జానపద గేయాలు- దిట్టి
– డి.సుజాతా దేవి గాలి దిట్టే కొట్టెనో ఊరి కళ్ళెర్రబడెనో వాలిపోతా వుంది సోలిపోతా ఉంది వొడిలినా పువ్వల్లె వొరిగిపడి వున్నాది!! కలలోకి రమ్మనీ కవ్వించి పోయేది మెలుకు వొచ్చింది నువ్వెవ్వరని అడిగేది!! ఎగిరివచ్చేది నా ఎదట నిలిసేది మాట సెప్పేతలికి మాయమై పోయేది!! మల్లెపూవులు సూసి మొకము సిట్లిత్తాది మామిడాకులు దూసి మనసుగా తింటాది!! మట్టి పై మనసేటో మాటాడ యిసుగేటొ పొద్దుమొక మెరగక పద్దాక నిదరేటో!!
మన ప్రసాదాలు -“రంజాన్ రంగుల సోయగం”
సలాం- వాలే కుం-సలాం భాయ్ ఔర్ బెహనో మరి రంజాన్ ముబారక్ చెప్పేసుకుని వంట షురూ…. ముస్లిం సోదరీ-సోదరులు పెద్ద ఎత్తున జరుపుకునే ఈద్.అందరు కలిసి- మెలిసి విందు-వినోదాల లో ఉత్సాహంగా పంచుకునే రంజాన్ పండుగ. పేద- గొప్ప అని భావించి మనమంతా ఒక్కటే అని గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు. 40 రోజులు ఎంతో నిష్ఠ గా ఉపవాసం ఉండి,క్రమం తప్పకుండా నమాజ్ చేస్తూ,ఎవరిని దూషించటం,దుర్భాషలాడటం లేకుండా సంతోషం గా గడుపుతూ ఇష్టమైన వంటకాలు అందరూ […]
జుట్టు పెరుగుతుంది?
శిరోజాల సంరక్షణకు కొన్ని రకాల గాఢ తైలాలు తొడ్పడతాయని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. జోజోబా లావెండర్ థైమ్ వంటి నూనెల వల్ల జట్టు వేగంగా పెరుగుతోందట. పెప్పర్ మెంట్ నూనె వల్ల మరీ వేగంగా జుట్టు పెరుగుతోంది అంటున్నారు .ఇందులోని మెంథాల్ కారణంగా చర్మం లోపల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీంతో రక్త ప్రసరణ మెరుగై శిరోజాలు వేగంగా పెరుగుతాయి. చమేలా రోజ్ మేరీ, సెజ్ వంటి ఔషధ నూనెల్లో కాస్త కొబ్బరి నూనె కలిపి వాడి చూడండి. […]
ఇక వాడకండి
తెల్లవారి లేచిన దగ్గర నుంచి పాల పాకెట్ లతో మొదలుపెట్టి రాత్రి పడుకొనేవరకు మనం వాడే వస్తువులన్ని ప్లాస్టిక్ వే. కొన్ని రకాల ప్లాస్టిక్ పాకెట్లలో మైక్రోవేన్ లో వాడేందుకు సురక్షితం అని రాసి ఉంటుంది ,కానీ వాటిని వేడిచేస్తే ప్లాస్టిక్ నుంచి రసాయనాలు విడుదలై ఆహరంలో కలుస్తాయి. సాధ్యమైనంత వరకు వీటి వాడకం మానేయాలి.కూరగాయలు ఆహరపదార్ధాలు తీసుకెళ్ళేందుకు గుడ్డతో లేదా జనపనారతో కుట్టిన సంచీలు వాడుకోవాలి. సింథటింక్ ఫైబర్ తో తయారు చేసిన తివాచీలు సోఫా […]
నిద్ర పొండి చాలు
షార్ట్ మెమొరీ లాస్ ..ప్రతిచొట వినబడుతోంది. మరచి పోతున్నాను, గుర్తుండటం లేదు అంటుంటారు.ఈ షార్ట్ మెమొరీ లాస్ కాస్త కొంత కాలానికి లాంగ్ టర్మ్ మెమొరీలాస్ అయిపోకుండా సుఖంగా ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపొమ్మంటున్నారు డాక్టర్లు. మంచి నిద్రకు జ్ఞాపక శక్తికి సంబంధం ఉంది. మంచి నిద్ర దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి సామార్ధ్యాన్ని పెంపొందిస్తుందని బెల్జియంలోని లీగ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. మెదడులో జ్ఞాపక శక్తికి సంబంధించిన హిప్పో కాంపస్ ఏరియా శక్తి మంతంగా పని చేయటానికి […]
అత్యంత ప్రాచీనం
ప్రపంచంలో ఉన్న అతి ప్రాచీనమైన అపురూపమైన ప్రింటెడ్ పుస్తకం డైమాండ్ సూత్ర. బుద్దుని బోధనలు ఉంటాయి ఈ పుస్తకంలో పసుపు రంగు డై వేసిన పేపర్ పైన చక్కని బ్లాక్ తో దాన్నీ ముద్రించారు. సంస్కృతంలో రాయబడిన ఈ పుస్తకం 401 AD లో చైనా భాషలోకి అనువాదం అయింది. మార్క్ ఆరిల్ స్టీన్ అనే ఆర్కియాలజిస్ట్ చైనాలోని డాన్ హువాంగ్ దగ్గరలోని థౌజండ్ బుద్దాస్ గుహాల్లో ఈ ప్రింటెడ్ ప్రతిని సంపాదించి లండన్ కు చేర్చారు.
