Saturday, 03 Oct, 2026

చనుబాలు దానం

సాండ్ కి ఆంఖ్ సినిమా ప్రొడ్యూసర్ నిధి పర్మార్ హిరానందాని ఇటీవలే తల్లి అయ్యారు తన చనుబాలు తన బిడ్డకే కాకుండా ఒక ఆస్పత్రికి దానం ఇచ్చి వార్తల్లో నిలిచారు. మొత్తం 42 లీటర్ల పాలు దానం చేశారామె. ఎందరో శిశువులకు తల్లి పాలు తాగే అదృష్టం ఉండదు. అలాటి అనాధ శిశువు గురించి ఆలోంచించి ఆస్పత్రి వర్గాలతో సంప్రదించి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చనుబాలు దానం చేసింది నిధి పర్మార్. ఆమె పంపిన పాలు ఆస్పత్రిలో […]

దోసకాయ తొక్కతో ప్యాకింగ్

దోసకాయల తొక్కతో పర్యావరణ అనుకూల ప్యాకెట్ పదార్థాన్ని తయారు చేశారు ఖరగ్ పూర్ ఐ ఐ టి శాస్త్రవేత్తలు.  ఆహార పదార్థాల ప్యాకింగ్ కు దాన్ని ఉపయోగించవచ్చునని వారు తెలిపారు దోసకాయ తొక్కలో భారీగా సెల్యూలోజ్ ఉంటుంది వీటినుంచి తీసిన నానో స్పటికలతో  ఈ పదార్థాన్ని చేయవచ్చనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ తో పర్యావరణానికి తీవ్ర హాని ఉంది ఇప్పుడీ దోసకాయ తొక్క నుంచి సెల్యూలోజ్,హెమిసెల్యులోజ్‌, పెక్టిన్‌ లను సేకరించారు వాటి ద్వారా […]

పిల్లలకు మేకప్ వద్దు

చిన్నపిల్లలకు సరదాగా కూడా మేకప్ వేయకండి వాళ్ల చర్మం సున్నితంగా ఉంటుంది. అధిక రసాయనాలున్న మేకప్ వస్తువులను ఉపయోగించడం వల్ల వారికి చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ అందువల్ల 15 సంవత్సరాలు దాటే వరకూ పిల్లలకు హెవీ మేకప్ వేయవద్దు అంటున్నారు నిపుణులు.మేకప్ తో చర్మం సహజమైన తేమను పోగొట్టుకుని గరుకుగా మారే ప్రమాదం ఉంటుంది ఒక్కసారి ప్రత్యేక సందర్భాల్లో స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్స్ కు వేడుకలకు మేకప్ వేయవలసి వస్తే వారి చర్మ తత్వం […]

   సౌందర్య పోషణలో ఓట్స్

ఓట్ మీల్ శరీర సౌష్టవం కోసమే కాదు చర్మ సౌందర్యానికి బాగా పనిచేసి చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. మాయిశ్చరైజర్ గా సహాయపడుతుంది చర్మ రంధ్రాల్లో ని  మురికిని, జిడ్డును తొలగించి శుభ్రం చేస్తుంది. కొద్దిగా ఓట్ మీల్ నీళ్లలో వేసి ఉడికించి చల్లారిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి అలాగే ఓట్ మీల్ తయారీ చాలా సులభం లేదా మీరు ఏవైనా సరే వాటిలో ఓట్స్ నాననిచ్చి […]

నా గతం అత్యంత విషాదం

నేను ట్రాన్స్ జెండర్ ని అనే కారణంగా నేను ఎన్నో అవమానాలు సహించవలసి వచ్చింది. అవన్నీ సహిస్తూ చదువు పైన ద్రుష్టి పెట్టాను. మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో ప్రాక్టికల్ సెక్షన్ లో ఒక మహిళకు ప్రసవం చేసి ఆ బిడ్డను చేతిలోకి తీసుకొన్న క్షణం నా జీవితంలో ఎంతో విలువైంది అంటోంది డాక్టర్ త్రినేత్ర. కర్నాటక రాష్టంలో మొదటి ట్రాన్స్ ఉమెన్ డాక్టర్ గా త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు గుర్తింపు పొందింది. ఆమె ప్రస్తుతం మణిపాల్ […]

