Uncategorized
అందాల లోకం
వర్షపు వేళలో ఆకాశంలో హరివిల్లు విరుస్తుంది. అలాటి సప్తవర్ణాల ఇంద్రధనస్సు నదిలో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ నీరు కాస్తా పంచవన్నెల మిశ్రమం లాగా మెరిస్తే ?అదిగో కొలంబియాలోని సెరేనియం డి లా మెకెరేనా పర్వతశ్రేణిలో కేనొ క్రిష్టల్ అనే నది ఒకటుంది. ప్రపంచంలోని అందమైన నదుల్లో ఇది ఒకటి. ప్రకృతి గీసిన పెయింటింగ్ అందం ఈ నది ఎరుపు, పసుపు,నీలం,ఆకుపచ్చ,నలుపు రంగుల కల పోతతో కనువిందు చేస్తుంది. ఈ నది అడుగు భాగం వేళ సంవత్సరాల […]
ఆరోగ్యానికి యోగ ముద్రలు
కదలకుండా కూర్చుంటే గుండె జబ్బులు,ఊబకాయం వస్తుందని ఎప్పటినుంచో చెబుతున్నారు కానీ ఈ కరోనా సమయంలో దొరికిన సెలవు దినాలు మరింత సమస్యలు తెస్తున్నాయి అంటున్నారు వైద్యులు.గంటకోసారి ఎంత పని ఒత్తిడిలో ఉన్నా అటు ఇటు తిరగకపోతే నరాలకు సంబంధించిన అనారోగ్యాలు తప్పవంటున్నారు.రోజులో నాలుగైదు సార్లు యోగముద్రలు సాధన చేయమంటారు యోగా గురువులు.యోగముద్రలో ధ్యానం, ప్రాణాయామం, చేస్తే రెట్టింపు ఫలితం వస్తాయంటారు. ముద్రలను ఒక చికిత్సగా సిఫార్స్ చేస్తున్నారు.వాయుముద్ర, వరుణముద్ర, శూన్యముద్ర, సూర్య ముద్ర, సహజ శంఖ ముద్రలు […]
కాస్త దూరం మంచిదే
నిరంతరం కరోనా వార్తలను వినటం వల్ల భయం ఆందోళన కలగటం సహజం.ముందుగా పుకార్లను వ్యాప్తి చేసే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం ఉత్తమం.చిన్న చిన్న వ్యాయామ లక్ష్యాలు చాలా అవసరం.రోజుకు అరగంట పాటు 14 రోజులు వేగంగా నడవాలని నిర్దేశించుకోవచ్చు.ఆ అరగంట శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతుంది.ఆన్ లైన్ వ్యాయామ తరగతుల్లో చేరవచ్చు.మంచి పోషకాహారం తోనే తగినంత శక్తి లభిస్తుంది.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కొవ్వు, ఉప్పు, తీపి పదార్థాలు సాధ్యమైనంత మితంగా తీసుకోవాలి. పీచు అధికంగా ఉండే […]
కాగితపు గుజ్జుతో ఫర్నిచర్
అసోం కి చెందిన స్పృహ చోకానీ పేపర్ మెష్ ఉత్పత్తులు తయారు చేస్తారు. పల్ప్ ఫ్యాక్టరీ పేరుతో జైపూర్ లో ఒక సంస్థ ప్రారంభించారు స్పృహ. వాడేసిన కాగితపు గుజ్జు శుద్ధి చేసి మొక్కజన్నల గింజలు బంగాళాదుంపలు బియ్యం తో చేసే పిండిలో జిగురు కోసం కర్ర పెండలం గుజ్జు కలిపి చక్కని ఫర్నిచర్ రూపొందిస్తారు. కుర్చీలు,స్టూల్స్ వంటివి తయారు చేస్తారు. పసుపు తయారీలో కాయితం గుజ్జు ప్యాకింగ్ కూడా వ్యవసాయి వ్యధలనే వాడుతారు. పర్యావరణానికి మేలు […]
ఆహారమే ఔషధం
వర్షా కాలంలో వచ్చే రుగ్మతులు నుంచి ముఖ్యంగా కరోనా నుంచి రక్షణ పొందేందుకు వ్యాధినిరోధక వ్యవస్థను బలపరిచే ఆహారం తీసుకోవాలి. పండ్లు,కూరగాయలు పొట్టు తో కూడిన ధాన్యాలు పప్పు దినుసులు పాల ఉత్పత్తులు తేలికగా జీర్ణం అవుతాయి. పాలిష్ పట్టని పరిపూర్ణ ధాన్యాలు ఆహారంగా తీసుకొన్నపుడు తేలికగా అరిగి త్వరిత శక్తిని ఇస్తాయి. సేంద్రియ పంటల్లో ఖనిజ లవణాలు విటమిన్లు,పీచు,పుష్కలంగా ఉంటాయి. ఇంట్లో తయారు చేసిన జున్ను,పాలు,కూరగాయలు తో చేసిన వంటకాలు శక్తి ని ఇస్తాయి. జీలకర్ర […]