అలానే పడుకోండి
గర్భిణిలు వెల్లికిలా పడుకొంటే కడుపులో బిడ్డకు రక్త సరఫరా తగ్గుతోందని పరిశోధకులు అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పుడో తాజా అధ్యయనం అలా వెల్లికిలా పడుకొంటే కడుపులో బిడ్డ చనిపోయి పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటోంది. గర్భం ధరించాక 28 వారాల నుంచి వెల్లికిలా పడుకొనే వారికి మృత శిశువు జననం ముప్పు 2.1 రేట్లు ఎక్కువగా ఉందంటున్నారు . మృత శిశువు జననానికి ఇతరత్రా కోణాలు ఉన్న దీన్ని పరిగణలోకి తీసుకొమంటున్నారు పరిశోధకులు.
సూపర్ మామ్
పర్ ఫెక్ట్ ఆకృతితో మళ్ళీ సినిమాల్లోకి వచ్చేసింది కాజోల్. తిరిగి పూర్వపు ఆకృతి సంతరించుకోవటం నెమ్మదిగా సాగిన కచ్చితంగా వస్తుంది అంటు కొత్త అమ్మలకు పెదవులతో చెప్పని సందేశం ఇస్తోంది కాజోల్. యుగ్,నైసా ఇద్దరు సంతానం రెండు సార్లు గర్భం దాల్చినప్పుడు బరువుగా అయిపోతుంది కాజోల్. నెమ్మదిగా ఆరోగ్యంగా తన పాత రూపం పొందింది. వర్కవుట్స్ చాలా ఎంజాయ్ చేస్తానంటోంది ఆహారం,అలవాట్ల విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటానంటోంది కాజోల్. అమ్మ కాబోయే ఎందరో యువతులకు ఆదర్శంగా ,తల్లి […]
ఇవి కొత్త ఫ్యాషన్లు
ఫ్లోరల్ ధోతి టాప్ కాలేజీ అమ్మాయిలకు కంఫర్ట్ గా ఉండే డ్రెస్ అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.ప్రెషర్స్ పార్టీ దగ్గర నుంచి కాలేజీలో జరిగే ప్రతి వేడుకలకు ఈ డ్రెస్ బావుంటుంది. జార్టెట్ ,సిఫాన్,సిల్క్ వంటి వస్త్రశ్రేణి ఈ డ్రెస్ లకు సరిగ్గా సరిపోతుంది. ఈ దుస్తులపైకి చక్కని స్టడ్స్ ,బన్ని హాంగింగ్స్ బాగా నప్సుతాయి. అలాగే పలాజోలు, స్కర్ట్స్ లు కూడా కాలేజీ అమ్మాయిలకు స్టైలిష్ లుక్ తెచ్చి పెడతాయి. ఇక మిక్స్ అండ్ మ్యాచ్ అయితే […]
మగపిల్లలకే ఇబ్బంది
అమ్మాయిల కంటే అబ్బాయిల్లో వాయు కాలుష్యం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతోంది అంటున్నారు పరిశోధకులు.గర్భంలో ఉన్న పిల్లలు,బాల్యదశ దాటిన పిల్లలు, ఏడేళ్ళ వయస్సు వరకు ఉన్న పిల్లలపై ఈ అధ్యయనం నిర్వహించారు,వారి అధ్యయనంలో కాలుషిత గాలిని పీల్చిన మగ పిల్లల్లో జ్ఞాపక శక్తి ఆలోచన నైపుణ్యాలు తగ్గుతున్నట్లు గుర్తించారు. అమ్మాయిల్లో ఈ సమస్య తక్కువగా కనిపించింది. హార్మోన్ తేడా వల్ల వారిలో ఈ సమస్య ఉత్పన్నం కాలేదని పరిశోధకులు చెపుతున్నారు. వాతావరణంలో ఎక్కువ వాయుకాలుష్యం తీసుకువచ్చే జబ్బుల […]
జానపద గేయాలు- ఆసికాలు
– డి.సుజాతా దేవి మల్లితో నీ ఆసికాలు వల్ల కాదురా సెల్లని మాటాడితేనే నొల్లకోనురా మావ నల్ల కోనురా!! సందమామ మొకమంటె సందమా అందమా నల్ల మచ్చలా మొకమా మల్లికి సాటి మావ మల్లికి పోటి !! సుక్కలు నా కళ్ళంటె సక్కదన మదేటి తిక్కలోడ పగటేళ సుక్కల మెరుపేడర !! సిలక పలుకులంటే గొప్ప కులుకా సంబడమా పలుకు నేర్సెనే గాని పాటలొచ్చునా సిలకకు పాట లొచ్చునా !!