మెరిసే చర్మం మీ సొంతం 

చలిగాలులకు ముఖం పొడిబారి పోతుంది.తేమ కోల్పోతుంది ఇంట్లో ఉండే పదార్థాలతో ముఖ చర్మం మెరిసేలా చేయొచ్చు రెండు స్పూన్ల సెనగపిండి లో స్పూన్ పెరుగు అర చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి మాస్క్ వేసుకొని ఆరిపోయాక కడిగేస్తే చాలు ముఖం మెత్తగా మెరుస్తూ కనిపిస్తుంది. అరటిపండు గుజ్జులో తేనే కలిపి ఈ మిశ్రమంతో మాస్క్ గా వేసుకోవచ్చు. బాదం గింజలు నానబెట్టి గ్రైండ్ చేసి  అందులో స్పూన్ పాలు పోసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిపోయాక […]

ఒంటరి తనమే ముఖ్యకారణం 

ఒంటరితనం, సామాజిక ఎడబాటు వంటివి మహిళ లో బి.పి పెరుగుదలకు కారణమని ఒక అధ్యయనం చెబుతోంది. బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ హైపర్ టెన్షన్ జర్నల్ లో ప్రచురించిన ఈ అధ్యయనంలో పురుషులతో పోలిస్తే సామాజికంగా మంచి అనుబంధం లేని నడివయసు పెద్ద వయసు మహిళల్లో గుండె సమస్యలకు దారితీసే బి.పి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.40 నుంచి 85 ఏళ్ల వయసులో ఉన్న 30 వేల మంది పై చేసిన ఒక అధ్యయనంలో భాగస్వామి లేని మహిళలు […]

ఈ ఫీల్డ్ లో మహిళలు తక్కువే 

ఈ కెరీర్ లో అడుగుపెట్టి 20 ఏళ్లు అవుతోంది నా ఎత్తు, రంగు చాలామంది హీరోయిన్ లకు మ్యాచ్ అవటంతో వాళ్లకు  డూప్ గా 250 సినిమాల్లో స్టంట్ ఉమెన్ గా పని చేశాను.ప్రపంచ వ్యాప్తంగా ధైర్యసాహసాలలో స్టంట్ చేసే వాళ్ళకి అందించే  టారస్ వరల్డ్ ఆవార్డ్ కు మూడు సార్లు నామినేట్ అయ్యాను అంటోంది స్టంట్ ఉమెన్ సానో బార్. ఇదే కెరిర్ గా కావాలని  కోరుకోవటం వల్ల మిక్సడ్  మార్షల్ ఆర్ట్స్, బైక్ రేసింగ్, […]

సమాన హక్కుల సాధన ధ్యేయం 

ట్రాన్స్ జెండర్ సెనేటర్ గా మిగిలిపోవాలని లేదు ప్రజలకు ఒక సెనేటర్ గా సేవలందిస్తాను.ట్రాన్స్ జెండర్ ను కావటం కేవలం యాదృచ్చికం అంటోంది సారా మెక్ బ్రైడ్.అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో డెలావేర్ రాష్ట్రం నుంచి సెనేటర్ గా ఎన్నికయ్యారు సారా. డెమోక్రాట్ల కు  కీలకమైన ఈ ప్రాంతం నుంచి గెలవటం గొప్ప విజయం పౌర సమస్యల పరిష్కారానికి విభిన్న లైంగిక వర్గాలకు సమాన హక్కులు కల్పించే ఈక్వాలిటీ బిల్లు కోసం పోరాటం కొనసాగిస్తాను. అందరికీ తగిన […]

ఆరోగ్య కషాయాలు 

ఈ చలి రోజుల్లో అన్ని రకాల వైరస్ లు సోకే ప్రమాదం ఉంటుంది.కొన్ని రకాల కషాయాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా వైరస్ ల నుంచి కాపాడేవిగా ఉంటాయి.కుంకుమపువ్వు, పుదీనా కషాయం, తులసి కషాయం, శొంఠి  మొదలైన కషాయాలు ఈ రోజుల్లో రోజుకు ఒకసారైనా తాగాలి కుంకుమపువ్వు యాలుకలు దాల్చినచెక్క అల్లం దినుసులన్నీ నీళ్లలో వేసి మరిగిస్తే చాలు.అలాగే తులసి కషాయం తులసి ఆకులు అల్లం మిరియాలు కలిపి నీళ్లలో మరిగించాలి శొంఠి, జీలకర్ర, ధనియాలు, తులసి ఆకులు, తాటి […]

ఇవి అనారోగ్యా లక్షణాలే !

