Thursday, 01 Oct, 2026

పోషకాల గని మొక్కజొన్న

వర్షం పడుతుంటే నిప్పుల పైన కాల్చిన మొక్కజొన్న పొత్తులు తినటం అందరికీ ఇష్టమే .న్యూట్రీయంట్లు సమృద్ధిగా ఉండే మొక్కజొన్నలో విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. వయసుతో పని లేకుండా అందరికీ మొక్కజొన్న శక్తి దాయిని గానే పనిచేస్తుంది. ప్రపంచంలో గోధుమ వరి కన్నా ఎక్కువగా సాగు చేసేది మొక్కజొన్న ఇది ధాన్యం వంటి పంటే. పసుపు రంగు మొక్కజొన్న దాదాపు అన్ని దేశాల్లోనూ పండిస్తారు అయితే ఎరుపు,ఆరెంజ్, వంగపండు రంగు ,నీలం, తెలుపు, నలుపుల్లో కూడా పండిస్తున్నారు. […]

లోలాకుల్లో ఇవి ప్రత్యేకం

అమ్మాయిలు ఇష్టంగా ధరించే చెవి లోలాకులు బుట్టల దే హవా. నవ్వినా,మాట్లాడిన, తల ఊపిన అందంగా ఊగాడే బుట్ట లోలాకులు అమ్మాయిలకు కొత్త అందం ఇచ్చేస్తాయి. ఏనాడో  అమ్మలు, అమ్మమ్మల కాలం నాటి బుట్టల లోలాకులు ఇప్పటికీ కాలం చెల్లలేదు అంటే అసలా తయారీ లోనే ఒక ప్రత్యేకత .బోర్లించినట్లు గుండ్రని బుట్టలు దీనిచుట్టూ ముత్యాలు లేదా చిన్న బంగారు గుండ్లు బుట్ల చేసిన డిజైన్ అయితే ఇప్పుడు టెంపుల్ నక్షీ, స్టోన్, సాచీ,పోల్కి, ఫిలిగ్రీ, తవ,తుషీ […]

స్త్రీల రక్షణ కు కొత్త ప్రాజెక్ట్

గృహహింస,వరకట్న వేధింపులకు చెక్ పెట్టేందుకు కేరళ ప్రభుత్వం పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది.ఈ ప్రాజెక్ట్ ప్రకారం కేరళలో ఇక పింక్ కార్లు కనిపిస్తాయి.లేడీ డ్రైవర్,లేడీ కానిస్టేబుల్,లేడీ ఇన్స్ పెక్టర్,వాళ్లే ఉంటారు.ఈ పింక్ కార్లు 24 గంటలు రోడ్లపైన పరిగెత్తుతూనే ఉంటాయి .ఏదైనా సమస్య వస్తే తమ కోసం ఈ వాహనాలు ఇలా వెంటనే పరిగెత్తుకు వస్తాయి అన్న నమ్మకాన్ని స్త్రీలకు ఇచ్చేందుకే ఈ ప్రాజెక్ట్ .ఇప్పటికే అక్కడ స్త్రీల రక్షణ కు వివిధ మహిళా పోలీస్ […]

మహిళలకు మంచి ఫుడ్

ఇంట్లో సభ్యులందరికీ చక్కని పోషకాహారం అందించే గృహిణులు తమ ఆరోగ్యం దగ్గరకు వచ్చే సరికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు .ఎన్నో పనులతో శారీరకంగా, మానసికంగా అలిసిపోయే స్త్రీలకు కీలకమైన పోషకాలు తప్పనిసరి ముఖ్యంగా ఈ కరోనా సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం ఆమె తీసుకొని తీరాలి. ఆమెకు సరైన డైట్ అవసరం కూడా .మహిళలు తమ ఆహారం లో ఆలివ్ ఆయిల్ ను  చేర్చుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో ఆరోగ్యవంతమైన మెనో అన్ సాచురేటెడ్ […]

ఆ మూడింట్లో నెయ్యి బెస్ట్

బరువు తగ్గడం కోసం కూడా ఎంతో కొంత కొవ్వు ఆహారంలో ఉండాలి అంటారు ఎక్స్ పర్ట్స్. మరి ఆ కొవ్వు ఏ నూనెలో ఎంచుకోవాలి ఆలివ్, వెన్న, నెయ్యి ఈ మూడింటిలో దేన్ని ఎంచుకోవాలి .మూడు ఆరోగ్యమే కానీ వాటిలోని పోషకాలు క్యాలరీల ద్వారా అనువైన కొవ్వుని ఎంచుకోవాలి. కీటో డైట్ లో ప్రధాన పాత్ర పోషించే వెన్న, నూనె కు చక్కని ప్రత్యామ్నాయం. పరిమితంగా తీసుకుంటే చక్కని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పాల నుంచి తీసే […]