మన ప్రసాదాలు- “దుర్గాదేవి ప్రసాదం”
మంగళవారం హనుమంతుడు తో పాటు దుర్గా దేవిని కూడా పూజించవచ్చు.సకల సౌభాగ్యాలకు మూలం దుర్గా దేవి అనుగ్రహం కలగడం.మంగళవారం ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి పూజ మొదలు పెట్టుకోవాలి. ముందుగా కాళ్ళకి పసుపు రాసుకుని,జుట్టు ముడిచి,పూజించాలి.దుర్గ దేవి ని శ్రద్ధగా,నిష్ఠగా,నిశ్చలమైనమనసుతో ఆరాధించాలి.ముఖ్యంగా ముత్తైదువతనానికి పవిత్రమైన పూజ.ఇంటికి వచ్చిన వారికి పసుపు-కుంకుమ,రవిక,పూలు,పండ్లు,ఎరుపు/ ఆకు పచ్చ గాజులు,ఆకు- వక్క ఇచ్చి నమస్కరించిన అమ్మవారి కటాక్షం తథ్యం!! ఇష్టమైన రంగు:ఎరుపు ఇష్టమైన పూలు: అన్ని రంగుల పూలు సమర్పించిన ఆనందంతో […]
శుభ్రంగా తినోచ్చు
కాస్త బరువు తగ్గాలి అనిపించగానే వెంటనే డైటింగ్ పేరుతో ఆహారాన్ని దూరం పెడతారు అమ్మాయిలు. ఇక పిండి పదార్థాలు చక్కెర,కోవ్వు మొత్తం మానేస్తారు. అయితే ఇవి శరీరానికి తగినంతగా అందకపోతే మరింత బరువు పెరుగుతారంటొందని ఒక తాజా అధ్యయనం. మెదడుకీ శరీరానికి శక్తి అంది సరిగ్గా పని చేయాలంటే పిండి పదార్థాలు చాలా అవసరం. ప్రాంతాన్ని బట్టే ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఎవరో చెప్పరు కదా ఫలానావి తినాలి అనుకొంటే శరీర తత్వాని సరిపోక జీర్ణ వ్యవస్థపైన […]
వ్యాయామంతో సరి
వయసు పెరిగుతుంటే చర్మం వదులుకావటం డబుల్ బిన్ రావటం సాధారణంగా జరుగుతూనే ఈ గడ్డం కింద ఏర్పడే కొవ్వును డైట్ వ్యాయమం వంటి సింపుల్ టెక్నిక్ లతో పొగొట్టుకోవచ్చు శరీరంలోని ఇతర భాగాలకు వల్లే ఫేషియల్ కండరాలకు కూడా నిత్య వ్యాయామం అవసరమే. ముఖ కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేయటం వల్ల ముఖంపై చర్మం బిగుతుగా మారటమే కాకుండా టానింగ్ కూడా బాగా అవుతుంది. మంచి ఆహారం తీసుకొంటూ మృదువుగా మారటంతో పాటు గడ్డం కింద ఏర్పడిన […]
చిన్న ఎలుకలా కనిపిస్తున్నా
మొదటి సారిగా మా నాన్న దర్శకత్వంలో పని చేయటం చాలా సంతోషంగా ఉంది. ఒక అందమైన ఉద్వేగా భరితమైన ,ఒక అపారమైన అంటే ఒక అంతు దరి కనిపించనంత పెద్దది అనుకొండి. అలాంటి పర్వతాన్ని ఎక్కబోతున్న చిన్న ఎలుక లాగా ఉన్నాను నేను అంటుంది అలియా భట్. మహేశ్ భట్ దర్శకత్వంలో నడక-2 షూటింగ్ మొదలైంది. నేనా పర్వత శిఖరాన్ని అందుకోగలననే భావిస్తున్నాను. కానీ అదంత సులువు కాదని నాకు తెలుసు. కానీ మధ్యలో పడిపోయినా పుంజుకోగలనన్న […]
వెల్లుల్లి నూనె బెస్ట్
వేసవిలో విపరీతమైన చమటలతో తలలో దుర్వాసన ,చుండ్రు,జిడ్డు చికాకు పెడుతుంటాయి. ఇంట్లో దొరికే వస్తులతో ఒక ఫ్యాక్ వేస్తే ప్రయోజనకారంగా ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియాల్ ,యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. పోషకాలు అందించగలదు. ఇది దుర్వాసనకు కారణం అయ్యే బాక్టీరియాను తొలగించగలదు. నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ముక్కలుగా చేసి స్టౌపై ప్యాక్ లో రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి అందులో ఈ వెల్లుల్లి ముక్కలు వేసి కొద్దీ సేపు వేయించి చల్లారనిచ్చి దాన్ని […]
డార్క్ చాక్లెట్స్ ఇష్టమేనా?