ఇంటికి పువ్వులు
వ్యాపార తరహా కూడా మారిపోతుంది ఒక ఫోన్ కాల్ తో వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం మనుషులందరికీ అలవాటైపోయింది.అందుకే పూలను ఇంటికి పంపే వ్యాపారాన్ని కరుటూరి యశోద ప్రారంభించింది. పుట్టింది ఇండియా లో అయినా పెరిగింది కెన్యా లో. కెన్యా ఇథియోపియాల్లో గులాబీ ల పెంపకం అమ్మకం చేస్తారు కుటుంబీకులు. 2019 లో ‘ రోజ్ బజార్ ‘ పేరుతో సంస్థ ప్రారంభించి బంతులు, చామంతులు, మల్లెలు, గులాబీలు ఇంటికి పంపే ఏర్పాటు చేశారు.ఈ స్టార్టప్ ఇప్పుడు బెంగళూరు […]
సరైన ప్రత్యామ్నాయం
మనసులో ఒత్తిడిని తగ్గిస్తుంది మసాజ్ థెరపీ. శరీరంలో మృదువైన టిష్యూలు కండరాలు అనుసంధాన టిష్యులు కండరాలు లిగమెంట్లు జాయింట్ల ను ఉద్దీప్తం చేసేదే మసాజ్ థెరఫీ ఇది ఆరోగ్య పరిరక్షణ ప్రత్యామ్నాయం.మనదేశంలో ఆరోమా థెరపీ డీప్ టిష్యూ డ్రై ట్రిగ్గర్ పాయింట్ తెరఫీ ఫుట్ రిఫ్లెక్సాలజీ హెడ్ మసాజ్, ఫేస్ మసాజ్ లు సర్వసాధారణంగా చేయించుకుంటూ వుంటారు ఒత్తిడికి కారణం అయ్యే నిద్రలేమి జాయింట్ నొప్పులను తగ్గించ గలుగుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ కరోనా సమయంలో […]
నిండుగా క్యాల్షియం
వారానికి గుప్పెడు నువ్వులు తినే అలవాటు చేసుకోండి అంటున్నారు వైద్యులు.నువ్వు ల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది.ప్రతిరోజు పరగడుపున టీ స్పూన్ నువ్వులు బెల్లం కలిపి తింటే ఎముకలు వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.అలాగే అత్యవసరమైన బి1, బి3, బి6 విటమిన్లు శరీరానికి అందుతాయి.నువ్వుల నూనె వాడే వాళ్లలో గుండె జబ్బుల అవకాశం తక్కువే.ఎండలో ఎక్కువసేపు పని చేస్తే చర్మం పై నల్లని మచ్చలు వస్తాయి.ఇవి పోవాలంటే నువ్వులు ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
ఫెమినిస్ట్ టీ
ఈ వర్షా కాలంలో ఫెమినిస్ట్ చాయ్ తాగితే మంచిదంటారు ఎక్స్పర్ట్స్. ఈ చలి గాలుల్లో కాశ్మీర్ లో ప్రత్యేకమైన ఫెమినిస్టు చాయ్ తాగాలి.ఈ చాయ్ చూసేందుకు అందమైన గులాబీ రంగులో ఉంటుంది.ఈ టీ తయారీలో టీ పొడి బాదం, పిస్తా పలుకులు, దాల్చిన చెక్క, గులాబీరేకులు వేస్తారు.చాయ్ కు గులాబీ రంగు రావటం కోసం అక్కడ దొరికే ప్రత్యేకమైన ఉప్పు వాడతారు .నూన్ చాయ్ గా పిలిచే ఈ రుచి చాలా బావుంటుందట.ఈ టీ పొడి ఇప్పుడు […]
ఒక్కరోజు సెలవు లేదు
ఒక్క రోజు కూడా వర్క్ వుట్ సెషన్ కు డుమ్మా కొట్టను.ఆరోగ్యవంతమైన జీవనశైలి శారీరక వ్యాయామం మనసుపెట్టి సమతుల ఆహారం తీసుకోవటం వంటివే అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడతాయి.అందుకే ఫిట్ నెస్ చాలెంజ్ ఈ వారంలో నా 365 రోజుల ఫిట్ నెస్ చాలెంజ్ పూర్తయిపోతుంది.అంటోంది మందిరా బేడి.ఇంటి దగ్గర ఎలాంటి పరికరాలు లేకుండా వర్క్ వుట్స్ చేస్తూ ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెడతారామె. నాకు యోగా తెలియదు తెలిసిన ఆసనాలు ప్రయత్నం చేస్తాను అంటారు మందిరా.ఎక్సర్ […]