సాగర మధ్యంలో అందాల గ్రామం

అందమైన ప్రకృతి చుట్టూ నీళ్లు మధ్యలో నివాస గృహాలు ! ఈ ఊహే బాగుంది కదా .అసలు ఒక ఇసుక రేణువు అంతా నేల కూడా అక్కడ లేకుండా కట్టిన ఫ్లోటింగ్ విలేజ్ ‘ko panyi’ ఇది థాయిలాండ్ లో ఉండే సుమారు రెండు వందల ఏళ్ళ క్రితం ఇండోనేషియా నుంచి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు సముద్రం మధ్యలో కర్రల సాయంతో ఇల్లు కట్టుకుని చేపలు పట్టడాన్ని వృత్తిగా చేసుకుని ఇక్కడే నివసించడం మొదలుపెట్టారు .నెమ్మదిగా […]

ఆ వయసులో అసంతృప్తి ఎక్కువే

జీవితంలో తృప్తి సంతోషం ఎక్కువగా ఎప్పుడూ ఉంటుందీ ? తక్కువగా ఎప్పుడూ అనిపిస్తుందీ అన్న విషయంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి ఒక అధ్యయనం ప్రకారం అభివృద్ధి చెందిన దేశాల్లో సగటున 47.2 ఏళ్ళ వయసులో అసంతృప్తి స్థాయి చాలా ఎక్కువ అని వెల్లడైంది .మనిషి ఎప్పుడూ సంతృప్తిగా బాగుంటాడు అన్న విషయాన్ని వయసుకి ముడి పెట్టి చేసిన అధ్యయనంలో 40 ఏళ్ల తరువాత అసంతృప్తి తీవ్రంగా ఉన్నట్లు  తేల్చారు దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక UN REST నెలకొంటుందని […]

అక్కడ నీళ్ళు చాలా హాట్

ఈ ప్రపంచంలో దట్టమైన అతిపెద్ద అరణ్యం అమెజాన్. ఎన్నో వింతైన జీవరాసులు, ఆరణ్య అందాలు,కలిసి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. అంతేనా ప్రపంచంలోనే అద్భుతమైన వేడినీటి నది ప్రవహించేది ఇక్కడే .పెరూ ప్రాంతానికి విస్తరించి ఉన్న అమెజాన్ అడవుల్లో మాయంతుయాకు అనే నది ఉంది. 82 అడుగుల వెడల్పుతో సుమారు నాలుగు మైళ్ల పొడవునా ప్రవహించే ఈ నది 20 అడుగుల లోతు ఉంటుంది. ప్రపంచంలోనే ఏకైక వేడి నీటి నది ఇది .సలసల మరిగే ఈ సరస్సు […]

అన్నీ మారిపోతాయి

వెండి తీగ లాంటి వర్షపు జల్లులు, చిరుగాలులతో వర్షాకాలం చల్లని గమ్మత్తు చేస్తుంది. అయితే వేసుకునే దుస్తులు, స్టయిల్స్ విషయంలో పూర్తిగా మార్పులు చేసుకుని తీరాలి .హఠాత్తుగా వానోస్తే తడిసిపోతాం కనుక తేలికగా ఆరిపోయే వీలున్న షిఫాన్ ,పాలిస్టర్ కాటన్ దుస్తులు ఎంచుకోవాలి. వర్షాల వేళలో వెలుగు తక్కువగా ఉండి పెద్ద హుషారు అనిపించదు .కనుక ఆకర్షణీయంగా ఉండే ముదురు రంగు దుస్తులు ఎంచుకోవాలి .ఆరెంజ్, ఎల్లో,నియాన్ గ్రీన్, పింక్, మొదలైన రంగులు బావుంటాయి. అలాగే ఫార్మల్ […]

హంసల సరస్సు

చందమామ కథల్లో హంసల దీవి గురించి చదివే వుంటారు. చల్లని తేట నీటి సరస్సులు అందులో హాయిగా ఈదే రాజ హంసలు తలచు కొంటేనే బావుంటుంది. మరి ఈ రోజుల్లో అలాటి దీవులు,హంసలూ ఉంటాయా ? అంత అందమైన ప్రదేశం మనం చూడగలమా అంటే అవును చూడచ్చు అంటారు. సైబీరియా సమీపం లో యురోజహైనీ గ్రామస్థులు. ఈ హంసలు 1967 నుంచి మా ఊరికి వలస వస్తున్నాయి అంటారు.ఈ సరస్సు రష్యాలో ఉంటుంది. నిజంగా ఈ  సరస్సే […]