తాజాగా ఒక పరిశోధన ఏం చేపుతోందంటే చాక్లెట్స్ రక్తపు పోటును దూరం చేస్తుందనీ ,సులువుగా లభ్యం అయ్యే అన్ని రకాల మిల్క్ చాక్లెట్స్ లో ఈ సుగుణం ఉండదు కానీ కోకో గింజల పొడిని 90శాతం వాడే చాక్లెట్స్ లోనే ఇలా బిపి తగ్గించే గుణం ఉంటుందంటున్నారు.డార్క్ చాక్లెట్ లో రక్త ప్రసరణ జరిగే ధమనుల్లో చైతన్యం కలిగించే లక్షణం ఉందని వివరించారు. రోజుకు ఒకటి రెండు చాకెట్లు తింటే ఈ ఫలితం ఉంటుంది అంటున్నారు.
ఇలానే తినాలి
డైనింగ్ టేబుల్ పైన తినటం సౌకర్యంగానే ఉంటుంది. కానీ మన పాత కాలంలో లాగా కింద కూర్చోని తినటం మంచిదంటున్నారు ఎక్స్ పర్ట్స్. కాళ్ళు ముడుచుకొని నేలపై కూర్చోని తినాలి. దీన్నే యోగా సుఖాసనం అంటోంది. ఈ భంగిమ మల్ల వెన్నుపూస నిలువుగా ఉంటుంది.దానికి సంబంధించిన కండరాలు బలపడతాయి. తొంటి భాగానికి కూడా మంచిదే .కాళ్ళు రెండు మడిచి కూర్చుంటే రక్తం పొట్టకి బాగా సరఫరా అవుతుంది. దీని వల్ల జీర్ణక్రియ వేగం శోషణ వేగం పెరుగుతాయి.కూర్చొని […]
ఆరోగ్యం కాదు అపాయం
వాకింగ్ చేయటం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. అయితే ఈ వాకింగ్ ఎక్కడ చేస్తున్నారో చెక్ చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పచ్చగా ఉండే పార్కులు వాకింగ్ ట్రాక్ లో ఎంపిక చేసుకొని నడవాలి. ఆ పరిసరాల్లో ఉండే చెట్లతో తాజా గాలి పీల్చుకొనే అవకాశం ఉంటుంది. అంతే కాని రోడ్డు మార్జిన్ లతో ట్రాఫిక్ ఉన్న ప్రదేశాల్లో వాకింగ్ అస్సలు చేయకూడదు.ఇలాంటి చోట్లలో విపరీతమైన కాలుష్యం ఉంటుంది. దుమ్ము ధూళి,శబ్దాలు, […]
జానపద గేయాలు- ఉళ్లొళ్ళో హాయీ
– డి.సుజాతా దేవి చిచ్చొళో హాయీ చిచ్చొళో హాయీ చిట్టి పాపాయీ బూచి వస్తాను బుట్ట తెస్తాను బజ్జో వేమోయి !! వద్దన్న వచ్చింది పొద్దెక్కి ఎండ సద్దుసేయక తొంగిచూసి పాలబుగ్గలమీద వాలింది వచ్చి చుర చుర చుర !! మళ్ళి వచ్చిందమ్మ అల్లరి గాలి ఉయ్యాలలో చేరి ఊగి మోగించి పోయింది మువ్వల్ల గిలక గల గల గల గల గల గల గల గల !!
