బెస్ట్ ఫేస్ మాస్క్
యవ్వనవంతమైన చర్మం కావాలనుకుంటే రైస్ వాటర్ ఫేస్ మాస్క్ బెస్ట్ అంటున్నారు ఎక్సపర్ట్స్. కప్పు రైస్ వాటర్ పేపర్ టవల్స్ ఉంటే చాలు బియ్యం కడిగిన నీళ్ళతో ఫేషియల్ టిష్యూ టవల్ ను పది నిమిషాలు మంచి ఉంచి బయటకు తీసి కాళ్ళ నీళ్లు పిండేసి ఆ టవల్ ను 20 లేదా 30 నిమిషాలు ముఖం పైన ఉంచుకోవాలి ఊపిరాడదు అనుకుంటే ముక్కు కళ్ళు ప్రాంతంలో రంధ్రాలు చెయ్యాలి బియ్యంలోని ఫ్లేవనాయిడ్స్ చర్మాన్ని బిగుతుగా మార్చేస్తాయి […]
పోషకాల జామ
జామ పండు ఎలా తిన్నా రుచి, పోషకాలు తగ్గకుండా ఉంటాయి. ఈ పండు నుంచి విటమిన్- సి, లైకోపిన్,యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే జామపండు లోని మెగ్నీషియం మనం తీసుకునే ఇతర ఆహార పదార్థాల్లో ఉండే పోషకాలను సరిగ్గా సేకరించేందుకు సహకరిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ని బయటకు పంపటంలో కీలకంగా పని చేస్తాయి. ఎక్కువ పీచు,తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే జామ పండు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. సోడియం పొటాషియం […]
సొంత నిర్ణయం లేనేలేదు
స్వతంత్ర భావాలు,సొంత వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలు కూడా తమ చదువులు ఉద్యోగాల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవటం లేదని ఇంట్లో వారో లేదా బాగా స్వామి అనుమతి తీసుకునే ఏ పనైనా మొదలు పెడుతున్నారని ఒక అధ్యయనం చెబుతోంది ‘ఒకే క్యూపిడ్’ అన్న డేటింగ్ యాప్ జరిపిన అధ్యయనంలో 79 శాతం మంది మహిళలు ఇప్పటికీ ప్రతి విషయంలోనూ ఇంట్లో వారి అనుమతి తీసుకుంటున్నామని చెబుతున్నారు. పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలా వద్దా కూడా కుటుంబ అనుమతి […]
పద్మశ్రీ గులాబో
పద్మశ్రీ అందుకున్న గులాబో రాజస్థాన్ లోని కల్‌బేలియా సంచారజాతికి చెందిన కళాకారిణి కల్‌బేలియా అనేది సంచార జాతులు పాములను ఆడిస్తూ చేసే ఒక రకమైన నృత్యం ఊహ తెలిసిన దగ్గరనుంచి గులాబో పాములను ఆడించే తండ్రితోనే ఉంటూ పాములతో సహవాసం చేసేది ఆమె చేసే నృత్యంలో జీవం తొణికిసలాడేది.ఉరి జాతర లో నృత్యం చేస్తున్న గులాబో ని పర్యాటక శాఖధికారులు చూడటంతో ఆమె జీవితం మారిపోయింది. దేశ విదేశాల్లో ఎన్నో వేదికలపైన ఆమె కల్‌బేలియా నృత్యం చేసింది. […]
అంగన్వాడీ బాజీ ఇష్రత్ బానో
ఇష్రత్ బానో (38) రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన అంగన్వాడీ కార్యకర్త.ఏడేళ్లుగా ఇడ్గాకాచి అనే మురికివాడ లోని చిన్నారుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోంది.అంగన్వాడీ కేంద్రానికి రూ 2000 అద్దెను తానే చెల్లిస్తోంది.దాతల నుంచి విరాళాలు సేకరించి పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆ చిన్నారులకు తృణధాన్యాలు, బెల్లంతో చేసిన ఆహారం దుస్తులు,పుస్తకాలు ఇస్తోంది. ఆశా వర్కర్లతో కలిసి పనిచేస్తూ మహిళల కు ఆరోగ్యం కోసం కృషి చేస్తోంది. ఈ సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అంగన్వాడీ అధికారి […]
ఆమెకు ఎగిరే రెక్కలివండి
బోహ్రా సిస్టర్స్ ఇన్ స్టాగ్రామ్ లో క్రియేట్ చేసే ఇలస్ట్రేషన్స్ సామజిక సందేశాలుఅందిస్తున్నాయి ఆ ఇద్దరిలో ఒకరు సకినా టొరంటో లో ఉంటే జైనాబ్ ఉదయపూర్ లో ఉంటుంది. మహిళలు పిల్లలపై ఇప్పటికీ వివక్ష కొనసాగుతూనే వుంది. ఆడపిల్లలకు దురదుష్టవశాత్తు కుటుంబమే ఆమె ఆశాలు చిదిపేస్తోంది ఇకనైనా అమ్మాయిలకు ఊతం ఇవ్వండి అనే అర్ధం వచ్చేలా ఆర్ట్ వర్క్ చేసిన వీడియో మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఇది అందరు చూసి తీర వలసిన వీడియో.