కరోనా భయంతో చేతులు శుభ్రం చేసుకుంటూ భౌతిక దూరం పాటిస్తూ గడుపుతూ ఉంటే, చాలా మందిలో ఈ జాగ్రత్తలు కాస్తా ఒత్తిడికి దారితీసే సమస్య ఉంటుంది అంటున్నారు డాక్టర్లు ఏదైనా ప్రవర్తనలో తేడా కనిపిస్తే డాక్టర్ సలహా తీసుకోమంటున్నారు. సూక్ష్మజీవులు  అంటుకున్నాయి అనే భయంతో నిరంతరం చేతులు కడుక్కోవటం వస్తువులు పదేపదే శుభ్రం చేయటం వాటి క్రమంలో ఏ మాత్రం తేడా ఉన్నా విపరీతమైన భావోద్వేగానికి లోనవటం,తనకు తానే ఇతరులకు హాని కలిగిస్తానని విపరీతమైన భయం తో […]

శిల్పా కా  మంత్రా 

వ్యక్తిగత సంరక్షణ భావోద్వేగాల పరంగా ఫిట్ గా వుండటం సంతోషానికి మూలం అంటారు శిల్పాశెట్టి.తన ఇన్ స్టాగ్రామ్ లో శిల్పా క మంత్రా పేరుతో సంతోషానికి కారణం అయ్యే నాలుగు రకాల హార్మోన్లను మన అదుపులో ఎలా ఉంచుకోవాలి చెబుతున్నారు శిల్పాశెట్టి. డోపామైన్,  ఎండార్షిన్,  సెరటోనిన్, ఆక్సిటోసిన్ లు  ఇవి మన శరీరంలో విడుదల ఆయేవే  జీవితంలో చిన్న పనులతోనే సంతోషంగా ఉండవచ్చు.ఇష్టమైన వారితో గడపటం చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం స్కూళ్లు కాలేజీ రోజుల స్నేహితులను […]

టైమ్  మేనేజ్ మెంట్ 

మన కాలం వెంట పరుగులు తీస్తున్నారు అని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.ఈ కాలాన్ని సరిగ్గా వినియోగించుకుంటే చేయవలసిన పనులన్నీ ఒక ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి.ఒత్తిడి లేకుండా ఉంటాము ఎప్పుడు ఏ పని వాయిదా వేయకుండా చేయటం మొదటి షరతు గా ఉండాలి. ఏ పనుల్లో దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో సరైన అవగాహన కలిగి ఉండాలి.చేయవలసిన పనులు పట్టిక తయారు చేసుకుని ఎక్కువ పని మీద వేసుకోవటం ఒక్కసారి ఎన్నో పనులు చేసేందుకు ప్రయత్నం చేయటం,పనికి […]

కాటన్  మాస్కే ఉత్తమం

నిరంతరం మాస్క్ తోనే గడపటంతో ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయి మాట్లాడేప్పుడు మాస్క్ కదులుతూ ఉండటం,వదులుతున్న గాలి,నోటి నుంచి వచ్చే తడితో బాక్టీరియా ఏర్పడుతుంది. సన్నపాటి గుల్లలు రావటం మొదలవుతోంది. ఎన్ 95 మాస్క్ ల తయారీలు పాలిస్టర్ లేదా నైలాన్ వస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఇవి అన్ని రకాల చర్మ తత్వాలకు సరిపడవు. అలాటప్పుడు కాటన్ మాస్క్ ఒక్కటే ప్రత్యామ్నాయం. మాస్క్ ధరించే ముందర ముఖం శుభ్రంగా కడిగి తుడుచుకొని ఆరిపోయాక తేలిక పాటి మాయిశ్చ రైజర్,సన్ […]

ఇది బెస్ట్ టిప్

ముఖం పైన నూగు వంటి అవాంఛిత రోమాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సమస్య శాశ్వతంగా పోవాలంటే ఈ పేస్ట్ ఉపయోగపడుతుంది. నారింజ తొక్కలు,నిమ్మకాయ ముక్కలు ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడి ఒక స్పూన్ తీసుకొని ఇందులో రోజ్ వాటర్,కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వాలి. నీళ్లతో కడిగేసే ముందు నెమ్మదిగా ఆరిపోయిన పేస్ట్ రాలిపోయేలా రబ్ చేస్తే చాలు. ఇలా చేస్తూ ఉంటే అవాంఛిత […]

