వరలక్ష్మి. నా చేతికి వచ్చిన అవకాశాలు నేనెప్పుడూ మిస్ అవ్వలేదు. ప్రతిసారీ నాయిక పాత్ర నే నా ప్రాధాన్యత ల్లో […]
అంతులేనన్ని ప్రశంసలు
ఆకాశమే నీ హద్దురా సినిమాలో కాటుక కనులే..పాట పాడింది దీక్షిత వెంకటేషం ‘దీ’ అంటేనే చాలా మందికి తెలుస్తుంది. పుట్టింది ఆస్ట్రేలియాలో తల్లి మీనాక్షిసుందరం కర్ణాటక సంగీత కళాకారిణి తండ్రి సంతోష్ నారాయణన్ ప్రముఖ సంగీత దర్శకుడు శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య సంగీతం లోనూ శిక్షణ తీసుకుంది దీక్షిత.14 సంవత్సరాల వయసులోనే సినిమా లో పడేసింది పిజ్జా- 2 లో ఆమె పాడిన పాటకు సంగీతం సమకూర్చింది తండ్రి సంతోష్ నారాయణన్ తాజాగా పాడిన కాటుక […]
సుస్వరాల మాలిక సుశీల
సినిమా రంగంలో 50 ఏళ్ల నుంచి పి. సుశీల పాడుతూనే ఉన్నారు.19 వేల పాటలు రికార్డుల్లో చూపించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నిలిచారు.తెలుగు తమిళం మలయాళం కూడా ఆమె ఆధ్యాత్మక గీతాల కు పెట్టింది పేరు.1955లో మిస్సమ్మ సినిమాలో ఆమె స్టార్‌డమ్ లోకి వచ్చారు. సినీ సంగీతం లో ఉండే అన్ని రకాల భావాలు సుసీల గారి గొంతులో పలికాయి. తెలుగు భాషా సౌందర్యం ఉచ్చారణ ద్వారా వచ్చే సొగసు సుశీల గారి పాటలో కనిపిస్తాయి. […]
రాళ్ళల్లో నీరు
నేను ఎంఏ చదివే రోజుల్లో నార్వే జాయిన్ నాటకం ఎడాల్స్ హౌస్ నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసింద. ఎప్పటికైనా దాన్ని తెరకెక్కించాలని అనుకున్నాను ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు దాన్ని స్క్రిప్ట్ చేశాను ‘రాళ్ళల్లో నీరు’ పేరుతో ఆ సినిమా వస్తోంది అంటోంది కిరణ్మయి ఇంద్రగంటి.ఎన్నో డాక్యుమెంటరీలు ఎన్నో రచనలు చేసిన అనువాదంతో ఆమె ఇప్పుడు దర్శకురాలిగా పరిచయం అవుతోంది ఐదు పాత్రలలో మనుషుల్లో అంతర్గతంగా ఉండే లోపాలను భావోద్వేగాలను విడిసి పెట్టేలా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను […]
ఫిట్ నెస్ కోసం యాపిల్ టీ
రోజుకు ఒక యాపిల్ తో అనారోగ్యాలు దగ్గరకు రావు అంటున్నారు కానీ ఇప్పుడు యాపిల్ టీ అంతకంటే ప్రయోజనకరం అంటున్నారు అధ్యయనకారులు యాపిల్ టీ ఫిట్ నెస్ తో పాటు శరీర బరువును అదుపులో ఉంచుతుంది రోగనిరోధకశక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.అలాగే ఉదర సంబంధమైన సమస్యలు అన్నింటికీ యాపిల్ టీ చక్కని ఔషధం.యాపిల్ టీ లో చర్మం కాంతివంతంగా తయారై మెరుపునిస్తుంది.