మహిళా గైడ్లు
కన్హా టైగర్ రిజర్వ్ లో 13 మంది మహిళ గైడ్లు స్థానం సంపాదించారు. అలాగే మధ్యప్రదేశ్-మహారాష్ట్రల్లో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వ్ లో కూడా మహిళ గైడ్లు గా పనిచేసే వారు స్థానిక బైగా, గొండ ఆదివాసీ మహిళలే ఈ అడవి గురించి అంగుళం అంగుళం మాకు తెలుసు మమ్మల్ని మించిన గైడ్లు ఎవరుంటారు అంటారు ఆ మహిళా గైడ్స్ అటవీశాఖ ఆదివాసి మహిళలకు శిక్షణ ఇచ్చే జంతువులు పక్షుల ఇంగ్లీష్ పేర్లు నేర్పిస్తారు. ఇంగ్లీష్ మాత్రమే […]
ఆడవాళ్ళ పైనే వేధింపులు
సమాజంలో పేరున్న మహిళలపై తప్పుడు సమాచారంతో కూడిన దాడులు సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతున్నాయని ఎంటిటీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ తన నివేదికలో చెబుతోంది ఈ దుష్ట్రచారలకి జెండర్ ప్రధాన కారణంగా ఉందని ఆ ఐక్య రాజా సమితి స్పష్టం చేసింది.ఆన్ లైన్ లో వేధింపులకు గురవుతున్న మహిళలు 67 శాతం మంది ఉన్నట్లు బవ్ సర్వే చెబుతోంది. జి.ఎస్. ఎం అసోసియేషన్స్ మొబైల్ జెండర్ గ్యాప్ 2019 నివేదిక […]
మల్లె నుంచి ఔషధం
వేసవిలో ఎండలతో పాటు కమ్మని వాసనతో మల్లెపూలు గుబాళించే రుతువు ఇది.ఈ పూలను ఔషధాలుగా వాడుకోవచ్చు తాజాగా మల్లెలు నూరి, తడిబట్టలో చుట్టి కాళ్ళ పై పెట్టుకుంటే కళ్లు తడి ఆరిపోవటం, కళ్ళలో నీళ్ళు రావడం తగ్గుతాయి. మల్లెపూల రసం మొహానికి రాసుకుంటే ఛాయ మెరుగవుతుంది మల్లెల సువాసన మనసుకి ఆహ్లాదాన్ని ఇవ్వటం కాక తల నొప్పి తగ్గిస్తుంది.మల్లెల నూనెతో మర్దన చేస్తే కళ్ళు మంటలు తగ్గుతాయి. ఈ పూల వాసన డిప్రెషన్ అతి కోపాన్ని శాంత […]
ఎండలో కాస్త జాగ్రత్త
వేసవి ప్రారంభం అయింది కనుక ఇక చర్మ సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి దుమ్ము,దూళీ, చెమట వల్ల చర్మం పై మురికి పేరుకుపోకుండా తరచూ మొహం కడుక్కోవాలి. మృతకణాలు పోయేందుకు కీరదోస రసంలో నిమ్మరసం పిండి మొహానికి శుభ్రపరుచుకుంటే మంచి ఫలితం ఉంటుంది.నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది వ్యర్థాలు టాక్సిన్లు బయటకు పోతాయి. సహజంగానే చర్మం తాజాగా తేమగా అనిపిస్తుంది. వాడుకునే సౌందర్య ఉత్పత్తుల్లో సిరా మైడ్, ఆక్వా గ్లిజరిన్ వంటివి […]
ఎంపిక సరిగ్గా ఉంటేనే అందం
చర్మం రంగుకు తగ్గట్టు లిప్ స్టిక్ ఎంచుకుంటేనే అందం అంటున్నారు ఎక్సపర్ట్స్ .చర్మం తెల్లగా ఉంటే ఆరెంజ్ బ్రౌన్ లిప్ స్టిక్ బావుంటాయి. చర్మం చామనఛాయ లో ఉంటే లైట్ బ్రౌన్ కలర్ లిప్ స్టిక్ బావుంటుంది. లైట్ బెర్రీ రంగు లిప్ స్టిక్ కూడా చక్కగా నప్పుతుంది స్కిన్ డాక్టర్ కలర్ అయితే ఎలాంటి షేడ్ ఉన్న లిప్ స్టిక్ అయినా బావుంటాయి. ముఖ్యంగా డార్క్ పింక్ చక్కగా ఉంటుంది. పగటిపూట లైట్ గా […]