మట్టి గణేశుని పూజిద్దాం
వినాయక చవితికి ఏక గణపతి ని తయారు చేయించండి విగ్రహం కోసం మెత్తగా తయారు చేసిన మట్టిలో పెసలు ఆవాలు కూరగాయల గింజలు కలపమంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు.చవితి వేడుకలు అయ్యాక ఈ విగ్రహాన్ని నీళ్లలో కరిగించి ఒక చిన్న తొట్టిలో వేస్తే వారం రోజుల్లో అందులో ఉంచిన గింజలు మొలకలు వస్తాయి.ఆ పచ్చదనం ఎప్పటికీ వాడిపోని పండగ అలాగే ఉంటుందంటున్నారు.వినాయకుడిని తయారు చేసే విధానం యూట్యూబ్ వీడియోలో చూడవచ్చు బంక మట్టి నీరు టూత్ పిక్స్ గానీ […]
ఇక పీరియడ్ లీవ్
పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకున్నాం.ఇక మొదట మా సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులు సంవత్సరానికి పది రోజులు లీవ్ తీసుకోవచ్చు అని జొమాటో కంపెనీ సిఈఓ దీపేందర్ గోయల్ ప్రకటించారు.ఈ సౌలభ్యంతో జొమాటో లో పనిచేసే మహిళా ఉద్యోగులకు రెగ్యులర్ సెలవులతో పాటు మరో పది రోజులు అదనపు సెలవు దొరికింది.జొమాటో భారతదేశంలో గురుగావ్ లో మొదలై ఇవ్వాళ 24 దేశాల్లో సేవలు అందిస్తోంది.ఆ సంస్థలో ఐదు వేల […]
పొట్ట లో బాగాలేదా ?
ఒక్క సారి పొట్ట అప్సెట్ అవుతోంది.జీర్ణ వ్యవస్థ యధాస్థితికి రావాలంటే బొప్పాయి సూపర్ ఫుడ్ అంటున్నారు వైద్యులు.ఇందులోని పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.అలాగే అరటిపండు కూడా,వాము సోంపు నమ్మిన కషాయం తాగిన మేలు చేస్తుంది. వీటిలోని ఫైటో న్యూట్రియంట్లు పొట్ట ఉబ్బరం తగ్గిస్తాయి జీలకర్ర పొడి మజ్జిగలో వేసుకుని తాగితే అది జీర్ణ సంబంధ స్రావాల విడుదలకు తోడ్పడి జీర్ణక్రియను చక్కదిద్దుతుంది. అల్లం రసం నిమ్మకాయ రసం తో కలిపి తేనె వేసి తాగితే […]
ప్రసవ వేదన తగ్గుతోంది
గర్భిణీ గా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తూ చురుకుగా పనులు చేసుకునే వారికి కాన్పు తేలికగా అవుతోందని ఎప్పుడో పెద్దలు చెప్పారు.అయితే ఈ వ్యాయామం తో ప్రసవ నొప్పులు సమయం తగ్గుతోందని పరిశోధనలు చెబుతున్నాయి 500 మంది పై చేసిన ఓ అధ్యయనంలో ప్రసవించేప్పుడు నొప్పులు పడే సమయం. తల్లి బరువు బిడ్డ బరువు కాన్పు జరిగిన తీరు మొదలైన విషయాలు పరిశీలించారు. వ్యాయామం చేసిన మహిళల్లో కాన్పు తర్వాత శరీరాకృతి ఏమాత్రం పాడవకుండా యధాస్థితికి చాలా త్వరగా […]
తప్పక తినాలి
ఈ కోవిడ్ కాలంలో అపార పోషకాలు అందించే పాలకూర ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోండి అంటున్నారు పోషకాహార నిపుణులు.ఇందులో అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.సూక్ష్మ పోషకాలైన విటమిన్ సి, నియాసిన్, విటమిన్ కె, లతోపాటు క్యాల్షియం ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.పాలకూరలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఖనిజాలు ఉండటం వల్ల ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు, శారీరక శ్రమ చేసే పెద్దలకు కూడా ప్రయోజన కారి.ఎక్కువగా తిన్నా తక్కువ క్యాలరీలు ఇచ్చే పాలకూర బరువు […]