శరీరం చెప్పేస్తుంది
స్త్రీల మనసు చదివేయాలి అంటే వాళ్ళ శరీరం తీరు గ్రహిస్తే చాలు అంటున్నారు పరిశోధకులు. నిండైన కనుబొమ్మలు పాజిటివ్ ఎమోషన్స్ వ్యక్తం చేస్తాయని చురుగ్గా ఉండటం అన్న లక్షణాన్ని చెపుతాయి. పెదవులు పెద్దవిగా ఉంటే ఆత్మవిశ్వాసంతో ఉంటారు పెదవుల ఆకృతి చక్కగా ఉంటే వాళ్ళలో సృజనాత్మకత ఎక్కువ.పాదాల వేళ్ళలో రెండవ వేలు బొటన వేలు కన్నా పొడవుగా ఉన్న మహిళలు నాయకత్వ లక్షణాలతో ఉంటారు.ఎవరి గురించి అయినా ఒక అంచనా కు రావాలంటే వారి అలవాట్లు అభిరుచులు […]
ఇవి ఎంతో ప్రత్యేకం
కవిత నాగ్ వ్లోగ్స్ పేరుతో నాగలక్ష్మి ఆమె వదిన కవిత చేసే వంటకాల వీడియో లను లక్షలకొద్దీ వీక్షించారు ఇందులో ప్రత్యేకత ఏమిటంటే నాగలక్ష్మి కి చూపు లేదు స్పర్శతోనే చక్కగా వంట చేయగలదు కవిత వదినగా వచ్చాక ఈ ఛానల్ మొదలు పెట్టారు తొలి వీడియోనే వైరల్ అయింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు కు చెందిన నాగలక్ష్మి ప్రత్యేకత ఏమిటో ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది. ఆత్మవిశ్వాసం తోడుగా ఉంటే ఎలాంటి ఘనకార్యాలు అయినా సాధించవచ్చునని […]
కిటికీలో ప్రకృతి అందాలు
స్కై ఫ్యాక్టరీ (ఇ -స్కేప్ వర్చువల్ విండో ) అదర్ వ్యూ వంటి కంపెనీలు తయారు చేసే డిజిటల్ కిటికీలు అమర్చుకొంటే ఇంట్లో గంటల తరబడి బయటికి కదలకుండా కూర్చుంటూ,బయట ప్రకృతి కనబడదు అని దిగులు పడేవాళ్ళకి ఊరటగా ఉంటుంది. ఈ కిటికీలకు టివి తెర వంటి ఎల్ ఇడీ స్క్రీన్ ఉంటుంది. ఈ తెర పైన ప్రదర్శించే రకరకాల వీడియోలు కంపెనీలు అత్యధికమైన డిజిటల్ సినిమా కెమెరాలతో చిత్రీకరిస్తారు. వీటి నిడివి,అరగంట నుంచి 24 గంటలూ […]
ఇది కోవిడ్ కావచ్చు
శ్వాసకోశ వ్యాధులకు దురద తో కూడిన దద్దుర్లకు దగ్గర సంబంధం ఉందని కోవిడ్ రుజువు చేసింది కరోనా సోకిన వారిలో కొందరికి దురద దద్దుర్లు కనిపించవచ్చని ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన పరిశీలనలో తేలింది. దగ్గు, జలుబు, జ్వరం వంటి ప్రధాన లక్షణాలు లేకపోయినా కొందరిలో కోవిడ్ చర్మపు ర్యాష్ రూపంలో బయటపడవచ్చు. అయితే ఈ ర్యాష్,ఆటలమ్మ రూపంలో, చదునైన మచ్చల రూపంలోనూ ఉండవచ్చు. అయితే చర్మం పైన దద్దుర్లు దురదలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని […]
ఈ మాస్క్ లు బెటర్
ఇంటి వద్ద తయారు చేసుకోగలిగే మూడు పొరల కాటన్ మాస్క్ లు వైరస్ ను అడ్డుకుంటూ శ్వాసను తేలికగా పీల్చుకోగలవని ఇటీవల పరిశోధన చెబుతోంది.నాన్ క్లినికల్ మాస్క్ లు అన్న సూక్ష్మమైన పార్టికల్స్ ను సమర్ధవంతంగానే వడ పోస్తాయనీ, అన్నింటికంటే ఎన్ 95 సమర్ధవంతమైనదనీ,చెపుతున్నారు. ఇంటి దగ్గర తయారు చేసుకోనే మాస్క్ ల్లో చొక్కా కాలర్ల బిగుతు ధనానికి వాడే మెటీరియల్ మరింత మెరుగ్గా వైరస్ అడ్డుకుంటుందని తేలింది అయితే చాలా సార్లు ఉతికాక వీటి సామర్థ్యం […]
ఇదే మంచి మార్గం
మానసిక ఒత్తిడి రోజువారీ పనుల పైన ఎంతో ప్రభావం చూపెడుతుంది.జీవనశైలి మార్పులతో, నిపుణుల సలహాలు ఈ ఒత్తిడి నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్.ముందుగా ఒత్తిడిగా ఉందనే విషయం గ్రహించి అందులోంచి బయట పడే ప్రయత్నం చేయాలి. సానుకూలమైన ఆలోచనలలో ఉండాలి. ఆహార నిద్ర విషయాల్లో సమయపాలన పాటించాలి ఎవరిని వారు ప్రోత్సహించు కొన్ని ఇష్టమైన అభిరుచి కోసం సమయం ఇచ్చుకోవాలి. ఏదో ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉండే ఉంటుంది పుస్తకాలు, సంగీతం, షాపింగ్ స్నేహితులతో కబుర్లు, విండో […]