లిక్విడ్ గోల్డ్ బెస్ట్ ఫర్ హెల్త్

తెలుగు వారి పండుగలు పర్వదినాలలో బెల్లంతో చేసిన పదార్థాలు ఉండవలసిందే సంక్రాంతికి బెల్లపు అరిసెలు, కొత్త పంట రాగానే తొలి నివేదన చేసే పొంగలి,శ్రీరామనవమికి బెల్లపు పానకం, గణపతి నవరాత్రుల్లో పానకం, పాయసం,వరంగల్ జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మకు సమర్పించే బంగారం బెల్లమే . బెల్లం వినియోగం భారతీయుల జీవనశైలిలో భాగం వంటలో చిరుతిళ్ళు నైవేద్యాలు ఆరోగ్యల్లో బెల్లానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రకృతి సహజంగా ఎలాంటి రసాయనాలు లేకుండా తయారయ్యే […]

ఇది బంగారు చేపల సరస్సు

అనగనగా ఓ సరస్సు అందులో బంగారు వర్ణంలో మెరిసే పువ్వుల్లాంటి గోల్డెన్ జెల్లీ ఫిష్ లు. పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ ప్రాంతం దీవిలోని పలావో దేశానికి చెందిన ఈల్ మాక్ ఐలాండ్ లో ఈ అందాల సరస్సు ఉంది దీన్ని గోల్డెన్ జల్లి ఫిష్ లేక్ అంటారు. మామూలుగా జెల్లీ ఫిష్ తెల్లగా ఉంటాయి. వీటిని మూన్ జెల్లీ ఫిష్ అంటారు .కానీ ఈ సరస్సులో చేపలు తళతళ బంగారు వర్ణంలో మెరిసిపోతూ వుంటాయి. వీటిని చూసేందుకు […]

సూపర్ టేస్ట్ టీ బాంబ్స్

గంటకు ఒక కప్పు టీ తాగే వాళ్ళున్నారు  .అందుకే టీ కూడా తనని తాను మార్చుకుంటూ, కొత్త రుచులు చేర్చుకుంటుంది .ఎన్ని రకాల పూల టీలు ,టీ బ్యాగ్స్ రంగురంగుల టీ లతో విందు చేసుకుంటున్న టీ ప్రియుల కోసం కొత్తగా వచ్చాయి టి బాంబులు. చుసేందుకు గుండ్రంగా, ఒక రకంగా టీ బ్యాగుల్లాంటివే అయినా టేస్ట్  లో మాత్రం ఇంకాస్త ఎక్కువ రుచితో ఉన్నాయి  .టీ బ్యాగులు బయట పడేస్తాం కానీ బాంబులు మాత్రం ఏవీ […]

మీరు ఎంత అదృష్టవంతులు

మీ వయసు గనుక 65 పైబడితే మీ అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు .మీరు భగవంతుని కరుణ పొందిన వాళ్లు అంటున్నారు పరిశోధకులు .ప్రపంచ జనాభాని 100 గా భావిస్తే అందులో 60 మంది ఆసియా ఖండానికి, 15 మంది ఆఫ్రికా, 11 మంది ఐరోపా, 9 మంది దక్షిణ అమెరికా, ఐదుగురు ఉత్తర అమెరికా వాళ్ళు 100 మందిలో 51 మంది పట్నాలలో మిగిలిన వాళ్లు పల్లెల్లో ఈ వందల 77 మందికి సొంత ఇల్లు […]

స్టయిలిష్ రెయిన్ కోట్స్

ఇప్పుడు ఫ్యాషన్ దుస్తుల పరంపరలో కి రెయిన్ కోట్స్ కూడా వచ్చి చేరాయి. వర్షం చుక్క కూడా మీద పడకుండా రక్షణ గా ఉండేందుకు చల్లని గాలిలో వెచ్చదనాన్ని ఇచ్చేందుకు కూడా కొత్త మోడల్స్ రెయిన్ కోట్లు వచ్చాయి .1200 వందల ఏళ్ళ క్రిందట రబ్బర్ చెట్ల నుంచి తీసిన మెటీరియల్ తో వాటర్ ప్రూఫ్ గార్మెంట్స్ తయారు చేసినట్లు చరిత్ర కథనం. 1824 లో స్కాటిష్ కెమిస్ట్ చార్లెస్ మాకి స్తోష్ టార్పాలిన్ ఫ్యాబ్రిక్ తో […]