ఊహించని అవకాశమిది

నేనెప్పుడూ ఎదురుచూడని అవకాశం ఇది. ఉప ముఖ్యమంత్రి బాధ్యత చాలా పెద్దది. పార్టీ నమ్మకాన్ని నిలబెట్టటం,ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటం ఇప్పుడు నాదృష్టి వీటి పైనే అంటోంది రేణుదేవి. ఇప్పుడు బీహార్ తోలి ఉప ముఖ్యమంత్రిగా కొత్త బాధ్యలతో తనదైన ముద్రవేస్తానంటోంది విశ్వహిందూ పరిషత్‌ మహిళా విభాగమైన దుర్గా వాహినిలో సభ్యురాలైన రేణుదేవి చంపారన్‌, ఉత్తర బీహార్‌ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల మహిళల కోసం పోరాటాలు చేశారు.రేణు దేవి సొంత ఊరు బీహార్‌లోని బేతియా. ఆ రాష్ట్రంలో […]

ఈ ఎనిమిదేళ్ల ప్రయాణం అద్భుతం

షీరోస్ ఫిగర్ గా భారతదేశం నుంచి బార్బీబొమ్మ (Barbie doll) మోడల్ గా ఎంపికైన రెండో మహిళను నేను. నా చామనచాయ రంగు పోనీ టైయిల్  కృత్రిమ కాలు అచ్చుగుద్దినట్టు తయారు చేశారు. ఈ బొమ్మను ఎంతటి ఊహించని పరిమాణం ఎదురైనా ఎదుర్కొనీ  జీవితంలో ఎదిగిన వైనాన్ని నా ప్రతిరూపమైన ఈ బార్బీ బొమ్మలు చూసి ఆడపిల్లలు స్ఫూర్తి పొందితే నాకు అంతే చాలు అంటుంది  మానసి జోషి.ఎనిమిదేళ్ల క్రితం లారీ డీ కొట్టే ఆ ప్రమాదంలో […]

ఈ సహజ లక్ష్యం మారిస్తే ఎలా ?

మనిషి సహజ లక్ష్యం నడక నడిచేది కాళ్లతోనే అయినా శరీరంలో అన్నిభాగాలకు మేలు కలుగుతోంది. రక్త ప్రవాహం మెరుగై శరీరంలో ఆక్సిజన్ సరఫరా అన్నీ పెంచుతోంది. కానీ ప్రతి చిన్నదానికీ వాహనం ఉపయోగిస్తే నడక మేలును గుర్తించటం లేదు మనిషి నడక వల్ల కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి క్లాట్స్ ఏర్పడవు గుండెపోటు రానివ్వదు రక్తపోటును తగ్గిస్తుంది. తుంటి భాగం బలపడి ఎముకలు పెలుసు బారకుండా ఉంటాయి. మోకాలి ప్రాంతంలో ఉండే ద్రవపదార్థాలు మెరుగ్గా ఉండి […]

శిశువు సమాచారం చెప్పే ‘క్రియ’

బెంగళూరుకు చెందిన శివీ కపిల్ ఎంపతి డిజైన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి కోటి రూపాయల ఖర్చుతో ఓ క్రియా  పరికరాన్ని రూపొందించింది.గర్భిణీ పొట్ట కు అందించిన ఈ ఫ్యాబ్ వంటి క్రియా పరికరం ద్వారా తల్లులే తమ శిశువు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు.తల్లి శిశువుల ఆరోగ్యం గురించి డివైస్ కు అనుసంధానించిన యాప్ ద్వారా రక్తపోటు చక్కెర స్థాయిలు బిడ్డ కదలికలు సర్వం తెలియజేస్తుంది ఈ పరికరం రూపొందించినందుకు గాను యునైటెడ్ నేషన్స్ […]

‘హిచ్ కీ’ (హిందీ) (2018)

సిద్ధార్థ్. పి మల్హోత్రా తీసిన మంచి స్ఫూర్తిదాయక చిత్రం హిచ్ కీ. నైనా మాథుర్ అన్న టీచర్ నరాలకు సంబందించిన వైకల్యం తో ఉంటుంది. ఉన్నట్లుండి ఎక్కిళ్ళు రావటం,చేత్తో బుగ్గ కిందుగా కొట్టుకోవటం అసంకల్పితంగా చేస్తూ ఉంటుంది. ఆమెకు ఎక్కడ ఉద్యోగం దొరకదు. చివరకు చిన్నప్పుడు చదువుకొన్న స్కూల్లో తాత్కాలిక టీచర్ గా జాయిన్ అవుతోంది. 9 th చదివే పిల్లలు కొందరు విద్య హక్కు చట్టం వల్ల ఆ కొర్పోరేట్ స్కూలు కు వస్తారు కానీ […]