కాస్త ప్రత్యేకంగా
ఐ లైనర్ లో భిన్నమైన రంగులు ఎంచుకుంటే ప్రత్యేక సందర్భాల్లో మెరిసి పోవచ్చు అంటారు ఎక్సపర్ట్స్.రంగుల ఐ లైనర్ ఉపయోగించే ముందర కన్సీలర్ రాసుకోవాలి. ఇది కళ్ల దగ్గర చర్మం ఓకే రంగులో ఉండేలా చేస్తుంది. బ్లాక్ ఐ లైనర్ మరి నియాన్ గ్రీన్ బావుంటుంది.అలాగే బంగారు వర్ణపు ఐ లైనర్ కూడా కొత్త లుక్ ఇస్తుంది. కలర్ లిక్విడ్ ఐ లైనర్ అందుబాటులో లేకపోతే సన్నటి బ్రష్ పైన మేకప్ సెట్టింగ్ స్ప్రే చల్లాలి. దాన్ని […]
మతాల సారం నియమ బద్ద జీవితం
బంధాలు అనుబంధాలు మనం పుట్టేక ఏర్పడినవే.వీటిని శ్రద్ధగా పెంచి పోషించి కొంటేనే నిలుస్తాయి.మనం ఎవరి కడుపున పుడతామో మన చేతుల్లో లేదు. ఏ భాషా, ఏ ప్రాంతం, ఏ సంస్కృతి, ఏ మతం అన్ని విషయాలు మనం పుట్టిన తర్వాత మనం జీవించే చోట మన ఉనికిని బట్టి వచ్చి చేరతాయి.వయసు వచ్చాక క్రమంగా అర్థం చేసుకోవలసిన అంశాలు ఇవి. నిజానికి ఏ మతం, సంస్కృతి హింసను ప్రేరేపించదు అన్ని మతాల సారం నియమబద్ధమైన జీవితమే.పొరుగు వారిని […]
మేకలకు ఆశ్రయం
Leanne Lauricella (లియాన్నే లారిసెల్లా ) గోట్స్ ఆఫ్ అనార్క పేరుతో ఒక శాంక్చ్యురీనీ తన ఇంట్లో ఏర్పాటు చేసింది. ఇక్కడ. అంగవైకల్యం ఉన్న మేకలకు ఆదరణ లభిస్తుంది. న్యూ జెర్సీ లో ఉన్న ఇల్లు,ఇంటి వెనక గార్డెన్ ను ఫామ్ గా మార్చేసి,మేకలు,కొన్ని ఇతర జంతువులకు ఆశ్రయం కల్పిస్తోంది లియాన్నే. కళ్ళు లేని మేకలకు దాతల సాయంతో ప్రత్యేక వీల్ ఛైర్లు కూడా ఏర్పాటు చేశారు. ‘గోట్స్ ఆఫ్ అనార్క’ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లకు […]
శక్తినిచ్చే ఆహారం ముఖ్యం
కార్తీకమాసంలో ఉపవాసాలు చేసే వాళ్ళు అధికం అయితే ఈ నెల రోజుల పాటు ఉపవాసం ముగిశాక ఏదో ఒకటి అన్నట్లు తినకూడదు శరీరానికి శక్తినిచ్చేవి తినటం చాలా ముఖ్యం కొన్ని గంటల పాటు ఇవి తినకుండా ఉండి ఒకేసారి కొవ్వులుండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఉపవాసం తర్వాత పండ్లు తినటం మంచిది. పండ్లు తక్షణ శక్తిని ఇస్తాయి.రక్తంలో చక్కెర స్థాయి నియంత్రిస్తాయి. పండ్లలో నీటిశాతం ఎక్కువ కాబట్టి శరీరంలో ఉపవాసం వల్ల కోల్పోయిన నీటి భర్తీ చేసుకోవచ్చు.పండ్లలో […]
‘కమల చాలా ప్రత్యేకం’
అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన కమలా హ్యారిస్ మనస్తత్వం ఆమె పవర్ ఫుల్ డ్రెస్సింగ్ తోనే వ్యక్తమవుతోంది అంటారు ప్రముఖ డిజైనర్ ప్రియా కటారియా పూరి.గత 34 సంవత్సరాలుగా కమల మెడలో ముత్యాల ధరిస్తూ ఉన్నారు ముత్యాలు నమ్మకం విశ్వాసాలకు ప్రతీక వీటిని ధరించి ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు.అదే సమయంలో స్నీకర్స్ ధరిస్తూ తన సిగ్నేచర్ స్టయిల్ కు అదనపు విలువ జోడించారు.నలుపు, గ్రే, నావీ బ్లూ రంగుల సూట్లు స్కర్టులు నేచురల్ మేకప్ ఆమెకు హుందా […]
పద్మ కుప్ప
తాజా ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేసి అమెరికాలోని రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టారు. భిలాయ్ లో పుట్టిన పద్మ కుప్ప.వరంగల్ ఎస్ ఐ టి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది.అమెరికాలో ఫోర్డ్ క్రిస్లర్ కార్స్ వంటి సంస్థల్లో పని చేసింది. 2018 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున మిచిగన్ రాష్ట్రంలో 41 డిస్ట్రిక్ట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది.ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ అభ్యర్థి పైన 5611 ఓట్ల మెజారిటీతో […]