వెనిగర్‌తో దుస్తులు శుభ్రం
వెనిగర్ తో దుస్తులు శుభ్రంగా మెత్తగా అయిపోతాయి వెనిగర్ మల్టీ టాస్కర్ ఇది బట్టలను సాఫ్ట్ గా ఉంచడంతో పాటు వాషింగ్ మిషన్ లో సున్నం ప్రమాణం పెరగటాన్ని తగ్గిస్తుంది. దీని తో వాషింగ్ మిషన్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది.వెనిగర్ అంత సువాసనతో ఉండదు. కాని దుస్తులు పొడిగా ఆరిపోయాక వెనిగర్ వాసన ఉండదు. చిన్న స్పూన్ వెనిగర్ కలిపిన చాలు బట్టలు రంగు పోకుండా ఉంటాయి. ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నర్ ఆనవాళ్లు దుస్తులకు ఉంటే […]
మునగాకులో కాల్షియం
ఎన్నో ఆకుకూరల్లో ఉండే ఇనుము కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఒక్క మునగాకు లో దొరుకుతుంది క్యారెట్ ల కంటే పది రెట్లు ఎక్కువగా విటమిన్ ఎ ఇందులో ఉంటుంది పాలలో కంటే ములగాకు లో ఉండే కాల్షియం పదిహేడు రెట్లు అధికం. పిల్లల ఆహారంలో మునగాకు చేరిస్తే ఎముకల బలం పెరుగుతుంది. గొంతుకు సంబంధించిన నొప్పి దగ్గు శ్వాసకోశ ఇబ్బందులు ఒక కప్పు వేడి వేడి మునగాకు సూప్ తో పోతాయి. శరీరంలోని వ్యర్ధాలను తేలికగా […]
షుగర్ ఫ్రీ ఉత్పత్తులు లక్ష్యం
బెంగళూరుకు చెందిన ఆర్తి రస్తోగి 80% వినికిడి లేని డయాబెటిక్. ఆమె ఫ్యామిలీ హిస్టరీ లోనే డయాబెటిక్ ఉంది. వినికిడి తగ్గిపోవటం తోనే చేస్తున్న హెచ్ ఆర్ విభాగపు ఉద్యోగం వదిలేసింది. ఐస్ క్రీమ్ తో ప్రయోగాలు చేసింది.షుగర్ ఫ్రీ గ్లూటెన్ ఫ్రీ కిటో ఫ్రెండ్లి కుకీలు చాక్లెట్ లు బ్రౌన్ కేక్ పైన ప్రయోగాలు చేసి ఫుడ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ డిపార్ట్మెంట్ ఆమోదంతో ఆర్టిన్సీ (Artinci) పేరుతో స్టార్టప్ ప్రారంభించింది. ఇప్పుడామె బెంగళూరులో పది […]
ముఖ సౌందర్యానికి చెరుకు రసం
ఈ వేసవిలో చెరుకు రసంతో ముఖ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోండి అని చెప్తున్నారు ఎక్సపర్ట్స్. చెరుకు రసంలో ఉండే గైకోలిక్ యాసిడ్ చర్మాన్నిఎప్పుడు యవ్వనవంతంగా ఉంచుతుంది. రెండు స్పూన్ల చెరుకు రసంలో ఒక స్పూన్ పసుపు కలిపి ఆ మిశ్రమంతో ముఖానికి నెమ్మదిగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే చెరుకు రసం వారంలో మూడు సార్లు మధ్యాహ్నం వేళల్లో తాగితే అది సహజమైన డిటాక్స్ లాగా పనిచేస్తుంది […]
గణిత మేధావి మంగళా నార్లికర్