ఇల్లంతా మొక్కలే

Summer Rayne oakes అమెరికా కు చెందిన ఫ్యాషన్ మోడల్, పర్యావరణ ఉద్యమ వేత్త, రచయిత్రి కూడా .న్యూ యార్క్ లోని ఆమె నివసించే 1200 చదరపు అడుగులు ఇల్లు మొత్తం 1100 కుండీలతో నిండి ఉంటుంది . ఎన్విరాన్ మెంటల్ సైన్స్,ఎంటమాలజీ లో డిగ్రీ చేసిన రెయిన్ కు ప్రయోగాలు ఇష్టం. అందులో భాగంగానే తన ఇల్లుని ఒక అరణ్యం లాగా మార్చేసింది. ఆమె ఇంట్లో ఫర్నిచర్ కూడా దాదాపు వీధి లో దొరికే చెక్కతో […]

కరగని చెదరని మేకప్

మోహం తీర్చిదిద్దినట్లు తీరైన కనుబొమ్మలు, ఎర్రని పెదవులు, కాటుక దిద్దిన కళ్ళతో ఎప్పుడు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎవరికైనా.అలా కలలు కనే వారికోసం పర్మనెంట్ సెమీ పర్మనెంట్ టాటూ వచ్చేసింది. ఎలాంటి మేకప్ చేసుకున్నా కొన్ని గంటల్లో చెదిరిపోతుంది. కానీ మొహంలో ఉండే చిన్న చిన్న లోపాలను సరి చేస్తూ వచ్చిందే పర్మనెంట్  మేకప్ .ఇదోరకం పచ్చబొట్టు లాంటిది ఫ్యాషన్ కోసం పచ్చ బొట్టు వేయించుకున్నట్లు ఒత్తుగా కనుబొమ్మలు కనిపించేందుకు, రంగైన పెదవులు, ముఖంపై మచ్చలు లేని […]

ఈ గొడుగులు కళాత్మకం

వర్షాలు మొదలయ్యాయి చేతిలో గొడుగు ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది .ఉండేదో స్టయిల్ గా ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది కదా ? అనుకున్నట్లు గానే గొడుగులు స్మార్ట్ గా ఈనాటి త్రీడి పరిజ్ఞానం వెంటబెట్టుకుని వచ్చి మరీ కనువిందు చేస్తున్నాయి .ఫ్యాషన్ డిజైన్ లలో కొత్త ట్రెండ్ ఈ త్రీడి గొడుగులు పైగా మరి పెద్దవి కాకుండా మినీ అంబ్రెల్లా లు స్టయిల్ గా చిన్న బ్యాగ్ లో పట్టేవి చాలా రకాలే ఉన్నాయి.  అరటిపండు బొమ్మ, కాప్సూల్ […]

సముద్రంలో హోటల్ ది మురాక

ప్రపంచంలో మొట్టమొదట నీటి అడుగున నిర్మించిన హోటల్ విల్లా ది మురాక క్రావ్రాడ్ మాల్దీల్స్ రంగాలి ఐలెండ్ లో రెండు అంతస్థుల్లో నిర్మించిన ఈ విల్లాలో కింది అంతస్థు సముద్రం లోపల 16 అడుగుల లోతున ఉంది. మొత్తం అద్దాలతో నిర్మించిన ఈ కింది అంతస్థు లోకి వెళితే నీటి మధ్యలో ఉన్నట్లే ఉంటుంది. ఆ అద్దలోంచి ఎన్నెన్నో సముద్రపు జీవులు హాయిగా ఈదుతుంటాయి . ఒక్క మాటలో చెప్పాలంటే ఒక అక్వేరియంలో మనుషులు బయట నీళ్ళూ […]

మెట్లెక్కటం మంచిదే

ఇక వర్షాలు మొదలయ్యాయి. నిద్ర లచే సరికి వాన పడుతూ ఉంటే ఇంకా వాకింగ్ కు వెళ్లాలనిపించదు. అలాటప్పుడు మెట్లు ఎక్కిదిగచ్చు,నడకలో ఖర్చయ్యే కాలరీలు కంటే రెండింతలు ఖర్చవుతాయి. కాళ్ళలో విభిన్న కండరాలకు పని చెప్పినట్లు అవుతోంది. తొడలు, కాలి మడమలు కండరాలకు కూడా వ్యాయామం లభిస్తుంది. మెట్లెక్కుతూ పక్కన గల రెయిల్స్ పై చేతుల్ని పెడుతూ ఉంటే ముంజేతులు  భుజాల్లోని కండరాలకు కూడా ఎక్సర్ సైజు లభిస్తుంది ఇలా చేయడం వల్ల కండరాలు స్ట్రెంత్ పెరుగుతుంది. […]