పోషకాలే ఔషధం
జుట్టు రాలిపోవటం నూటికి 90 మంది సమస్య ఈ సమస్య కు ఆహారం తోనే చక్కని పరిష్కారం అంటున్నారు ఎక్సపర్ట్స్. జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్లు ఎంతో అవసరం చికెన్,చేప,గుడ్డు వంటి మాంసాహారం తో పాటు పాలు పెరుగు పప్పుధాన్యాలు తీసుకోవాలి. ఈ ప్రోటీన్ల తో పాటు శరీరానికి అవసరం అయిన ఐరన్,జింక్,సెలీనియం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆహారము అవసరమే.బాదం ,పిస్తా,వాల్ నట్స్, అవిసెగింజలు తీసుకోవాలి. విటమిన్ డి లోపం వల్ల కూడా జుట్టురాలుతోంది. అలాగే నిద్ర […]
ఈ వ్యాయామం తో రిలాక్స్
గంటల కొద్దీ చేసే ఆఫీస్ పనితో ఎన్నో శారీరక సమస్యలు వస్తుంటాయి.వర్క్ ఫ్రమ్ హోమ్ లో లాప్ టాప్ తో పనిచేసే చాలామందికి మణికట్టు నొప్పి వస్తుంది. అప్పుడు కుడి అరచేయి కింద భాగాన్ని ఎడమ చేతి వేళ్ళతో మృదువుగా కింద కు నొక్కాలి అలా కొన్ని సెకండ్ల పాటు ఒత్తితే ప్రయోజనం ఉంటుంది. అలాగే కుడి చేత్తో ఎడమచేతి కూడా స్ట్రెచ్ చేయాలి రెండు చేతులు ముందుకు చాచాలి కుడి చేతి వేళ్లను,ఎడమ చేతితో వెనక్కి […]
పై పొట్టు లో పోషకాలు
కాయగూరల చెక్కుతీసి వాడుతూ ఉంటాం కానీ అసలైన పోషకాలన్నీ పొట్టు లోనే ఉంటాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. బీట్ రూట్ పొట్టు లో పీచు, విటమిన్-బి9, విటమిన్- సి, పొటాషియం, ఐరన్, వంటి పోషకాలు ఉంటాయి.దాన్ని శుభ్రంగా కడిగి వాడుకుంటే సరిపోతుంది. కీరా లో కూడా తొక్క వగరుగా ఉంటుందని తీసి పడేస్తూ ఉంటాము. కీరా లోని పొట్టు విత్తనాల లోనే యాంటీ ఆక్సిడెంట్లు ఎంజైమ్ లు ఎక్కువగా ఉంటాయి. అవి వ్యాధి కారకాలతో పోరాడతాయి పొట్టులో ఉండే […]
మా అమ్మేనాకు స్ఫూర్తి
తన 81 వ పుట్టిన రోజున 16 పుషప్స్ చేసి తన ఫిట్ నెస్ ను చాటుకున్నారు ఉషా సోమన్. ఫిట్ నెస్ ఐకాన్ మిలింద్ సోమన్ తల్లి.కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా ఉద్యోగ విరమణ చేశాక యాత్రలు గురుధన్ పరుగు మొదలు పెట్టారు కొడుకు తో కలిసి మారథాన్ లో తీసిన పరుగులు ట్రెండ్ అయ్యాయి.ట్రెక్కింగ్ నేర్చుకోని ఎవరెస్ట్ పర్వతం చేసే క్యాంప్ తో పాటు ఆఫ్రికాలోని ఎత్తయిన కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించారు.2016 లో చీర కట్టు […]
ఇలా చేస్తే టేస్టీ
బీట్ రూట్ జ్యూస్ తో ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు డాక్టర్లు. టీనేజ్ పిల్లలకు రక్తహీనత సమస్య దూరం అవుతోంది.హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. నీరసం తో బాధపడేవారికి తక్షణ శక్తి వస్తుంది.ఈ రసంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పోతుంది. నెలసరి సమయంలో బాధించే మూడ్ స్వింగ్స్ తగ్గిపోతాయి.కాలేయాన్ని శుద్ధిచేసి ఎముకల బలాన్ని పెంచుతుంది.తీయని రుచితో బీట్ రూట్ జ్యూస్ తాగాలనుకుంటే ఒక బీట్ రూట్ దుంప, ఆపిల్, అల్లం కలిపి జ్యూస్ తయారు చేసుకోవచ్చు.పైనాపిల్ […]