పిల్లలకు లెక్కలు సులువుగా అర్థం అయ్యేందుకు వీలుగా సరదా లెక్కల పుస్తకాలు రాసి గణిత మేధావిగా గుర్తింపు పొందారు డాక్టర్ మంగళా నార్లికర్ గణితంలో కీలక శాఖలైనా కాంప్లెక్స్ అనాలసిస్ అనలిటికల్ జామెంట్రీ నంబర్ థియరీ, ఆల్ జీబ్రా లలో విశేష కృషి చేశారు. మహారాష్ట్ర పాఠ్య పుస్తకాల ప్రచురణ సంస్థ బాలభారతి తో కలిసి పిల్లల కోసం విశేషంగా సులభ లెక్కల పుస్తకాలు రాశారు. బాల భారతీ డైరెక్టర్ గా పాఠాలలో సులభ పద్ధతులు ప్రవేశపెట్టారు.మంగళా […]
20 దేశాల్లో సేఫ్టీ పిన్
సేఫ్టీ పిన్ యాప్ డాక్టర్ కల్పనా విశ్వనాధ రూపొందించారు ఈ మొబైల్ యాప్ ని 20 దేశాలల్లో లక్షల మంది అమ్మాయిలు వాడుతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన కొన్ని ప్రాజెక్ట్ ల్లో విధులు నిర్వహించారు కల్పనా.అందులో భాగంగా మహిళల రక్షణ గురించి అధ్యయనం చేశారు. కొత్త ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు తప్పించడం కోసం సేఫ్టీ పిన్ యాప్ రూపొందించారు కల్పన.ఈ యాప్ ఫోన్ లో ఉంటే ఆయా ప్రాంతాల్లోని ఆ సౌకర్యాలతో పాటు అక్కడి రద్దీ,రహదారుల్లో లైట్లు, […]
హాల్ ఆఫ్ ఫేమ్ లో మిషెల్
మిషెల్ ఒబామా మరో ఐదుగురు మహిళలు ఈ సంవత్సరం హాల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం పొందారు న్యూయార్క్ లో 1969 నుంచి నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్ సంస్థ ఉంది . ఈ హాల్ కి ఎంపిక అవటం ఒక ప్రతిష్ట గా భావిస్తారు. మిషెల్ ఒబామా (57) నలభై నాల్గవ అమెరికా ప్రథమ మహిళ ఆ స్థానంలో కి వచ్చిన తొలి నల్లజాతి మహిళ కూడా 21వ శతాబ్దపు అత్యంత ప్రభావశాలి అయినా […]
ఆరోగ్య రహస్యాలు
కొన్ని జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండొచ్చు, బీపీ తగ్గినట్లు అనిపిస్తే 10 నుంచి 15 దాకా ఎండు ద్రాక్ష పండ్లు తింటే మంచిది 3 క్యారెట్లతో ఎంతో శక్తి వస్తుంది. బీట్ రూట్ దుంపల్లో ఐరన్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఓ గ్లాసు బీట్ రూట్ రసం తాగితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.చర్మం ఎంతో మృదువుగా అయిపోతుంది. క్యారెట్ జ్యూస్ కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. నువ్వుల నూనె నిమ్మరసం కలిపి కీళ్లపై మర్దన చేస్తే […]
ఇదే ‘హెల్ప్ మి’ గుర్తు
ఉమెన్ ఫండింగ్ నెట్ వర్క్ ఆపదలో ఉన్న వారికి తక్షణ సాయం అందించేందుకు పిడికిలి బిగించిన ఒక సంకేతాన్ని రూపొందించారు.అరచేతిని మొహం వైపు ఉంచుకొని ముందుగా బొటనవేలు ముడిచి మిగిలిన వేళ్ళతో పిడికిలి బిగించి చూపెడితే వారు ఆపదలో ఉన్నట్లు అర్థం చేసుకోవాలని అర్థం చేసుకోవాలి.ఈ సిగ్నల్ ఫర్ హెల్ప్ మీ ఉమెన్ ఫండింగ్ నెట్ వర్క్ ప్రచారం చేస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న ఈ హెల్ప్ మి చిహ్నం గురించి అందరు తెలుసుకోవాలని చాలా మంది వీడియోలు […]
